22, మే 2007, మంగళవారం

ఆహా! సమస్యలు!!

మనకు సమస్యలకేం తక్కువ లేవు. ఒకదాని మీదొకటి పుట్టుకొస్తున్నాయి. ఎంతలా అంటే.. ప్రభుత్వం ఆనందించేంతగా! ఆనందం ఎందుకంటే.. ఒకదాని మీదొకటి ఇలా సమస్యలు పడిపోతూ ఉంటే, పాత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం లేదు కదా! గతంలో ఇందిరా గాంధీ, ప్రయత్నించి మరీ కొత్త సమస్యలు తెచ్చేది. అలా పుట్టుకొచ్చిన వాడేనట జర్నెయిల్ సింగ్ భిందరన్ వాలే! ఇప్పటి మన రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం అయాచితంగా వచ్చి పడిపోతున్నాయ్, సమస్యలు. సమస్యలు ప్రభుత్వానికి కాదు, ప్రజలకని మనవి.

  1. సరే తెలంగాణ సమస్య ఎలాగు ఉండనే ఉందనుకోండి. 2009 ఎన్నికల్లో దానితో బోలెడు పనుంది కాబట్టి అది అలా ఉంటూనే ఉంటుంది.
  2. ఇహ ప్రాజెక్టుల్లో అవినీతి..డబ్బులున్న చోట అవినీతి ఉండడం సహజమే కదా. అవినీతి సర్వవ్యాప్తం అని ఇప్పటి నాయకులందరి అమ్మగారు (మదర్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ లీడర్స్) ఎప్పుడో తేల్చి చెప్పారాయె.
  3. పోతిరెడ్డిపాడు సమస్య మాత్రం ముఖ్యమంత్రి ఒంటి చేత్తో సృష్టించిన సమస్య! బ్రదర్సుకు మాత్రం మందుగుండు సరఫరా చేస్తోందీ సమస్య
  4. 11 కోట్ల సొమ్ములు పోనాయన్న సంగతి మీరు మర్చిపోనారు, నాకు తెల్దనుకోకండి మరి.
  5. మరి మన ఎంపీలు ప్రశ్నలడిగేందుకు డబ్బులు నొక్కేసిన సంగతి తెలిసి ప్రజలు నోళ్ళు తెరిచారు. అన్ని యుద్ధాలకు మాతృక లాగా అన్ని కుంభకోణాలకు మాతృక ఇది అని చెప్పుకున్నారు. దీని బాబు లాంటిది మరోటి రాబోతోందని తెలీదు పాపం అమాయకులకు.
  6. ఆ మధ్య డిపెప్పో మరోటో.. కార్యక్రమం కోసం (ఇక్కడ కార్యక్రమం ఏమిటనేది ముఖ్యం కాదు, డబ్బులేమాత్రం ఉన్నాయనేది ముఖ్యం. ఇప్పుడు చూడండి, నిధుల్లేవని చెప్పి, ఆ మధ్య ఉప్పునూతల వారు ప్రాంతీయ అభివృద్ధి మండలి పదవి తీసుకోనన్నారు. నిధుల్లేని పదవి నాకెందుకన్నారు. "..ఈ ఏకాకి కంచి గరుడ సేవ నాకెందుక"న్న దుర్యోధనుడిలా) కేంద్రం డబ్బులు పంపిస్తే సూర్యుడి వేడికి ఆవిరైపోయిన నీరు లాగా ఆ డబ్బులు సుబ్బరంగా అయి పోయాయి.
  7. ఇదిలా జరుగుతూ ఉండగా బాబ్లీ ప్రాజెక్టుతో తెదేపా మంచి సందడి చేసి, పండగ చేసుకుంది. పాపం తెరాస వెనకబడి పోయింది. పోలవరం కంటే పెద్ద సమస్యనా ఇది అంటూ తేల్చేయబోయారు గానీ, వాళ్ళ వాదనే తేలిపోయింది.
  8. ప్రశ్నల కోసం డబ్బులు తీసుకున్న ఎంపీలు తెలివి తక్కువగా దొరికిపోయాక, మిగిలిన వాళ్ళలో కొందరికి ఆ ఆదాయ మార్గం మూసుకుపోయింది. (అంత తెలివి తక్కువగా ఎందుకు దొరికి సచ్చారో అని తిట్టుకున్నారట కూడా!) ఒక విప్లవాత్మక, వినూత్న పద్ధతి కనిపెట్టారు. గిట్టనివాళ్ళు "అది కొత్తదేమీ కాదు, చిర పురాతనమైనది, అతి ప్రాచీనమైన వృత్తే" నని పెదవి విరిచారు. కట్టుకున్న భార్య ఉండగా మరో స్త్రీని భార్యగా చూపించి, డబ్బులు చేసుకున్నారు. మహామహా చార్లెస్ శోభరాజ్ లాంటి వాళ్ళే డంగైపోయేంతటి తెలివితేటలవి, మనబోటి మామూలు పౌరుల సంగతి చెప్పేదేముంది?
  9. కొత్త సమస్యేమీ లేనట్లు పాత దాన్ని తిరగదోడారీసారి. అదే - పుర్రె గుర్తు! బాబ్లీని తెదేపా ఎత్తుకుపోయే సరికి తెరాస వాళ్ళు మళ్ళీ కంకాళ నృత్యం చేయ సంకల్పించారు. అయితే పుర్రె కూడా మాదే నంటూ తెదేపా వాళ్ళూ గొడవ చేసారు. మొత్తం సమస్యలన్నీ వొళ్ళో పోసేసుకుని తెరాసకు సమస్యలనేవే లేకుండా చేద్దామని తెదేపా పన్నాగంలా ఉంది.
  10. ఈలోగా సీపీయం వాళ్ళు భూ ఆక్రమణలకు దిగారు. అధికార పార్టీ నాయకులకు అర్థం కానిదొకటుందిందులో.. "భూమి ఆక్రమించుకోడం వరకూ బానే ఉంది, కానీ ఇలా అంత మందిని తీసుకొచ్చి బహిరంగంగా ఆక్రమించుకుంటే ఉపయోగమేముంది? ఈ తెలివి తక్కువ కమ్యూనిస్టులు మనలను చూసన్నా నేర్చుకోకపోతే ఎలా" అని వాపోయారు. శ్రమ వృధా అయిపోతోందే అని వారి వేదన!
  11. ఈలోగా వర్గీకరణ అంటూ రావణ కాష్ఠంలా రగులుతున్న సమస్యొకటి మనకుండనే ఉంది. వర్గీకరణ కావాలని మంద కృష్ణ మాదిగ పాపం చంద్రబాబుకు ముందు కాలం నుండీ మొత్తుకుంటున్నాడు. ఒద్దొద్దని మాలలు! ఈలోగా కృష్ణ మాదిగ నిరశన దీక్ష, ఆయన అనుచరుల దహన కాండ, దోపిడీ కాండ మొదలైంది (బస్సు తగలబెట్టబోయే ముందు, ప్రయాణీకుల డబ్బూ దస్కం దోచుకున్నారట! కొన్ని చోట్ల ప్రయాణీకులు దిగక ముందే తగలబెట్టారట!!) . ప్రభుత్వానికి బోల్డంత పని.
  12. ఇవన్నీ ఇలా ఉండగా మక్కా మసీదులో బాంబు పేలింది. కొన్నాళ్ళ పాటు సందడి! 24 గంటల్లో కూపీ లాగుతామని ముఖ్యమంత్రే చెప్పేటప్పటికి, ఓహో కుట్ర సంగతి దాదాపు తెలిసిపోయిందనుకున్నా. దీన్నిగానీ పరిష్కరించేస్తారా ఏమిటి అని ఆశ్చర్యపోయాను కూడా! ఇవ్వాళ పేపర్లో చూస్తే తెలిసింది అలాంటి ప్రమాదమేమీ లేదని.. 24 గంటల్లో కూపీ లాగిందేంటయ్యా అంటే "సెల్ ఫోనుతో పేల్చారా, మరోటేదన్నా వాడారా" అనే సంగతి!
బాంబు పేల్పేసి నాల్రోలై పోయింది గదా, మరోటేదన్నా సమస్యొచ్చాక రాద్దాం లెమ్మనుకున్నా. కానీ ఏమీ రాకపోయేతలికి, ఇహనాగలేక ఈ జాబు రాసేస్తున్నా! సమస్యలకేం కొదవలేదు. కొత్తవి రాకపోతే పాతవెలాగూ ఉన్నాయి, ఎందుకంటే సమస్యను పరిష్కరించడం మన ప్రభుత్వాలకెలాగూ అలవాటు లేదుగా! పై సమస్యల్లో దేన్నీ పరిష్కరించకుండా జాగ్రత్త పడ్డాయి, చూసారుగా. కొత్తవి దొరకని రోజున పాతవి పనికొస్తాయి కదా, మరి! చీమ మనస్తత్వమన్నమాట!

3 కామెంట్‌లు:

  1. నీకె ఎవరు చపిన తెలుగు మిదా బ్లొగింగ్ రాదా?
    నాకు ఫొన్ చఈ నెను నికు తెలెగు బొగింగ్ నెర్స్కుంటా
    :)

    ఆకు సరింగా తెలెగు రాదు అంద్కంటె సొరీ
    సాగర్ చంద్ ౦౪౦ ౬౬౧౭ ౩౪౮౭
    హిందీ లా చపు :)
    भाई मुझे तेलुगु बराबर नहीं आती पर मैं आपको तेलुगु टाइपिंग सिखा सकता हूँ। उपर फोन नंबर दिया है। तेलुगु लिखने में कुछ गलतियाँ हुई हो सकती है सो उसके लिये क्षमायाचना।

    రిప్లయితొలగించండి
  2. meeru TRS vaalla passport episode marchipoyaru

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు