........
- "ఆయన గుడ్డివాడు " - "ఆయన అంధుడు."
- "ఆమె చెవిటిది" - "ఆమె బధిరురాలు."
- "అతడు కుంటివాడు" - "అతడు వికలాంగుడు" (ఈ మాటను ఎక్కువగా కాలూ చేతులకే వాడుతూ ఉంటారు, అందుకే ఇక్కడ రాసాను)
- "అవిటివాళ్ళు" - వికలాంగులు
పై వాక్యాల్లో బొద్దుగా ఉన్నవి అచ్చ తెలుగు మాటలు. అచ్చ తెలుగు మాటలు వాడినపుడు మనకు అమర్యాదకరంగా తోస్తున్నాయి. ఎక్కిరించడానికీ, ఎటకారం చెయ్యడానికీ అవే మాటలు వాడడం వలన ఆ మాటలను ఎక్కడ వాడినా అమర్యాదే ధ్వనిస్తోందనుకుంటాను. ఇంగ్లీషులో సందర్భాన్ని బట్టి మాట విలువను అర్థం చేసుకునేలా ఉంటే బాగుండేదేమో! అలా లేకపోవడం వల్లనే, మర్యాదగా ధ్వనించాలంటే సంస్కృతం వాడాల్సి వసోంది.
ఇవి చూడండి:
- "చెవిటిదీ, గుడ్డిదీ అయిన ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే."
- "చెవిటీ, గుడ్డీ అయిన ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే."
- "బధిరురాలూ, అంధురాలూ అయిన ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే."
"చెవిటి వారూ, మూగ వారూ, గుడ్డి వారూ అయిన ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే." -నాకైతే కృతకంగా అనిపిస్తోందిది.
వికీలో చూస్తూ ఉంటాం.. (నేను రాస్తూ ఉంటాను కూడా) "ఆయన ఫలానా తేదీన జన్మించాడు, ఆమె ఫలానా చోట జన్మించింది" అంటూ. అవే వాక్యాలను "ఆయన ఫలానా తేదీన పుట్టాడు", "ఆమె ఫలానా చోట పుట్టింది" అని రాస్తే అంతగా నచ్చదు. మరీ ముఖ్యంగా ఆడవారి విషయంలో! (వికీలో ఇదివరలో ఒక చర్చ జరిగింది. సావిత్రి వ్యాసంలో అనుకుంటాను.. ఏకవచనంలో రాసారని అభ్యంతరం వచ్చింది -వికీ పద్ధతది, మరి! ఒక సభ్యునికి అది నచ్చలేదు, అమర్యాదకరంగా ఉందన్నారు.) అంతెందుకు, 'ఆడది' అనే మాట కూడా అమర్యాదకరమైనదే! స్త్రీ, మహిళ, వనిత ఇలాంటి అనేకానేక పేర్లు వాడొచ్చు కానీ 'ఆడది' వాడకూడదు!! 'ఆడవాళ్ళు' అనే మాట పర్లేదు మళ్ళీ.
చచ్చిపోయాడు, చచ్చిపోయింది అనే బదులు మరణించాడు, మరణించింది అని వాడుతూ ఉంటాం. అచ్చ తెలుగులో ఉండటం తప్పించి ఆ వాక్యాల్లో తప్పేమన్నా ఉందా!?
ఇలాంటివే ఇంకా ఎన్నో ఉండుంటాయి. ఇలాగ..
బ్రతుకు/బతుకు - జీవితం
బొక్క/చిల్లు/కంత - రంధ్రం
ఆమె ప్రసవించింది - గేదె ఈనింది. (ప్రసవించింది, ఈనింది లను అటూ ఇటూ మార్చి చూడండి.)
ప్రసవించింది అనే మాట కూడా ఎక్కడ వాడుతున్నాం లెండి, డెలివరీ అయింది అంటున్నాం గాని.
http://sameekshaclub.blogspot.com/2007/11/blog-post_27.html - ఈ జాబులో జరిగిన చర్చ చూసాక ఇది రాయాలనిపించింది. (నేనిది ఎవరిని ఉద్దేశించీ రాసింది కాదు. ఇది ఏ కొందరికో మాత్రమే పరిమితమైన విషయమూ కాదు. నాకూ అటువంటి భావనే ఉంది, దాదాపుగా అందరూ అలానే భావిస్తారనుకుంటా.)
పైవన్నీ ఒక స్థాయికి చెందినవి. మరికొన్ని మాటలుంటాయి.. వాటిని పలకడం కూడా అసభ్యతగా భావిస్తాం. (ట్యాబూ మాటలంటారేమో!) కొండొకచో బూతుమాటలు కూడా అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు..
ఉచ్చ/ఒంటేలు - మూత్రం
ఇక శరీర అవయవాల్లో కొన్నిటి పేర్లను అప్రాచ్యులు పలికినంత స్వేచ్ఛగా మనం పలకలేం. ఒకవేళ పలకాలంటే ఇంగ్లీషులో మాట్టాడ్డమో, లేదా సంస్కృతం చాటున దాక్కోవడమో చేస్తాం. ఉదాహరణకు చెప్పాల్సి వస్తే చాలానే ఉన్నాయి.. కానీ రాయలేను (చెబుతున్నాగా, తెలుగులో పలకాలంటే సభ్యతగా ఉండదన్న ఆలోచన! అసలీ జాబే దాని గురించి!!)
'చంక' అనే మాటను పలకడం కూడా కొందరు తప్పుగా భావిస్తారు!!
--------
'అంతా రాసావు బానే ఉందయా, ఇంతకీ ఇప్పుడు నువ్వనేదేంటి' అని మీరడిగితే..
"నా ఆలోచనలను రాసాను, అంతే. నేననేదేం లేదండి, మీరేమన్నా అంటే వింటాను." అని మాత్రం అంటాను.
ఉంటాను.
యూఫెమీజాలు ఏ భాషలోనైనా వుంటాయి లెండి.
రిప్లయితొలగించండినేను నిన్ననే ముండ లమీద.. err..
లంజ లమీద.. err..
వాడవదిన లమీద.. err..
భోగంవాళ్ల మీద .. err..
దారిక లమీద.. err..
వేశ్యాంగన లమీద.. err..
కళావతు లమీద.. err..
గణికల లమీద.. err..
భజిష్యల లమీద.. err..
రూపాజీవల లమీద.. err..
రోవెలది లమీద.. err..
వారకాంత లమీద.. err..
జారస్త్రీ లమీద.. err..
జారిణి లమీద.. err..
సారిణి లమీద ఒక టపా రాద్దామనుకున్నా. సరైన సభ్యమైన పదం దొరకక ఆగిపోయా...
chaalaa bavundandi ee post ...
రిప్లయితొలగించండిnaaku konni words telisaayi
చదువరి గారు,
రిప్లయితొలగించండిమీ ఆలోచనకి నా పొడిగింపు.
భాషను నిమ్నత్వాన్ని సూచించడానికి వాడుకోవడం పలు రకాలుగా జరుగుతంది. కాళిదాసు నాటకాలలో స్త్రీ పాత్రలకు, సేవకుల పాత్రలకు ప్రాకృతం వాడాడని విన్నాను. షేక్స్పియరు నాటకాలలో కూడా కొన్ని పాత్రలకు, కొన్నిటిలో బహుశా స్త్రీ పాత్రలకు కూడా భాష ద్వారా తరగతుల తేడాలు ( I meant claases - rich and poor and social importance) చూపించాడు. ఇక సినిమాలలో యాసలు వాడి పాత్రలను ఎక్కువ తక్కువలుగా చూపించడం తెలిసిందే.
సరే నా అభ్యంతరాన్ని విపులీకరిస్తాను. ఇంకోలా రాయగలుగుతారేమో ప్రయత్నించి చూద్దాం.
మీరు ఈ ప్రస్తావన తేవడం కూడా మంచిదయ్యింది. నేను ఓపిక లేక మళ్ళీ ఆ సంభాషణను కొనసాగించలేదు. ఇప్పుడు ఓపిక తెచ్చుకుని ప్రయత్నిస్తున్నాను.
నా అభ్యంతరం భాష పరంగా కొంత, పరిచయంలో ప్రాధాన్యత ఇచ్చిన అంశాల మీద మిగతాది అని నేననుకుంటున్నాను. హెలెన్ కెల్లెర్ తనకున్న విపరీతమైన పరిమితులను అతిక్రమించిన (I meant one who overcame) మనిషి. ఆమెను అవిటి తనం ప్రస్తావించి పరిచయం చెయ్యడం, అందునా ఆ విధంగా చెయ్యడం నాకు ఇబ్బంది కలిగించింది.
నిన్ననే ఒక పత్రికలో "మా ఆయనే బతికుంటే క్షురకుణ్ణి పిలుచుకొచ్చి వుండేవారుగదా" అని చూశాను - వాళ్ళు కుడా అచ్చతెలుగు వాడితే అమర్యాద అనుకున్నారేమో!
రిప్లయితొలగించండిఅవునండీ, మీరు వ్రాసిన విషయం ఆలోచించతగ్గది. బహుశః ఈదృష్ట్యానే ఇంగ్లీషువాళ్ళు handcapped బదులు challenged అని వాడుతున్నారు. హెలెన్ కిల్లర్ విషయంలో ఆవిడ అవిటితనాన్ని ప్రస్తావించడం అవసరం అనుకుంటా. కానీ ఒక చోట నే చదివిన వాక్యం చూడండి- కోమటి కులంలో పుట్టిన ఈయన (గాంధీ) మనకి స్వాతంత్య్రం తెచ్చాడు. ఇలా వ్రాయాల్సిన అవసరం ఏమాత్రం లేదు.
రిప్లయితొలగించండి"మా ఆయనే బతికుంటే క్షురకుణ్ణి పిలుచుకొచ్చి వుండేవారుగదా" సరైన సామెత కాదనుకుంటా. ఆయనే ఉంటే మంగలెందుకు అని ఉండాలి.
"చెవిటి, మూగ అంధురాలైన హెలెన్ కెల్లర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కాలేజీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందిన తొలి అంధ బాలిక ఈమె. "
రిప్లయితొలగించండిబదులుగా ఇలా రాయచ్చు కదా అని నా అభిప్రాయం (ఇంకా బాగా కూడా రాయచ్చు అచ్చ తెలుగులోనే అని కూడా నా అభిప్రాయం):
"హెలెన్ కెల్లర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకటి కాదు మూడు విధాలుగా అవిటి వారైనా, కాలేజీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందిన తొలి అంధ బాలిక ఈమె." ఏమంటారు?
హెలెన్ కెల్లర్ పేరే మనకి ఆమె అవిటితన్నాన్నీ, దాన్ని అధిగమించిన పట్టుదలనూ గుర్తు తెస్తాయి. అవిటి తనం ప్రస్తావిస్తూ పరిచయం చెయ్యడం అంత బాగాలేదని, ఆమె పరిచయానికి తగదనీ అనిపించింది.
ప్రసవానికి సమానార్థకాలు తెలుగులో రెండున్నాయండీ: మనుషులకు సంబంధించి "కనడం", పశువులకు "ఈనడం". తెలుగులో "ఆమె ప్రసవించింది" అనకపోయినా "ఆమెకు కాన్పు అయింది" అంటారు కదా?
రిప్లయితొలగించండిచంక: "బాహుమూల పాలిండ్ల రుచితో..." రొమ్ములను పాలిండ్లు అనగలిగిన కవి బాహుమూలాన్ని చంక అనలేకపోవడం చిత్రమే! :-)
కొన్ని పదాలకి రంగు, వాసన, రుచి పులిమినప్పుడు భాష కొత్తపదాలను సృష్టించుకొనే స్థితిలో ఉండాలి. లేదా వాటిని కడిగేసి తిరిగి వాడుకోవాలి.
రిప్లయితొలగించండిఆంగ్లములో gay, rubber మొదలైన చక్కని పదాల్ని stigmatize చేయటం వళ్ళ, ఇప్పుడు వాటిని వాటి అర్ధాల్లో వాడే అవకాశం లేదు. వాళ్ళకు ఇతర ప్రత్యామ్నాయ పదాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. మనకు లేవు కాబట్టి సంస్కృతము నుండి, ఆంగ్లము నుండి దిగుమతి చేసుకుంటున్నాం అని నా బుఱ్ఱకు తోచింది.
ఇప్పుడు ఇక్కడొక పీసీ (politically correctness) జాడ్యం అమెరికానీ పట్టిపీడిస్తోంది. అందుకే -challenged తో చాలా పదాలు సృష్టిస్తున్నారు. పొట్టివాన్ని పొట్టివాడు అనటానికి లేదాయె vertically challenged అని అనాలంటా. నల్లవాళ్ళని నల్లవాడని అనటానికి లేదాయె
colored people అనాలంటా
మహాశయా అంటే వెక్కిరింతయిపోయినట్లే మిగతావన్నీ కూడానూ... కానీ మరింత లోతుగా చర్చించవలసిన అవసరంమెంతైనా ఉన్నది..టపా చాలా విలువైనది.. కృతజ్ఞతలు.. కాదు కాదు.. నెనర్లు..
రిప్లయితొలగించండివెర్టికల్లీ చాలెంజ్‌డ్! :D మొదటి సారిగా వింటున్నానీ మాటను, రవి. నవ్వొచ్చిందామాట చదవగానే. నేను గత ఉద్యోగంలో ఉండగా మిత్రుడొకడు, చాన్నాళ్ళ తరవాత కలిసిన ఓ మిత్రుడితో అన్నాడు.. ఏం గురూ, ఎక్స్ యాక్సిస్ లో పెరిగిపోయావే, అని. (లావయ్యాడని) అది గుర్తొచ్చింది ఈ మాట విని.
రిప్లయితొలగించండిలలిత గారూ, భాషాపరమైన అభ్యంతరం మీ కొక్కరికే కాదు, చాలామందికి ఉంటుంది, నాకూ ఉంది. ఇక్కడ నేనన్నదదే!
రాకేశ్వర గారూ, ఇన్నున్నాయా!:)
అశ్విన్ గారూ! నెనర్లు
సుగాత్రి గారూ, సత్యసాయి గారూ! మీరన్నది నిజం. కొన్ని సామెతలను వాడలేని పరిస్థితి ఉంది ఇపుడు.
త్రివిక్రమ్ గారూ! :) ఛందానికి కుదరలేదేమో!
కృష్ణమోహన్ గారూ, నెనర్లు!
మంచి టపా, మీరన్నది అక్షరాలా నిజం కూడా..చంటి పిల్లల గురించి తల్లిదండ్రులు : మనవైపైతే కేక్ వెళ్ళింది/ వెళ్ళాడు..కొత్తగా అమెరికా వచ్చిన "వానబి"లైతే పూప్ చేసింది/చేసాడు అంటారు. "దొడ్డికి" అనడం నేనింతవరకు వినలేదు. (అది కూడా మవవాళ్ళు "మలవిసర్జన"కి కనిపెట్టిన మరుపదమే కదా?)
రిప్లయితొలగించండి"ముడ్డి" అనడానికి సిగ్గు బమ్మొ,బట్టో హంగు..
ఈ చర్చకు అంతముండదని నా అభిప్రాయం. మొన్నో సారి మా అఫీసులో ఎవరో అమ్మాయి pregnant అంటే మా భార్య అలా చెప్పడం కంటే she is in the family way అని అనడం మంచిదేమో కదా అంది. కానీ అలాంటి అవసరం ఏమీ లేదని నేను పట్టుపట్టి కూర్చున్నాను. కానీ తర్వాత ఆలోచిస్తే నాదే తప్పేమో అనిపించింది. "మా ఆవిడకు కడుపు రా" అనడంలోనూ "మా ఆవిడ నీళ్ళోసుకుంది" అనడంలోనూ, "మా ఆవిడ గర్బం దాల్చింది" అనడంలోనూ చాలా తేడా వుందని మనకనిపించినా అది మన గురించి ఇతరులు ఏమనుకుంటారో అనే దానిమిదే ఆధారపడుందేమో అనిపిస్తుంది. అలాగే ఒక వాక్యం వ్రాయడానికి, మాట్లాడడానికి కూడా చాలా తేడా వుంటుంది.
రిప్లయితొలగించండిచెప్పటం మరిచా, రాకేశ్వరుని వ్యాఖ్య అదిరింది..
రిప్లయితొలగించండిచదువరి గారు,
మీ టపాకి కొంచెం పక్కదోవ కానీ, నా పై వ్యాఖ్యకి పొడిగింపు ఇక్కడ ఉంచాను..
అచ్చ తెలుగు పదాలు గుండెల్లోకి నేరుగా బాణాల్లాగా దూసుకుపోతాయి. మన భావాల్ని ఉన్నవున్నట్లుగా ఏ భేషజాలూ లేకుండా నగ్నంగా ప్రదర్శిస్తాయి. వాటి అద్దంలో మనల్ని మనం చూసుకోవాలంటే మనకు జంకు, బిడియం. మనకు అంత పారదర్శకత ప్రాణాంతకం. అందుకని మనకూ పదమనే పెళ్ళికూతురికీ మధ్య ఒక పరాయిభాషా పరదా (కొన్నిసార్లు అది సంస్కృతం) అవసరమని మనం (తెలుగువాళ్ళం) అనుకుంటాం.
రిప్లయితొలగించండిఈ చర్చ నేను కళాశాలలో చదివే రోజుల్లో మిత్రులు చేసేవారు. మఱీ ఇంత నాజూగ్గా కాదనుకోండి. అయితే అప్పుడు ఇంకా చాలా పదాల గుఱించి చర్చించేవాళ్ళం.
సంత - మార్కెట్
దొర - ప్రభువు
తిర్నాల - ఉత్సవం
తిండి - భోజనం
నాట్యం - చిందు (గ్రాంథికపదం - గొండిలి)
లెంక - సైనికుడు
పడాలు - సైన్యాధిపతి
ఇలాగే ఎన్నో....