ఆధ్యాత్మిక రచనలతో తెలుగు సాహిత్యం పరిపుష్టమయింది. దేవుణ్ణి కీర్తిస్తూ చేసిన రచనలు ఎన్నో కాగా, కొన్ని మాత్రం భిన్నమైనవి. భగవంతుణ్ణి మాయజేసో, బుట్టలోవేసో, ఎత్తిపొడిచో, నిష్ఠురాలాడో తమ పనులు నెరవేర్చుకున్న కార్యసాథకులైన భక్తుల గురించిన రచనలు ఇవి.
ఈ భక్తిలో వినతులుండవు.. ఆనతులే గాని
నివేదనలుండవు.. ఆదేశాలే గాని
పొగడ్తలు, కీర్తిగానాలు ఉండవు.. చెతుర్లు, నిష్ఠురాలు, ఎత్తిపొడుపులే గాని
కానీ, ఎత్తిపొడుపులూ నిష్ఠురాల వెనుక భక్తుని ఆర్తి వినిపిస్తూ ఉంటుంది. సాక్షాత్తూ రాముడే తలవంచిన భక్త్యావేశమది. మన సాహితీకారుల అపూర్వ సృజనలివి. వారికి నమస్సులతో కొన్ని ఉదాహరణలు..
"నీ కాలిదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట.. నా నావ మీద కాలు పెడితె ఏమౌతాదోతంట!" (రాముడితో చెతురాడుతున్నాడు బాపు గారి గుహుడు. లేక, అది గుహుడి అమాయకత్వమా?)
"ఆదిభిక్షువు వాడినేమి కోరేదీ... బూడిదిచ్చేవాడినేది అడిగేది?" -సిరివెన్నెల చతురత. ఇంకా చూడండి... "తియ్యటి గొంతిచ్చిన కోకిలమ్మకు నల్లటి రంగు, ముద్దులొలికే పూలకు మూణ్ణాళ్ళూ, కరకు బండరాళ్ళకు చిరాయుశ్శునూ ఇచ్చిన ఆ శివుణ్ణి నేనేమడిగేది" అంటున్నాడు. వంకలు పెడుతూనే జగత్కారకుడు శివుడేనని కీర్తిస్తోంది ఈ పాట. (నాకీ సంగీతజ్ఞానమిచ్చి కళ్ళు లేకుండా చేసాడే అనే ఆవేదన కూడా ఆ సినిమా పాత్రలో ఉందేమో!)
ఇక రామదాసు సంగతి చెప్పేదేముంది.. "నీకు గుడి కట్టించాను.., మీ ఆవిడకు, తమ్ముడికి నగలు చేయించాను" అని పేరుపేరునా చదివి, "ఇదంతా ఎవడబ్బసొమ్ముతో చేయించాననుకుంటున్నావు? ఇన్ని చేసానే.. మరి నన్ను విడిపించేందుకు నీకు మనసు రావడం లేదేంటి" అంటూ ఎత్తిపొడిస్తే తట్టుకోలేక రాముడు తానే స్వయంగా తానీశుడికి సొమ్మిచ్చి, రామదాసును చెర విడిపించి, తెరపిన పడ్డాడు.
"సిరిగలవానికి చెల్లును... పరమేశా గంగ విడుము పార్వతి చాలున్" అంటూ పలనాట నీటి కొరతను చూపుతూ శ్రీనాథుడు ఇలా అన్నాడు. "విష్ణుమూర్తి వంటి డబ్బున్న మారాజులకు ఎంతమంది భార్యలున్నా చెల్లుతుంది.. తిరిపెమెత్తే నీకు ఇద్దరెందుకయ్యా.. గంగను మాకొదులు, నీకు పార్వతి చాలులే" అని చెతురాడుతూ నీళ్ళకోసం శివుణ్ణి వేడుకున్నాడు. (గంగ అంటే నీరు అనే అర్థంలో..)
ఇక సావిత్రి చతురత జగద్విదితం. భర్త ప్రాణాన్ని దక్కించుకునేందుకు యముడంతటి యముణ్ణే బోల్తా కొట్టించిన చతుర, ఆమె. వరాలిచ్చేయడంలో యముడు బోళాశంకరుణ్ణే మించిపోయిన ఘట్టమది!
ఇంకా ఎన్నున్నాయో.. ఇలా!

manchi udaaharaNalu...ilaaMTi daaniki iMkoka udaahraNa srikaakula AMdhradEva satakaM. aaa kavi sIsa padyaalu adbhutamgaa uMTaayi.
రిప్లయితొలగించండి