ఆ ఎమ్మెల్యేల మాట సాధారణంగా వినబడదు పత్రికల్లో, శాసనసభలో కూడా. ఈ మధ్య మాత్రం అన్ని పత్రికల్లోనూ పతాక శీర్షికలకెక్కుతున్నారు. తస్లీమా నస్రీన్‌ను కొట్టి ఓ రోజు, నీలోఫర్లో ఓసారి, ప్రసూతి ఆసుపత్రిలో ఓసారి డాక్టర్లను కొట్టి వార్తల్లోకెక్కారు. కొట్టి వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళ మాటా పేరూ వినబడవు.., తరువాతి దౌర్జన్యం వరకూ. ఈలోగా ప్రభుత్వం మాత్రం ఆ దెబ్బలు తిన్నవాళ్ళ మీదే కేసులు పెట్టి, ఎస్మాలు పెట్టి హడావుడి చేస్తూ ఉంటుంది.
19, డిసెంబర్ 2007, బుధవారం
దార్లు కొట్టేవాళ్ళూ డాక్టర్లను కొట్టేవాళ్ళూ
ఆ ఎమ్మెల్యేల మాట సాధారణంగా వినబడదు పత్రికల్లో, శాసనసభలో కూడా. ఈ మధ్య మాత్రం అన్ని పత్రికల్లోనూ పతాక శీర్షికలకెక్కుతున్నారు. తస్లీమా నస్రీన్‌ను కొట్టి ఓ రోజు, నీలోఫర్లో ఓసారి, ప్రసూతి ఆసుపత్రిలో ఓసారి డాక్టర్లను కొట్టి వార్తల్లోకెక్కారు. కొట్టి వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళ మాటా పేరూ వినబడవు.., తరువాతి దౌర్జన్యం వరకూ. ఈలోగా ప్రభుత్వం మాత్రం ఆ దెబ్బలు తిన్నవాళ్ళ మీదే కేసులు పెట్టి, ఎస్మాలు పెట్టి హడావుడి చేస్తూ ఉంటుంది.
9, డిసెంబర్ 2007, ఆదివారం
"మహాకవి శ్రీశ్రీ" జీవిత చరిత్ర
"కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది". శ్రీశ్రీ కవిత, "కవితా ఓ కవితా" గురించి రాస్తూ ఆ పుస్తకంలోనే రచయిత అన్న మాటలివి.
29, నవంబర్ 2007, గురువారం
మర్యాదకరమైన మాటలు
24, నవంబర్ 2007, శనివారం
రహదారులు, రహగొందులు, రహసందులు
నరు(?) చేతను నాచేతనుహై.లో దిక్కుమాలిన, నత్తనడకల ట్రాఫిక్కుక్కూడా తలమాసిన కారణాలు బోలెడున్నాయి. ఆ కారణాల్లో కొన్ని.., కందాల్లో ఇక్కడ..
వరమడిగిన కుంతి చేత పారుని చేతన్
ధరచే భార్గవు చేతన్
నరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్
22, నవంబర్ 2007, గురువారం
మరోసారి తలంటు!
"There were serious deficiencies in the efficient, economic and effective implementation of the projects undertaken under GWUA. The schemes were undertaken without proper care in finalizing the ayacut, source and availability of assured power supply..."
"..The agreements were one sided in favour of the contractors and suitable provisions were not incorporated to protect Government interest. The consultants were not made responsible for any deviations in quantities, designs and drawings during execution. The contractors enjoyed huge undue benefits due to incorrect projection of materials required, preparation of unrealistic estimates, etc. Despite being monitored at all levels, the rate of progress in the works under SSP and JCRDLIS is not as per the milestones fixed."
ఇలాంటి నివేదికలు వచ్చాక, బాధ్యుల మీద చర్యలేమీ లేకపోతే ఇట్టాగే మాట్టాడతారు.
20, నవంబర్ 2007, మంగళవారం
ఏరు దాటిన వెనుక..
కం. ఏరును దాటిన దళపతి
పేరుకె మద్దతు తెలిపెను! పేరోలగమున్
చేరగ తొలగెను ముసుగులు
తేరుకు జూచిన ప్రభుతకు తెరపడి పోయెన్!
ఊరు హర్దనహళ్ళి
ఊతపదమట 'హళ్ళి'
'అప్ప'జెప్పిరి మళ్ళి
-కర్నాటకదల్లి
సూత్రధారుడు నాన్న
పాత్రధారుడు కన్న
భాజపాకిక సున్న-కర్నాటకాన
రాజకీయమ్మంత
రోత వెదకిననెంత
కానరాదే సుంత
-దేశమందంత!
8, నవంబర్ 2007, గురువారం
ఉప్పూకారపు తప్పులు
ముఖ్యమంత్రి "ఉప్పూ కారం తింటున్నాను కాబట్టి ఊరుకోలేకపోయాను" అన్నాడు. ('లక్షాధికారియైన లవణమన్నమె గాని మెరుగు బంగారమ్ము మింగబోడు ' గదా!) ఆయనన్న మాటలని అలాగే తీసుకోవాలి. అంతేగాని, ఇంగ్లీషోడన్నట్టు చిటికెడు ఉప్పు జల్లి సేవిస్తే అపార్థాలు గోచరిస్తాయి. నేను ఇక్కడ కవి హృదయాన్ని ఆవిష్కరించదలచాను..
చంద్రబాబు ఉప్పూ కారాలు మానేసి చాన్నాళ్ళయింది. అంటే ఖచ్చితంగా కాదుగానీ, సాత్వికాహారం, అందునా మితంగా తినడం, యోగాసనాలు వెయ్యడం, ఆయన అలవాటు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చమత్కరించాడన్నమాట! "ఉప్పూ కారం తినకే నువ్వలా ఐపోయావు", "నీలాగా నేను చేవ చచ్చిన వాణ్ణి కాదు", ఇలాంటి తాత్పర్యాలు లాగొచ్చు ఆ మాటల నుండి. ఒక్ఖ మాటలో లక్ష బూతులన్న మాట.
అయినా, 'తమలపాకుతో నువ్వొకటంటే తలుపుచెక్కతో నేరెండంటా' అనే మనిషిని నెమలి ఈకతో కూడా కెలక్కూడదు. చంద్రబాబుకు అదింకా అర్థం కాలేదెందుకో!? లేక.. తిట్టించుకుని సానుభూతి కొట్టేద్దామని, పనిలో పనిగా ముఖ్యమంత్రి దురుసుతనాన్ని బజారుకీడుద్దామని ప్రయత్నమా? ఏమో చెప్పలేం..
రాజకీయులు.. దేనికైనా వెనుదీయరు గదా!
పెద్దల సభలో గలభా!
ఈ ముక్క రాసినందుకే శాసనమండలి ఈనాడు సంపాదకుణ్ణి సభకు పిలిపించి మందలించాలని తీర్మానించింది ఒకప్పుడు. ఏడో తేదీన శాసన మండలిలో జరిగింది గలభా కాదు, _మ్..మీ అనొచ్చేమో!. (నేను పూర్తిగా చెప్పడం లేదు. ఒకవేళ వాళ్ళకు తెలిస్తే నన్నూ సభకు పిలిచి, బూతులు తిట్టే ప్రమాదం ఉంది. ఎవరితోటైనా పెట్టుకోవచ్చు గానీ చాలామంది రాజకీయ నాయకులతోటీ, కొన్ని పిచ్చి కుక్కలతోటీ అస్సలు పెట్టుకోకూడదు) అమ్మనాబూతులు తిట్టుకున్నారట, తోపులాటలో ఒక మంత్రికి చొక్కా చినిగిందట.
"మండలి వస్తే విద్యాధికులు, ఉపాధ్యాయులు వగైరా పెద్దమనుషులు సభకు వచ్చే అవకాశం ఉంటుంది, అర్థవంతమైన చర్చలు జరుగుతాయి." మండలి కావాలని కోరుతూ ఇలాంటి జోకులు చాలానే వేసారు, అప్పట్లో. న్యాయశాఖ మంత్రి హెచ్చార్ భరద్వాజ్ "మండలి కావాలనేది ఆంధ్రుల కోరిక, దాన్ని అడ్డుకుని వారి ఆకాంక్షలను తోసిపుచ్చకండి" అని పార్లమెంటులో ప్రతిపక్షాలకు చెబుతూ మొత్తం ఆంధ్రులందరి మీదా జోకాడు. ఇప్పుడు చూడండి, ఏం జరుగుతోందో!!
అయినా, వాళ్ళు మాత్రం ఉప్పూకారం తినడం లేదేటండి?
25, అక్టోబర్ 2007, గురువారం
శభాష్, శ్రీరమణా!
నిజానికి ఈ బ్యానర్లు పెట్టింది పి.వి.శ్రీరమణ అనే వ్యక్తి.
రోడ్లమీదా, కాలనీల్లోనూ అలా శుభాకాంక్షలు చెప్పే బ్యానర్లు కొల్లలుగా చూస్తూంటాం. పెద్దకారు రాజకీయులకు చిన్నకారు వాళ్ళూ, చిన్నకారు సన్నకారు వాళ్ళకు వాళ్ళ చెంచాగాళ్ళూ పెడుతూ ఉంటారు ఇలాంటి బ్యానర్లు. ఫలానావాడి పుట్టినరోజు వచ్చిందనుకోండి.. "వారికి శుభాకాంక్షలు" చెబుతూ పెడతారు. ఆ ఫలానావాడు బ్యానరులో ఒక పక్కన నుంచోనుంటాడు. రెండో పక్కన బ్యానరు కోసం అందరికంటే ఎక్కువ డబ్బులు పెట్టినవాడు నుంచోనుంటాడు. ఇహ కింద, వాళ్ళ కాళ్ళదగ్గర, ఓ ఏడెనిమిది మంది సత్రకాయల ఫొటోలుంటాయి. ఏ బ్యానరైనా కొద్దిగా అటూ ఇటూగా ఇదే మూస! సందర్భాలు మాత్రం మారుతూ ఉంటాయి. ఫలానావాడు అయ్యప్ప దీక్ష తీసుకున్నాడనో, ఫలానా "అన్న" ముష్టి పార్టీ గల్లీ కమిటీ మెంబరైన సందర్భంగానో, మరోటో మరోటో! ఇహ పండగలప్పుడూ ఈ బాపతు జనాల హడావుడి గురించి ఎంతైనా చెప్పొచ్చు.
పాపం శ్రీరమణ చిర్రెత్తిపోయినట్టున్నాడు ఈ బ్యానరాసురుల గోలతో; ఆ పిచ్చివాడి పేరు మీద బ్యానర్లు తయారు చేసి కాలనీలో అంటించాడు. ఈ బ్యానరాసురుల్ని వెక్కిరించడానికే పెట్టినట్టు వాళ్ళకు వెంటనే అర్థం కాదేమోననే సంకోచంతో ఈ మాట కూడా చెప్పాడట.. "నేను ఎవర్నీ నొప్పించే ఉద్దేశ్యంతో పెట్టలేదు. నాయకులు ప్రజలకి ఇబ్బందులు కలిగించకూడదనే సందేశమిస్తూ ఇలా పెట్టాను".
ఈ రాజకీయ సత్రకాయలకు సంగతి అర్థమవుద్దంటారా అని!!
మీ నిరసనను తెలియజేసినందుకు శభాష్ శ్రీరమణా!
17, అక్టోబర్ 2007, బుధవారం
ఏంటో..
- నాయకులకు పెద్దపెద్ద విగ్రహాలు పెడతారు - అంత కంటే పెద్ద నిచ్చెనలు వాళ్ళ భుజాల మీదుగా కడతారు
- ఉచిత విద్యుత్తు.. మోటారు కోసం ఉండదు - షాకిచ్చి చంపేందుకు మాత్రం వెనకాడదు.
- పదుగురాడు మాట పాడియై ధరజెల్లు - పదకొండు మంది ఆడవారి గోడు మాత్రం అడవి పాలు
- దోపిడీ మీటర్ల నరికట్టలేరంట - ఆటోలు తీసేసి కార్లు పెడతారంట.
- గోధుమపై నెనరు - వరినసలే కనరు
- బయటి రింగు రోడ్లకు.. రెండువేల కోట్లంట - ఊళ్ళో రోడ్లకు.. రెండు కోట్లు లేవంట
- ఒకరు గజదొంగ ఇంకోరు జగదొంగ (ఒకడు చిక్కడు ఇంకోడు దొరకడు) - ఒక్క జడ్జేం చాలుతాడు వీళ్ళను పట్టంగ! (అసలు, జడ్జీలతో కాకుండా జే.ఎం. లింగ్డో, రామచంద్ర సమాల్ లతో ఓ కమిషను వేసి వీళ్ళ సంగతి చూడమనాలి.)
- వాళ్ళు రొప్పుతూ రోజుతూ రోడ్డేస్తారు - జలమండలి వాళ్ళు నవ్వుకుంటూ తవ్వేస్తారు (తారు కాసే మంట మీద నీళ్ళు జల్లినట్టు)
- నిజాం పాలన తెస్తడంట - పాలిస్తడా లేక పీడిస్తడా?
- సారీ బుష్, ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యలేను - సరే బాస్, న్హా..కా సంగతి తెలుసులే!
- సెన్సెక్సు పెరిగితే నల్లేరుపై నడక - పడితే..., పల్లేరుపై పడక
16, అక్టోబర్ 2007, మంగళవారం
బస్సు దోపిడీ!
- ప్రభుత్వానికి జెల్ల కొట్టడంలో వీళ్ళది అందె వేసిన చెయ్యి. టూరిస్టు క్యారేజిగా తిరగాలవి.. కానీ స్టేజి క్యారేజిగా తిరుగుతాయి. ఆంధ్ర దేశంలో ఉన్నవాళ్ళందరికీ తెలుసా సంగతి, సంబంధిత అధికారులకు తప్ప!
- హై. నుండి మీ ఊరికి ఒక బస్సూ, అట్నుండి ఇటొకటీ ఒకే సమయానికి బయలుదేరుతాయి. ఒక్కో బస్సుకు ఒక్కో ప్రత్యేక రిజిస్ట్రేషను నంబరుంటుంది (కదా!). రెంటికీ పన్ను కడతారని మనబోటి అమాయకులం అనుకుంటాం (కదా!). పాపం ప్రభుత్వమూ అలాగే అనుకుంటుంది. (ఔనా! ఏమో?) కానీ వాళ్ళు ఒకదానికే కడతారు.. ఆ నంబరు పెట్టుకునే రెండు బస్సులూ తిరుగుతాయి.
- రాత్రి ఎనిమిది నుండి పదింటి దాకా కూకట్‌పల్లి నుండి దిల్‌సుఖ్ నగరు దాకా చూడాలి.. మాఊరు, మీ ఊరని లేదు.. మొత్తం రోడ్డంతా వాళ్ళదే. రోడ్డు మీంచి ఒక్క అంగుళం కూడా దిగరు. మన హై. ముష్టి రోడ్లకు తోడు వీళ్ళ ఆగడం జతై మనకు నరకమే కనిపిస్తుంది.
- బస్సుపైన బస్సెత్తున సామానేస్తారు. హై. దాటేటప్పటికి పన్నెండు దాటుద్ది. ఇక ఆపైన ప్రయాణం మేఘాల్లో తేలిపోతూ సాగుతుంది. పైప్రాణాలు పైనే పోతాయి. మొన్న ఈనాడులో చూసాం కదా ఏం జరిగిందో!
- ప్రజలను దోచడంలో వీరు ఎమ్మెన్సీలకు పాఠాలు చెప్పగలరు. ప్రతి శుక్రవారం హై. నుండి గుంటూరు వెళ్ళే కొన్ని (అన్నీనా.. ఏమో?) బస్సుల్లో టిక్కెట్టు వెల పెరుగుతుంది. ఆది వారం అటునుండి వచ్చే టిక్కెట్లు వాస్తాయి. వీకెండుకు ఇంటికెళ్ళే సాఫ్టువేరు శ్రీమంతుల స్పెషలది. ఇది వారాంతపు స్పెషలు దోపిడీ. టిక్కెట్ల నల్లబజారు! సినిమా హాళ్ళ వాళ్ళు కొత్త సినిమాలకు టిక్కెట్లను పెంచేసినట్టు!!
- మీ ఊరి నుండి కూకట్‌పల్లి వెళ్ళాలని ఎక్కుతారు. పొద్దున్నే ఎస్సారు నగర్లో ఆపేసి, ఇకపోదు, అదిగో ఆ బస్సెక్కండి.. ఇదుగో ఈ ఆటోలో వెళ్ళండి అని అంటారు.
ప్రైవేటు బస్సులని ఎత్తెయ్యాలని కాదు.. వాటిని అదుపు చెయ్యాలి. ప్రజలను వాళ్ళు పెట్టే ఇబ్బందుల నుండి రక్షించాలి. టిక్కెట్టు రేట్లు అదుపు చెయ్యాలి (ఆర్టీసీ వాళ్ళను చేసినట్టుగా). ప్రయాణీకుల బళ్ళు ప్రయాణీకుల కోసమే నడవాలి. సరుకు రవాణా కోసం వాడరాదు.
ప్రస్తుతానికి పూనం మాలకొండయ్యదే పైచేయి. చూద్దాం, ప్రభుత్వమామెను ఎన్నాళ్ళు పనిచెయ్యనిస్తుందో!
11, అక్టోబర్ 2007, గురువారం
వ్యాఖ్యోపాఖ్యానం
10, అక్టోబర్ 2007, బుధవారం
మా పున్నమ్మ బడి
9, అక్టోబర్ 2007, మంగళవారం
ఎవరెవరి సంపాదనలెంతెంత?
కాబట్టి ముఖ్యమంత్రి గారూ! వెంటనే ఆ కమిషనేదో వెయ్యండి. మీరిద్దరేగాదు, రాజకీయులంతా ఎవరెవరు ఎంతెంత మెక్కారో తేల్చండి.
మీరిద్దరూ అవినీతిపరులని తేలిందనుకోండి.. మీ సొమ్ములు గుంజేసుకుంటే ఒక్క గజం భూమి కూడా అమ్మకుండా మొత్తం ప్రాజెక్టులన్నిటినీ కట్టి పారెయ్యొచ్చు. (మీరే చెప్పుకున్న మీమీ ఆస్తుల వివరాలను బట్టి చెబుతున్నాను) మాకు రెండిందాలా లాభం.. మీరు కొట్టేసిన మా డబ్బులు మాకు తిరిగొచ్చేస్తాయి. మిమ్మల్నెలాగూ జైల్లో తోసేస్తారు కాబట్టి మాకు మీ పీడ విరగడౌతుంది. ఇంకో లాభం కూడా ఉంది.. మీ గతి చూసాక మీ తరవాత వచ్చేవాళ్ళు మీలాగా బరి తెగించరు.
అలాకాక, మీరు అవినీతిపరులు గాదనీ, స్వచ్ఛమైన తెల్ల చొక్కాల్లాంటి వాళ్ళనీ తేలిందనుకోండి.. మా ఖర్మ ఇంతేలే అని సరిపెట్టుకుంటాం. ఎన్ని దర్యాప్తు ప్రహసనాలు చూళ్ళేదు గనక!
2, అక్టోబర్ 2007, మంగళవారం
హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు... ముస్లిము సోదరులు
ఉగ్రవాదులు మతం పేరు చెప్పుకునే ఈ పనులు చేస్తున్నారు. మతం పేరిటే స్లీపర్లను, తదితరులను ఏర్పాటు చేసుకుంటున్నారు. మామూలు యువకులు స్లీపర్లు గాను, మానవ బాంబులు గాను మారటానికి ప్రేరణ మతమే అని నేనంటున్నాను. వీరలా మారడానికి ఉగ్రవాదులతో చేతులు కలపడానికి మరో కారణం ఏంటో చెప్పండి. బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ కూడా ఉగ్రవాదులతో చేతులు కలపడాన్ని మనమేమనుకోవాలో చెప్పండి. -క్లుప్తంగా ఇదీ నా గత జాబు! దీనిపైన వచ్చిన విమర్శలోని ముఖ్యాంశాలు, నా జవాబులు:
1, అక్టోబర్ 2007, సోమవారం
ప్రజల సొమ్ము, సబ్సిడీల పాలు
ఉచితంగా మూడు సెంట్ల భూమి!
ఉచిత కరెంటు
ఉచిత అది
ఉచిత ఇది
...
బహిరంగంగా చేస్తున్న ఓట్ల వేలం ఇది. వీళ్ళ సొమ్మేం బోయింది, వీళ్ళు మింగేసిన దాంటోంచి ఇవ్వడం లేదుగదా! మన జేబుల్లోంచి తీసేసుకున్నదే ఇస్తున్నారు. ప్రజల డబ్బులతోటి ప్రజల వోట్లను కొనాలను చూస్తున్నారు. కిలో బియ్యం మార్కెట్లో పాతిక రూపాయల దాకా ఉంది. మార్కెట్టు రేటుకు బియ్యాన్ని కొనుక్కొనే తాహతును ప్రజలకు సంపాదించి పెట్టాల్సింది పోయి, దాదాపు 20 రూపాయల సబ్సిడీ ఇస్తారట. సరే ప్రస్తుతానికి ఇచ్చారుపో.. ఎన్నాళ్ళకు ప్రజలకా తాహతు సంపాదించి పెడతారు? ఆ మాట చెప్పిన పాపాన పోలేదొక్కడు కూడా. దాదాపు పాతికేళ్ళుగా బియ్యంపై సబ్సిడీ ఇస్తూనే ఉన్నారు, ప్రజలికింతవరకు ఆ తాహతు చేకూరలేదు. ఈ సబ్సిడీ పథకం ప్రజలను జోకొట్టేందుకు పనికొచ్చేదే గానీ, దీర్ఘకాలిక ప్రయోజనం శూన్యం. ఏ సబ్సిడీకయినా "ఇదిగో ఫలానా సంత్సరానికల్లా ప్రజలకు ఈ సబ్సిడీ అవసరం లేకుండా చేస్తాం" లాంటి లక్ష్యాలంటూ ఉండాలి. లేకపోతే రిజర్వేషన్ల లాగా పరిమిత ప్రయోజనకరమో నిష్ప్రయోజనమో ఐపోతాయి.
అయితే ఈ వాగ్దానశూరులకు కొన్ని ప్రశ్నలు..
- వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుండి తెస్తారు?
- మీ పరిపాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ఏ స్థాయికి తీసుకెళ్తారు? తలసరి ఆదాయ లక్ష్యం ఏమిటి?
- రాబోయే ఐదేళ్ళలో ఏయే పన్నులను ఏ లెక్ఖన పెంచబోతున్నారు? ఏ స్థాయిని దాటి పెంచరో కూడా చెప్పండి.
- సబ్సిడీలు పొందని ప్రజల కొనుగోలుశక్తిని ఎలా రక్షిస్తారు? ఆ శక్తిని ఏ స్థాయికి పెంచుతారు? ఎలా పెంచుతారు?
- ఊరికినే ఇళ్ళ స్థలాలు ఇచ్చేస్తారు సరే. ఆ స్థలాలకు అర్హత లేని మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకునే మార్గమేంటి? దానిపై మీ ప్రతిపాదన ఏమిటి? ఇప్పటి భూధరల మంటల్లో మధ్యతరగతి ఇంటి ఆశలు ఆహుతై పోతున్నాయి. మరి వారికెలాంటి రక్షణనిస్తారు?
- రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తారు సరే.. బయట బజారులో బియ్యం రేటును ఎంతవరకు నియంత్రిస్తారు?
- రైతుకు కనీస ధరను ఎలా ఇస్తారు? ఎంత ఇస్తారు? పైవాటికి దీనికీ సమతుల్యతను ఎలా సాధిస్తారు?
కలరు టీవీలిస్తారా అని అడిగితే 'చూద్దాం బ్రదరూ' అని నవ్వాడట మన ఘన ప్రతిపక్ష 'నాయుడు'. ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగలు బట్టలారేసుకోడానికి తప్ప మరెందుకూ పనికిరావన్న వ్యక్తి, ఇప్పుడా తీగలను పట్టుకుని ఉయ్యాలలూగమంటాడా!?
23, సెప్టెంబర్ 2007, ఆదివారం
ట్రాఫిక్కబుర్లు
మంగళవారం సాయంత్రం ఆరుంబావు.
ఆఫీసు నుండి ఇంటికెళ్తున్నా, కారులో.
నేనే నడుపుతున్నాను.
నామీద జాలిపడ్డానికి ఇంతకు మించిన కారణం మరోటక్కరలేదు.
21, సెప్టెంబర్ 2007, శుక్రవారం
'కుడీ' 'ఎడమా', మధ్యలో కాంగ్రెసు, నెత్తి మీద కరుణానిధి
ఓ సినిమాలో కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యంల జంట కామెడీ ఒకటుంది. కోట, తుపాకీ ఒకటి పట్టుకుని తిరుగుతూంటాడు. ధర్మవరపు ఆయనకు ఆషాఢభూతి లాంటి అనుచరుడు లాంటి సహచరుడు. "మేజరు గారంటే ఏంటనుకున్నావ్? చవటనుకున్నావా? వెధవనుకున్నావా? చేతకాని దద్దమ్మనుకున్నావా?" అంటూ ఇలా ఉన్నవీ లేనివీ కల్పించి ఎదటివాడు ఏమీ అనకపోయినా అన్నీ తానే తిడుతూ ఎదటి వాళ్ళతో పోట్లాడుతూ ఉంటాడు. అంతా అభిమానం కొద్దీ అంటున్నట్టే ఉంటుంది గానీ ఆ మాటల్లో అంతా అవమానమే! కోటకు ఇతగాణ్ణి ఎలా వదిలించుకోవాలో తెలీదు.
ఖచ్చితంగా అలాగే కాకపోయినా సోనియా కరుణలకు, పై కామెడీకీ కొంత పోలిక ఉంది. సోనియా ఏదైతే ఒద్దనుకుంటోందో కరుణ అదే చేస్తున్నాడు. అతడిని అలా మాట్టాడొద్దని చెప్పలేదు, అలాగని ఊరుకోనూ లేదు. ప్రస్తుతం సోనియా, కరుణానిధిల వ్యవహారం చూస్తంటే నాకు కోట, ధర్మవరపే గుర్తుకొస్తున్నారు. పాపం సోనియా! కరుణానిధిని వదిలించుకోగలదో లేదో!!
మరో దృక్కోణం
ఈ వ్యవహారాన్ని మరో కోణం నుండి చూస్తే.. గుడ్డిలో మెల్ల లాగా కరుణానిధి వాచాలత వలన కాంగ్రెసుకు కొద్దో గొప్పో ఉపయోగమూ లేకపోలేదు. ఆయన నోటి దురుసు కారణంగా బీజేపీకి ఆయుధాలు దొరికి కాస్త పుంజుకొనే అవకాశం ఉంది. వామపక్షాల వాళ్ళు ప్రపంచంలో దేన్నైనా సహిస్తారేమో గానీ, బీజేపీ బలపడితే తట్టుకోలేరు. వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉన్న తరుణంలో మధ్యంతరం జరిగితే బీజేపీకి సీట్లెక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, వామపక్షాలు అందుకు తెగబడక పోవచ్చు. అందుకోసం అణు ఒప్పందంపై తమ అభ్యంతరాలను పక్కన బెడతారు. (వాళ్ళు దేన్నైనా పక్కన బెట్టగలరు!) ఈ రకంగా కరుణానిధి దుందుడుకు ధోరణి కాంగ్రెసుకు ఉపయోగపడుతుంది.
20, సెప్టెంబర్ 2007, గురువారం
గురు లఘువులు
17, సెప్టెంబర్ 2007, సోమవారం
రామ సేతువు - ఎన్డీటీవి చర్చ
నేను టీవీ పెట్టేటప్పటికీ ఆ ప్రొఫెసరుగారు చెబుతున్నాడు.. "రాముడికీ, బ్రిడ్జికీ సంబంధం లేదు. రాజకీయాలకూ మతానికీ సంబంధం లేదు. అఫిడవిట్‌ను వెనక్కి తీసుకోవడం ప్రభుత్వపు తప్పు."
ఈలోగా ఆర్య ద్రావిడ తగువు చర్చకి వచ్చింది. 'రావణుడు బ్త్రాహ్మణుడు, రాముడు, వాల్మీకి బ్రాహ్మణులు కాదు అనే విషయం కరుణానిధికి తెలీదు. ఆయనకు చరిత్ర తెలీదు, కానీ మాట్లాడతాడు' అని సుబ్రహ్మణ్యం స్వామి అన్నాడు. దీనిపై ఆయనా, రాజా కాసేపు పోట్టాడుకున్నారు. ఇహ చూడక్కరలేదనుకుంటా అని అనుకుంటూ ఉన్నాను.. ఈలోగా బర్ఖా దత్ వాళ్ళకు అడ్డం పడిపోయి పోట్లాటను ఆపేసింది.
రాజకీయులు వాళ్ళ మార్కు రిమార్కులు, వాదనలూ చేసారు. వాళ్ళ వాదన చూసి ఆశాభంగం చెందేటంత ఆశలు నాకేమీ లేవు వాళ్ళమీద. కానీ ప్రొఫెసరు మాట్లాడిన విధానం చూసి మాత్రం కష్టమేసింది..
ఆయన "రామ సేతువు" కారణంగా ప్రాజెక్టు ఆగిపోవడానికి బద్ధ వ్యతిరేకి. అసలు రామసేతువును రామ సేతువు అని అనడానికి కూడా ఆయన ఇచ్చగించలేదు. పని గట్టుకుని యాడమ్స్ బ్రిడ్జి అని అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది, కష్టమూ వేసింది. రాముడు కట్టాడో లేదో పక్కన బెట్టండి. ఈ జాతి సహస్రాబ్దుల కిందటి నుండీ నమ్ముతూ వచ్చిన విషయం కదా అది; దాన్ని పక్కన బెట్టి ఈ కొత్త పేరు - "యాడమ్స్ బ్రిడ్జి" అని అనడమేంటి? అది ఎక్కడినుండి వచ్చిందో వెతకబోతే ఇదట దాని కథ. ఏఁవన్నా అర్థముందండీ? చారిత్రకుడు దేన్ని నమ్ముతున్నాడో చూసారా? నాకది చిన్న విషయంగా అనిపించలేదు. మనోడు చెబితే మౌఢ్యం, పైవోడి పైత్యం పరమౌషధమా వీళ్ళకి !? ఏంటో మన వాళ్ళు..
పై కార్యక్రమ నిర్వాహకురాలికి కొన్ని అభిప్రాయాలున్నాయి (ఉండొచ్చు, తప్పులేదు). ఆమె వాటినే చర్చాఫలితంగా చూపించదలచినట్టు అనిపించింది. దాని కోసం అవిరళ కృషి జరిపినట్టు కూడా అనిపించింది. ఈవిడ గారికి ఓ అలవాటుంది. ప్రశ్న అడుగుతుంది, చెప్పేవాడికి పూర్తిగా చెప్పే చాన్సివ్వదు. వాళ్ళు చెప్పేది తనకనుకూలంగా ఉంటే సరే, లేదో.. మాటమాటకీ అడ్డం పడిపోతుంటుంది.
ఇదివరలో ఆమె సహోద్యోగి -రాజ్‌దీప్ సర్దేశాయ్, ఇప్పడు CNN IBN కి కర్త, కర్మ, క్రియ- కూడ ఇలాంటి వాడే. (వీళ్ళిద్దరికీ కామనుగా రెండు ఊతపదాలున్నాయి. అవి: "ఓకే, యు మేడ్ యువర్ పాయింట్", "ఓకే, ఫెయిరినఫ్". ఈ మాటలను వాళ్ళు వాడేటపుడు గమనించండి.. ఆ రెండింటికీ అర్థం ఒకటే స్ఫురిస్తుంది.. "ఇప్పటికే ఎక్కువగా వాగావు, ఇక మూసుకో" అని. అంత ఫోర్సుగా వాడతారు ఆ మాటలను!) . ఇకపోతే కరణ్ థాపర్.. ప్రశ్న అడుగుతాడు, కానీ జవాబు చెప్పే అవకాశమే ఇవ్వడు - పోలీసు, ఖైదీ సంభాషణ లాగా ఉంటుంది ఇంటర్వ్యూ.
వీళ్ళందరితో పోలిస్తే, మన టీవీ 9 రవిప్రకాష్ చాలా మెరుగు. ఇదివరలో జెమినీలో ఉండగా వారం వారం ఒకరిని ఇంటర్వ్యూ చేసేవాడు. వాళ్ళని చక్కగా మాట్టాడనిచ్చేవాడు. అడ్డం పడిపోయేవాడు కాదు.
--ఇవ్వాళ్టికింతే!
16, సెప్టెంబర్ 2007, ఆదివారం
ఇంటర్నెట్లో తెలుగు లోతెంత?
ఇవ్వాళ తెలుగులోనే ఉండే సైట్లు బోలెడన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని నా జీవితంలో భాగమైపోయాయి. భుక్తి కోసం నేను చేసే పనులు ఇవ్వని ఆత్మ తృప్తి ఆయా సైట్లలో నేను చేసే పనులు నాకిచ్చాయి.
నాకు అన్నిటి కంటే ముందు పరిచయమైన తెలుగు సైటు వికీపీడియా! తెలుగు విజ్ఞానసర్వస్వం - ఎన్‌సైక్లోపీడియా. తెలుగులో ఉన్న ఆ సైటు చూసి నాకు మూర్ఛపోయినంత పనైంది. ఎంతో స్వేచ్ఛ ఉంది అక్కడ! అక్కడ ఎవరైనా రాయొచ్చు కూడా. వెంటనే రాయడం మొదలుపెట్టాను. అప్పటికే ఉన్న సభ్యులు - ముఖ్యంగా రవి వైజాసత్య, నాకు ఎంతో సాయపడ్డారు. ఆయన నాకు వికీ గురువు! ఇప్పుడంటే వికీలో చేరేవారికి సాయం చేసేందుకు అక్కడ ఎంతో మంది ఉన్నారు గానీ, ఆ రోజుల్లో రవి ఒక్కడే వికీకంతటికీ! అసలు ఇప్పటి వికీ స్వరూపం చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతింతై, వటుడింతయై అన్నట్టు పెరిగిపోతోంది. రవితో పాటు, ప్రదీప్, కాజ సుధాకరబాబు, నవీన్ వంటి ఎందరో సభ్యులు వికీని పరుగులు పెట్టిస్తున్నారు. అక్కడ నేనూ రాస్తాను. నెట్లో నేను చేసే పనులన్నిటిలోకీ నాకు బాగా ఇష్టమైనది ఇదే, నా బ్లాగు కంటే కూడా! ప్రతి తెలుగువాడూ చూసి తీరాల్సిన, రాసి తీరాల్సిన సైటు ఇది.
బ్లాగులు చూడండి.. చక్కటి తెలుగులో ఉండడమే కాదు వాటి గొప్పదనం.., చక్కటి భావాలతో, మంచి భాషతో, వైవిధ్యమైన విషయాలతో మనలను అలరిస్తూ ఉంటాయి. ఈనాడు, జ్యోతి వగైరా పేపర్లు చదువుతాం. ఎన్ని చదివినా అవే వార్తలు, అవే కబుర్లు. విశ్లేషణలు మాత్రం కొద్దిగా భిన్నంగా ఉంటాయి. కానీ..
కంద పద్యం గురించి, కర్ణాటక సంగీత మాధుర్యం గురించి, రాయలసీమ వ్యావహారికంలో చిన్ననాటి కథలు, విశేషాలు, విదేశాల కబుర్లు, నిజమైన, నిష్పాక్షికమైన సినిమా సమీక్షలు, కడుపుబ్బ నవ్వించే గల్పికలు, నిర్మొహమాటంగా ఉండే రాజకీయ విశ్లేషణలు, వంటలు, సామాజిక సమస్యలు మొదలైన వాటిపై వ్యాసాలు.. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? సమకాలీనమైన ఈ విశేషాలు మనబోటి సామాన్యుడి మాటల్లో ఎక్కడ చూడగలం? బ్లాగుల్లో చూడగలం! అసలు మన పత్రికలపైనా, టీవీల పైనా, సినిమాల పైనా నిష్పాక్షికమైన విమర్శ కావాలంటే బ్లాగులు చూడాల్సిందే! మరోచోట దొరకవు. ఎవరైనా, ఏ విషయం గురించైనా రాయగలగడమే ఈ బ్లాగుల విశిష్టత! ఈ పేజీకి ఎడమ పక్కన ఉన్న బ్లాగుల లింకులకెళ్ళి చూస్తే, బ్లాగుల గురించి నేను చెప్పింది బహు తక్కువని తెలిసిపోతుంది. కూడలికి వెళ్తే బ్లాగుల పూర్తి జాబితా చూడవచ్చు.
వికీకి, బ్లాగులకు, ఆమాటకొస్తే తెలుగును ఇంటర్నెట్ వ్యాప్తం చెయ్యడానికి దోహదం చేసినవి కొన్నున్నాయి. తెలుగు నెజ్జనులకు అవి ప్రాతఃస్మరణీయాలు. ఓసారి బ్లాగుముఖంగా వాటిని స్మరించుకుంటాను.
- తెలుగుబ్లాగు గూగుల్ గుంపు (http://groups.google.com/group/telugublog) నెట్లో తెలుగు అభివృద్ధికి దోహదపడిన అత్యుత్తమ స్థలం ఏదన్నా ఉందీ అంటే.. అది ఇదే
- లేఖిని (http://lekhini.org) తెలుగులో రాయడానికి ఇంతకంటే సులభమైన సైటు ఇంకా రాలేదు.
- పద్మ (http://geocities.com/vnagarjuna/padma.html) నేను తెలుగులో రాయడం సాధన చేసిందిక్కడే. లేఖిని వచ్చాక, వెనకబడింది.
- కూడలి (http://koodali.org) మొత్తం బ్లాగుల కబుర్లన్నీ ఇక్కడ చూడొచ్చు.
తరువాతి కాలంలో వెలసిన కిందిసైట్లు కూడా ఇతోధికంగా సేవ చేస్తున్నాయి.
- తెలుగుబ్లాగర్స్ (http://www.telugubloggers.com)
- తేనెగూడు (http://www.thenegoodu.com)
- జల్లెడ (http://jalleda.com)
15, సెప్టెంబర్ 2007, శనివారం
మీ నిర్వాకం సంగతి చూడ్డానికి వేరే రాష్ట్రానికి పోవాలా ముఖ్యమంత్రీ?
మన అభివృద్ధి సంగతి తెలుసుకుని మూర్ఛబోదామని నాకూ ఉంది. కానీ అంతకంటే ముందు చంద్రబాబు, ఇతర ప్రతిపక్షాలు అలా దేశం తిరిగొస్తే ప్రయోజనమేమైనా కలుగుతుందా అని ఆలోచించ దలచాను. ఈమధ్య ఈ జనాలు ఓబులాపురం చూసొచ్చారు. సింగడు అద్దంకి వెళ్ళాడు, వచ్చాడు అన్నట్టు.. వీళ్ళూ వెళ్ళారు, వచ్చారు. తెదేపా 'ఏమీ బాలేదు' అని అంది.. ఏంబాలేదో, ఎందుకు బాలేదో చెప్పలేకపోయింది, మామూలుగానే! మిగతావాళ్ళు 'ఏంలేదు, అంతా బానే ఉంది' అంటూ జేజేలు కొట్టొచ్చారు. ఆ మాత్రపు ముష్టి పని కోసం ఈ నాయకులంతా పాంట్లు ఎగలాక్కోని ఓబులాపురం దాకా పొయ్యొచ్చారు. అవునులే జీవితంలో మరో రకంగా 'గాలి'మిషను (హెలికాప్టరు) ఎక్కగలిగే వాళ్ళా!? 'గాలి' అబ్బాయి వీళ్ళని చూసి ముష్టి వెధవలని అనుకొని నవ్వుకొని ఉంటాడు. హై. లో కూచ్చుని గనులు లీజుకెలా ఇచ్చారో పరిశీలిస్తే ఇక్కడే తెలిసిపోయేది ఆ లీజు భాగోతం; కోర్టుకు తెలిసిపోలా!!?
వీళ్ళింత చేతకాని వాళ్ళని తెలిసే ముఖ్యమంత్రి వెళ్ళొద్దాం వస్తారా అని చిటికెలేస్తున్నాడు. అసలు మన గొప్ప తెలుసుకొనేందుకు ఎక్కడికన్నా పొయ్యి రావాలా, అనేది నా సందేహం.
ముఖ్యమంత్రీ.. అక్కడికెళ్ళి ఏంచేస్తారు?
- ప్రజల పట్ల ఇంత బాధ్యతారాహిత్యంగా, ఇంత నిష్పూచీగా ఉండే ప్రభుత్వం మరోటుందేమో చూసొస్తారా?
- కోర్టులు మీ ప్రభుత్వాన్ని తిట్టినట్టు ఇంకెవరినైనా తిట్టారో లేదో తెలుసుకుంటారా?
- తరాల తరబడి ప్రభుత్వ భూములను కాజేసి, వాడేసుకొని ఇవ్వాళే తెలుసుకున్నట్టు, ప్రభుత్వానికి అప్పజెప్పినట్టూ నాటకాలాడే పత్తిత్తుల కోసం వెతుకుతారా?
- రాష్ట్రం మొత్తాన్ని ప్లాట్లు చేసి లాట్లుగా అమ్మేసే ప్రభుత్వం ఇంకెక్కడైనా ఉందేమోనని చూసొస్తారా?
- ఫైళ్ళు చూడకుండానే సంతకాలు పెట్టేసే ముఖ్యమంత్రులు, తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టిచ్చేసే మంత్రులు ఇంకా ఎక్కడెక్కడున్నారో చూసొస్తారా?
- నేరస్తులతో చెట్టాపట్టాలేసుకు తిరిగే పాలకుల కోసం వెతుకుతారా?
- పర్సనల్ కార్యదర్శి నుండి ప్యూను దాకా అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిన మరో పేషీ ఎక్కడన్నా ఉందేమోనని చూసొస్తారా?
- బినామీ పేర్లతో కంపెనీలే పెట్టిపారేసే మంత్రులు ఇంకా ఎక్కడైనా ఉన్నారో లేదో చూసొస్తారా?
- ఒకదాని తరవాత ఒకటి బాంబులేసినోడెవడో నీకు తెలీదు. గుజరాతులో నేరం జరిగితే, వాళ్ళు, మీ పోలీసుల్లోనే దొంగ వెధవలున్నారంటూ ఇక్కడికొచ్చి మరీ చెప్పి పోయారు. ఈ మాత్రం తెలుసుకొనేందుకు పైరాష్ట్రానికెందుకు పోయి రావడం డబ్బు దండగ కాకపోతే! వాళ్ళే ఇక్కడికొచ్చి చెబుతున్నారు గదా!
- సబ్ కాంట్రాక్టులు పొందే కుట్రతో, కాంట్రాక్టులు పెద్ద కంపెనీలకు ఇప్పించి, వాటి నుండి పొందిన సబ్ కాట్రాక్టులతో నాసి రకం కట్టుబడులతో రాజకీయులు కోట్లు పోగేస్తున్న వైనం ఇంకా ఎక్కడుందో చూసొస్తారా?
- కడుతూ ఉండగానే కూలిపోయే వంతెనలు, పైదారులు, కిందారులు దేశంలో ఎక్కడున్నాయో వెతుక్కుంటూ పోతారా?
- 11 కోట్లు అప్పనంగా ఇచ్చి పారేసి, ఎవడికిచ్చామో కూడా తెలీని పరిస్థితి ఇంకా ఎక్కడైనా ఉందో లేదో చూసొస్తారా?
- రాజీవు, ఇందిర, సోనియా అంటూ చెక్కభజన చేస్తూ సొంత రాష్ట్రపు నాయకులను విస్మరించే జాతి ఇంకా ఎక్కడైనా ఉందేమోనని చూసొస్తావా?
- గత సీవీసీ రామచంద్ర సమాల్ ఏమంటున్నారో వినబడిందా? ఇన్నాళ్ళూ ఆయన చెప్పినవన్నీ పెడచెవినబెట్టావు. ఇప్పుడు ఆయన చెప్పే మాటలు మాకూ వినబడుతున్నాయి. ఆయనిలా అంటున్నాడు..
"ఆంధ్రప్రదేశ్ భూగర్భాన్ని సముద్రంలోపల, సముద్రం బయట ఇంత వ్యవస్థీకృతంగా దోపిడి చేయటం ఎప్పుడూ చూడలేదు."
"..అన్ని ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రస్తుత నాణ్యత నియంత్రణ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రత్యామ్నాయం ఒక భ్రమ. అందరూ కాంట్రాక్టర్లుగా మారిపోయారు."
మీ బాగోతాలు బయట పెట్టేంతటి తెలివి ఈ చేతకాని ప్రతిపక్షానికి లేదు. ఉంటే, ఇన్నాళ్ళూ మీ ఆటలిలా సాగేవా?
31, ఆగస్టు 2007, శుక్రవారం
కంప్యూటర్ ఎరా చూసారా?
పత్రికంటే ఓ యాభై కాగితాలు కాదు, యాభై పేజీల విశేషాలు. రాసే వ్యక్తికి తెలిసిన విషయాలు రాస్తే కాదు.., చదువరికి తెలియని కబుర్లు రాయాలి. అప్పుడే పత్రికను కొనుక్కున్న పాఠకుడికి తృప్తి కలుగుతుంది. ఈ పత్రిక ఖచ్చితంగా డబ్బుకు తగ్గ విలువ ఇస్తుంది. ఒకే ఒక్క వ్యక్తి, నెలనెలా, అంతంత సమాచారాన్ని, అన్నన్ని విశేషాల్ని, ఒంటిచేత్తో ఇస్తూ వస్తున్నారంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సంపాదకుడు నల్లమోతు శ్రీధర్ గారికి అభినందనలు.
పత్రికను మీరూ చదవండి.. మీ సూచనలు, సలహాలను శ్రీధర్ గారికి పంపండి.
సెప్టెంబరు సంచికలో 'జాలంలో తెలుగు వెలుగుల' కబుర్లు కూడా వచ్చాయి. వలబోజు జ్యోతి గారి చలవ అది. మంచి వ్యాసం రాసారు.
28, ఆగస్టు 2007, మంగళవారం
ఉగ్రవాదము, మతమూ
26, ఆగస్టు 2007, ఆదివారం
బాంబుల మధ్య మనం
ఏ ప్రకృతి బీభత్సానికో ప్రజలు చనిపోతే శోకం, బాధ కలుగుతాయి, మనసుక్కష్టం కలుగుతుంది. కానీ ఇలాంటి దురాగతాలకు బలవుతుంటే ఆక్రోశం, క్రోధమూ కలుగుతాయి. మున్నెన్నడూ ఎరగని సంఘటనలేమీ కావివి. మనకెన్నడూ అనుభవం లోకి రానివేమీ కావీ ఘటనలు. ఇంతకు ముందు జరిగాయి, పైగా ఇలాంటివి ఇంకా జరగొచ్చని అనుమానాలూ ఉన్నాయి. అయినా ఎలా జరిగాయి?
ఎందుకిలా జరిగాయి? మే 18 నాటి మసీదు బాంబు పేలుడు నాటి నుండీ, మళ్ళీ అలాంటివి జరగొచ్చేమోనని పేపర్లలో వార్తలు చూస్తూనే ఉన్నాం. నిఘా సంస్థలకు వీటిపై సమాచారముందట. అయినా ఎలా జరిగాయీ పేలుళ్ళు? ఎందుకు వీటిని ఆపలేకపోయారు? ఇంత పెద్ద నగరంలో బాంబులెక్కడున్నాయో కనిపెట్టడం గడ్డి వామిలో సూది కోసం వెతికినట్టే కావచ్చు! కానీ మసీదు బాంబు తరవాత, ఇంకా అలాంటివి జరగొచ్చని తెలిసింతరవాత కూడా ఎవ్వరినీ అరెస్టు చెయ్యలేదెందుకని? ఒక్క అనుమానితుడిని కూడా పట్టుకోలేక పోయారేఁ? ఆర్డీయెక్సులు, బాంబుల తయారీ స్థలాలూ, దాచిన స్థలాలూ ఎందుకు దొరకలేదు? అసలు చర్యలేం తీసుకున్నారు? ఎంతమందిని అరెస్టు చేసారు? 42 ప్రాణాలు బలయ్యాక.., ఇకనైనా చెబుతారా? మమ్మల్ని సంయమనంతో ఉండమని చెవటం కాదు, మా రక్షణ కోసం మీరేం చేసారో, ఏం చేస్తున్నారో చెప్పండి.
ఒక్కటి మాత్రం బలపడుతోంది.. పొద్దుట బయటికి వెళ్ళిన వాళ్ళం మళ్ళీ రాత్రికి క్షేమంగా ఇంటికి చేరుకున్నామంటే అది కేవలం మన అదృష్టం, అంతే.. వ్యవస్థ మనకు కల్పిస్తున్న రక్షణ వలన మాత్రం కాదు! ప్రభుత్వాలు, వాటి విధానాలు చేతకానివి కావడంతో మనం మూల్యం చెల్లిస్తున్నాం. వాళ్ళకు ఓట్లిచ్చాం, పాలించే హక్కిచ్చాం, చివరికిలా ప్రాణాలూ వాళ్ళ ఎదాన పోస్తున్నాం.
25, ఆగస్టు 2007, శనివారం
ప్రాణాలు తీసేవాడు, ప్రాణాలు పోసేవారు
ఇతడి వార్త వచ్చిన ఆగస్టు 25నే మరో వార్త కూడా వచ్చింది. అంతరించి పోతున్న కృష్ణజింక జాతిని (అతడు చంపేసిన జింక జాతి) కాపాడేందుకు హైదరాబాదులోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ - మక్కికి మక్కి అనువాదం చేస్తే.. కణ, కణజాల జీవశాస్త్ర కేంద్రం) నడుం బిగించింది. కృత్రిమ గర్భధారణ ద్వారా ఒక జింక పిల్లను భూమి మీదకు తెచ్చారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు మనోజ్‌పాటిల్, సదానంద్, ఉమాపతి దీనిపై కృషిచేసారు. వీరు అయిదు మగ కృష్ణజింకల నుంచి 85 వీర్యనమూనాలను సేకరించారు. వీటిని మూడు జింకల్లో కృత్రిమ విధానంలో గర్భధారణ చేయించగా ఒకటి విజయవంతం అయిందని సీసీఎంబీ సంచాలకులు లాల్జీసింగ్ చెప్పారు. [2007 ఆగస్టు 25 నాటి ఈనాడు వార్త -ఈ లింకు ఎన్నాళ్ళో పనిచెయ్యదు]
సీసీఎమ్‌బీ, మూలకణాలపై (స్టెమ్‌సెల్స్) పరిశోధనలు చేస్తున్న ఏకైక భారతీయ సంస్థే కాకుండా, ప్రపంచంలోని అతి కొద్ది సంస్థల్లో ఇది ఒకటని కూడా చదివిన గుర్తు. మొదలుపెట్టినకొత్తలో దాని గురించి ప్రముఖంగా వార్త వచ్చింది, అది ఎంత బాగుందో, దాని పరిసరాలెంత బాగున్నాయో అంటూ! అప్పటి సంచాలకుడు (భార్గవ అనుకుంటా) మారి, లాల్జీసింగు వచ్చాక ఆయన జీవిత విశేషాలను గురించిన వార్త వచ్చింది.
కొసమెరుపు: ఆ సినిమా హీరో ప్రాణాలు తీస్తే, శాస్త్రవేత్తలు ప్రాణాలు పోసారు. ఈనాడులో అతడి వార్త మొదటి పేజీలో ఫోటోతో సహా ప్రముఖంగా వచ్చింది, వీరి వార్త ఐదో పేజీలో వేసారు; ఫోటోలా!? భలేవారే!!
22, ఆగస్టు 2007, బుధవారం
బీసీసీఐ నిర్వాకం
బీసీసీఐ నియంత్రించేది క్రికెట్టును కాదు, దానిలో వచ్చిపడుతున్న డబ్బులను.
ఏ పోటీ ఐనా, ఎక్కడ జరిగినా మన జట్టంటూ పాల్గొంటే చాలు.. డబ్బులే డబ్బులు!
మనం ఓడినా, గెలిచినా మన జట్టు ఆడే మాచిల ప్రసార హక్కులు కోట్లు కురిపిస్తాయి.
- అంచేత జట్టును ఆడించడమే ముఖ్యం.. గెలుపు కాదు.
- అంచేత జట్టును ఎంపిక చేస్తే చాలు.. మంచి జట్టే కానక్కర్లేదు.
- అంచేత ఆటగాళ్ళంటూ ఉంటే చాలు.. మంచి ఆటగాళ్ళను తయారు చెయ్యాల్సిన పని లేదు.
బీసీసీఐ ఎక్కువగా తప్పుడు విషయాలకే వార్తల్లో ఉంటుంది. ఇవిగో ఇలాంటి వాటికి.
- ఆటగాళ్ళ లోగోల గోల
- ఆటగాళ్ళతో ఒప్పందాల పేచీ
- ప్రసార హక్కుల గొడవ
- ఎన్నికల రాజకీయాలు
- ఐసీసీతో తగువులు
బీసీసీఐ నిర్వాహకులు భలేగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు లేడు గానీ ఇదివరకు జయవంత్ లెలే అని ఒకాయనుండే వాడు, కార్యదర్శిగా.. మనవాళ్ళు ఆస్ట్రేలియాలో చిత్తుగా ఓడి వస్తారని పత్రికల వాళ్ళకి చెప్పాడోసారి; తరవాత దాన్ని ఖండించాడు లెండి!
పైగా బీసీసీఐ పేరెత్తితే చాలు, రాజకీయాల గబ్బు. పోయిన దాల్మియా పతాకస్థాయికి తీసుకెళ్ళాడు దాన్ని. దాల్మియాలు, నాయర్లు, భింద్రాలు.. వీళ్ళకు రాజకీయాల తోటే సరిపోయేది. వీళ్ళు రాబందుల్లాగా తయారయ్యారనుకుంటే.. ఏకంగా గుంట నక్కలు, తోడేళ్ళే రంగంలోకి దిగిపొయ్యాయి, తరవాత. మాంసం వాసనను ఈ జంతువులెలా పసిగడతాయో, రాజకీయ జంతువులు డబ్బు వాసన్నలా పసిగడతాయి.
అసలు రాజకీయులు బీసీసీఐ లోకి దిగడం ఎప్పుడో మొదలైంది. ఎన్.కె.పి.సాల్వే అధ్యక్షుడిగా చేసాడిదివరలో. తరవాత్తరవాత మాధవ్‌రావ్ సిందియా, అరుణ్ జైట్లీ, శరద్ పవార్.. ఇలా అందరూ చేరి దాన్నో రొచ్చుగుంట చేసారు. లాలూ బీహారు సంఘంలో అడుగెట్టాడు, తరువాతి మజిలీ బీసీసీఐ య్యే! (ఇతర ఏ రంగం నుండైనా రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు గానీ రాజకీయులు వేరే ఏ ఇతర రంగంలోకీ అడుగుపెట్టరాదని ఓ చట్టం చేస్తే బాగుండు. దివాలా తీసినవాడు ఇక ఎందుకూ పనికిరాడని తేల్చినట్టుగా నన్నమాట!)
ఒక్క బీసీసీఐ మాత్రమేనా.., దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ సంఘాలూ ఇట్టాగే ఏడుస్తున్నట్టున్నాయి. భారత క్రికెట్టు సామ్రాజ్యానికి బీసీసీఐ చక్రవర్తి, స్థానిక సంఘాలు సామంత రాజులూను. మన హైదరాబాదు సంఘం చూడండి.. రాజకీయాలకు నెలవది. శివలాల్ యాదవ్ తన కొడుక్కోసం తిరుపతి రాయుణ్ణి బలిపెట్టాడని చదివాం. ఆంధ్ర సంఘానికి ఈ మధ్య ఎన్నికలు జరిగితే బెజవాడ ఎంపీ దూరబోయాడు.. ఎలాగో బెడిసికొట్టింది. బెంగాల్లో ఓ సీపీఎమ్ నాయకుడూ ఓ పోలీసోడు పోటీ పడ్డారు అధ్యక్ష పదవి కోసం. అప్పుడు ఎవడికి మద్దతివ్వాలనే విషయమై ముఖ్యమంత్రికి చిక్కొచ్చిపడిందట! మన పేపర్ల దాకా వచ్చిందా విషయం.
ఇండియన్ క్రికెట్ లీగ్ - ఐసీయెల్ - భారత క్రికెట్లోకి మంచి మార్పులు తెస్తుందా?
తెస్తుంది. పోటీ వస్తుంది. బీసీసీఐ క్రికెట్ గురించి కూడా ఆలోచించేలా చేస్తుంది. పెద్దల అండలేని ఆటగాళ్ళ ప్రతిభా ప్రదర్శనకు వేదిక అవుతుంది. ఐసీయెల్ క్రికెట్టుకు సేవ చేసేందుకు వచ్చిందని నేననడం లేదు.. వాళ్ళకూ డబ్బు కావాలి. కానీ క్రికెట్టును పక్కనెట్టి రాజకీయాల్లో మునిగితేలరు, బీసీసీఐ లాగా.
ఐసీయెల్ లాగా మరి కొన్ని లీగులు రావాలి. అన్ని లీగుల్లోంచి ఉత్తమంగా ముందుకొచ్చేవారికి జాతీయ జట్టులో స్థానాలు కల్పించాలి. అదే బీసీసీఐకి తగిన మందు.
ఐసీయెల్ కు స్వాగతం! సుభాష్ చంద్రకు, కపిల్ దేవ్ కు శుభాకాంక్షలు.
తా.క: బీసీసీఐ వెబ్ సైటు చూస్తే, వాళ్ళకు క్రికెట్టు పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందో మనకర్థం అవుతుంది. అసలు దాని వెబ్ అడ్రసేంటో చెప్పుకోండి చూద్దాం!
24, జులై 2007, మంగళవారం
ధృతరాష్ట్రుడూ ఆయన సంతతీ!
మర్యాదస్తులు బయట కూడా అలా మాట్లాడుకునేందుకు వెనకాడుతారు; పోట్లాడుకునే సందర్భంలో కూడా!
అంత దారుణంగా మాట్లాడాక మళ్ళీ మామూలుగా ఉండగలరా? అసలిహ మొహం మొహం చూసుకోగలరా? కలిసికట్టుగా పనిచెయ్యలేని ఈ అధికార, ప్రతిపక్షాలు మనకెంతమాత్రం పనికొస్తాయి?
మనం వీళ్ళకి ఓట్లేసి సభకు పంపింది కలిసి పనిచెయ్యమని, కాట్లాడుకొమ్మని కాదు. ఇలా అసభ్యంగా మాట్లాడి - దూషించి- ముఖ్యమంత్రి తన విధిని మరిచాడు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన స్పీకరు - అసలు ప్రతి'పక్షపాతి'గా ఉండాలట - ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తుతూ తానా పదవికి పనికిరానని నిరూపించుకున్నాడు.
- ఉక్కు కర్మాగారం - తప్పుబట్టిన ప్రతిపక్షం
- చుట్టాల గనులు - తప్పంటున్న ఘనులు
- తోడల్లుడి పవరు ప్లాంటు - ఆపేయించిన ప్రతిపక్షాలు
- ప్రాజెక్టుల్లో ప్రవహిస్తున్న అవినీతి - దానికి ఆనకట్ట కట్టబోయే పత్రికలు, ప్రతిపక్షాలు
- హైదరాబాదు బ్రదర్స్ - కారు చిచ్చులు, వీధి పోరాటాలు
- పోతిరెడ్డిపాడు - అద్భుత ప్రగతిని ఓర్వలేని ప్రతిపక్షాలు
- అంతులేని భూయాగాలు - అయినా తీరని కోరికలు
- ఆ రెండు పత్రికలు - కొరకరాని కొయ్యలు
- కమ్యూనిస్టుల భూయజ్ఞం - అవి చాలవన్నట్టు నిరాహార దీక్షలు
- ...
- ...
- పై తలనెప్పులకు తోడు శాసనసభ సమావేశాలు పెట్టక తప్పని పరిస్థితి. తప్పించుకుందామంటే లేదాయె!
మొత్తమ్మీద సభను కురుసభను తలపింప జేసారు. ముఖ్యమంత్రి దుర్యోధనుడుగా పరవాలేదు. స్పీకరు మాత్రం ధృతరాష్ట్రుడి పాత్రలో జీవించాడు. స్పీకరు ఎలా ఉండకూడదో ఒక ఉదాహరణగా నిలుస్తాడు!!
24, జూన్ 2007, ఆదివారం
కౌన్సెలింగు చేసేందుకు వీళ్ళెవరు?
అధికారంలో ఉండి హంగూ ఆర్భాటాల్తో తిరిగే రోజుల్లో వీళ్ళంతా ఏం చేసినట్టు? తెలంగాణ రాష్ట్రం ఇమ్మని అడుక్కునే రోజుల్లో, కాంగ్రెసు దేవత కటాక్షం కోసం దేబిరించే రోజుల్లో ఈ జీవోలు గుర్తుకు రాలేదా? అప్పుడేం చేసారో ఈ కౌన్సెలింగు నేతలు? తెలంగాణాకు అనుకూలంగా అమ్మగారి చేత ఏదో ఒక ప్రకటన చేయించమని దిగ్విజయ్ సింగును ముష్టెత్తుకునే రోజుల్లో ఈ జీవోలను ఏ పరుపుల కింద దాచారు? ఇవ్వాళ మాత్రం ఈ సలహా దళాన్నొకదాన్ని ఏర్పాటు చేసుకుని ఆఫీసులకెళ్ళి తైతక్కలాడుతున్నారు. జీవోను అమలు చెయ్యకపోతే ప్రభుత్వం మెడలు వంచి చేయించుకోవాలి లేదా చేతులు ముడుచుక్కూచ్చోవాలి . అంతేకానీ, ఉద్యోగులనిలా హింసించడమేమిటి?
8, జూన్ 2007, శుక్రవారం
ఇన్నాళ్ళూ ఏమైపోయారు పాల్ గారూ?
"ఎన్నికలప్పుడు రాజశేఖరరెడ్డి నన్ను 5 మిలియను డాలర్లు డబ్బులడిగాడు. నేనివ్వనన్నాను. అంచేత నాపై పగబట్టి ఆయనా సోనియాగాంధీ కలిసి నా గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ కు దేశంలో అనుమతి రద్దు చేసారు."
మూడేళ్ళ తరవాత ఆయనకీ సంగతి హఠాత్తుగా గుర్తొచ్చి, ఈ ముక్క పత్రికల వాళ్ళ దగ్గర బైటపెడితే, ముఖ్యమంత్రి ఫక్కున నవ్వేసాడు. (అంటే ఏదో ఉందన్నమాటే!)
అసలు పాల్ కు రాజకీయ నాయకులతో పనేంటి? కూటములు పెట్టి ప్రజలకు స్వస్థత ప్రసాదించే దైవజనుడు రాజకీయులతో అంత పూసుకు తిరగాల్సిన అవసరం ఏంటి? 108 దేశాల్లో తిరిగాను, 60, 70 మంది ప్రభుత్వ, దేశాధినేతలతో ప్రత్యక్షంగా పరిచయం ఉంది. ఇరాక్ లో నా శాంతి ప్రయత్నాలు విజయం సాధించే దశలో, అసూయతో బుష్షు అడ్డం పడి యుద్ధానికి వెళ్ళాడు. బుష్షూ రైసూ కలిసి సోనియా గాంధీతో కుమ్మక్కై నా సంస్థకు అనుమతులు రాకుండా చేసారు.. ఇలా ఆయన చెప్పుకు పోతుంటే మనకూ నవ్వొచ్చింది. ఆ రాత్రి టీవీ9 వాడి ఫోనాఫోనీ కార్యక్రమంలో చూడాలి అయ్యవారి తీరు.. అబ్బో..!
టీవీ 9 వాడి ఫోనాఫోనీ ఎంతో రంజుగా మంచి ఆరోగ్య కరమైన హాస్యాన్ని అందిస్తూ సాగింది. పైన చెప్పినవి కాక కొన్ని జోకులు చూడండి..
పాల్ ఆయన ఎదురుగా ఉన్న ఫైలు లేపి చూపిస్తూ మంత్రి మారెప్ప, రోశయ్య, నట్వర్ సింగు, ఇలా ఎందరో ఉత్తరాలు ఇచ్చారు. ఇందులో అందరి ఉత్తరాలు ఉన్నాయి. సమయం వచ్చినపుడు బయట పెడతాను అంటూ చెప్పినవాడు, టీవీ 9 రజనీకాంత్ "ఏదీ చూపించండి" అంటే వెతికాడు కానీ కనిపించలేదు.
ఈ లోగా మంత్రి మారెప్ప లైను లోకి వచ్చాడు..
పాల్ ఉత్సాహంగా ఆ మారెప్ప గారూ చెప్పండి అన్నాడు. మారెప్ప ఆయన్ని నిరాశ పరుస్తూ ఈ పాల్ చెప్పేవన్నీ అబద్ధాలు. నేను ఆయన తమ్ముడికి ఉత్తరం ఇచ్చిన మాట వాస్తవం అని అన్నాడు. వెంటనే పాల్, 'ఇదుగో మీరు రాసిన ఉత్తరం నా దగ్గరే ఉంది. అసలు అందులో మీరేం రాసారో చెప్పండి', అని అడిగాడు.
అప్పుడు "మంత్రి" మారెప్ప అద్భుతమైన డవిలాగు చెప్పాడు "అబ్బే నేనేం రాయలేదు, తెల్ల కాగితమ్మీద సంతకం పెట్టిచ్చాను". (ముఖ్యమంత్రి గారు ఫైలు చూడకుండానే సంతకం పెట్టానని చెప్పుకున్నాడు. వారి దర్బారులో మంత్రేమో తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టి ఇచ్చేస్తున్నాడు. శభాష్!) మతి పోయిన రజనీకాంత్ తేరుకుని "అలా తెల్ల కాగితమ్మీద సంతకం ఎలా పెట్టారండి" అనడిగితే ఈయన దైవజనుడు కదా అని పెట్టాను అని అన్నాడు.
అన్నిటి కంటే గొప్ప జోకు ఏంటంటే, పాల్ గారు పదే పదే చెప్పిన ఓ మాట..
"నా సంస్థను ఇలా అడ్డుకోవడం వలన వీళ్ళెంత తప్పు చేస్తున్నారో తెలుసుకోవడం లేదు.. ఎంతో మంది విధవరాండ్రకు అన్యాయం జరుగుతోంది. ప్రపంచంలోని వేలాది విధవరాండ్రకు (ముందు లక్షలాది అని అన్నాడు) నేను మేలు చేస్తున్నాను" ఇలా పదే పదే విధవరాండ్రు అని ఆయన అంటూ ఉంటే, నాకు గురజాడ వారి గిరీశమే గుర్తుకొచ్చాడు.
ఇహ జోకులాపి విషయానికొస్తే..
మూడేళ్ళ కిందట వీళ్ళు డబ్బులడిగారని పాల్ గారు చెబుతున్నారు. అది దిగ్భ్రాంతి కలిగించేంత, నమ్మలేనంత విషయమేమీ కాదు. అడిగే ఉంటారు! కానీ..
- డబ్బుల సంగతి ఇన్నాళ్ళూ ఎందుకు దాచారు?
- అసలు వాళ్ళతో ఈయనకు తగవు రావడానికి కారణం అదేనా, లేక.. ప్రజలకు చెప్పనిది, చెప్పుకోలేనిది ఇంకా ఏమైనా ఉందా?
- డబ్బులివ్వనందున ఈయన సంస్థకు అనుమతులు ఇవ్వడం లేదంటున్నారు. అందుకే అ సంగతులన్నీ ఇప్పుడు బైట పెట్టానంటున్నారు. మరి అనుమతులు నిరాటంకంగా కొనసాగి ఉంటే బయట పెట్టేవారు కాదా?
- ఇప్పటి వరకూ ఎవరెవరు ఈయన్ని డబ్బులడిగారు? ఎంతెంత ఇచ్చారు?
- కూటముల మాటున ఈయన రాజకీయులతో అనైతిక సంబంధాలు పెట్టుకున్నట్టుగా అనుమానం కలుగుతోంది. ఏయే పార్టీలతో ఈయనకు సంబంధాలున్నాయి?
3, జూన్ 2007, ఆదివారం
ఏది చరిత్ర?
ఇది మనం చదువుకున్న చరిత్ర.
కానీ పంజాబు రాజు ఆనందపాలుడు గజనీ మహమ్మదుకు రాసిన ఉత్తరం చూడండి ..
"నీ రాజ్యం మీదికి తురుష్కులు దండెత్తి వచ్చారని, ఖురాసాన్ ప్రాంతాన్ని ఆక్రమించారని విన్నాను. నువ్వు కావాలంటే ఐదువేల గుర్రాలతో, పదివేల సైనికులతో, నూరు ఏనుగులతో నేను నీకు సాయంగా వస్తాను. లేదా, నీకిష్టమైతే అంతకు రెట్టింపు బలగంతో నా కుమారుడిని పంపుతాను. నేనీ ప్రతిపాదన చేస్తున్నది నీ అనుగ్రహం కోసం కాదు. నేను నిన్ను చిత్తుగా ఓడించి పరాభవించాను. నీపై నేను సాధించిన పైచేయి నాకు తప్ప మరొకరికి దక్కకూడదని నా కోరిక"
ఈ ఉత్తరం గురించి రాసింది ఎవరో కాదు, సాక్షాత్తూ గజనీ ఆస్థానంలోని చారిత్రకుడు, అల్ బెరూనీ. అంటే దీనర్థం గజనీ మన మీదికి దండెత్తిన మొత్తం 17 సార్లూ గెలవలేదన్న మాట. మరి మనకలా ఎందుకు చెబుతున్నారు? ఎవరా చెప్పేది?
ఇదీ, ఇలాంటి అనేకానేక పాత వాస్తవాలు కొత్తగా తెలుసుకోవాలంటే (తెలుసుకోవాలి కూడా) ఎం.వి.ఆర్.శాస్త్రి గారు రచించిన ఏది చరిత్ర? అనే పుస్తకం చదవాలి. ఇదే కాదు దాని తరవాత వచ్చిన ఇదీ చరిత్ర కూడా చదవాలి.
రచయిత శాస్త్రి గారు ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకుడు.
ఈ పుస్తకాల గురించి నాకు చెప్పిన త్రివిక్రమ్ కు కృతజ్ఞతలతో..
- ఏది చరిత్ర? గురించిన వికీపీడియా వ్యాసం చూడండి. ఆ వ్యాసాన్ని విస్తరించండి.
2, జూన్ 2007, శనివారం
మీస వైరాగ్యం భక్తి వైరాగ్యం
ఆ మధ్య తిరపతెళ్ళి గుండు చేయించుకొచ్చాను. ఏవో కష్టాల్లో పడి ఉంటాడు.., దేవుడు గుర్తొచ్చాడు, లేపోతే తిరుపతెందుకెళ్తాడు అని అనుకుంటున్నారా? నిజమే మరి, కష్టాల్లో ఉన్నప్పుడు కాక, అంతా బాగున్నప్పుడు కూడా దేవుణ్ణి విసిగించడం ఎందుకు చెప్పండి? అసలు నాకో సందేహం.. కష్టాలొచ్చినపుడు, ఆస్తికులు దేవుడికి మొక్కుకుంటారు, చక్కహా గుండు చేయించుకుంటారు, మరి నాస్తికులు గుండెప్పుడు చేయించుకుంటారబ్బా?
నాస్తికులు "దేవుడు లేడు, భక్తీ ముక్తీ అంతా ట్రాష్ అంటూ ఇంగ్లీషులో కొట్టిపారేస్తుంటారు కదా.. వీళ్ళకి పాపం తగలదూ? చచ్చిపోయాక నరకానికి పోరూ?" అని చింత ఉండేది నాకు. ఈ మధ్య ఓ బ్లాగులో (పేరు గుర్తు లేదు) రాసింది చదివాక నాకా సందేహాలు పటాపంచలైపోయాయి. అందులో ఇలా రాసారు..
జయ విజయుల కథ తెలుసు కదా, వాళ్ళు విష్ణుమూర్తి ద్వారపాలకులు, పరమభక్తులు. సనక సనందనాదుల శాపవశాన ఏడు జన్మలు విష్ణువుకు దూరంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శాపవిమోచనం కోసం విష్ణువు కాళ్ళావేళ్ళా పడితే సరే మూడు జన్మలు నాకు బద్ధ శత్రువులుగా నన్ను తిడుతూ జీవించండి. ఆ తరువాత నన్ను చేరుకోవచ్చు అని చెప్పాడట. ఆ విధంగా హిరణ్యాక్ష, హిరణ్య కశిపులు, రావణ కుంభకర్ణులు, జరాసంధ కంసులు మనకు దొరికారు. అదే విధంగా మన నాస్తికులు కూడా గత జన్మాల్లో శాపగ్రస్తులై, సదరు శాప విమోచనం కోసం ఈ జన్మలో దేవుణ్ణి తిడుతూ ముక్తి కోసం ఎదురు చూస్తున్నారట. అంచేత వాళ్ళ గురించి మనం దిగులు చెందనక్కరలేదు, మనకంటే వీర భక్తులు వాళ్ళు! శ్రీ వేంకటేశ్వరుడు వారికి ముక్తిని ప్రసాదిస్తాడు, నోడౌట్! సో.. నాస్తిక్స్, డోంట్వర్రీ!
ఇక నా గుండు దగ్గరికి వస్తే.. గుండు చేయించుకున్నపుడు మీసం కూడా తీసెయ్యాల్సి వచ్చింది. గుండు చేయించుకుని రాంబగీచాలో గదిలోకి వెళితే వీడెవడన్నట్టు చూసారు పిల్లలు. అద్దంలో చూసుకుని నేనే గుర్తుపట్టలా.. ఇహ వాళ్ళేం గుర్తు పడతారు! మూతి మీద మీసం లేకపోతే నాకు నచ్చదు. మరిప్పుడెలా? మరీ చూసుకోలేకుండా ఉన్నానే! మీసమ్మీద నా అభిప్రాయం మార్చుకుంటే తప్ప ప్రశాంతంగా ఉండలేననిపించింది. కృష్ణుడికి మీసముందా? వాజపేయీకి మీసముందా? అని సమాధానపడ్డాను. అలా అభిప్రాయం మార్చుకున్నాక మీసం లేకపోయినా బానే అనిపించింది. పదిరోజుల్లో మీసమ్మొలిచాక మళ్ళీ అభిప్రాయం మార్చుకున్నాను లెండి.
29, మే 2007, మంగళవారం
ఓ మంత్రిగారి జాబు
నవ్వొస్తది వీళ్ళ పద్ధతి చూస్తుంటే. ఈమె కాంగ్రెసు నేత. తెదేపా వాళ్ళు తమ తమాషాను జరుపుకుంటున్నారు. తమ నాయకుణ్ణి తలచుకుంటున్నారు. మరో కాంగ్రెసు నాయకుడెవరైనా అంటే పర్లేదు, కానీ అలా రాసే నైతికత ఈమెకుందా? ఆమెనే అడుగుదాం.
అమ్మా మంత్రిగారూ..
- రామారావు పార్టీ పెట్టిందే కాంగ్రెసుకు వ్యతిరేకతతో. కాంగ్రెసు వ్యతిరేకతే తెదేపాకు అస్తిత్వం. మరి మీరు ఆ పార్టీలో ఎలా చేరారు? మీ నాన్నపై అంత గౌరవం, ప్రేమ ఉంటే తెదేపాలోనే ఎందుకుండలేదు? సరే బాబు ఉండనివ్వలేదు.. అందుకని కాంగ్రెసులో ఎలా చేరతారు, మీ నాన్న ఆశయాలకు వ్యతిరేకంగా?
- మీ నాన్నను పడదోసి బాబు గద్దెనెక్కినపుడు, మీభర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముందు మీ నాన్నతోటే ఉన్నాడు. తరువాత బాబు పంచన చేరాడు. మరి అప్పుడు కనిపించలేదా బాబు మీనాన్నకు చేసిన ద్రోహం? కొన్నాళ్ళకు మళ్ళీ వెనక్కి పోయాడు. తన వర్గంలోని వారికి మంత్రివర్గంలో చాలినన్ని సీట్లివ్వలేదనే కదా బయటికి పోయింది?
- ఇప్పుడు మీరీ బహిరంగ లేఖ ఎందుకు రాసారు? ఏ నిచ్చెన ఎక్కేందుకు మీ తాపత్రయం?
- రాజకీయ నాయకుడిగా రామారావుకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని సొమ్ము చేసుకుందామని అందరూ చూస్తున్నారు. తెదేపా, ఆయన కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు.. ఇలా అందరూ. సొమ్ము చేసుకునే హక్కు ఎవరికైనా ఉందీ అంటే అది తెలుగుదేశం పార్టికే ఉంది. ఆయన రాజకీయ వారసత్వం తెలుగుదేశం పార్టీదే. పార్టీకి మూలవిరాట్టుగా రామారావుకు ఆ గౌరవమివ్వాల్సిన బాధ్యతా పార్టీకుంది. మీరు ఆయన బిడ్డలైతే ఆయన కుటుంబ వారసత్వం కోసం పోట్లాడుకోండి. ఆయన ఆస్తి కోసం కొట్టుకోండి. ప్రజల ముందు నాటకాలొద్దు.
25, మే 2007, శుక్రవారం
అంటువ్యాధి
24, మే 2007, గురువారం
పాతవన్నీ ఒకచోట!
- ఆహా! సమస్యలు!!
- బ్లాగరులో హిందీ!
- మసీదులో బాంబు
- అప్పన్న, అప్పన్న, అప్పన్న
- అడ్డుగోడలు, అడ్డగోలు మాటలు
- జీమెయిలు ఉత్తరాలు ఇక ప్రింటు తీసి మన ముంగిట్లో
- చాప కింద నీరు
- మండలి, దాని ఎన్నికలు
- టైగరు, పేపరు టైగరూ
- బుద్ధుడి పాలనలో
- పునరంకితం -మళ్ళీ మళ్ళీ
- దొంగ సాధ్వులు,
- మండలి ఎన్నికల కథా కమామీషు
- తప్పటడుగులు
- సైంధవులు, శిశుపాలురు, మన పాలిట గుదిబండలు -
- మానవత!
- ఊరు బడి చెబుతుంది ఏలుబడి తీరు!
- తెలుగు సినిమా - 7 ఏళ్ళ పండుగ
- కార్పొరేటు చిల్లర కొట్లు
- బ్రౌను ఫోటో
- సాయిబాబా - తెలంగాణా
- ఆర్టీసీకి కొత్త రంగులు
- సీతాకోక చిలుక ప్యూపా దశకు పోతూంది
- తెలంగాణా సెంటిమెంటు + యాంటీ కాంగ్రెసు సెంటిమెంటు
- మార్గదర్శి
- సడిసేయకో గాలి సడిసేయబోకే.. పాటలు,
- వినుడు వినుడు వీనుల విందుగా..
- కొన్ని హాస్య వార్తలు
- ప్చ్..
- బీడీ, భాషా, యాసా కాదేదీ ఎన్నికల ప్రచారాని కనర్హం
- వోక్సూ పోనాదండి
- గొంతు విప్పిన బాలసుబ్రహ్మణ్యం
- అనుకోకుండా, యాదృచ్ఛికంగా, కాకతాళీయంగా...
- తెలుగు, ఆంధ్రం - కనకదుర్గ గారి అబద్ధాలు, దూషణలు
- తెలుగు సినిమాలను ఆడించేందుకు కొన్ని చిట్కాలు
- రామోజీరావు x రాజశేఖరరెడ్డి
- నీటి బొట్టు పెరిగిపోతె సంద్రమే! సమాజం
- కొత్త వెస్టిండియనులు, అదే పాత ఇండియనులు క్రికెట్టు
- సోయం బాపూరావు అనగా రాజా జయచంద్ర
- తెలుగుతల్లి
- ఈనాడు x ముఖ్యమంత్రి అవినీతి, మాధ్యమాలు,
- గురజాడపై విమర్శ భాష,
- కేసీయార్ రాజీనామా తార్కికమైనదేనా!
- స్వపరిపాలన కోసం తెలంగాణ
- ఉరుకుల పరుగుల వికీపీడియా
- రాష్ట్ర విభజనతో నీళ్ళూ, నియామకాలు వస్తాయా?
- రాష్ట్ర విభజనతో ఏం జరుగుతుంది?
- ఆదివారం టీవీ కార్యక్రమాలు
- వేడెక్కుతోన్న వాతావరణం
- పోపు గారు.. క్షమించ గోరారు
- నక్సలైట్లు, రాకెట్లు, పౌరహక్కుల సంఘాలు రాజకీయాలు,
- నిరుత్తర కుమారులు
- అరాచకీయుడిని ఎదిరిద్దాం! రాజకీయాలు,
- ఆత్మ లేని బతుకులు రాజకీయాలు,
- శంఖారావం - తెలంగాణ కాంగ్రెసు నాయకులెక్కడ? ఎక్కడ??
- భావ దారిద్ర్యం, భావ దాస్యం - మలి పర్వం
- వందేమాతరం!
- లోక్‌సత్తా పార్టీ అవసరమా?
- సినిమా పాటలూ మన పాట్లూ పాటలు,
- భేష్, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు
- రాంగురోడ్డు బాధితులు
- వీరేశలింగం పంతులుగారి వారసత్వం
- ప్లూటో హోదా ఏమిటి?
- తెలంగాణ ధ్వనులు
- వాయిదా వెయ్యడమెందుకు?
- రావోయీ అనుకోని అతిథీ!
- రాజీనామా ఎందుకు చేసారబ్బా!?
- వికీపీడియా ఎందుకు చూడాలి?
- పదాలు, దపాలు
- వెంటాడే జ్ఞాపకాలు
- నేడే స్వాతంత్ర్య దినం.. వీరుల త్యాగఫలం
- పొంతన లేని ఆంగిక వాచికాలు
- ఎన్నోవాడు?
- శబ్ద కాలుష్యం
- ఈయన అన్‌ఫిట్!
- భావ దారిద్ర్యం, భావ దాస్యం
- ప్రజలతో జయప్రకాష్ నారాయణ ఫోనాఫోని
- ఏమిటీ ధోరణి!
- నెట్లో తెలుగు వ్యాప్తి
- ఏమిటీ తెలివితక్కువతనం! బ్లాగు, రాజకీయాలు,
- దుర్వార్తలు, దుష్టులు, దుష్కీర్తి, ఆశావహ ధోరణి
- విజేతలూ, విజితా!
- లోక్‌సత్తా రాజకీయ ప్రణాళికలు
- పీబీశ్రీనివాస్ ఇంటర్వ్యూ
- జాబుల జాబితా
- ప్రజా ప్రతినిధులపై ప్రజాసమీక్ష
- అవకాశవాదం - తిట్లకు మహదవకాశం
- తెలుగు సినిమా హీరోలు, అభిమానులు, ఇతర పాత్రలూ
- గూగుల్ ఎనలిటిక్స్
- వర్డ్‌ప్రెస్సుకీ బ్లాగ్‌స్పాటుకీ పడదని తెలిసింది
- వామపక్ష నాటకాలు
- బూదరాజు రాధాకృష్ణ అస్తమయం
- వినవచ్చిన వార్తలు, విన.. నొచ్చిన వార్తలు
- తెలంగాణ గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు..
- టీవీ వాళ్ళకు, సినిమా వాళ్ళకు తగువైతే..
- వేగుచుక్క
- బ్లాగు గణాంకాలు -
- మత మార్పిడి ఊపు మీద పోపు గారు
- రిజర్వేషాలు
- ఒంటరిగా మనలేని మాటలు
- చతుర భక్తి, నిష్ఠుర భక్తి, ఎత్తిపొడుపు భక్తి..
- బ్లాగు గణాంకాలు
- పునరంకితం.. పునః పునరంకితం
- (పుస్తకాల) పురుగులొస్తున్నాయి జాగ్రత్త!
- జయహో ఇస్రో!
- మీరేం చేస్తుంటారు?
- తెలుగు అమలు - ఇంటా బయటా
- చందమామ గురించి
- వీళ్ళు పోలీసులా ?!?
- గాయకుడు కారుణ్య
- తెలుగురాష్ట్ర రాజధానిలో తెలుగు
- సొంతడబ్బా
- తనికెళ్ళ భరణి ఇంటర్వ్యూ
- హైకోర్టు ఆదేశాలు
- మమ్మేలిన మా శాసనసభ్యులకు..
- మీరిది చూసారా..?
- మనమూ మన భాషా..
- భారతదేశం - SWOT విశ్లేషణ
- ఎవరికోసమీ శాసనమండలి?
- కెరటాల కరణాలు
- వార్తల్లో విప్లవం - ఇందిరమ్మ టీవీ
- నా గోడు
22, మే 2007, మంగళవారం
ఆహా! సమస్యలు!!
- సరే తెలంగాణ సమస్య ఎలాగు ఉండనే ఉందనుకోండి. 2009 ఎన్నికల్లో దానితో బోలెడు పనుంది కాబట్టి అది అలా ఉంటూనే ఉంటుంది.
- ఇహ ప్రాజెక్టుల్లో అవినీతి..డబ్బులున్న చోట అవినీతి ఉండడం సహజమే కదా. అవినీతి సర్వవ్యాప్తం అని ఇప్పటి నాయకులందరి అమ్మగారు (మదర్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ లీడర్స్) ఎప్పుడో తేల్చి చెప్పారాయె.
- పోతిరెడ్డిపాడు సమస్య మాత్రం ముఖ్యమంత్రి ఒంటి చేత్తో సృష్టించిన సమస్య! బ్రదర్సుకు మాత్రం మందుగుండు సరఫరా చేస్తోందీ సమస్య
- 11 కోట్ల సొమ్ములు పోనాయన్న సంగతి మీరు మర్చిపోనారు, నాకు తెల్దనుకోకండి మరి.
- మరి మన ఎంపీలు ప్రశ్నలడిగేందుకు డబ్బులు నొక్కేసిన సంగతి తెలిసి ప్రజలు నోళ్ళు తెరిచారు. అన్ని యుద్ధాలకు మాతృక లాగా అన్ని కుంభకోణాలకు మాతృక ఇది అని చెప్పుకున్నారు. దీని బాబు లాంటిది మరోటి రాబోతోందని తెలీదు పాపం అమాయకులకు.
- ఆ మధ్య డిపెప్పో మరోటో.. కార్యక్రమం కోసం (ఇక్కడ కార్యక్రమం ఏమిటనేది ముఖ్యం కాదు, డబ్బులేమాత్రం ఉన్నాయనేది ముఖ్యం. ఇప్పుడు చూడండి, నిధుల్లేవని చెప్పి, ఆ మధ్య ఉప్పునూతల వారు ప్రాంతీయ అభివృద్ధి మండలి పదవి తీసుకోనన్నారు. నిధుల్లేని పదవి నాకెందుకన్నారు. "..ఈ ఏకాకి కంచి గరుడ సేవ నాకెందుక"న్న దుర్యోధనుడిలా) కేంద్రం డబ్బులు పంపిస్తే సూర్యుడి వేడికి ఆవిరైపోయిన నీరు లాగా ఆ డబ్బులు సుబ్బరంగా అయి పోయాయి.
- ఇదిలా జరుగుతూ ఉండగా బాబ్లీ ప్రాజెక్టుతో తెదేపా మంచి సందడి చేసి, పండగ చేసుకుంది. పాపం తెరాస వెనకబడి పోయింది. పోలవరం కంటే పెద్ద సమస్యనా ఇది అంటూ తేల్చేయబోయారు గానీ, వాళ్ళ వాదనే తేలిపోయింది.
- ప్రశ్నల కోసం డబ్బులు తీసుకున్న ఎంపీలు తెలివి తక్కువగా దొరికిపోయాక, మిగిలిన వాళ్ళలో కొందరికి ఆ ఆదాయ మార్గం మూసుకుపోయింది. (అంత తెలివి తక్కువగా ఎందుకు దొరికి సచ్చారో అని తిట్టుకున్నారట కూడా!) ఒక విప్లవాత్మక, వినూత్న పద్ధతి కనిపెట్టారు. గిట్టనివాళ్ళు "అది కొత్తదేమీ కాదు, చిర పురాతనమైనది, అతి ప్రాచీనమైన వృత్తే" నని పెదవి విరిచారు. కట్టుకున్న భార్య ఉండగా మరో స్త్రీని భార్యగా చూపించి, డబ్బులు చేసుకున్నారు. మహామహా చార్లెస్ శోభరాజ్ లాంటి వాళ్ళే డంగైపోయేంతటి తెలివితేటలవి, మనబోటి మామూలు పౌరుల సంగతి చెప్పేదేముంది?
- కొత్త సమస్యేమీ లేనట్లు పాత దాన్ని తిరగదోడారీసారి. అదే - పుర్రె గుర్తు! బాబ్లీని తెదేపా ఎత్తుకుపోయే సరికి తెరాస వాళ్ళు మళ్ళీ కంకాళ నృత్యం చేయ సంకల్పించారు. అయితే పుర్రె కూడా మాదే నంటూ తెదేపా వాళ్ళూ గొడవ చేసారు. మొత్తం సమస్యలన్నీ వొళ్ళో పోసేసుకుని తెరాసకు సమస్యలనేవే లేకుండా చేద్దామని తెదేపా పన్నాగంలా ఉంది.
- ఈలోగా సీపీయం వాళ్ళు భూ ఆక్రమణలకు దిగారు. అధికార పార్టీ నాయకులకు అర్థం కానిదొకటుందిందులో.. "భూమి ఆక్రమించుకోడం వరకూ బానే ఉంది, కానీ ఇలా అంత మందిని తీసుకొచ్చి బహిరంగంగా ఆక్రమించుకుంటే ఉపయోగమేముంది? ఈ తెలివి తక్కువ కమ్యూనిస్టులు మనలను చూసన్నా నేర్చుకోకపోతే ఎలా" అని వాపోయారు. శ్రమ వృధా అయిపోతోందే అని వారి వేదన!
- ఈలోగా వర్గీకరణ అంటూ రావణ కాష్ఠంలా రగులుతున్న సమస్యొకటి మనకుండనే ఉంది. వర్గీకరణ కావాలని మంద కృష్ణ మాదిగ పాపం చంద్రబాబుకు ముందు కాలం నుండీ మొత్తుకుంటున్నాడు. ఒద్దొద్దని మాలలు! ఈలోగా కృష్ణ మాదిగ నిరశన దీక్ష, ఆయన అనుచరుల దహన కాండ, దోపిడీ కాండ మొదలైంది (బస్సు తగలబెట్టబోయే ముందు, ప్రయాణీకుల డబ్బూ దస్కం దోచుకున్నారట! కొన్ని చోట్ల ప్రయాణీకులు దిగక ముందే తగలబెట్టారట!!) . ప్రభుత్వానికి బోల్డంత పని.
- ఇవన్నీ ఇలా ఉండగా మక్కా మసీదులో బాంబు పేలింది. కొన్నాళ్ళ పాటు సందడి! 24 గంటల్లో కూపీ లాగుతామని ముఖ్యమంత్రే చెప్పేటప్పటికి, ఓహో కుట్ర సంగతి దాదాపు తెలిసిపోయిందనుకున్నా. దీన్నిగానీ పరిష్కరించేస్తారా ఏమిటి అని ఆశ్చర్యపోయాను కూడా! ఇవ్వాళ పేపర్లో చూస్తే తెలిసింది అలాంటి ప్రమాదమేమీ లేదని.. 24 గంటల్లో కూపీ లాగిందేంటయ్యా అంటే "సెల్ ఫోనుతో పేల్చారా, మరోటేదన్నా వాడారా" అనే సంగతి!
బ్లాగరులో హిందీ!
ఇది నేరుగా బ్లాగరు ఎడిటరులోనే నేను రాసిన హిందీ; నేను RTS లో రాస్తూ ఉంటే ఆటోమాటిగ్గా అదే హిందీలోకి మారిపోయింది. బ్లాగరూ, మరి తెలుగులో ఎప్పుడు!?
19, మే 2007, శనివారం
మసీదులో బాంబు
14, ఏప్రిల్ 2007, శనివారం
అప్పన్న, అప్పన్న, అప్పన్న
చాన్నాళ్ల తరువాత తిరిగొచ్చిన అనిల్ బాగా నవ్వు తెప్పించారు. అది చదివాక, చిన్నప్పుడు (బహుశా ఆంధ్రప్రభలో అనుకుంటా) నేను చదివిన ఓ జోకు జ్ఞాపకమొచ్చింది.
ఇద్దరు ఆడపిల్లలు. కవల పిల్లలు. మూడేళ్ళిలా వచ్చాయో లేదో బడికి పంపించారు. పాలేరు వెంట హుషారుగా బడికి వెళ్ళారు పిల్లలిద్దరూ.
బళ్ళో మేష్టారు వాళ్ళను ముద్దు చేసి,
"నీ పేరేంటమ్మా" అని అడిగారు
"అప్పన్న"
"ఏదీ మళ్ళీ చెప్పు"
"అప్పన్న"
పేరు నోరు తిరగడం లేనట్లుంది అని అనుకుని రెండో పాపను అడిగారు
"నీ పేరేంటమ్మా?"
"అప్పన్న"
"!"..., "అక్క పేరు కాదమ్మా, నీ పేరు చెప్పు"
"అప్పన్న"
మేష్టారు తెలివిగా "సరే, మీ అక్క పేరు చెప్పు"
"అప్పన్న"
"!!"
ఇలా లాభం లేదని పాలేరును పిలిచి అడిగారు
"ఈ పాప పేరేమిటోయ్?"
"అప్పన్నండి"
"!!!"..., "మరి ఈ పాప పేరు?"
"అప్పన్నండి"
"!!!!"
......
......
"ఏమిటయ్యా ఇద్దరికీ ఒకటే పేరు చెబుతున్నావు, అందునా మగపేరు చెబుతున్నావు, ఇంతకీ నీ పేరేమిటీ?"
"అప్పన్నండి"
!!??!!??!!!
తరువాత తెలిసింది..,
ఆ పాపల పేర్లు - అపర్ణ, అర్పణ, పాలేరు పేరు అప్పన్న అని.
పిల్లలకు నోరు తిరగలేదు. పాలేరుకూ నోరు తిరగలేదు మరి!
8, ఏప్రిల్ 2007, ఆదివారం
అడ్డుగోడలు, అడ్డగోలు మాటలు
- పులిచింతల కడితే తెలంగాణకు నష్టం లేదు, అయినా సరే దాన్ని వ్యతిరేకిస్తున్నారు.
- ఆంధ్రా అధికారులు దొంగలన్నారు.
- ఆంధ్రా వాళ్ళు హైదరాబాదు కాలుష్యానికి కారణం అన్నారు.
- ఆలమట్టి కడితేనే మంచిది అంటూ అడ్డగోలుగా మాట్లాడారు.
- మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని, మా ఆస్తులను, భూములను దోచుకున్నారన్నారు.
- మమ్మల్ని గేలి చేసారు, మా యాసను ఎగతాళి చేసారన్నారు.
- హైదరాబాదు మా చెమటతో కట్టుకున్నది, దాన్ని వీళ్ళు దురాక్రమణ చేసారు. ఇక్కడ భూములు కొనీ, వ్యాపారాలు పెట్టీ అభివృద్ధి చెందారు. మేం వెనకబడిపోయాం అని అన్నారు
- తెలంగాణ వాళ్ళకు అవకాశమే లేకుండా బళ్ళూ, కాలేజీలు కూడా వాళ్ళే పెట్టేస్తున్నారు.
- ఇక్కడ మా హోటళ్ళు లేవు అన్నీ ఆంధ్రా హోటళ్ళే! అని అన్నారు
- సినిమా పరిశ్రమ యావత్తూ ఆంధ్ర మయమే, తెలంగాణ వాళ్ళు లేరు అని అన్నారు
- సినిమాల్లో వాడే భాష ఆంధ్ర మాండలికమే, విలన్లకు, ఆసిగాళ్ళకు మాత్రం తెలంగాణ మాండలికం వాడుతారు.
- తెలుగుతల్లి అనే భావనను తూలనాడారు
- తెలుగు అనే మాటను దొంగతనం చేసారన్నారు
- ఇలా ఎన్నో.. ఇదుగో, ఇప్పుడు సాగరుకు అడ్డంగా గోడ కడతారట.
వెనకబాటుతనం అనేది అన్నిచోట్లా ఉన్నదే అని ఆలోచించరు. ఊరికే అరిస్తే ఉపయోగమేమిటి? కేవలం భావోద్వేగం పని సాధిస్తుందా? అందరి మీదా ఇలా అరిచీ, కరిచీ తెలంగాణ వ్యతిరేకతను పెంచడం తప్ప ఉపయోగమేమిటి? ప్రతీదానికీ ఆంధ్రులే కారణమని ఇలా అన్ని రకాల తిట్లూ తిట్టి, ఆ మీదట అదే జనం అన్నదమ్ముల్లా విడిపోదామని సన్నాయి నొక్కులు నొక్కుతారు! సోదర భావం అంటే ఇలా తిట్టుకోవడమా? ఇది కేవలం తెరాస నాయకులకే పరిమితం కాదు పత్రికల్లో వచ్చిన వ్యాసాల్లో చూసాం, కొండొకచో బ్లాగుల్లోనూ చూసాం. ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారంటే, వ్యతిరేకించరూ మరి!?
3, ఏప్రిల్ 2007, మంగళవారం
జీమెయిలు ఉత్తరాలు ఇక ప్రింటు తీసి మన ముంగిట్లో
మరి డబ్బేమాత్రం తీసుకుంటాడు? పైసా కూడా తీసుకోడు. ఔను, డబ్బడగడు. జాబులను ప్రింటు చేసిన కాగితాలకు వెనక వైపున యాడ్లు వేసుకుంటాడు. దానితో ఖర్చులొచ్చేస్తాయి.
రాత్రి జీమెయిలు ఇంటర్‌ఫేసు అనువాదంలో భాగంగా దీన్నీ అనువదించాను. కుతూహలం కలిగి, వాడి సైట్లో చూసా. ఈ లింకు దొరికింది. ప్రస్తుతం అమెరికాలో పెట్టినా త్వరలోనే ఇక్కడకూ వస్తుందేమోలే అని అనుకుంటూ కింది "టర్మ్‌స్ ఆఫ్ యూజ్స్" నొక్కి ఆ పేజీ చూస్తే, అక్కడ కనబడింది - ఏప్రిల్ ఫూల్ అని!
2, ఏప్రిల్ 2007, సోమవారం
చాప కింద నీరు
31, మార్చి 2007, శనివారం
మండలి, దాని ఎన్నికలు
స్థానిక సంస్థల ప్రతినిధుల ఓట్ల లెక్కింపు ఇంకా చెయ్యాల్సి ఉంది. అది ఏప్రిల్ 25 లోపు అవగొడతారట. మిగతా వాటితోపాటే తేలిపోవాల్సిన వీటి లెక్కింపు ఓ నెల పాటు వాయిదా పడింది. కాంగ్రెసు వాళ్ళు ప్రవేశపెట్టిన బహిరంగ పోలింగే దీనికి కారణం. మామూలుగా తప్పుడు పనులను చాలా సమర్థవంతంగా చేస్తారు రాజకీయులు, ఈ పనిలో ఎందుకో తేడా జరిగింది! తప్పుడు పనులైనంత మాత్రాన చాటుమాటుగా చెయ్యాల్సిన పని లేదు, బహిరంగంగా చేసినా మనల్నడిగేవాళ్ళు లేరు అనే దిలాసా తనం అలవాటైంది ఈమధ్య రాజకీయులకి. అంచేతే ఇంత బహిరంగంగా బహిరంగ వోటింగు చేసి దొరికిపోయారు!
అసలీ మండలి వలన మనమేం బావుకుంటామనే ప్రశ్న ఎలాగూ ఉండనే ఉంది. దీనివలన వచ్చే మార్పులేమిటో ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో శ్రీరమణ ఇలా రాసారు..
"యికపై ఉభయసభలు అనే మాట వినిపిస్తుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి డిమాండ్ పెరుగుతుంది. తిరుమల దర్శనానికి కొత్త లెటర్‌హెడ్స్ మీద సిఫార్సు లేఖలు వెళతాయి. స్థానికంగా, నగరంలో వుండే అధికారులు పెద్దల్ని కూడా తట్టుకోవలసి వుంటుంది. స్టూడెంట్ కుర్రాళ్లు వచ్చే సిలబస్ నుంచి కొత్త పాఠాలు చచ్చినట్లు చదవాల్సి వుంటుంది."
శ్రీరమణ మరో విషయం కూడా రాసారు.. ఎన్టీయార్ మండలిని రద్దు చేసాక, ఈ రెండు దశాబ్దాలలోనూ 'ఏ వొక్క సమయంలోనూ "అయ్యో శాసనమండలి వుండి వుంటే యీ విపత్తు వచ్చేది కాదు కదా'' అనుకునే సదవకాశం తెలుగు ప్రజలకు రాలేదు.'
దీనికి భిన్నంగా.. ఆహా, మండలి ఉండబట్టే కదా ఈ పని జరిగింది అని మనం అనుకునేలా పని చెయ్యగలరా కొత్తగా ఎన్నికైన నాగేశ్వర్ వంటి వారు???
30, మార్చి 2007, శుక్రవారం
టైగరు, పేపరు టైగరూ
అంతకు ముందో తమాషా జరిగిందట! విశ్వరూప సందర్శనకు కొన్ని గంటల ముందు నరేంద్ర విలేకరులతో మాట్లాడుతూ ఉండగా నరేంద్ర అనుచర గణం "టైగర్ నరేంద్రా, సంఘర్ష్ కరో, హమ్ తుమ్హారే సాత్ హై" అంటూ హిందీలో నినాదాలు చేసారు. పైగా కేసీయార్ డౌన్ డౌన్ అని ఇంగ్లీషులో కూడా అన్నారట. అప్పటికే తెరాస నాయకులు కొందరు నరేంద్రను కలిసి ఆయనపై కేసీయార్ కు కలిగిన అనుగ్రహం గురించి, విశ్వరూప ప్రదర్శన చెయ్యాలన్న ఆయన అభిమతం గురించి నరేంద్రకు చెప్పి ఉన్నారు. ఓపక్క ఆ దెబ్బకే బేజారై ఉన్న నరేంద్రకు తన అనుచరులు నినదించిన సంఘర్ష్ కరో అనే మాటలు ఈటెలై, తూటాలై గుచ్చుకుని ఉండాలి. పాపం కష్టపడి వాళ్ళను శాంతింపజేసాడట. అనుచరులు నాయకుడి మనసెరిగి ప్రవర్తించాలి గదా అని నరేంద్రపై మనసులోనే జాలిపడ్డారట విలేకరుల్లో కొందరు. అనుచరుడు నాయకుడి మనసెరిగి ప్రవర్తించాలి గదా అని అనుకున్నారట మరి కొందరు.
విశ్వరూపాన్ని దర్శించిన తరువాత 'టైగర్' నరేంద్ర పత్రికల వాళ్ళతో మాట్లాడుతూ మామధ్య గొడవలేమీ లేవు, అదంతా మీ సృష్టే అని అన్నాడట. పైగా 'ఇంత అన్యాయమైన మీడియా మరొకచోట లేదు' అని కూడా అన్నాడట.
ఓ అంకం ముగిసింది. ఈ అంకం వరకు మాత్రం కేసీయార్ టైగరు తానేనని ప్రకటించి, నరేంద్రకు పేపరిచ్చి పంపించాడు. రాబోయే అంకాలు ఆసక్తికరంగా ఉండొచ్చు.
21, మార్చి 2007, బుధవారం
బుద్ధుడి పాలనలో హింస
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.ఆర్.కృష్ణయ్యర్ మాటలివి. మార్చి 14న పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ లో జరిగిన హింసకు చలించి సీపీఎం అధ్యక్షుడు ప్రకాష్ కారత్ కు రాసిన ఉత్తరంలో పై మాటలు రాసాడాయన.
వెబ్ లో చాలా చోట్ల ఉందీ ఉత్తరం. మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను.
URGENT March 15, 2007
My dear Prakash Karat,
I adore you as the top leader of the Marxist Party even as I hold Com. Jyoti Basu as a creative wonder of the Communist Marxist Party. As you know, I remained in power with the Communist Government in 1956 in Kerala under the charismatic Chiefministership of EMS, the great Leftist thinker. But alas!, in West Bengal things are murky, capitalism is happy, poor peasantry is in privation and deprivation, if newspaper reports throw light on events objectively. We, in 1957, came to power by the ballot and rarely, if ever, used the bullet, with the result the police violence was hardly an instrument against the peasantry.
Look at the contrast. The brutality and bloodshed, at the instance of the police force is now bulleting of humble humanity. I had and have great hopes that the Marxists if in power, will rule with compassionate ideology and win votes and people’s co-operation beyond party barriers. But to my horror, the terror practiced yesterday at Nandigram fills me with dread and disappointment. The illusion of exploitative power has led the ministry to govern by the gun. The consequent bloodshed demands your urgent attention and commands the party’s authority to arrest the frequency of bloodshed policy and police barbarity. Sri. Sumit Chakravartty telephoned me last night about the police misuse of firepower. If true, I protest and entreat you and the party to take immediate action and restore the basic proposition that Communist Government is not power with violent weapons. And action at party level must be taken if governance over humanity is for the benefit of the peasantry. I am sure, thousands like me will be shocked by the Nandigram incident. Please, please have some regard for those who feel that socialism is not terrorism, but humanism; and misrule by gun will not be the rule of the Left in State authority. Do forgive me for expressing my strong feelings with the expectation that the Left Administration believe and practice as a fundamental for the humble people, not for the proprietariat with the brute force of the bullet.
With high regards,
Yours sincerely,
(V.R. KRISHNA IYER)
To,
Sri. Prakash Karat
General Secretary
Communist Party of India (Marxist)
New Delhi
14 మంది అమాయక కర్షకులు హతులైన ఘటన అది; ప్రత్యేక ఆర్థిక మండలి కోసం భూమి కోల్పోతున్న వాళ్ళ నిరసన తెలియజేస్తే బుద్ధదేవుని ప్రభుత్వం వారికిచ్చిన జవాబు. పై ఉత్తరంలో కృష్ణయ్యరు, "మార్క్సిస్టులు అధికారంలో ఉంటే, సహానుభూతితో పాలిస్తారూ.., పార్టీలకతీతంగా ప్రజల తోడ్పాటును, వోట్లనూ పొందుతారు అనే గొప్ప ఆశలు నాకుండేవి, ఉన్నాయి." (I had and have great hopes that the Marxists if in power, will rule with compassionate ideology and win votes and people’s co-operation beyond party barriers.) అని రాసారు. నా నమ్మకం సడలుతోంది, తగు చర్యలు తీసుకుని పరిస్థితిని మరింత దిగజారనివ్వకండి అని లీలగా హెచ్చరిక చేసారాయన.
ఆర్థిక మండళ్ళ పేరిట పెద్ద కంపెనీలకు దేశాన్ని దోచిపెట్టడంలో కమ్యూనిస్టులు ఇతరులకేమీ తీసిపోవడంలేదు, వాళ్ళ కంటే ముందంజ లోనే ఉన్నారు. ప్రజలు, ఉద్యమాలు అని ఓ.. ఊదరగొడతారు గానీ, అసలు విషయానికి వచ్చే సరికి వీరిదీ ఆ బాటే. ప్రజా ఉద్యమాలు కాస్తా ప్రజలపై ఉద్యమాలు గా మారిపోతున్నాయేమో!
సీపీఎం నాయకులు రాఘవులు, యేచూరి మొదలైనవారు ఈ కాల్పులను సమర్ధించుకున్నారు. అది తృణమూల్ కుట్ర అనీ, ఏవో రెండు వర్గాల మధ్య ఘర్షణ అనీ అన్నారు. కరెంటు ఉద్యమ సమయంలో బషీరుబాగులో చంద్రబాబు ప్రభుత్వం జరిపించిన కాల్పులకు, నందిగ్రామ్ కాల్పులకు తేడా ఏంటో రాఘవులు చెప్పాలి. కరెంటు ఉద్యమం సీపీఎం, కాంగ్రెసుల కుట్రేనా?
మన శాసనసభలో జరిగిన చర్చలో మజ్లిస్ అక్బరుద్దీన్.. కాల్పుల్లో చనిపోయిన వారిలో దాదాపు అందరూ మైనారిటీలే, అందుకే మాట్లాడుతున్నాను. దాన్ని ఖండిస్తూ తీర్మానం చెయ్యాలి - అంటూ మాట్లాడుకుంటూ పోయాడు. పరాయి రాష్ట్రం గురించి ఇక్కడెందుకు మాట్లాడాలంటూ సీపీఎం వాళ్ళు ఎదురుదాడి చేసారు.
ఈ కాల్పుల వలన రాష్ట్ర కాంగ్రెసు మాత్రం లాభించింది. ఈమధ్య తమపై ఒంటికాలి మీద లేస్తున్న సీపీఎంనూ, రాఘవులునూ ఎదుర్కోడానికి వారికో మంచి ఆయుధం దొరికింది. తెదేపా పరిస్థితి కాస్త ఇరుకున పడినట్లే. ఓ పక్క సీపీఎం తో స్నేహం కోసం అర్రులు చాస్తూ మరోపక్క ఆపార్టీని విమర్శించలేదు. అలాగని నోరెత్తకుండా ఉండనూ లేదు.
12, మార్చి 2007, సోమవారం
పునరంకితం -మళ్ళీ మళ్ళీ
మే 14 న పునరంకిత దినోత్సవం జరపనున్నామని ఈమధ్య ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రకటించాడు. గత ఏడు మేలో ఓసారి పునరంకితమయ్యారు. మళ్ళీ ఇప్పుడవుతారట. మళ్ళీ మళ్ళీ పునరంకితం అవ్వడమేంటి? అదేదో ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలో - బహుశా యమలీలేమో- తనికెళ్ళ భరణి -రౌడీ పాత్ర - కవితలు రాస్తాడు. "చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ" అని రాస్తాడు. చెల్లి పెళ్ళి.. మళ్ళీ మళ్ళీ!! పత్రికా సంపాదకుడైన జెన్నీ కూడా అచ్చు మనలాగే అనుకుంటాడు. కానీ భరణి రౌడీయిజానికి భయపడి పత్రికలో వేసుకుంటాడు. ఆ తరువాత ఆ కవితకు పాఠకుల నుండి విపరీతమైన స్పందన వస్తుంది కూడా! ఇప్పుడు ప్రజాసేవకు కాంగ్రెసు పార్టీ మళ్ళీ మళ్ళీ పునరంకితమవడం చూస్తుంటే చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఉంది.
నిరుటి పునరంకిత జాతర సమయాన నేను రాసిన జాబులో తిరిగి పునరంకిత జాతర ఎన్నికల ఏడాది జరగొచ్చని ఊహ పోయాను. అది అపోహ మాత్రమేనని తేలింది. ప్రతి ఏడూ జరుగుతుందన్నమాట!
26, ఫిబ్రవరి 2007, సోమవారం
దొంగ సాధ్వులు, సాధువులు
చాలా సందర్భాల్లో ప్రజల అమాయకత్వమే దొంగ సాధువులను నమ్మేందుకు కారణం. నమ్మకమే దీనికి పునాది. ఆ మాయలు, మహిమలూ లేవని తేలితే ఇలాంటివి జరగవు. దానికో మార్గముంది. మాయలూ మంత్రాలు వచ్చని చెప్పుకునే వారిని వాటిని నిరూపించమనాలి. అలా నిరూపించిన వాళ్ళకు ఆ మహిమలను ప్రాక్టీసు చేసుకునే లైసెన్సులు ఇవ్వాలి. ఎంబీబియ్యెస్ ప్యాసైన వాళ్ళకు సర్టిఫికేటు ఇచ్చి, ప్రాక్టీసుకు అనుమతి పత్రం ఇచ్చినట్టుగానన్నమాట. ప్రభుత్వం ఆ పని చెయ్యలేకపోవచ్చు. అలాంటపుడు మరో మార్గముంది..
ఈ దొంగ సాధ్వులను, సాధువులను గుంజక్కట్టేసి, చర్నాకోలతో.. "నాకు మాయలూ, మంత్రాలేమీ తెలీదు బాబోయ్, నేనో దొంగను" అనే దాకా, "ఈ గుబురు జుట్టు తీసేసి, గుండు చేయించుకుంటాను" అని అనేదాకా.. "మహిమలున్నాయన్నావు కదా, ఏదీ నిన్ను నీవు రక్షించుకో" అంటూ..
25, ఫిబ్రవరి 2007, ఆదివారం
మండలి ఎన్నికల కథా కమామీషు
- పట్టభద్రులకు 8 స్థానాలు,
- పంతుళ్ళకు 8,
- స్థానిక సంస్థల ప్రతినిధులకు 31,
- శాసనసభ్యుల ప్రతినిధులకు 31
శాసనమండలి సభ్యుల కాలపరిమితి ఆరేళ్ళు. అయితే ఆరేళ్ళకోసారి సభ్యులందరి పదవీకాలం ముగిసి సభ రద్దైపోయి (శాసనసభలాగా) ఎన్నికలు జరిగి కొత్త సభ ఏర్పడడం లాంటి పద్ధతి లేదిక్కడ. ఉన్న సభ్యుల్లో మూడోవంతు మంది రెండేళ్ళకో సారి రిటైరౌతారు. వారి స్థానాల్లో కొత్తవారిని ఎన్నుకుంటారు. అంచేత మండలి ఎన్నటికీ రద్దైపోదు, రామారావు చేసినట్లు శాశ్వతంగా రద్దు చేస్తే తప్ప.
అంతా బాగానే ఉంది.. మరి, ఇప్పుడు ఎన్నిక /ఎంపిక కాబోయే 90 మందీ కూడా ఒక్కసారే పదవి లోకి వస్తున్నారు కదా, మొదటి రెండేళ్ళకు, రెండో రెండేళ్ళకు విరమణ చేసేదెవరు? దాని కోసం లాటరీ తీస్తారట, మొదటి గుంపులో ఇంటికెళ్ళేదెవరు, రెండో బాచ్చిలోని వారెవరు, పూర్తి కాలం ఉండేదెవరు అనేది లాటరీ వేసి తేలుస్తారన్నమాట.
మిగతా ఎన్నికల లాగా ఈ ఎన్నికల బాలెటు కాగితాల్లో గుర్తులుండవు. వోట్లెసే వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే కదా! వోటెయ్యడమంటే ముద్ర గుద్దడం కాదు, మనకు నచ్చిన వారి పేరు పక్కన 1 అని అంకె వెయ్యాలి. మీకు ఒకడి కంటే ఎక్కువ మంది నచ్చారనుకోండి, మిగతా ఎన్నికలలో మనకా అవకాశం లేకున్నా, ఇక్కడ ఒకడి కంటే ఎక్కువ మందికి వోటేసే అవకాశం ఉంది. మీకు నచ్చిన వాళ్ళకు ర్యాంకులిచ్చుకుంటూ పోవచ్చు. ఒక ర్యాంకు ఒక్కడికే ఇవ్వాలి సుమా! అలాగే ఒక్కరికి ఒక ర్యాంకే ఇవ్వాలి. వోటేసేటప్పుడు ఏం చెయ్యొచ్చో, ఏమేం చెయ్యకూడదో ఇక్కడ చూడొచ్చు.
అన్నట్టు మండలి ఎన్నికల్లో వోట్ల లెక్కింపు విభిన్నంగా ఉంటుంది. శాసనసభ ఎన్నికల్లో సమీప అభ్యర్థి కంటే ఒక్క వోటు ఎక్కువ వచ్చినా గెలిచినట్లే. కానీ మండలి ఎన్నికల్లో కనీసం సగం వోట్ల కంటే ఒకటి ఎక్కువ వస్తేనే గెలిచినట్లు. అలా ఎవరికీ రాకపోతే..? లేదులెండి, ఆ భయమక్కరలేదు. మళ్ళీ ఎన్నికలు పెట్టరు గానీ, మళ్ళీ లెక్కిస్తారు. ఈసారి అతి తక్కువ వోట్లు వచ్చినవారిని లెక్కింపులోంచి తొలగించి వారి వోట్లను మిగతావారికి బదిలీ చేస్తారు. ఈ లెక్కింపు వ్యవహారం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ పీడీఎఫ్ ను చూడండి.
---------------------------
లక్ష్మయ్యకు రాష్ట్ర ప్రభుత్వ రెవిన్యూ శాఖలో ఉద్యోగం - ప్రస్తుతం ఉద్యోగం మానేసి ఉండొచ్చు బహుశా. ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కూడా. సుమారు ఓ యేడాది కిందట టీవీలో మాట్లాడుతూ ఉద్యోగులు లంచం తీసుకోవడం తప్పు కాదన్నట్లుగా మాట్లాడాడు. నా గత జాబుల్లో ఒకదానిలో దాని గురించి రాసాను కూడా. అప్పుడు నాకీ వ్యక్తి పేరు గుర్తు లేదు, ఇప్పుడు ఆయన ఫోటో చూడగానే గుర్తుకొచ్చాడు. ఇప్పుడు మండలికి వెళ్తాడట! సభలో ప్రశ్న అడిగేందుకు లంచం తీసుకోడంలో తప్పు లేదంటాడేమో, ఒకవేళ గెలిస్తే.
ఇక కె.నాగేశ్వర్.. ఈయన ఉస్మానియాలో జర్నలిజం ప్రొఫెసరు. ప్రస్తుతం ప్రతి శనివారం ఈనాడు ప్రతిభలో రాస్తూ ఉంటాడు. ఒకప్పుడు టీవీల్లో పొద్దుట పూట వార్తల విశ్లేషణలో దాదాపు రోజూ కనిపించేవాడు. ఆయన విశ్లేషణ చూస్తూ, అసలీయనకు తెలీని విషయమే లేనట్లుందే అని అనుకునేవాణ్ణి. గణాంకాలు పంటి కిందే ఉండేవి. విశ్లేషణ కూడా నిష్పాక్షికంగా ఉండేది. ఈసారి మన వోట్లు సద్వినియోగం చేసుకోవచ్చు లాగుంది.
మండలి ఎన్నికల్లో నాకు వోటుంది. మరి, మీకో? మీకు వోటుందో లేదో తెలుసుకునేందుకు ఎన్నికల అధికారి వెబ్ సైటులోని ఈ లింకుకు వెళ్ళండి.