ఇస్రో - భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ. స్వాతంత్ర్యం వచ్చాక భారత్ సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి.
బ్రిటిషు వాళ్ళు మనదేశాన్ని పీల్చి పిప్పి చేసి వదిలాక, దేశ, జాతి పునర్నిర్మాణంలో ఎన్నో ఘనతలు.. వీటిలో ముందువరుసలో ఎత్తు పీటపై ఉండేది, మన అంతరిక్ష పరిశోధన. ఈ రంగంలో ఇవ్వాళ మనం ప్రపంచంలోనే మొదటి వరుసలో ఉన్నామంటే, ఈ ఘనత పూర్తిగా ఇస్రోదే. దాదాపు పూర్తిగా సొంత తెలివితెటల్తో, సొంత సాంకేతికతతో, కొద్దిపాటి వనరులతో మనవాళ్ళు రచించిన విజయగాధ ఇస్రో.
విక్రం సారాభాయీ సతీష్ ధావను
బెంగుళూరు, హైదరాబాదు,
తుంబా, శ్రీహరికోట
ఎస్సెల్వీ, ఏఎస్సెల్వీ,
పీఎస్సెల్వీ, జీఎస్సెల్వీ..
ఆర్యభట్ట, భాస్కర,
ఇన్‌శాటు, అయ్యారెస్సు..
ఎన్నో ఘనతలు, ఎన్నో విజయాలు, మరెన్నో రికార్డులు. జాతికి కీర్తి తెచ్చేవి, తరతరాలకు స్ఫూర్తినిచ్చేవి. ఒక్కో రాకెట్టు నింగికెగుస్తూంటే ఒక్కో రికార్డు నేల రాలుతుంది! జాతిగౌరవం మరో కక్ష్య ఎగబాకుతుంది! ఇప్పుడు చంద్రయాన్! కృత్రిమ ఉపగ్రహాల కక్ష్యలను దాటి మన అసలు సిసలు ఉపగ్రహం కక్ష్య వైపు చూపు! (చందమామా.. వస్తున్నాం!)
ఐదో తరగతి కసుగాయలకు షోలే గురించి పాఠం చెప్పించే అయ్యలారా!
ఇస్రో గురించి కూడా చెప్పించండి.. అది మన కీర్తి, మన పిల్లలకు స్ఫూర్తి!
సున్నా, సంస్కృతం, వేదాలు, భగవద్గీత, యోగసాధన, హైందవ ధర్మం, చదరంగం, బుద్ధుడు, అశోక చక్రవర్తి, గాంధీ.. మన కీర్తి కిరీటాలు. ఈ వరసలోదే.. ఇస్రో!
జయహో! ఇస్రో!! (-చదువరి తెలుగు బ్లాగు)
congrats ISRO !
రిప్లయితొలగించండిచక్కగా చెప్పారు. చాలా మంచి పోస్టు. మన శాస్త్రవేత్తలకు నమస్సులు!
రిప్లయితొలగించండిభారత జీవగడ్డ మీద ఎంతటి ప్రతిభ పాటవాలు దాగున్నాయో ఈ ఒక్క ఇస్రో ప్రయాణ గమనాన్ని పరికిస్తే చాలు. అఖండ ప్రతిభావంతులకి ఇదే మన హృదయపూర్వక నమఃస్సుమాంజలి
రిప్లయితొలగించండిమిమ్మల్ని పుస్తకపురుగు కుట్టినది
రిప్లయితొలగించండినివారన మరియు ఇతర వివరాలకు చూడండి
http://oremuna.com/blog/?p=798
మీకు పుస్తకాల పురుగు కుట్టింది.
రిప్లయితొలగించండివివరాలకు ఇక్కడ చూడండి.
swathikumari.wordpress.com