19, మే 2007, శనివారం

మసీదులో బాంబు

మసీదులో బాంబు! గతంలో పోలీసు కమిషనరేటు మీద మానవ బాంబు దాడి జరిగిన తరువాత కొన్నాళ్ళకనుకుంటా.. పోలీసులు ఇద్దరు ముస్లిము కుర్రాళ్ళని అరెస్టు చేసారు. అందుకు నిరసనగా ముస్లిము ఆడవాళ్ళు గుంపులు గుంపులుగా కమిషనరేటు మీదకి దండెత్తి వచ్చి, నానా యాగీ చేసి పోయారు. వాళ్ళకి వాళ్ళ నాయకుల మద్దతు కూడా. అనుమానమ్మీద ముస్లిములను అరెస్టు చేస్తేనే అలా అల్లరి చేస్తే, మరి ఇళ్ళల్లో దాక్కున్న నేరస్తులను పట్టుకునేదెట్లా? ఇలాంటి ఘటనలను నివారించేదెట్లా? అంతెందుకు, మే 18 నాటి బాంబు దాడి తరువాత కూడా, మసీదు లోపలికి పోలీసులను రానివ్వలేదట అక్కడి జనం! ఎలాగో తోసుకుని లోపలికి వెళ్ళి చూస్తే మరో రెండు బాంబులు కనబడ్డాయి. వాటిని నిర్వీర్యం చేసారట పోలీసులు. రానివ్వలేదని వాళ్ళు వెళ్ళకపోయి ఉంటే అవీ పేలేయేమో! ఈ సంఘటనలో అనుమానితుడు షాహెద్‌ బిలాల్ అని పత్రికలు రాస్తున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మేలుకుని తగు చర్యలు తీసుకోవాలి. అయితే.. "కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు" మాత్రం చెయ్యకండి. అదో పెద్ద జోకైపోయింది. నీళ్ళ బిందెకి చిల్లు పడితే గచ్చు తడవకుండా బిందె చుట్టూ ఆనకట్ట కడతామా, బిందెకు మాటు వేయిస్తామా? భద్రతా ఏర్పాట్లు ఎంత దిట్టంగా చేసినా, టెర్రరిస్టుల్ని ఆపలేరు. దానికి ఒకటే మార్గం.. వాళ్ళను ఏరెయ్యాలి. ఏరేసేందుకు ఒకటే మార్గం.. అనుమానం ఉన్నచోట్ల భయం లేకుండా సోదాలు చెయ్యాలి. (ఔను, భయం లేకుండానే! పాత బస్తీలో కొన్ని చోట్లకి వెళ్ళేందుకు పోలీసులు భయపడతారు!) నిర్భయంగా తిరగ్గలిగే సౌకర్యం టెర్రరిస్టులకు కలిగిస్తూ ఇలాంటి సంఘటనలు జరక్కుండా "కట్టుదిట్టమైన ఏర్పాట్లు" చెయ్యడం, "షాంతి భద్రతలను కాపాడ్డం", చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే! అయితే ఇప్పటికే మనకు చేతులు చాలా సార్లు కాలాయి. సాయిబాబా గుడి, పోలీసు కమిషనరేటు, నల్గొండ, నిజామాబాదు, ఆజం ఘోరీ, ముజీబులు, నజీరులు, వజీరులూ .. ఈ కథలన్నీ వింటూనే ఉన్నాం. అయినా "కట్టుదిట్టమైన.." చెయ్యడంతోటే సరిపెడుతున్నాం.

ప్రభుత్వమా! చేతులు కాదు, ఇల్లంటుకుంటోంది, కళ్ళు తెరువ్!

మధ్యాహ్నం 1:20 కి బాంబులు పేలాయి. మూడింటికి మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో విలేకరులకు ఇలా చెప్పారట.. "రాష్ట్రంలోను, హైదరాబాదులోను జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్ర చేసి ఈ బాంబులు పేల్చార"ట!! ముఖ్యమంత్రి హాస్యప్రియుడు, పైగా స్థితప్రజ్ఞుడు, అందునా మొక్కవోని ధైర్యసాహసాలున్నవాడు. అందుకే.., విషాదంలోనూ హాస్యాన్ని పిండుతున్నాడు. పనిలోపని, టెర్రరిస్టులు కూడా అసూయపడేటంత అభివృద్ధి చేస్తున్నానని యావజ్జాతికీ చెప్పుకున్నాడు! శభాష్!!

4 కామెంట్‌లు:

  1. నాణేనికి అటువైపున కూడా ఉన్నది:

    మన పోలీసులకు పూర్తి పవర్ ఇస్తే భూటకపు ఎంకౌంటర్లు, అనవసరపు ఆత్మహత్యలు.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది. 'పరిస్థితులని అదుపులోకి తీసుకోవడం' మర్చిపోయారు. నిన్న ఒక వార్త చదివా-పరిస్థితులని అదుపులోకి తీసుకోవడానికి మంత్రులు, పోలీసులు వెళ్ళారని. అంటే ఏమిటో? మీరన్నట్టు క్రిమినల్స్ కి మతం ఏమిటీ? మన రాతలు రాసినవాడే మనకి గతి.
    ఒరేమునా గారూ, మీరు చెప్పినదే -మానవహక్కులని చాలామంది అంటారు. టెర్రరిజం బాధితులు కూడా మానవులే కదా. రేపిష్టుకి ఉరితీయడానికి పెద్దగా ఆలోచించం, కాని టెర్రరిష్టు ఏక్టివిటీలో నిందితులకి శిక్షవేయాలంటే ఎంతోమందికి జవాబుదారీ వహించాల్సి వస్తోంది.

    రిప్లయితొలగించండి
  3. పాపం పోలీసులు :(,అసలు కొన్ని వాదనలు వింటే చాలా బాదకలుగు తుంది,మెన్న నా ముస్లీం మిత్రుడు చెప్పాడు ఇవి కేవలం బయపెట్టటాని కట , అసలు వీరు తలచుకోంటే తిరుపతి/మక్కా మసీదు ని కూడా నామరూపాలు లెకుండా చేయగలరుట, తిరుపతి మీదా !అమ్మో తదనంతరం జరిగే పరిమాణాలను నేను కలలో కూడా వూహించలేను

    రిప్లయితొలగించండి
  4. అవును భేషుగ్గా చేయగలరు, కానీ తరువాత ఉక్కు పాదంతో వారిని అణచి వేయవలసి వస్తుంది, అందుకే అంత తొందరపడరు సమయం వచ్చేంత వరకూ

    సమయం ఎవరిది అంటే ?


    36 strategies to war (టైటిల్ సరిగ్గ గుర్తు లేదు పుస్తకం ఇంట్లో ఉంటుంది, ఈ సారి ఖమ్మం వెళ్ళినప్పుడు చూసి చెపుతాను) అనో ఇంకేదో ఇటువంటి టైటిల్ ఉన్న పుస్తకం చాలా బాగుంటుంది ఒక్క సారి వీలుంటే చదవండి

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు