అప్పుడే సాయంకాలమైంది. సూర్యాస్తమయం చేరువైంది. సంవత్సరం కిందట ఉజ్వలంగా ఉదయించిన ప్రజారాజ్యం సూర్యుడు, కాంగ్రెసు తుప్పల్లో కుంకబోతున్నాడు.
పాపం చిరంజీవి! హీరో కావాలనుకున్నవాడు మొన్నటి ఎన్నికల్లో జీరో అయ్యాడు. ఇప్పుడు కాంగ్రెసు పంచన చేరి, నిదానంగా వంత పాత్రలు వేసి, ఎప్పుడోకప్పుడు హీరో కాకపోతానా అని చూస్తున్నట్టున్నాడు. కాంగ్రెసుతో పెట్టుకుంటున్న ఈ పొత్తు కారణంగా ఒక్కటి మాత్రం స్పష్టం.. ఒకవేళ ఈ పొత్తే గనక 2014 ఎన్నికలలోనూ కొనసాగినా, లేక ఈలోగా ప్రజారాజ్యం కాంగ్రెసులో మునిగిపోయినా.. కాంగ్రెసు చేస్తే తప్ప ఇక అతడు హీరో కాలేడు. పాపం చిరంజీవి!
ప్రజారాజ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రజారాజ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
2, నవంబర్ 2009, సోమవారం
10, ఏప్రిల్ 2009, శుక్రవారం
ఏం తేడా లేదు!
ఇన్నాళ్ళూ ప్రజారాజ్యాన్ని రాజ్యేతరులే విమర్శించారు. ఆ పార్టీలో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. మిగతా పార్టీల కంటే కొత్తదనం, వైవిధ్యత ఏదీ లేదన్నారు. డబ్బులు తీసుకుని టిక్కెట్లిస్తున్నారనీ అన్నారు. చిరంజీవి పైకి కనబడేంత సౌమ్యుడు, అమాయకుడూ కాదన్నారు. అతడిది నటన అని అన్నారు. అది అతివినయం అనీ అన్నారు.
28, ఆగస్టు 2008, గురువారం
ప్రజారాజ్యం కోసం చిరంజీవి ప్రజారాజ్యం తెచ్చాడు
ఎట్టకేలకు చిరంజీవి పార్టీ వచ్చేసింది. ప్రజారాజ్యం అనే చక్కని పేరు పెట్టుకుని 2008 ఆగస్టు 26 న ఈ పార్టీ పుట్టింది. జెండాను ఆవిష్కరించిన చిరంజీవి, అది ఏయే అంశాలకు ప్రతీకగా నిలవబోతోందో కూడా చెప్పాడు. లక్షల మంది ఉత్సాహవంతులైన వీరాభిమానుల కోలాహలం మధ్య తిరుపతిలో పార్టీ పేరు ప్రకటించడమే కాకుండా స్థూలంగా పార్టీ విధానాలను కూడా వివరించాడు. మొత్తం మీద ప్రజారాజ్యం ఆవిర్భావం సందడిగా జరిగింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
సంబంధిత టపాలు
loading..