21, మార్చి 2007, బుధవారం

బుద్ధుడి పాలనలో హింస

"నందిగ్రామ్ లో జరిగిన హింస నాకు భయం కలిగించింది"
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.ఆర్.కృష్ణయ్యర్ మాటలివి. మార్చి 14న పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ లో జరిగిన హింసకు చలించి సీపీఎం అధ్యక్షుడు ప్రకాష్ కారత్ కు రాసిన ఉత్తరంలో పై మాటలు రాసాడాయన.
వెబ్ లో చాలా చోట్ల ఉందీ ఉత్తరం. మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను.

URGENT March 15, 2007

My dear Prakash Karat,

I adore you as the top leader of the Marxist Party even as I hold Com. Jyoti Basu as a creative wonder of the Communist Marxist Party. As you know, I remained in power with the Communist Government in 1956 in Kerala under the charismatic Chiefministership of EMS, the great Leftist thinker. But alas!, in West Bengal things are murky, capitalism is happy, poor peasantry is in privation and deprivation, if newspaper reports throw light on events objectively. We, in 1957, came to power by the ballot and rarely, if ever, used the bullet, with the result the police violence was hardly an instrument against the peasantry.

Look at the contrast. The brutality and bloodshed, at the instance of the police force is now bulleting of humble humanity. I had and have great hopes that the Marxists if in power, will rule with compassionate ideology and win votes and people’s co-operation beyond party barriers. But to my horror, the terror practiced yesterday at Nandigram fills me with dread and disappointment. The illusion of exploitative power has led the ministry to govern by the gun. The consequent bloodshed demands your urgent attention and commands the party’s authority to arrest the frequency of bloodshed policy and police barbarity. Sri. Sumit Chakravartty telephoned me last night about the police misuse of firepower. If true, I protest and entreat you and the party to take immediate action and restore the basic proposition that Communist Government is not power with violent weapons. And action at party level must be taken if governance over humanity is for the benefit of the peasantry. I am sure, thousands like me will be shocked by the Nandigram incident. Please, please have some regard for those who feel that socialism is not terrorism, but humanism; and misrule by gun will not be the rule of the Left in State authority. Do forgive me for expressing my strong feelings with the expectation that the Left Administration believe and practice as a fundamental for the humble people, not for the proprietariat with the brute force of the bullet.

With high regards,
Yours sincerely,

(V.R. KRISHNA IYER)
To,
Sri. Prakash Karat
General Secretary
Communist Party of India (Marxist)
New Delhi


14 మంది అమాయక కర్షకులు హతులైన ఘటన అది; ప్రత్యేక ఆర్థిక మండలి కోసం భూమి కోల్పోతున్న వాళ్ళ నిరసన తెలియజేస్తే బుద్ధదేవుని ప్రభుత్వం వారికిచ్చిన జవాబు. పై ఉత్తరంలో కృష్ణయ్యరు, "మార్క్సిస్టులు అధికారంలో ఉంటే, సహానుభూతితో పాలిస్తారూ.., పార్టీలకతీతంగా ప్రజల తోడ్పాటును, వోట్లనూ పొందుతారు అనే గొప్ప ఆశలు నాకుండేవి, ఉన్నాయి." (I had and have great hopes that the Marxists if in power, will rule with compassionate ideology and win votes and people’s co-operation beyond party barriers.) అని రాసారు. నా నమ్మకం సడలుతోంది, తగు చర్యలు తీసుకుని పరిస్థితిని మరింత దిగజారనివ్వకండి అని లీలగా హెచ్చరిక చేసారాయన.

ఆర్థిక మండళ్ళ పేరిట పెద్ద కంపెనీలకు దేశాన్ని దోచిపెట్టడంలో కమ్యూనిస్టులు ఇతరులకేమీ తీసిపోవడంలేదు, వాళ్ళ కంటే ముందంజ లోనే ఉన్నారు. ప్రజలు, ఉద్యమాలు అని ఓ.. ఊదరగొడతారు గానీ, అసలు విషయానికి వచ్చే సరికి వీరిదీ ఆ బాటే. ప్రజా ఉద్యమాలు కాస్తా ప్రజలపై ఉద్యమాలు గా మారిపోతున్నాయేమో!

సీపీఎం నాయకులు రాఘవులు, యేచూరి మొదలైనవారు ఈ కాల్పులను సమర్ధించుకున్నారు. అది తృణమూల్ కుట్ర అనీ, ఏవో రెండు వర్గాల మధ్య ఘర్షణ అనీ అన్నారు. కరెంటు ఉద్యమ సమయంలో బషీరుబాగులో చంద్రబాబు ప్రభుత్వం జరిపించిన కాల్పులకు, నందిగ్రామ్ కాల్పులకు తేడా ఏంటో రాఘవులు చెప్పాలి. కరెంటు ఉద్యమం సీపీఎం, కాంగ్రెసుల కుట్రేనా?

మన శాసనసభలో జరిగిన చర్చలో మజ్లిస్ అక్బరుద్దీన్.. కాల్పుల్లో చనిపోయిన వారిలో దాదాపు అందరూ మైనారిటీలే, అందుకే మాట్లాడుతున్నాను. దాన్ని ఖండిస్తూ తీర్మానం చెయ్యాలి - అంటూ మాట్లాడుకుంటూ పోయాడు. పరాయి రాష్ట్రం గురించి ఇక్కడెందుకు మాట్లాడాలంటూ సీపీఎం వాళ్ళు ఎదురుదాడి చేసారు.

ఈ కాల్పుల వలన రాష్ట్ర కాంగ్రెసు మాత్రం లాభించింది. ఈమధ్య తమపై ఒంటికాలి మీద లేస్తున్న సీపీఎంనూ, రాఘవులునూ ఎదుర్కోడానికి వారికో మంచి ఆయుధం దొరికింది. తెదేపా పరిస్థితి కాస్త ఇరుకున పడినట్లే. ఓ పక్క సీపీఎం తో స్నేహం కోసం అర్రులు చాస్తూ మరోపక్క ఆపార్టీని విమర్శించలేదు. అలాగని నోరెత్తకుండా ఉండనూ లేదు.

1 కామెంట్‌:

  1. ఇలాంటి దారుణాలు వామపక్షాల నియంతృత్వ పాలనలోని పశ్చిమ బెంగాల్ లొ కొత్తేమీ కాదు. కృష్ణ అయ్యర్ గారి సంగతి నాకు తెలీదు కానీ, అక్కడ ఎన్నికలు ఎలా జరుగుతాయో బహిరంగ రహస్యం. సీపీఎం తాలూకు గూండాలూ, బంగ్లాదేష్ నుంచి చొరబడనిచ్చిని కాందిశీకులు వారి వోటు బేంక్. ఎక్కడైనా వ్యతిరేకత ఎదురైతే ఇలా కిరాతకంగా అణిచివేయడం మామూలే.

    ఇంతకీ ఈ సంఘటన జరగటానికి 2 రోజులు ముందే బుద్ధులవారు వెనక్కి తగ్గినట్టు ప్రకటించారు. తాటిచెట్టు దూడగడ్డికి ఎక్కానన్నట్టు 5 వేల మంది పొలీసులని రోడ్లు వేయడానికి పంపారుట. ఎవరు నమ్మాలి?

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు