27, మార్చి 2006, సోమవారం

తెలుగురాష్ట్ర రాజధానిలో తెలుగు

తెలుగు భాషకు ప్రాచీనత కావాలని కేంద్రాన్ని కోరతాం, కేంద్రంపై వత్తిడి తెస్తాం అంటోంది, ప్రభుత్వం. అయితే భాష పరంగా తాను స్వయంగా చెయ్యగలిగిన పనులను పక్కనబెట్టింది. హైదరాబాదులో తెలుగు వాడుక ఉండేకొద్దీ తగ్గిపోతోంది. దీనిపై బ్లాగుల్లో రాస్తున్నారు. వాటిని ఇక్కడ చూడొచ్చు.

ఈ విషయమై మన మంత్రులకు మెయిళ్ళు పంపాలనే ప్రతిపాదన వచ్చింది.
మన మంత్రుల అడ్ర్రసులు ఇక్కడున్నాయి: http://www.aponline.gov.in/apportal/contact/contacthome.html
నా వంతుగా నేనూ మెయిళ్ళు పంపుతూ ప్రభుత్వానికి ఇక్కడ ఓ బహిరంగలేఖ రాసాను.
*****
తెలుగు భాషకు ప్రాచీనత కావాలని కేంద్రాన్ని కోరతాం, కేంద్రంపై వత్తిడి తెస్తాం అంటున్నారు. అసలు ఈ రెండేళ్ళ్ళలో భాషకు సంబంధించి మీరు చేసిన అభివృద్ధి ఏమిటి? (వెతక్కండి.., ఏమీ లేదులే!) అయితే, ఇదిగో ఇది చేసాం అని చెప్పుకోడానికి ఇప్పుడో మహత్తర అవకాశం!

మన రాజధానిలో ఏ మూలకెళ్ళి చూసినా ఇంగ్లీషులో బోర్డులే! తెలుగు బోర్డే కనపడదు. ప్రభుత్వ కార్యాలయాలు, ట్రాఫిక్కు సూచికలు.., ఏదీ తెలుగులో లేదు. సచివాలయం పేరు తెలుగులో లేదని పత్రికలు వేలెత్తి చూపించిన పరిస్థితి. కొన్ని సాక్ష్యాలివిగో.. ఈ ఫోటోలు చూడండి. (పీవీఎస్సెస్ శ్రీహర్ష గారు తీసినవి). ఇవి కేవలం మచ్చుకే!

దయచేసి బోర్డులను తెలుగులో రాయించండి. హైదరాబాదు అంతర్జాతీయ నగరంగా మారుతోంది.. బోర్డులు ఇంగ్లీషులోనే ఉండాలి కదా అనే తెలివితక్కువ వాదనను మీరూ చెయ్యొద్దు. మన రాజధానికి వచ్చిన ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశస్థులూ మన వ్యవహారం చూసి ఆశ్చర్యపోతున్నారు (నవ్వుకుంటున్నారేమో కూడా). ఎందుకంటే వాళ్ళ ఊళ్ళలో ఇలా ఉండదు మరి. ఎవరి భాషలో వాళ్ళు రాసుకుంటారు. తెలుగుపై అభిమానం లేకపోయినా పరాయోడి ముందు తేలిక కాకూడదన్న ఇంగితంతో నన్నా ఈ పని చెయ్యండి.
****

1 కామెంట్‌:

  1. చాలా బాగా చెప్పారు గురుగారు...మన వాళ్ళు ఎప్పుడు కళ్ళు తెరుస్తారో కాని....

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు