దానికి మన సమాజంలో కొన్ని వృత్తుల, వర్గాల వారు ఎలా జవాబిస్తారో చూద్దాం!
- రైతులు: వ్యవసాయం చేస్తాను
- వృత్తి పనుల వారు: ఫలానా వృత్తి చేస్తాను.
- కూలీలు: ఫలానా కూలీ పని చేస్తాను.
- పంతుళ్ళు: ఫలానా బడిలో పంతులుగా పని చేస్తున్నాను.
- గృహిణులు: ఇంటి పనులు చేస్తాను.
- ప్రభుత్వోద్యోగులు: ఫలానా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను.
- ప్రైవేటు ఉద్యోగులు: ఫలానా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను.
- వ్యాపారులు: ఫలానా వ్యాపారం చేస్తున్నాను.
- పాత్రికేయులు: ఫలానా పత్రికలో ఫలానా పని చేస్తున్నాను.
- కళాకారులు: ఫలానా కళను ప్రదర్శిస్తూ ఉంటాను. (బొమ్మలు గీస్తుంటాను, నటిస్తుంటాను, పాటలు పాడతాను .. ఇలా)
- నిరుద్యోగులు: పని కోసం వెతుక్కుంటున్నాను
- బడికెళ్ళే పిల్లలు: ఫలానా బడిలో ఫలానా తరగతి చదువుతున్నాను
- బడికెళ్ళని పిల్లకాయలు: ఆడుకుంటాను!?
- అడుక్కునే వాళ్ళు: అడుక్కుంటాను.
- రాజకీయులు: (ఏదన్నా అధికార పదవి ఉంటే అది చెబుతారు. లేదంటే..)??...!!...ఊ..??..ఆ!.. రాజకీయాల్లో ఉన్నాను..అంటే.. రాజకీయాల్లో తిరుగుతూ ఉంటాను. (ఫలానా పని చేస్తాను అని చెప్పలేరు)
- రౌడీలు, గూండాలు: ??..ఆ!!, రాజకీయాల్లో తిరుగుదామనుకుంటున్నాను. (లేదా) ఫలానా రాజకీయ నాయకుడి దగ్గర ఉంటున్నాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి