7, డిసెంబర్ 2006, గురువారం

మార్గదర్శి

మార్గదర్శిది తప్పని రిజర్వు బ్యాంకు తేల్చేసింది. అందులో డబ్బు పెట్టిన వారికి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేం లేకపోవచ్చు. కానీ, మార్గదర్శి నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసినట్లుగా ఋజువైంది. ఒకటీ రెండూ కాదు, 2200 కోట్ల రూపాయలు ప్రజల దగ్గరి నుండి సేకరించింది. నిబంధనలకు వ్యతిరేకంగా చెయ్యడం అనైతికతే కాదు, నేరం కూడా.

సేకరించిన డబ్బులను సకాలంలో తీర్చెయ్యాలని ఆదేశించింది, బానే ఉంది. కానీ అసలు సేకరించడం తప్పు గదా, దానిపై చర్యలేం తీసుకుంటుందో చూడాలి. అసలిన్నాళ్ళుగా ఈ విషయం బ్యాంకు దృష్టికి రాకపోవడమే ఆశ్చర్యం. ఇదివరలో ఒకాయనెవరో ఫిర్యాదు చేసారట కూడాను. అయినా చర్యలేం తీసుకోలేదు. అప్పుడెందుకు తీసుకోలేదు? అంతా మాయ, రాజకీయ మాయ.

ఒకటి మాత్రం వాస్తవం, మార్గదర్శి మన దగ్గరి నుండి డబ్బులు తీసుకోకూడదు. కానీ తీసుకున్నారు, తప్పు చేసారు. ఇంత ఇరకాటపు పరిస్థితుల్లో కూడా మార్గదర్శులు జోకులేసి, కామెడీ చేసారు చూడండి..
  • రిజర్వు బ్యాంకు వాళ్ళు 'ఏమయ్యా మీరు ఇలా డబ్బులు తీసుకోకూడదు కదా, ఎందుకు తీసుకున్నారు' అని అంటే 'సారీ, మాకు తెలియక చేసాం' అని అన్నారట. (మార్గదర్శికి మార్గం తెలియలేదు!!)
  • రిజర్వు బ్యాంకు మమ్మల్ని డిపాజిట్లు తీసుకోవద్దని ఆదేశించలేదు, సూచించారంతే అని అంటోంది మార్గదర్శి (దానికి బ్యాంకు వాళ్ళు.. సూచనో ఆదేశమో ఎలా అనుకుంటారో వాళ్ళిష్టం. దాన్ని మాత్రం పాటించాల్సిందే అని అన్నారట)

తన ఉద్దేశ్యం ఏదైనా, ఉండవల్లి చేసిన పని వలన ఒక తప్పు బయట పడింది. లేకపోతే బహుశా రిజర్వు బ్యాంకు రిజర్వుడు గానే ఉండి పోయేదేమో!

మరి, ఈనాడును నియంత్రించాలన్న కాంగీయుల కాంక్ష నెరవేరేనా!? అనుమానమే, రామోజీ గ్రూపు బయటి పెట్టుబడులను తీసుకోబోతోందని దట్స్ తెలుగు అంటోంది.

సామాన్యుడి కాంక్ష.. ఈటీవీలో సుమనోత్సాహాన్ని కూడా నియంత్రించే సంస్థ ఒకటుంటే బాగుంటుంది.

4 కామెంట్‌లు:

  1. ఈనాడు గ్రూపు సంస్థలు Public issue కి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. R.B.I. ఆదేశాలు మార్గదర్శిను పెద్దగా ఇబ్బంది పెట్టలేవు. కాబోతే రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులు చెయ్యాలనుకొంటే (State act of protection for depositors) మార్గదర్శికి తిప్పలే. కాని ప్రజల సానుభూతి ఈనాడువైపే ఉంటుంది. Snap ఎక్కడ ఉన్నది? Snap ఎక్కడ ఉన్నది? ఎంతవెదికినా కనపడదే అది? ఎన్ని చుట్లు తిరిగినా కనపడదెందుకని?

    రిప్లయితొలగించండి
  2. maa uuriloa caala mamdiki margadarsiloa dabbulu vunnayi.amdaru caalaa dhiimaga vunnaru.cinna tappu vumdani telisinaa hadavudi padipoaye viileenaa imta dhairayam ga vunnadi ani naku chala aschryam anipimchimdi.emayitene prajalaku maatram eenadu grupula miida full nammakam vumdi ani maatram telustumdi.

    రిప్లయితొలగించండి
  3. స్నాపు గురించి నేనేమీ రాయలేదండి. దాన్ని నా సైటులో పెట్టానంతే! "చూడాల్సిన బ్లాగులు" కింద ఉన్న బ్లాగుల్లో ఏదో ఒక దానిపై వేలు పెట్టండి.. బుళుక్కున బుడగ ప్రత్యక్షమౌతుంది. అదే స్నాపంటే!

    రిప్లయితొలగించండి
  4. Margadarsi emoa gaani....
    ee E tv maatram nikrustapu serials,programmu latoa kampu kodutonadi...
    ee madhya Suman ki toaduga Prabhakar ani okadu chearadu..E tv loa aithe Suman serail leka pote eeyani gaari programme...
    maha prabhoa bharincha leakunnamu..!

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు