9, అక్టోబర్ 2007, మంగళవారం

ఎవరెవరి సంపాదనలెంతెంత?

నాయకుడు, ప్రతినాయకుడుల సంపాదనలు ఎవరెవరివి ఎంతెంతో తేల్చడానికి విచారణ కమిషను వేసేందుకు సిద్ధమట! ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. మంచిది. ఏం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారో చెబితే సుఖమేముంది? చేస్తే గదా ప్రయోజనం!?

కాబట్టి ముఖ్యమంత్రి గారూ! వెంటనే ఆ కమిషనేదో వెయ్యండి. మీరిద్దరేగాదు, రాజకీయులంతా ఎవరెవరు ఎంతెంత మెక్కారో తేల్చండి.

మీరిద్దరూ అవినీతిపరులని తేలిందనుకోండి.. మీ సొమ్ములు గుంజేసుకుంటే ఒక్క గజం భూమి కూడా అమ్మకుండా మొత్తం ప్రాజెక్టులన్నిటినీ కట్టి పారెయ్యొచ్చు. (మీరే చెప్పుకున్న మీమీ ఆస్తుల వివరాలను బట్టి చెబుతున్నాను) మాకు రెండిందాలా లాభం.. మీరు కొట్టేసిన మా డబ్బులు మాకు తిరిగొచ్చేస్తాయి. మిమ్మల్నెలాగూ జైల్లో తోసేస్తారు కాబట్టి మాకు మీ పీడ విరగడౌతుంది. ఇంకో లాభం కూడా ఉంది.. మీ గతి చూసాక మీ తరవాత వచ్చేవాళ్ళు మీలాగా బరి తెగించరు.

అలాకాక, మీరు అవినీతిపరులు గాదనీ, స్వచ్ఛమైన తెల్ల చొక్కాల్లాంటి వాళ్ళనీ తేలిందనుకోండి.. మా ఖర్మ ఇంతేలే అని సరిపెట్టుకుంటాం. ఎన్ని దర్యాప్తు ప్రహసనాలు చూళ్ళేదు గనక!

7 కామెంట్‌లు:

  1. అహా! ఏమి మన భాగ్యము, చదువరి గారి మాట చలువతో ఇదే కనుక జరిగితే.. మన తెలుగువాళ్ళు అందరికీ ఉంటుది, నెత్తిన ఓ బంగారు కిరీటం.
    -

    రిప్లయితొలగించండి
  2. చదువరి గారూ, కమీషన్ నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇస్తే చూసి తట్టుకోగల గుండెధైర్యం ఉందా మనకి? అజ్ఞానం కన్నా ఆనందం లేదు గొర్రెదాటు జనానికి.
    -నేనుసైతం

    రిప్లయితొలగించండి
  3. నాలాగే మీక్కూడా రాజకీయాల మీద ఆసక్తి ఉంది కాబట్టి చెబుతున్నాను. ఇంతకు ముందు రానారె బ్లాగులో చెప్పాను. ఆదివారం రాత్రి 9:00కు ఈటీవీ2లో "మాయాబజార్" అనే కార్యక్రమం వస్తుంది తప్పక చూడండి.అది ప్రస్తుత రాజకీయాలపై విసుర్లతో, సెటైర్లతో నిండి ఉంటుంది. శనివారం ప్రొద్దున్నె 11:30కు మళ్ళీ వేస్తాడు. ఇందులో రాజకీయ నాయకులను నేరుగా అనకుండా మారుపేర్లు పెట్టి ఏకిపారేస్తాడు..ఉదాహరణకు

    పంచెకట్టు భక్తవత్సలం = రాజశేఖరరెడ్డి
    అమ్మతల్లి = సోనియా గాంధీ
    గొడ్డలి పార్టీ = టీఆరెస్స్
    బాణం పార్టీ = భాజాపా
    జనం పార్టీ = కాంగ్రెస్సు

    ఇలాగన్న మాట

    రిప్లయితొలగించండి
  4. చదువరి బ్లాగు mast head ఆకర్షణీయంగా లేదు.

    రిప్లయితొలగించండి
  5. అందరికీ నెనరులు. నవీన్ గారూ, అదొచ్చిన కొత్తలో చూసేవాణ్ణి. తరవాత మానేసాను. ఈటీవీ వాడి మిగతా కార్యక్రమాల్లాగే ఇది కూడా మొద్దుగా ఉండేది. సహకమైన వ్యంగ్యం ఉన్నట్టనిపించేది కాదు. కొన్ని బానే ఉండేవి లెండి -ముఖ్యంగా ఎర్రబాబులపై రాసిన వ్యంగ్యాస్త్రాలు నాకు నచ్చినవాటిలో కొన్ని. ఇక చూస్తాను. నెనరులు

    రిప్లయితొలగించండి
  6. Chaduvari garu and friends

    There is surely a light at the end of the tunnel visible.

    I think Lok Satta Party will save us from this murky political culture.

    I have visited the party website, www.loksatta.org. It indeed ushers in a New Political Culture.

    The party is about the common man and it aims to make politics and revolve around the citizen.

    Please also visit

    www.jayaprakashnarayan.blogspot.com
    www.loksattaparty.blogspot.com

    Lok Satta Party has launched a website to fight corruption. The URL is

    www.combatcorruptionindia.org

    Do check out and tell your frieds that there is hope.

    Regards
    Amar

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు