25, మే 2006, గురువారం

బ్లాగు గణాంకాలు - 2

మన బ్లాగును ఎంతమంది చూస్తున్నారు, ఎవరెవరు చూస్తున్నారో తెలుసుకోడం బానే ఉంటుంది. అయితే, దీనితో ఓ సమస్య కూడా ఉంది.. మన బ్లాగును పెద్దగా ఎవరూ చూడటం లేదని కూడా తెలుస్తుంది. దానితో నీరసం వచ్చే అవకాశమూ ఉంది. చూస్తే చూస్తారు, లేపోతే లేదు, నాకేంటి.. నా రాతలు నే రాస్తాను, నా కూతలు నే కూస్తాను అనుకునే నాబోంట్లకు ఇదో లెక్కలోది కాదనుకోండి.

స్టాట్‌కౌంటరు అనే గణాంకాల సైటు పెర్ఫార్మెన్సింగు కంటే బాగుంది. ఇదీ ఉచితమే, ఇదీ అదృశ్యంగానే పనిచేస్తుంది.

6 కామెంట్‌లు:

  1. నాలాంటి వారు కొందరు బద్దకస్తులు సైటుకు రాకుండానే RSS Feeds ద్వారా మీరు రాసేవి చదువుతుంటారు. మీ గణాంకాల సైటు చూపించేవారి కంటే ఎక్కువమంది మీ బ్లాగును చదువుతూ ఉంటారు కాబట్టి మీ గణాంకాలను చూసి బాద పడక్కర్లేదు.

    రిప్లయితొలగించండి
  2. స్టాట్‌కౌంటరు నిజంగానే చాలా బాగుందండీ. మీ పోస్టు చూసి గత రెండు రోజులుగా నేనూ వాడుతున్నాను. నిజంగానే మీరు చిన్నపాటి పరిశోధన చేస్తున్నట్లుంది వీటి మీద!

    రిప్లయితొలగించండి
  3. అవును రమణా, మీరన్నది నిజం. మీ ప్రోత్సాహపు మాటలకు థాంక్స్.

    ఔనౌను త్రివిక్రం, ఓ రకంగా.., పరిశోధనే!

    రిప్లయితొలగించండి
  4. I say briefly: Best! Useful information. Good job guys.
    »

    రిప్లయితొలగించండి
  5. Your are Nice. And so is your site! Maybe you need some more pictures. Will return in the near future.
    »

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు