వీరేశలింగం పంతులు గారి గురించి, ఆయన సంఘ సంస్కరణ గురించి, సాహిత్య సేవ గురించి కొత్తగా మనం చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. కానీ కొత్తగా చెప్పుకోవాల్సింది మాత్రం ఆయన వారసత్వాన్ని మనమెలా కాపాడుకుంటున్నామనే దాని గురించి.
ఆగస్టు 26 మధ్యాహ్నం టీవీ9 వార్తల్లో దీని గురించి ఒక ప్రత్యేక వార్త చూసాను. ఆయన ఇల్లు ప్రస్తుతం ఒక ట్రస్టు అధీనంలో ఉంది. ప్రస్తుతం అది ఒక పేకాట గృహంగా మారిపోయిందట (టీవీ9 కెమెరాలో పడకుండా ఆ పేకాటరాయుళ్ళు ముఖాలు దాచుకోడం చూస్తే నవ్వొచ్చింది). ట్రస్టు అధిపతి మాత్రం ఇలా చెబుతున్నాడు..అక్కడ ఆటల ద్వారా వచ్చిన ఆదాయాన్ని, ఆ ఇంటి బాగోగులకే ఖర్చు పెడుతున్నారు. వీరేశలింగం పంతులుగారు కూడా పేకాట ఆడేవారు. - ఇలా చెప్పుకుంటూ పోయాడా పెద్దమనిషి. (ఏమిటో ఆసికాలు!)
ఇక మరో ముఖ్యమైన సంగతి ఏమిటంటే.. పంతులుగారు రాసిన ఎన్నో రచనలు ఓ మూలెక్కడో ఉన్నాయట. వాటి ఆలనా పాలనా చూసేవారు లేక పడి ఉన్నాయట. మన సాహిత్యాభిమానులు, నెట్లో తెలుగు బ్లాగరులూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం.. ఔత్సాహికులు పూనుకుని, వాటిని యూనికోడు లోకి ఎక్కిస్తే,, మనమో మంచి పని చేసినవారమౌతాం. మహాభారతం లాగానే ఇదీ ఓ మహత్కార్యం కాగలదు. ఏమంటారు?
parignanam ante naa uddesham lo vishaya parignanam ani technical kadu,nenu mee blog ke naa abhiprayalu post cheyyalanukontunnanu nenu rasedi appudappuadu kavuna naku sonthaga blog start chese alochana ledu nenu meeku mail chestanu danni meeru telugu lo translate chesi mee blog lo pettandi.naa email id sshanthikumar@gmail.com
రిప్లయితొలగించండి'సుమతీశతక స్ఫూర్తి ' కి సంబంధించిన మిగతా పోస్టింగులు కూడ on line చేశాను. చూడగలరు. 'తెలుగు జాతీయవాది 'బ్లాగు చూశాక నా సాహిత్య విమర్శలకి ఆ టైపు టెంప్లేట్ అయితే బాగా సూటవుతుందనిపించి టెంప్లేట్ కూడా మార్చాను. ఇది పొడవాటి పద్యాలకీ,print outs తీసుకోవడానికి, కాగితం పొదుపుకీ కూడా చాలా బావుంది.
రిప్లయితొలగించండి