(ఈనాడులో వార్త ఆధారంగా)
కొందరుంటారు, ఒకటనుకుంటే అది సాధించేదాకా వదలరు. ఎన్ని కష్టాలెదురైనా వెనక్కి తిరగరు. మిన్నూ మన్నూ ఏకం చేసైనా తామనుకున్నది సాధిస్తారు. చుట్టూ ఉన్నవారికి వేగుచుక్క లాగా నిలుస్తారు.
అదుగో అటువంటి వ్యక్తే .. పాతికేళ్ళ శిష్టా (శిష్ట్లా?) వివేక్ విక్రమ్.పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరు ఈయన సొంతూరు.
ఇంటరు చదివేటపుడే ప్రమాదంలో తండ్రి మరణం..
అదే ప్రమాదంలో తనకు తగిలిన గాయాల కారణంగా 9 నెలలు పడక.
ఇంటరులో ఫస్టుక్లాసు
తండ్రి ఛీఫ్ మేనేజరుగా పనిచేసిన బ్యాంకులోనే దాదాపు ప్యూను స్థాయి ఉద్యోగంలో చేరిక
ఉద్యోగం చేస్తూనే బీకాం చదివి, ఇప్పుడు ఐ.ఐ.ఎం కలకత్తాలో చేరబోతున్నాడు
తన పెదనాన్న గారి అబ్బాయి లక్నో ఐ.ఐ.ఎం లో పట్టా తీసుకోడం చూసి అనుకున్నాడట, తనూ ఐ.ఐ.ఎం లో చదవాలని! అప్పుడు.. డిగ్రీ చదవడం మొదలెట్టి సాధించాడు! వివరాలను మే 26 నాటి ఈనాడులో చూడండి
ఐ.ఐ.ఎం లో సీటు రావడం కంటే.. ఇంటరు పూర్తి చెయ్యడమే తనకు మరపురానిది అని అంటున్నాడు, వివేక్
శభాష్ వివేక్!!
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు. మహాపురుషులౌతారు.
రిప్లయితొలగించండిపట్టుదలే ఉంటే మనిషి సాధించలేనిదిలేదు అని మనకు గుర్తుచేస్తూ మనల్ని ఉత్తేజితుల్ని చేస్తారు ఇలాంటి విజేతలు.