తెలంగాణ అంశం తెలుగు వారు ఎదుర్కొంటున్న అతిపెద్ద రాజకీయ సమస్య. అలాంటి ముఖ్యమైన అంశంపై రెండేళ్ళుగా మన రాజకీయులు ఆడుతున్న నాటకాలు చూస్తూ ఉంటే అనిపిస్తుంది.. 'పైకి ఏదో ఒకటి మాట్లాడుతున్నా, లోపల ఎవరెవరు ఏమేమనుకుంటున్నారో మిగతావారికి తెలుస్తున్నట్లు లేదు' అని. ఈ రాజకీయ నాటకంలో ముఖ్యపాత్రలు ఐదు. సోనియా, కె.సి.ఆర్, నరేంద్ర, రాజశేఖరరెడ్డి, కేశవరావు.
మాయాబజారు సినిమాలోని మాయాదర్శిని వాడి, వాళ్ళ మనసుల్లో ఏముందో తెలుసుకుందాం.
కె.సి.ఆర్: ఈ సోనియాతో పెద్ద చిక్కొచ్చి పడిందే! ఈమెకా తెలీదు, చెబుదామా అంటే అపాయింటుమెంటివ్వదు. దొరక్క దొరక్క దొరికినప్పుడు గోడు వెళ్ళబోసుకుంటానా.. ఒక్క ముక్క మాట్లాడదు. ఏంటో చిద్విలాసంగా నవ్వుతుంది. "హమ్మయ్య అనుకూలంగానే ఉందీమె" అనుకుని బయటికి వస్తాను. వెంటనే ఈ రాజశేఖరు ఎవరో ఒకర్ని పంపించి ఒద్దని నూరిపోస్తాడు. ఎలాగైనా ఈ మూడేళ్ళూ కనీసం నెలకో సారన్నా సోనియా అపాయింటుమెంటు తీసుకుని తెలంగాణ ఎందుకు కావాలో చెబుతూ ఉండాలి. అప్పటిదాకా మంత్రిపదవి కాపాడుకోవాలి. దిగ్విజయ్‌ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే అపాయింటుమెంటు ఎలాగోలా ఏర్పాటు చేస్తాడు. అపాయింటుమెంటు కోసం నేనెంత కష్టపడుతున్నానో ఈ మందడితో ఉన్న మందకు తెలిసి చావడం లేదు.
నరేంద్ర: ఈ కె.సి.ఆర్ ని పట్టుకుని తెలంగాణ గోదావరి ఈదగలనో లేదో గానీ, మంత్రి పదవి మాత్రం దక్కింది. బీజేపీలో ఉంటే ఇది దక్కేదా! రాజీనామా రాజీనామా అంటూ కె.సి.ఆర్ నిజంగానే రాజీనామా చెయ్యమంటాడేమోనని భయంగా ఉంది. ఏదో డెడ్‌లైన్లు పెట్టుకుంటూ నెట్టుకొస్తున్నా, ఇలా ఎన్నాళ్ళో!? ప్రస్తుతానికి మరో డెడ్‌లైన్ ఇచ్చేస్తా!
రాజశేఖరరెడ్డి: మేడంకు ఏమీ తెలవదు కాబట్టి సరిపోయింది, లేకుంటేనా..! ఆమెకేమీ తెలవకుండా కాపాడుకోవాలి. సోనియాను వీళ్ళు కలవకుండా చూసుకుంటే సరిపోద్ది. ఒకవేళ కలిసినా.. దానికి ముందోసారి, వెనకోసారి మనాళ్ళని పంపించి, మేడంను పూర్తిగా అయోమయంలో పెట్టేయాలి. కేశవరావే అందుకు సమర్థుడు.
కేశవరావు: ఏమిటి నా పరిస్థితి ఇట్లా ఐపోయింది!? ముఖ్యమంత్రి ఇలా అనమంటాడు, కె.సి.ఆర్ అలా అనమంటాడు. చచ్చిపోతున్నాను ఏమనాలో తెలీక. లక్కీగా మనమేం మాట్లాడినా ఆమెకేమీ అర్థం కాదు కాబట్టి పర్లేదు. ఎటొచ్చీ విలేకరులతోటే జాగ్రత్తగా ఉండాలి.
సోనియా: ఏంటో వీళ్ళ గోల. రెండేళ్ళైనా ఇంతవరకూ నాకేం అర్థం కాలేదు. "మన సొమ్మేంబోయింది ఇచ్చేస్తే పోలా" అంటే వినరు. విసుగొచ్చేస్తోంది. ఈ ప్రణబ్ ముఖర్జీ ఒకడు.. "ఎటూ తేల్చకూడదు మేడం" అంటాడు. రాజశేఖరేమో "రాష్ట్రం ఇచ్చే ప్రసక్తే లేదం"టాడు. ఇక ఆ కె.సి.ఆర్ చెప్పేది ఒక్క ముక్క అర్థమై చావదు. అర్థం కావడంలేదని చెబుదామంటే అవకాశమివ్వడు! తానే మాట్లాడుతాడు తప్పించి నన్ను నోరెత్తనివ్వడు. నేను నవ్వుతూ తలకాయ ఊపుతుంటే అర్థమైందనుకుంటున్నాడు, పాపం! తలనెప్పొచ్చేస్తోంది. నేనందుకే వీళ్ళను అసలు కలవనని అంటాను. దిగ్విజయ్ వినడు. "ఓసారి కలవండి మేడం, ఒక మూణ్ణెల్ల దాకా పడి ఉంటారు" అంటాడు. ఆ నరేంద్రొకడు, అతణ్ణి చూస్తేనే భయమేస్తుంది. అతడితో వస్తే కలవనని కె.సి.ఆర్ కు ముందే చెప్పడం మంచిదైంది.
ఆ పీసీసీ అధ్యక్షుడి పేరేమిటీ.. ఆఁ.., కేశవ్! చిత్రమైన మనిషి! మాట్లాడేది ఇంగ్లీషైనా ఒక్క ముక్క అర్థం కాకుండా భలే మాట్లాడతాడు. పైగా "మీరు కూడా ఇలాగే మాట్లాడాలి మేడం" అంటాడు.
ప్రధానమంత్రి పదవి రాకపోడమే మంచిదైంది. లేకపోతే ఈ గోలకి పిచ్చెక్కిపోయేది. ఈ యు.పి.ఏ కు కూడా రాజీనామా చేసేసి ఏ ప్రకాష్ కారత్ కో ఇచ్చేస్తాను అంటే దిగ్విజయ్ వినడు.. "ఐదో ఏడు త్యాగం చేద్దురుగాని మేడం, ఎన్నికల్లో పనికొస్తుంది" అంటాడు. అప్పటి దాకా ఎలా భరించాలో వీళ్ళని!!
వీళ్ళంతా నాకు అనుచరులో, ట్యూషను టీచర్లో తెలీడం లేదు. నాకేవీ తెలీదని వీళ్ళంతా నాతో ఆడుకుంటున్నారు. అయినా.., నేనసలు నోరే విప్పను కదా.., మరి, నాకేం తెలవదని వీళ్ళకెలా తెలిసిందబ్బా!!?? అమ్మో, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి.
*******
మరి కమ్యూనిస్టులూ, చంద్రబాబూ మాటేమిటి.. మాయాబజారు సినిమాలో పాండవుల పాత్రే వీళ్ళదీను.
అద్భుతంగా వ్రాసినారు
రిప్లయితొలగించండిఅద్భుతమండీ! తెలంగాణా గురించి హడావిడి చేసే వాళ్ళ గురించే కాకుండా చెయ్యనివాళ్ళ గురించి కూడా తిరుగులేని పోలికతో చక్కగా చెప్పారు.
రిప్లయితొలగించండిమంచి రచన!
రిప్లయితొలగించండిఅయ్య బాబోయ్! మీ మాయాదర్శిని ఎంత చక్కగా పని చేస్తోందండీ!
రిప్లయితొలగించండిఎంత బాగా వ్రాశారు!! ఇన్ని రోజులు మీ ఈ బ్లాగు చదవనందుకు విచారంగా ఉంది. కడుపుబ్బ నవ్వేశాను. అద్భుతంగా ఉంది.
-- ప్రసాద్
Hmm I love the idea behind this website, very unique.
రిప్లయితొలగించండి»
Naa lage ee post ni chala mandi miss ayyi untaru. TeluguBlog book lo unchi manchi pani chesaru. Office lo chaduvutunte bayam vesindi - naa navvu chusi maa boss thidathademonani
రిప్లయితొలగించండిBaasu perfectu.
రిప్లయితొలగించండి