3, ఏప్రిల్ 2007, మంగళవారం

జీమెయిలు ఉత్తరాలు ఇక ప్రింటు తీసి మన ముంగిట్లో

జీమెయిలు వాడు కొత్త సర్వీసు - Gmail Paper - మొదలుపెట్టాడు. మీ మెయిలును ప్రింటు తీసి మీ ఇంటికి పోస్టులో పంపిస్తాడు. మీరెన్ని మెయిళ్ళడిగితే అన్నీ పంపిస్తాడు.. ఒకటైనా, వెయ్యైనా, లక్షైనా! అటాచిమెంట్లు కూడా ప్రింటు తీసి పంపిస్తాడు. ఫోటోలను చక్కటి ఫోటో పేపరు మీద అచ్చేసి మరీ పంపుతాడు.

మరి డబ్బేమాత్రం తీసుకుంటాడు? పైసా కూడా తీసుకోడు. ఔను, డబ్బడగడు. జాబులను ప్రింటు చేసిన కాగితాలకు వెనక వైపున యాడ్లు వేసుకుంటాడు. దానితో ఖర్చులొచ్చేస్తాయి.

రాత్రి జీమెయిలు ఇంటర్‌ఫేసు అనువాదంలో భాగంగా దీన్నీ అనువదించాను. కుతూహలం కలిగి, వాడి సైట్లో చూసా. ఈ లింకు దొరికింది. ప్రస్తుతం అమెరికాలో పెట్టినా త్వరలోనే ఇక్కడకూ వస్తుందేమోలే అని అనుకుంటూ కింది "టర్మ్‌స్ ఆఫ్ యూజ్స్" నొక్కి ఆ పేజీ చూస్తే, అక్కడ కనబడింది - ఏప్రిల్ ఫూల్ అని!

5 కామెంట్‌లు:

  1. హి హి హి ....

    జీమైల్ పేపర్ తో పాటు TISP పేరు తో మీ ఇంట్లో కమోడ్ సాయం తో ఫ్రీ బ్రాడ్ బాండ్ అని కూడా పెట్టారు
    ఇది చూడండి

    http://www.google.com/tisp/

    రిప్లయితొలగించండి
  2. ఇది చదివి నేనూ బోల్తా పడ్డాను..ఇక్కడ రాసాను.

    రిప్లయితొలగించండి
  3. Gmail Paper వాతావరణానికి మంచిదంటం హైలైట్.
    :))

    రిప్లయితొలగించండి
  4. ఇంకో దగ్గర కూడా జీమెయిల్ వాడు ఫూల్స్ ని చేసాడుగా..
    http://mail.google.com/mail/help/motion.html ఇక్కడ చూసారా. మా అమ్మాయి చదివి వర్ణించి చెప్తే ఆహా...తెల్లోడి బిస అని నేనూ నమ్మేసా. తనతో పాటు. తర్వాత బజ్ లో ఎవరో చెప్పుకుంటూ ఉంటే తెలిసింది.ఆరోజు ఫూల్ అయ్యానని. నాలాగా ఎందరో...పాపం.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు