బ్లాగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బ్లాగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, అక్టోబర్ 2011, సోమవారం

గూగుల్ ప్లస్ బ్లాగర్ = " "

7 కామెంట్‌లు
గూగుల్ వాడు అనేక సేవలను తామర తంపర గా జనాల్లోకి దింపేస్తూంటాడు. మన జీమెయిల్లో పైన ఎడం చేతి పక్క నుండి వాడి సేవల జాబితా మొదలౌతుంది. జాబితా చివర ’మోర్’ అనే లింకుంటుంది. అది నొక్కితే మరో సేవలజాబితా కిందకి జారుతుంది. దాని చివర ’ఈవెన్ మోర్’ అనే లింకుంటుంది. అది నొక్కితే ఒక సేవల పేజీకి వెళ్తాం. ఇదివరకు ఆ పేజీనిండా బోలెడు సేవల జాబితా ఉండేది. వాటిలో ల్యాబ్స్ అని ఒకటుండేది.. అది నొక్కితే ఇంకా ప్రయోగ దశలో ఉన్న సేవల జాబితా ఇంకోటి ఉండేది. మొత్తం ఒక యాభైకి పైగానే ఉండేవి. ఇప్పుడు ఆ సేవల జాబితా బాగా చిక్కిపోయింది. అవన్నీ ఏమయ్యాయో తెలవదు.

30, అక్టోబర్ 2011, ఆదివారం

బ్లాగుల / సంకలినుల ద్వారా డబ్బు సంపాదించుకోవడం ఎలా?

8 కామెంట్‌లు
మొన్న నేను బ్లాగరులో ఒక చిన్న పొరపాటు పని చేసాను. వేద్దామనుకున్న టపాతో పాటుగా, చిత్తుప్రతుల్లో ఉన్న మరో టపాను - ఇప్పుడప్పుడే వెయ్యదలచుకోనిది-  కూడా ప్రచురించేసాను. అనుకోకుండా జరిగింది. అడెడె.. అనుకుని వెనువెంటనే, దాదాపు అరనిముషం లోపే, దాన్ని ’అ’ప్రచురించేసాను, తిరిగి చిత్తుప్రతుల్లోకి పంపేసాను. ఎందుకైనా మంచిదని హారానికి వెళ్ళి చూసాను. అక్కడ చూపించలేదు. మాలిక లోనూ చూసాను, అక్కడా లేదు. కూడలిలోను, జల్లెడలోనూ రాలేదు.

1, ఏప్రిల్ 2011, శుక్రవారం

బ్లాగరు బ్లాగును ప్రదర్శించేందుకు కొత్త అమరికలు

6 కామెంట్‌లు
బ్లాగరు వాడు ఒక కొత్త విశేషం తీసుకొచ్చాడివాళ. బ్లాగు నిర్వహణలో, ప్రచురణలో ఇదేమీ ఉపయోగపడనప్పటికీ, బ్లాగును కొత్తగా చూపించుకోడానికి డైనమిక్ వ్యూస్ అనే ఈ విశేషాన్ని వాడుకోవచ్చు.

3, ఆగస్టు 2010, మంగళవారం

తెలుగులో వెతకటం అంత వీజీ కాదు గురూ!

20 కామెంట్‌లు
(ఈ వ్యాసంలో కొన్ని పదాల పక్కన బ్రాకెట్లలో అంకెలు చూపించాను. అవి - ఆగస్టు 2 రాత్రి ఆయాపదాల కోసం గూగిలించినపుడు వచ్చిన ఫలితాల సంఖ్య. మళ్ళీ వెతికితే ఈ ఫలితాలు కొద్దిగా అటూఇటూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రాసినదంతా గూగుల్లో వెతకడాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినదే. గూగిలించడం అంటే google.com లో వెతకడం.) 

1, జనవరి 2010, శుక్రవారం

కొత్త సంవత్సరానికి పాత టపాలు!

16 కామెంట్‌లు
నచ్చిన బ్లాగుల గురించి, టపాల గురించీ ఈ మధ్య టపాలొస్తున్నాయి. ఆ స్ఫూర్తితోనే ఈ టపా!

సాధారణంగా నాకు హాస్యం చిప్పిల్లే టపాలు నచ్చుతాయి. అసలు హాస్యం నచ్చందెవరికిలెండి!! హాస్యం తరవాత, జ్ఞాపకాల టపాలు కూడా నాకెంతో నచ్చుతాయి. ఎవరి జ్ఞాపకాలు వాళ్ళకు ముద్దేననుకోండి. నాకు మాత్రం ఎవరి జ్ఞాపకాలైనా ముద్దే! చదవడానికి ఆహ్లాదకరంగా, చదివాక హాయిగా ఉండే ఏ టపాలైనా బావుంటాయి. ఎప్పటికప్పుడు గుర్తుకొస్తూ ఉండే టపాలు కొన్నిటి గురించి ఇక్కడ కొంత...

25, ఫిబ్రవరి 2009, బుధవారం

ప్రమదావనం.. భేష్!

3 కామెంట్‌లు
సామాజికంగా సేవ చెయ్యాలనే ఆసక్తి ఎంతో మందికి ఉంటుంది. ఉత్సాహమూ ఉంటుంది. వీటికి మించి సాటివారి కష్టం, బాధ, వేదనల పట్ల సహానుభూతి ఉంటుంది. కానీ అందుకు అవసరమైన ఆర్థిక, ఆర్థికేతర వనరులు లేకపోవడం వలనగానీ, మరో కారణం వలన గానీ ఆయా పనులు చెయ్యలేరు. ఎక్కడో అరుదుగా, యామినీ ఫౌండేషను పెట్టిన శ్రీనివాసు గారి లాంటివారు ఉంటారు.అలాంటి అరుదైన సేవకులను అభినందిద్దాం.

14, ఫిబ్రవరి 2009, శనివారం

బ్లాగుల్లో దొంగలు పడ్డారు

17 కామెంట్‌లు
..పడి, మన ఐడీలను కొట్టేస్తున్నారు. మన వేషాలేసుకుని, మన పేర్లతో దొంగ వ్యాఖ్యలు రాసేస్తున్నారు. ఇది ఎవరి పనో చెప్పనక్కర్లేదు, ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలను పరిశీలించినవారికెవరికైనా, ఈ పనులు చేస్తున్నది ఎవరో తెలిసిపోయి ఉంటుంది.

1, ఫిబ్రవరి 2009, ఆదివారం

సరికొత్త బ్లాగుల పరిచయం

26 కామెంట్‌లు
బ్లాగు మూతల కార్యక్రమంలో తెలుగు బ్లాగరులు తలమునకలుగా ఉండగా.. ప్రసిద్ధులైనవాళ్ళు తమ తెలుగు బ్లాగులను మొదలుపెట్టారు. బ్లాగరి పేరు, బ్లాగు పేరు (బొద్దు అక్షరాల్లో), వాళ్ళ బ్లాగులలోని ప్రధాన విశేషాలు మొదలైనవాటితో కూర్చిన టపా ఇది. అవధరించండి.

16, నవంబర్ 2008, ఆదివారం

రండి, రండి! Welcome

14 కామెంట్‌లు
Can't see Telugu on this page? Is your Computer showing series of boxes after this paragraph? It is because, it is not taught how to render Telugu. You can teach a lesson to it, so that it will surrender to the sheer beauty of those magnificent letters. Follow the steps given in this Wikipedia link or this link or this and implement the suggested changes in your computer... you will find yourself in the lap of Mother Telugu. Then, please come back and read the following few lines.

కొత్తగా బ్లాగుల గురించి తెలుసుకుంటున్న వారికి, ఈ బ్లాగుపై ఆంధ్రజ్యోతి సమీక్ష చదివి ఇక్కడికి వచ్చినవారికి, బ్లాగరులకు, బ్లాగ్వరులకు స్వాగతం! నాకు తెలిసిన నాలుగు ముక్కలను కొత్తవారికి చెప్పాలని ఇది రాస్తున్నాను.

1, జులై 2008, మంగళవారం

బ్లాగరులో కొత్త అంశాలు

8 కామెంట్‌లు


బ్లాగరు కొన్ని కొత్త అంశాలను ప్రవేశపెట్టింది. draft.blogger.com చూస్తున్నవారికి ఈసంగతి తెలిసే ఉంటుంది. కొత్త కొత్త అంశాలను ప్రవేశపెట్టడం బ్లాగరుకు మామూలే. ఈ సారి ప్రవేశపెట్టిన అంశాల్లో నాకు బాగా నచ్చినదొకటుంది. - వ్యాఖ్యలపెట్టె. బ్లాగరులో వ్యాఖ్యలు రాసేందుకు అంతగా వీలు ఉండదు. వ్యాఖ్య రాయాలంటే ఓ లింకు నొక్కాలి, అప్పుడు వేరే పేజీ తెరుచుకుంటుంది - అందులో రాయాల్సుంటుంది. అదొక తలనెప్పి వ్యవహారం. ఈ పద్ధతిని సంస్కరించి, వ్యాఖ్యలపెట్టె కూడా జాబు పేజీ (ఇన్‌లైను) లోనే వచ్చే ఏర్పాటు చేసారు. ఇప్పుడు వర్డ్‌ప్రెస్‌లో ఉండే వీలు బ్లాగరులో కూడా చేరింది. అయితే దీనికి కాస్త హంగు చెయ్యాల్సి ఉన్నట్టుంది. ఏదేమైనా ఇప్పుడున్న స్థితిలోనైనా ఇది బానే ఉంది. కొత్త అంశాలను చూసేందుకు draft.blogger.com లో లాగినయి, డ్యాష్‌బోర్డులో ఈ కొత్త అంశాలను చూడవచ్చు.



ఈ అంశాన్ని వాడటంలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. నాకెదురైంది. అప్పుడు ఇక్కడిచ్చిన సూచనలను అనుసరించి, సాధించాను.

11, అక్టోబర్ 2007, గురువారం

వ్యాఖ్యోపాఖ్యానం

23 కామెంట్‌లు
తెలుగు బ్లాగుల రాసి బాగా పెరుగుతోంది, ఇక బ్లాగరులు 'వాసి'పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ వింజమూరి విజయకుమార్ గారు మధ్యంతర మార్గ నిర్దేశనం లాంటిది చేసారు. బ్లాగు నాణ్యతకై బ్లాగరులంతా పునరంకితం (అమంగళం ప్రతిహతమగుగాక :) ) కావాలని వారి ఉద్దేశ్యం కాబోలు.

16, సెప్టెంబర్ 2007, ఆదివారం

ఇంటర్నెట్లో తెలుగు లోతెంత?

10 కామెంట్‌లు
ఓ మూడేళ్ళ కిందటి దాకా నెట్లో తెలుగు అనేది ఉందనే నాకు తెలియదు. ఏ పని చేసినా ఇంగ్లీషులోనే చెయ్యడం. కంప్యూటరుకు తెలుగు నేర్పొచ్చని, తెలుగులో సుబ్బరంగా రాయొచ్చని ఎప్పుడైతే తెలిసిందో.. ఇక నేను ఆ వచ్చీరాని ఇంగ్లీషు రాయడం మానేసాను. తెలుగులోనే అన్నీ!

ఇవ్వాళ తెలుగులోనే ఉండే సైట్లు బోలెడన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని నా జీవితంలో భాగమైపోయాయి. భుక్తి కోసం నేను చేసే పనులు ఇవ్వని ఆత్మ తృప్తి ఆయా సైట్లలో నేను చేసే పనులు నాకిచ్చాయి.

నాకు అన్నిటి కంటే ముందు పరిచయమైన తెలుగు సైటు వికీపీడియా! తెలుగు విజ్ఞానసర్వస్వం - ఎన్‌సైక్లోపీడియా. తెలుగులో ఉన్న ఆ సైటు చూసి నాకు మూర్ఛపోయినంత పనైంది. ఎంతో స్వేచ్ఛ ఉంది అక్కడ! అక్కడ ఎవరైనా రాయొచ్చు కూడా. వెంటనే రాయడం మొదలుపెట్టాను. అప్పటికే ఉన్న సభ్యులు - ముఖ్యంగా రవి వైజాసత్య, నాకు ఎంతో సాయపడ్డారు. ఆయన నాకు వికీ గురువు! ఇప్పుడంటే వికీలో చేరేవారికి సాయం చేసేందుకు అక్కడ ఎంతో మంది ఉన్నారు గానీ, ఆ రోజుల్లో రవి ఒక్కడే వికీకంతటికీ! అసలు ఇప్పటి వికీ స్వరూపం చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతింతై, వటుడింతయై అన్నట్టు పెరిగిపోతోంది. రవితో పాటు, ప్రదీప్, కాజ సుధాకరబాబు, నవీన్ వంటి ఎందరో సభ్యులు వికీని పరుగులు పెట్టిస్తున్నారు. అక్కడ నేనూ రాస్తాను. నెట్లో నేను చేసే పనులన్నిటిలోకీ నాకు బాగా ఇష్టమైనది ఇదే, నా బ్లాగు కంటే కూడా! ప్రతి తెలుగువాడూ చూసి తీరాల్సిన, రాసి తీరాల్సిన సైటు ఇది.


బ్లాగులు చూడండి.. చక్కటి తెలుగులో ఉండడమే కాదు వాటి గొప్పదనం.., చక్కటి భావాలతో, మంచి భాషతో, వైవిధ్యమైన విషయాలతో మనలను అలరిస్తూ ఉంటాయి. ఈనాడు, జ్యోతి వగైరా పేపర్లు చదువుతాం. ఎన్ని చదివినా అవే వార్తలు, అవే కబుర్లు. విశ్లేషణలు మాత్రం కొద్దిగా భిన్నంగా ఉంటాయి. కానీ..

కంద పద్యం గురించి, కర్ణాటక సంగీత మాధుర్యం గురించి, రాయలసీమ వ్యావహారికంలో చిన్ననాటి కథలు, విశేషాలు, విదేశాల కబుర్లు, నిజమైన, నిష్పాక్షికమైన సినిమా సమీక్షలు, కడుపుబ్బ నవ్వించే గల్పికలు, నిర్మొహమాటంగా ఉండే రాజకీయ విశ్లేషణలు, వంటలు, సామాజిక సమస్యలు మొదలైన వాటిపై వ్యాసాలు.. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? సమకాలీనమైన ఈ విశేషాలు మనబోటి సామాన్యుడి మాటల్లో ఎక్కడ చూడగలం? బ్లాగుల్లో చూడగలం! అసలు మన పత్రికలపైనా, టీవీల పైనా, సినిమాల పైనా నిష్పాక్షికమైన విమర్శ కావాలంటే బ్లాగులు చూడాల్సిందే! మరోచోట దొరకవు. ఎవరైనా, ఏ విషయం గురించైనా రాయగలగడమే ఈ బ్లాగుల విశిష్టత! ఈ పేజీకి ఎడమ పక్కన ఉన్న బ్లాగుల లింకులకెళ్ళి చూస్తే, బ్లాగుల గురించి నేను చెప్పింది బహు తక్కువని తెలిసిపోతుంది. కూడలికి వెళ్తే బ్లాగుల పూర్తి జాబితా చూడవచ్చు.

వికీకి, బ్లాగులకు, ఆమాటకొస్తే తెలుగును ఇంటర్నెట్ వ్యాప్తం చెయ్యడానికి దోహదం చేసినవి కొన్నున్నాయి. తెలుగు నెజ్జనులకు అవి ప్రాతఃస్మరణీయాలు. ఓసారి బ్లాగుముఖంగా వాటిని స్మరించుకుంటాను.
  • తెలుగుబ్లాగు గూగుల్ గుంపు (http://groups.google.com/group/telugublog) నెట్లో తెలుగు అభివృద్ధికి దోహదపడిన అత్యుత్తమ స్థలం ఏదన్నా ఉందీ అంటే.. అది ఇదే
  • లేఖిని (http://lekhini.org) తెలుగులో రాయడానికి ఇంతకంటే సులభమైన సైటు ఇంకా రాలేదు.
  • పద్మ (http://geocities.com/vnagarjuna/padma.html) నేను తెలుగులో రాయడం సాధన చేసిందిక్కడే. లేఖిని వచ్చాక, వెనకబడింది.
  • కూడలి (http://koodali.org) మొత్తం బ్లాగుల కబుర్లన్నీ ఇక్కడ చూడొచ్చు.
మొదటిదాని కర్త చావా కిరణ్ కూ, లేఖిని కూడలి ల కర్త వీవెన్ కు, పద్మను సృష్టించిన నాగార్జునకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలి. వీటిని పెంచి పోషించిన తెలుగువారికందరికీ అభినందనలూ తెలపాలి.

తరువాతి కాలంలో వెలసిన కిందిసైట్లు కూడా ఇతోధికంగా సేవ చేస్తున్నాయి.
  • తెలుగుబ్లాగర్స్ (http://www.telugubloggers.com)
  • తేనెగూడు (http://www.thenegoodu.com)
  • జల్లెడ (http://jalleda.com)
ఈనాడులోను, ఇతర పత్రికల్లోను వచ్చిన వ్యాసాలు ప్రజలను పై సైటుల వైపుకు పంపిస్తే తెలుగువారు తెలుగులో చదివేందుకు, రాసేందుకు పై సైటులు ఎంతో దోహదం చేసాయి.

కొత్తవారి కోసం
నెట్లో తెలుగుకు మీరు కొత్తవారైతే, అసలెక్కడ మొదలుపెట్టాలబ్బా అని అయోమయంగా ఉంటే తెలుగుబ్లాగు గూగుల్ గుంపుకు వెళ్ళండి. అక్కడి సభ్యులు మీకు దారి చూపిస్తారు. నేను పైన రాసిన విశేషాలు చాలా తక్కువ -సింధువులో బిందువంత! ఓసారి గుంపులో చేరాక, ఇంకా బోలెడు సంగతులు తెలుస్తాయి. అంతర్జాలానికే ప్రత్యేకించిన పత్రికల దగ్గరనుండి, తెలుగు భాష అభివృద్ధి కోసం మనవాళ్ళు పాటుపడుతున్నారన్న విషయం దాకా ఎన్నో విషయాలను మీరు చూడాల్సి ఉంది. ఆయా పనుల్లో మీరూ పాల్గొనాల్సి ఉంది. రండి!

16, నవంబర్ 2006, గురువారం

అనుకోకుండా, యాదృచ్ఛికంగా, కాకతాళీయంగా...

7 కామెంట్‌లు
జీవితంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరో కావాలని, మంచి ప్రణాళికాబద్ధంగా చేసినట్లుగా ఉంటాయి. కొన్ని సంతోషంతో గుండె ఝల్లుమనిపిస్తాయి, మరికొన్ని చెంప ఛెళ్ళుమనిపిస్తాయి. ఈ రెండో రకం యాదృచ్ఛికాలు బహు ప్రమాదకరమైనవి. ఏదో కాకతాళీయంగా జరిగాయిలే అని అనుకోకపోతే నిదరపట్టదు మనకు..

నా బ్లాగులోదే ఒక ఉదాహరణ రాస్తానిక్కడ..

"తెలుగు, ఆంధ్రం - కనకదుర్గ గారి అబద్ధాలు, దూషణలు" అనే నా గత జాబుకు కొన్ని స్పందనలు వచ్చాయి. వాటిలో మొదటి రెంటినీ చూద్దాం..
మొదటిది..
"చాలా బాగా వ్రాశారు, ఈ రచనతో కనకదుర్గ గారు మూర్ఖత్వానికి ఒక ఉదాహరణ అయ్యారు. అయినా ఆంధ్రజ్యోతి సంపాదకులు యధవలు కాబట్టె ఇలాంటి మూర్ఖుల రచనలు ప్రచురిస్తున్నారు."

ఇక రెండో వ్యాఖ్య చూడండి.

"అంధ్ర జ్యోతికి పంపండి. ఈ ప్రతిస్పందనను తప్పక అచ్చేసుకొంటారు." :-((

ఈ రెండు వ్యాఖ్యల్నీ ఒక్కసారే చూసాను. మొదటిది చూసాక సహజంగానే సమ్మగా అనిపించింది. రెండోది చూడగానే కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ రెండు స్పందనల మధ్య తేడా కేవలం రెండే నిమిషాలు కాబట్టి అవి కాకతాళీయంగా రాసిన వ్యాఖ్యలేనన్న విషయం అర్థమై, ఉపశమనం కలిగింది.

అందుకే నిదురపోగలిగాను రాత్రి.

23, ఆగస్టు 2006, బుధవారం

రావోయీ అనుకోని అతిథీ!

1 కామెంట్‌లు
ఒక విషయం గమనించారా? బ్లాగుస్పాటులో పైన లింకుల పట్టీలో చివరన ఉన్న NEXT BLOG అనే లింకును చూసారా? అది నొక్కితే అప్పుడే తాజాకరించిన బ్లాగు మనకు కనిపిస్తుంది. నేను స్టాటుకౌంటరు గణాంకాల్లో చూస్తూ ఉంటాను, ఏ సంబంధమూ లేని బ్లాగుల నుండి నా బ్లాగుకు లింకులు వస్తూ ఉంటాయి. గమనించగా తేలిందిది.. నా బ్లాగులో నేను కొత్త జాబు పెట్టీ పెట్టగానే వచ్చిన ఈ అనుకోని అతిథులు (తిథి లేకుండా వచ్చేవారే కదా అతిథులు) ఆ లింకు ద్వారానే వచ్చారని! వాళ్ళు తమ బ్లాగుల్లో NEXT BLOG నొక్కిన సమయానికి నేను నా బ్లాగును తాజాకరించి ఉంటాను. ఏదేమైనా మన బ్లాగుకు ట్రాఫిక్కు పెరుగుతోంది, సంతోషమే కదా!

అనుకోని అతిథీ! స్వాగతం!!

ఏంటి, మీకీ సంగతి తెలుసా!? అయినా పర్లేదు, నే రాస్తాను. నేను వికీపీడియా వాడిని.. ఏదీ చిన్న విషయం కాదు, తెలుసు కాబట్టి మనకది చిన్నది, తెలియని వారికి.. అది పెద్దదే, తెలుసుకోవలసిన విషయమే.

18, జులై 2006, మంగళవారం

ఏమిటీ తెలివితక్కువతనం!

0 కామెంట్‌లు
కేంద్ర ప్రభుత్వం బ్లాగ్‌స్పాటులోని 22 వెబ్‌సైట్లనో, 22 పేజీల వెబ్‌సైట్ల జాబితానో నిరోధించిందట! అయ్యెస్పీలేమో మొత్తం బ్లాగ్‌స్పాటుకే స్పాటు పెట్టారు.

అయినా ఇదేం చపలత్వం. ఆ సైట్లలో ఉన్న సమాచారం జనానికి చేరకూడదనుకుంటే ఇదా దానికి మార్గం? ఇప్పుడు ఆ వెబ్‌సైట్లేంటొ వెతుక్కుని మరీ చూస్తాం కదా! వాటికి లేనిపోని ప్రచారం కల్పించినట్లే కదా! ఇప్పుడేమయింది? ప్రపంచంలో మనం తప్ప అందరూ ఆ సైట్లను చూస్తారు. ఆ తప్పుడురాతలను (ఒకవేళ అవి తప్పుడు రాతలైతే) చదువుతారు. చదివి ఓహో అలాగా అనుకుంటారు. మనం చదివితే వాటిని సమర్ధవంతంగా ఖండించవచ్చు. చదివే అవకాశమే లేకుండా చేస్తిరి! మరి ఆ రాతలను ఖండించేదెవరు? మనం చదవకపోతే మనకే కదా నష్టం.

ఇదంతా ఒక ఎత్తు. ఇక ఇప్పుడు ప్రపంచంలోని ప్రతీ అణాకాణీ వెధవా మనకు సలహాలు ఇవ్వడం మొదలెడతాడు... "భారత్‌లో ఆలోచించే హక్కు లేదు, మాట్లాడే హక్కూ, రాసే హక్కూ లేవు, మెదళ్ళకు తాళాలేస్తున్నారు" అంటూ. మనల్ని మనం ఎన్నైనా తిట్టుకోవచ్చు, పైవాడికి ఆ అవకాశమిస్తే ఎట్లా?

(నాకో అనుమానం.. అధిష్ఠాన దేవుళ్ళు, దేవతల గురించి నిజాలు రాసిన సైట్లు గానీ కావుగదా ఇవి!)

16, జూన్ 2006, శుక్రవారం

జాబుల జాబితా

0 కామెంట్‌లు
ఈ బ్లాగులో నేను రాసిన జాబులు వరుసగా ఇక్కడ పేర్చాను. కొంతమేర వాటిని వర్గీకరించాను కూడా! పక్కన ఉన్న పాత బ్లాగులు లింకు ద్వారా వెళ్ళి బ్లాగులను వెతుక్కొనే కంటే ఇది తేలికని ఇలా రాసాను.

  1. నా గోడు (టీవీ చానెళ్ళు, భాష)
  2. వార్తల్లో విప్లవం - ఇందిరమ్మ టీవీ (రాజకీయాలు)
  3. కెరటాల కరణాలు (రాజకీయాలు)
  4. ఎవరికోసమీ శాసనమండలి? (రాజకీయాలు)
  5. భారతదేశం - SWOT విశ్లేషణ (సమాజం)
  6. హైకోర్టు ఆదేశాలు (రాజకీయాలు, సమాజం)
  7. తనికెళ్ళ భరణి ఇంటర్వ్యూ (ప్రజలు)
  8. సొంతడబ్బా (సమాజం, భాష)
  9. తెలుగురాష్ట్ర రాజధానిలో తెలుగు (భాష)
  10. గాయకుడు కారుణ్య (ప్రజలు)
  11. వీళ్ళు పోలీసులా ?!? (సమాజం)
  12. చందమామ గురించి (సమాజం)
  13. తెలుగు అమలు - ఇంటా బయటా (భాష)
  14. మీరేం చేస్తుంటారు? (సమాజం)
  15. జయహో ఇస్రో! (సమాజం)
  16. (పుస్తకాల) పురుగులొస్తున్నాయి జాగ్రత్త! (బ్లాగులు)
  17. పునరంకితం.. పునః పునరంకితం (రాజకీయాలు)
  18. బ్లాగు గణాంకాలు (బ్లాగులు)
  19. చతుర భక్తి, నిష్ఠుర భక్తి, ఎత్తిపొడుపు భక్తి.. (సాహిత్యం)
  20. ఒంటరిగా మనలేని మాటలు (భాష)
  21. రిజర్వేషాలు (రాజకీయాలు, సమాజం)
  22. మత మార్పిడి ఊపు మీద పోపు గారు (రాజకీయాలు, సమాజం)
  23. బ్లాగు గణాంకాలు - 2 (బ్లాగులు)
  24. వేగుచుక్క (ప్రజలు)
  25. టీవీ వాళ్ళకు, సినిమా వాళ్ళకు తగువైతే.. (టీవీ చానెళ్ళు)
  26. తెలంగాణ గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు.. (రాజకీయాలు)
  27. వినవచ్చిన వార్తలు, విన.. నొచ్చిన వార్తలు (సమాజం)
  28. బూదరాజు రాధాకృష్ణ అస్తమయం (ప్రజలు)
  29. వామపక్ష నాటకాలు (రాజకీయాలు)
  30. వర్డ్‌ప్రెస్సుకీ బ్లాగ్‌స్పాటుకీ పడదని తెలిసింది (బ్లాగులు)
  31. గూగుల్ ఎనలిటిక్స్ (సాంకేతికం)
  32. తెలుగు సినిమా హీరోలు, అభిమానులు, ఇతర పాత్రలూ (సినిమా)
  33. అవకాశవాదం - తిట్లకు మహదవకాశం (రాజకీయాలు)
  34. ప్రజా ప్రతినిధులపై ప్రజాసమీక్ష (రాజకీయాలు, సమాజం)

8, జూన్ 2006, గురువారం

గూగుల్ ఎనలిటిక్స్

1 కామెంట్‌లు
గూగుల్ ఎనలిటిక్స్! ఇది మరో గణాంకాల సైటు, గూగుల్‌ది. అయితే గణాంకాలకు మించి ఇందులో ఇంకా ఉంది.. ముఖ్యంగా విశ్లేషణ. ప్రస్తుతం నేను దాని పరిశీలనలో ఉన్నాను. బ్లాగర్లు, సొంత వెబ్‌సైట్లు కలవారు, వెబ్ మార్కెటింగులో అభిరుచి, ఆసక్తీ గలవారు దీన్ని చూడాలి. ఇప్పటికే గూగుల్ అడ్‌వర్డ్స్ ఎకౌంటున్న వారికి ఇది మరింత ఉపయోగమనుకుంటా!

ప్రస్తుతం ఇది పరీక్షల స్థాయిలో ఉంది. ముందు మన పేరును నమోదు చేసుకోవాలి. గూగుల్ తనకు తీరుబడి దొరికినపుడు మనకు అవకాశం ఇస్తూ ఓ మెయిలిస్తుంది (జీమెయిల్ విషయంలో కూడా కొత్తలో అలానే చేసింది). అప్పుడు మనం దాన్ని వాడుకోడం మొదలెట్టొచ్చు.

6, జూన్ 2006, మంగళవారం

వర్డ్‌ప్రెస్సుకీ బ్లాగ్‌స్పాటుకీ పడదని తెలిసింది

0 కామెంట్‌లు
వర్డ్‌ప్రెస్‌లో ఓ విశేషముంది. ఇతర బ్లాగుల్లోంచి దాన్లోకి బ్లాగులను దిగుమతి చేసుకోవచ్చు. సరే అక్కడ ఓ బ్లాగు తయారుచేసి బ్లాగ్‌స్పాటులోని నా బ్లాగుల్ని దిగుమతి చెయ్యబోయాను. ఒకే ఒక్క జాబు దిగుమతి అయింది, మిగతావి కాలేదు, ఎంచేతో! సరే వచ్చింది చాల్లే అనుకున్నా. తరువాత, ఇక్కడికి వచ్చి చూద్దునుగదా.. బ్లాగు ఆకారమంతా (ఫార్మాటింగు) చెడిపోయింది. బొద్దక్షరాలూ, ఇటాలిక్సూ, లైను బ్రేకులూ ఏమీ లేవు. సరిచెయ్యబోతే ఒప్పుకోవడంలేదీ బ్లాగరు! సెట్టింగుల్లోకి వెళ్ళి లైను బ్రేకులను తిరగదోడాను, దాంతో ఓ రూపుకొచ్చింది.


వర్డ్‌ప్రెస్సుకీ బ్లాగ్‌స్పాటుకీ పడదు గామోసు! వర్డ్‌ప్రెస్సు వాడొచ్చి బ్లాగ్‌స్పాటులో బ్లాగుల్ని లాక్కోబోతే వీడూరుకుంటాడా మరి! తన బంగారు పుట్టలో వేలెడితే చీమే ఊరుకోదు!! కాబట్టి, మీరూ ఈ దిగుమతి వ్యవహారం చెయ్యదలిస్తే.. జాగ్రత్త సుమా!

25, మే 2006, గురువారం

బ్లాగు గణాంకాలు - 2

6 కామెంట్‌లు
మన బ్లాగును ఎంతమంది చూస్తున్నారు, ఎవరెవరు చూస్తున్నారో తెలుసుకోడం బానే ఉంటుంది. అయితే, దీనితో ఓ సమస్య కూడా ఉంది.. మన బ్లాగును పెద్దగా ఎవరూ చూడటం లేదని కూడా తెలుస్తుంది. దానితో నీరసం వచ్చే అవకాశమూ ఉంది. చూస్తే చూస్తారు, లేపోతే లేదు, నాకేంటి.. నా రాతలు నే రాస్తాను, నా కూతలు నే కూస్తాను అనుకునే నాబోంట్లకు ఇదో లెక్కలోది కాదనుకోండి.

స్టాట్‌కౌంటరు అనే గణాంకాల సైటు పెర్ఫార్మెన్సింగు కంటే బాగుంది. ఇదీ ఉచితమే, ఇదీ అదృశ్యంగానే పనిచేస్తుంది.

16, మే 2006, మంగళవారం

బ్లాగు గణాంకాలు

3 కామెంట్‌లు
మీ బ్లాగుకు ఎంతమంది వస్తున్నారు, కొత్తవాళ్ళెందరు, మళ్ళీ మళ్ళీ వచ్చేదెంతమంది, ఎక్కడెక్కడి నుండి వస్తున్నారు.. ఇట్లాంటి విషయాలు తెలియాలంటే http://performancing.com/చూడండి.

ఇది ఉచితం, బ్లాగు పేజీలో ఎక్కడా ఏమీ కనపడదు, మీ గణాంకాలు మీకే పరిమితం! ఓ చూపు చూడొచ్చు.., వాడొచ్చు. నేను వాడుతున్నాను.

సంబంధిత టపాలు