హుస్సేనుసాగరు కాలుష్యానికి కోస్తా, రాయలసీమ వాసులే కారణమట, నరేంద్ర గారు వాక్రుచ్చారు. వాళ్ళిక్కడికి వచ్చి, కాలనీలు కట్టుకుని, పరిశ్రమలు పెట్టుకుని కాలుష్యాన్ని, మాలిన్యాల్నీ సాగరులోకి పంపి దాన్ని కలుషితం చేసారట! సాగరు కాలుష్యానికి నగరీకరణ, పారిశ్రామికీకరణ కారణమనడంలో అవాస్తవమేమీ లేదు. కానీ దీనికి ఫలానా వాళ్ళే కారణమనడం.. అన్యాయం.
ఇంకా నయం.. ఆయన జుట్టు తెల్లబడటానికి కారణం కూడా వాళ్ళే ననలేదు.
అసలు సాగరు కాలుష్యానికి అందరి కంటే ఎక్కువ బాధ్యులైన ఓ నలుగురు వ్యక్తులను ఏరాల్సి వస్తే ఆ జాబితాలో ఖచ్చితంగా ఆయన గారుంటారు. వినాయక నిమజ్జనం సాగరులోనే చెయ్యాలని వాదించి, వేధించిన వారిలో వీరే కదా ప్రముఖులు!
(ఏమైతేనేం, కోర్టు ఈసారికి ఒప్పుకుంది, వచ్చే ఏటి నుండి ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పింది)
బాగా రాశారు.
రిప్లయితొలగించండిఈ వెధవలకి ఏదో ఒక సాకుతో రోషాలను రెచ్చగొడితే గానీ పబ్బం గడవదు. విషయాన్ని విషయంగా చూడక దానికి ప్రాంతీయ భేదాలో, బాషా బేదాలో, మత బేదాలో చూపిస్తారు. బీడీ కాల్చడానికి ఇల్లు తగలేస్తారు.
రిప్లయితొలగించండి-- ప్రసాద్
http://charasala.wordpress.com
సినిమా వ్యాపార ప్రకటనలో ఒక అమ్మాయి అంటుంది - శొభన ముహుర్తమా లేక పెళ్లి ముహుర్తమా అని.ఈ వ్యాసం శబ్ద కాలుష్యమా లేక జల కాలుష్యమా !
రిప్లయితొలగించండిరావు గారూ! వ్యాసాన్ని రాజకీయుడి మాటలపై గురిపెట్టాను గానీ సాగరు కాలుష్యంపై కాదు. ఆ మాటల కాలుష్యాన్ని ఎత్తి చూపిస్తూ శబ్ద కాలుష్యం అన్నాను.
రిప్లయితొలగించండి