"నా పేరు బి. సురేష్‌బాబు. తమిళనాడులోని నాదపట్టినమ్ జిల్లా, తిరుక్కడయూర్‌లోని పిపిఎన్ పవర్ జెనరేటింగ్ కంపెనీలో సీనియర్ మేనేజర్ (మెటీరియల్స్)గా పనిచేస్తున్నాను. సి.పి.బ్రౌన్ ఫొటోకు సంబంధించి పత్రికల్లో ప్రచురితమైన వార్తకు స్పం దనగా ఇది రాస్తున్నాను. ఆ ఫొటో సి.పి. బ్రౌన్‌ది కానేకాదు. ఫొటోలో ఎడమవైపు కూర్చుని ఉన్న వ్యక్తి మా ముత్తాత చెంగల్‌రావుగారు. ఆయన 1965లో తన 85వ ఏట మరణించారు. ఫొటోలో కనిపిస్తున్నదానిని బట్టి అప్పటికి ఆయన వయసు దాదాపుగా 55 సంవత్సరాలు ఉండవచ్చును. అంటే, ఈ ఫొటో 1935-40 మధ్యకాలంలో తీసినది అయి ఉండాలి. సర్ సి.పి. బ్రౌన్ 1855లోనే భారతదేశంనుంచి వెళ్ళిపోయి 1884లో కన్నుమూశారు.
ఆ విధంగా చూస్తే, సి.పి.బ్రౌన్ భారతదేశంలో ఉన్న కాలంలో మా ముత్తాత పుట్టనేలేదన్నమాట. రెవిన్యూ, భూమి సర్వేల నిమిత్తం యెల్లుట్ల గ్రామంలోని మా ఇంటికీ, మా బంధువుల ఇళ్ళకూ బ్రిటిష్ అధికారులు ఎంతోమం ది వచ్చిపోతుండేవారని మా గ్రామస్తులు ఎప్పుడూ చెబుతుండేవారు. ఈ ఫొటోలోని వ్యక్తి అటువంటి ఏదో పని నిమిత్తం వచ్చిన ఎవరో బ్రిటిష్ అధికారి కావచ్చును. అంతేకానీ, ఎట్టిపరిస్థితుల్లో నూ బ్రౌన్ కాదు. చెంగల్‌రావుగారి కుమార్తె, నా అమ్మమ్మ ఇప్పటికీ అదే గ్రామంలో నివసిస్తున్నారు. ఆమె ఈ విషయాన్ని మరిం తగా నిర్ధారించగలరు."
కాలం గడిచే కొద్దీ ఇప్పటి వాళ్ళ ఫోటోలు కూడా అలాగే మరుగునపడిపోతాయేమో! మనకో ఫోటో భోషాణం ఉంటే బాగుంటుంది. కావలసిన ఫోటోను స్వయంగా వెతుక్కుని చూసేలా - వికీపీడియాలోలాగా - ఉంటే రాబోయే తరాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
ఈ లేఖతో నా ఆనందం అంతా ఆవిరి అయిపోయింది :-(
రిప్లయితొలగించండిఔనా ? పత్రికల వాళ్ళు ఇలా నిర్ధారించకుండా ముద్రించేసారా?
రిప్లయితొలగించండిReally suprising that a reputed daily like Eenaadu would publish a story without verifying the facts. May be they never expected a Sureshbabu..
రిప్లయితొలగించండి