---------------
ముఖ్యమంత్రి "ఉప్పూ కారం తింటున్నాను కాబట్టి ఊరుకోలేకపోయాను" అన్నాడు. ('లక్షాధికారియైన లవణమన్నమె గాని మెరుగు బంగారమ్ము మింగబోడు ' గదా!) ఆయనన్న మాటలని అలాగే తీసుకోవాలి. అంతేగాని, ఇంగ్లీషోడన్నట్టు చిటికెడు ఉప్పు జల్లి సేవిస్తే అపార్థాలు గోచరిస్తాయి. నేను ఇక్కడ కవి హృదయాన్ని ఆవిష్కరించదలచాను..
చంద్రబాబు ఉప్పూ కారాలు మానేసి చాన్నాళ్ళయింది. అంటే ఖచ్చితంగా కాదుగానీ, సాత్వికాహారం, అందునా మితంగా తినడం, యోగాసనాలు వెయ్యడం, ఆయన అలవాటు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చమత్కరించాడన్నమాట! "ఉప్పూ కారం తినకే నువ్వలా ఐపోయావు", "నీలాగా నేను చేవ చచ్చిన వాణ్ణి కాదు", ఇలాంటి తాత్పర్యాలు లాగొచ్చు ఆ మాటల నుండి. ఒక్ఖ మాటలో లక్ష బూతులన్న మాట.
అయినా, 'తమలపాకుతో నువ్వొకటంటే తలుపుచెక్కతో నేరెండంటా' అనే మనిషిని నెమలి ఈకతో కూడా కెలక్కూడదు. చంద్రబాబుకు అదింకా అర్థం కాలేదెందుకో!? లేక.. తిట్టించుకుని సానుభూతి కొట్టేద్దామని, పనిలో పనిగా ముఖ్యమంత్రి దురుసుతనాన్ని బజారుకీడుద్దామని ప్రయత్నమా? ఏమో చెప్పలేం..
రాజకీయులు.. దేనికైనా వెనుదీయరు గదా!
------
పెద్దల సభలో గలభా!
ఈ ముక్క రాసినందుకే శాసనమండలి ఈనాడు సంపాదకుణ్ణి సభకు పిలిపించి మందలించాలని తీర్మానించింది ఒకప్పుడు. ఏడో తేదీన శాసన మండలిలో జరిగింది గలభా కాదు, _మ్..మీ అనొచ్చేమో!. (నేను పూర్తిగా చెప్పడం లేదు. ఒకవేళ వాళ్ళకు తెలిస్తే నన్నూ సభకు పిలిచి, బూతులు తిట్టే ప్రమాదం ఉంది. ఎవరితోటైనా పెట్టుకోవచ్చు గానీ చాలామంది రాజకీయ నాయకులతోటీ, కొన్ని పిచ్చి కుక్కలతోటీ అస్సలు పెట్టుకోకూడదు) అమ్మనాబూతులు తిట్టుకున్నారట, తోపులాటలో ఒక మంత్రికి చొక్కా చినిగిందట.
"మండలి వస్తే విద్యాధికులు, ఉపాధ్యాయులు వగైరా పెద్దమనుషులు సభకు వచ్చే అవకాశం ఉంటుంది, అర్థవంతమైన చర్చలు జరుగుతాయి." మండలి కావాలని కోరుతూ ఇలాంటి జోకులు చాలానే వేసారు, అప్పట్లో. న్యాయశాఖ మంత్రి హెచ్చార్ భరద్వాజ్ "మండలి కావాలనేది ఆంధ్రుల కోరిక, దాన్ని అడ్డుకుని వారి ఆకాంక్షలను తోసిపుచ్చకండి" అని పార్లమెంటులో ప్రతిపక్షాలకు చెబుతూ మొత్తం ఆంధ్రులందరి మీదా జోకాడు. ఇప్పుడు చూడండి, ఏం జరుగుతోందో!!
అయినా, వాళ్ళు మాత్రం ఉప్పూకారం తినడం లేదేటండి?
కనకపు సింహాసనమున
రిప్లయితొలగించండిశునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!
((సుమతీ శతకము నుండి)
ఇదేంటండీ బాబూ ! నాయుడుగారిని ప్రతినాయకుణ్ణి (విలన్‌ని) చేసి రాసేశారు ! ఆయన ప్రతిపక్షనాయకుడే గాని ప్రతినాయకుడు మాత్రం కాడు. అసలైన ప్రతినాయకుడు అవతలాయనే.
రిప్లయితొలగించండిబలే సెప్పారండీ :-)
రిప్లయితొలగించండిఏటేటీ, బాబు, మన బాబు, తినడం తగ్గించేసి ఆసనలేత్తన్నారా? ఆస్తా సానల్లో అగుపడ్డం లేదేటండీ, ఇడ్డూరంగా లేదూ? ఆవును మరి, పవుర్లో ఉన్నప్పుడు తెగతినెస్తే ఏవో జబ్బులొస్తాయటగద, అందుకే కొద్దిగ తగ్గించారెమో, మల్లీ పవుర్లోకొస్తే, తిండం మొదలెద్తార్లెండి. మీరు బెంగెట్టేసుకొని సిక్కిపోకండి బాబు.
ఏటీ మన ఈనాడు, అబ్బ అదేనండీ, మన తెలుగునాడు, ఇంకా అర్దం కాలేదటండీ, మన పార్టీ పత్రిక, అసలు ఇరగదీసేస్తంది కదా, ఏం వార్తలండీ, టయము లేదు గానీ వొక పుస్తకం రాయొచ్చండి. బాగా సదువుకొన్న బాబులు గద ఏటంతారు
తాడేపల్లి గారూ, ప్రతిద్వంద్వి, ప్రతికక్షి అనే అర్థంలో ప్రతినాయకుడు వాడానులెండి. అయినా.. మన ప్రతీ నాయకుడూ ప్రతినాయకుడే (మీరు చెప్పిన అర్థంలో) గదా!
రిప్లయితొలగించండిఅనామకా! నేనేటంతను! మీరింత బాగా చేప్పేసినాక! మీరు నాకింత దైర్నవిచ్చేసినాక ఇక నాకు బెంగేటికండి?
బాబు పవుర్లో ఉండగానే తగ్గించి తినీవోడు. ఇరవయ్యేళ్ళో యాభై ఏళ్ళో ఏలాలని యావ గదండీ మరి! ఆరోగ్యం ఉండాలి గదా!
ఇహ, ఈనాడు గురించి మీ రోదన నాకర్థం కాలేదు. కాస్త అర్థమయ్యేలాగా ఏడవరూ?
సదువుకొన్న బాబులకి కోటి దండాలు.
రిప్లయితొలగించండిమీకింత కోపమొత్తాదని తెలిత్తే అలా రాసీవోడిని కాదండి. ఐనా నాకు తెలవక అడుగుతున్నా, మారాజులు కోపగించుకోకూడదు, బాబు తిండి తగ్గించీనాడు, ఆసనాలేత్తాడు, అయి చెత్తాడు, ఇయి చేత్తాడు అని సెప్పేత్తన్నారు మీరేటైనా ఆయన పక్కనే కూకుంతారా ఎప్పుడూ?
అయినా ఆల్లు ఏటి సేసినా అల్లకోసవే గదేటి, ఆయన తిండి తగ్గిత్తే మనకేటి, ఆసనాలెత్తే మనకేటి. అయినా మన బాబేటైనా బైరాగేటండి గాలి పీలుత్తా ఆసనాలేసుకుండడానికి.
ఏడుపేటండి, సమద్ర గోసైతేను
అనగ అనగ వొక పత్రికుండెదండి, అనగ అనగ వొక పార్టీ, ఆ రెండీట మద్య సంబందవేటో తెలీదండి గాని, ఆ పార్టీ నాయికుడి మీద ఈగోల్తే ఆ పత్రికమీద కర్రడినంత పనైపోత్తందండి, అదేంసిత్రవో (తెలుగు బాస బాగ పాడైపోనాదండి, మరీ పాడెక్కేసిందంటె బాగుందని అలా అన్నానడి, మరేటనుకొకండి, అరసున్నలెత్తేసినారేటండి :( ) ఆ పత్రిక మీద దోంవోలితే, ఆ పార్టీ నాయికుడిమీద దూలవొడిపోయినంత (మల్లీ అరసున్న కరువైపోనాదండి) పనౌద్దండి. ఇలా ఎందుకౌద్దో మీకేటైనా తెలిస్తే సెప్తారేమోనని.
బాబులు, సదువుకొన్న బాబులు, మరి నాకు సెలవిప్పిత్తే ఉంతానండి, దండాలు బాబు :-)
మన్నించాలి, గత వ్యాఖ్య కాస్త దురుసుగా రాసాను.
రిప్లయితొలగించండిబాబు తిండి విషయం లోక విదితం. నాకొక్కడికే తెలిసిన విశేషం కాదండి.
పోతే ఈనాడు గురించి మీరనే సంగతి నాకర్థమైంది. పూర్తిగా కాకపోయినా కొంతవరకు ఏకీభవిస్తాను.
ఇహ భాష గురించి.. అది బానే ఉందండి, మనఁవే... ఆర్టీయెస్ లో @m అని రాస్తే అరసున్నా పడుద్దండి.
మరేం పర్నేదండి, మనం కూడ కొద్దీగ ఉప్పూ కారం తింటన్నాం కదండి, మరి ఆమాత్రం ఉప్పూ కారం తప్పులొస్తాఉంటాయ, మనలో మనం సరుదుకు పోవాల, ఏటంతారు :D
రిప్లయితొలగించండిమీ ఆర సున్నా సాయానికి మా కర దండాలు (అంతే మా సేతులతో నఁవస్కారాలు, కరక్టేనంతారా?)
హహ్హ.. ఔనండి, నేనేమో ముసుగు మనిషితో మాట్టాడతన్నాను. ముసుగేసుకున్నోడితో మాట్టాడ్డమంటే చాలా ఓపికుండాలండి.
రిప్లయితొలగించండిమీరేమో మరీ తెలివైన వారాయె, పేరు చెప్పరు, కనీసం ఐపీ అడ్రసు కూడా చెప్పరు. ఐపీ అడ్రసును మార్చి మార్చి రాస్తున్నారాయె - మాయ మంత్రాలు తెలిసిన పిశాచంతో యుద్ధం చేస్తున్న మనిషి లాగా ఉంది నా పరిస్థితి.:)
అసలు కన్నా కొసరు ముద్దు అని ఎందుకంటారో ఇప్పుడే తెలిసింది. టపా బాగుంది, అనామక వ్యాఖ్యలు మరీ బాగున్నాయి. భాష తేనేలోంచి తీసినట్లు ఉంది. ఈ తేనే జుర్రుకోవాలంటే ఏ బ్లాగు చూడాలో ఎవరైనా చెబుదురూ దయచేసి. నెనర్లతో బ్రాహ్మీ.
రిప్లయితొలగించండిరహస్యమైతే నాకు వేగు పంపినా మహదానందమే. braahmii@gmail.com
బ్రాహ్మీగారి పలుకులతో ఏకీభవిస్తాను. మీ తూర్పు యాస బాగుంది గానీ అనామకంగా రాయవలసిన అవసరం కనబడదు. మీరు విజ్ఞుల్లా ఉన్నారు కాబట్టి ఏదో మంచి కారణమే మీకు తోచి ఉండవచ్చు. కానీ బ్లాగు దుకాణాలు తెరిచి టపాలు వ్యాఖ్యలూ రాస్తున్న మా వంటి వారికి మాత్రం ఈ ముసుగులో గుద్దులాట మహ చిరాకుగా ఉంటుందని తమరు గుర్తించాలి. చదువరి ప్రతివ్యాఖ్యల్లో కూడా చిరాకు ఇదేననుకుంటున్నాను.
రిప్లయితొలగించండిఅదంతా అలా ఉండగా, దేశం గురించీ, దెశంలోని రాజకీయాలగురించీ కాస్త పట్టించుకునే బ్లాగర్లమందరమూ ఏదన్నా ఒక క్రియాశీలకమైన పని చేబట్టితే బాగుంటుందని ఉంది. ఏమంటారు?
పేరులో ఏముందండి - బాగా వ్యాఖ్యానిస్తున్నారు, చదివి ఆనందించడమే.
రిప్లయితొలగించండిప్రస్తుతానికి నాకైతే ఇద్దరూ ఒకరిని మించిన ఒకరు అనిపిస్తున్నారు. ప్రతీ విషయం లేవనెత్తడం, ఒక పది రోజులు కొట్టుకుని వదిలెయ్యటం మామూలైపోయింది.
రిప్లయితొలగించండిబాబు, వైయస్ ఇద్దరూ రెండు రకాల ఆర్ధిక విధానాలు వ్యవహరిస్తారు దోపిడీలో. అయితే వైయస్ ది కొద్దిగా తైమూరు టైపు మూర్ఖపు దోపిడి...అంతే తేడా
బావుంది చర్చ :)
రిప్లయితొలగించండికొత్తపాళీ, బ్లాగాగ్ని, సుధాకర్, గిరి - నెనరులు. పేరులో ఏముంది లెండని అన్నారు కొందరు.. స్వానుభవమ్మీద తెలిసొస్తుంది లెండి!:) ఏదేమైనా అనామకుడి మాయ తెర నిదానంగా వీడుతోంది :)
రిప్లయితొలగించండిఇహ, అనామకుడి తలనెప్పిని పక్కన బెట్టి విషయానికొస్తే.. ఇద్దరూ ఇద్దరేనని నా ఉద్దేశ్యం. రాజశేఖరరెడ్డి కాస్త ఎక్కువ ముదురు. బాబుకున్న అవలక్షణాలతో పాటు ముఖ్యమంత్రిలో వల్లమాలిన పొగరు, ప్రజలంటే లెక్కలేనితనం, ముఠాదారు మూర్ఖత్వం స్ఫుటంగా కనిపిస్తూంటాయి.
ఈ అనామకులెవరో గానీ నేను ఇదే విషయం మీద రాసిన టపా శైలిలో రాసేస్తున్నారు.
రిప్లయితొలగించండిదొంగలంతే గదా సుధాకర్ గారూ! అనుమానం తమమీదకి రాకుండా చూసుకుంటూ అవతలోళ్ళ మీదకెళ్ళేలా జాగ్రత్త పడతారు. :)
రిప్లయితొలగించండిమాయాబజార్ సినిమా గుర్తుందా, చివరలో శకుని చెప్పిన మాట (మాయా శశిరేఖ పెళ్లిలో) గుర్తుందా
రిప్లయితొలగించండి"హా తెలిసిపోయింది,ఇప్పుడు అర్థమయ్యింది, బలరామా ఇక్కడ నీ పెళ్లి కూతురి రూపంలో ఉన్నది నీ కూతురు శశిరేఖ కాదు, ఏవరో మాయావి, నిన్నూ,మమ్మల్నీ ఇలా మోసం చేసింది నీ ""సోదరు""డు శ్రీకృష్ణుడే "
అందుకే తెలిసిపోయింది తెలిసిపోయింది
నెనర్లతో బ్రాహ్మీ
ఇంతకీ ఇక్కడా శ్రీకృష్ణుడెవ్వరు ? అనామక వ్యాఖ్యానంలో ఇదేదో కొత్త పుంతలా వుంది.:-)
రిప్లయితొలగించండి@బ్రాహ్మీ - :)
రిప్లయితొలగించండిఈ టపాకి నాకోరిక తీరిపోయినట్లే. కాని ఇంకొక్కటి మిగిలుంది-ఈనాడు విషయం.
రిప్లయితొలగించండి""ఏటీ మన ఈనాడు, అబ్బ అదేనండీ, మన తెలుగునాడు, ఇంకా అర్దం కాలేదటండీ, మన పార్టీ పత్రిక, అసలు ఇరగదీసేస్తంది కదా, ఏం వార్తలండీ, టయము లేదు గానీ వొక పుస్తకం రాయొచ్చండి. బాగా సదువుకొన్న బాబులు గద ఏటంతారు""
టయిము చూసుకుని కనీసం టపా అయినా రాయకుడదా
నెనర్లతో బ్రాహ్మీ
హహ్హహ్హ చాలా బాగుంది :-)
రిప్లయితొలగించండిక్లాప్ క్లాప్, ఎవరక్కడ!! సత్య పీఠం తీసుకురండి
ఆయ్, ఇంతకీ ఇక్కడ శకుని ఎవరు/ఎక్కడ (పవరు పోయిన రంగస్తలం లా ఉంది కదా?)
ఛ, సమయస్పూర్తి లేదండి, శకుని కనిపించటంలేదని అనవసరంగా కంగారుపడ్డాను కాని పిలిస్తే అయనే వచ్చేవాడు కదా :-)
రిప్లయితొలగించండిశకుని మామా, శకుని మామా (సమయానికి మంత్రి కూడ మిస్సింగ్, ఏంటో ఇలా అయిపోఇంది)
నేను కూడా బ్లాగాగ్ని గారితో ఏకీభవిస్తున్నాను, పేరులో ఏముందండి, మనం ఆలోచించే విధానం లో కాని. శ్రీ రమణ మహర్షి గారు కూడ అదే చెప్పారు. నేను అంటే ఎవరు, ఎంత బాగుంటుందో కదా ఆ లాజిక్.
I have an interesting thought here but I am not sure how many of you are aware of UNIX operating system, so I will park my thoughts for now and will express them at an appropriate place and time ( just our like politicians, han :-))
"స్వానుభవం మీద తెలుస్తుంది" అని బానే అన్నారు. లేదని ఎలా అనుకొన్నారు? Assumption is the mother of all screw-ups. :) సర్లెండి, చర్చ అనవసరంగా ప్రక్కదారి పడుతోంది.
రిప్లయితొలగించండి@అనామకా - పైన చెప్పిన విధంగా, assumption వద్దు - "మీకు తెలుసో లేదో, అందుకని చెప్పను" - అవతలివాళ్ళకి తెలియదని అంత తొందరగా నిర్ణయానికి వస్తే ఎలా? మీరు చెప్పాలనుకొన్నది చెప్పండి - తెలియనివాళ్ళు అడుగుతారు.
Thanks for the suggestion, Solarflare. I will do that in my blog.
రిప్లయితొలగించండిjust nit-picking, you are also safely assuming that I am a man, tough you are right this time but it is an assumption though.
anamaka or anamika ? is there a gender agnostic term here :-)
:) చూసారా - మళ్ళీ assumption; నేను మీరు మగా ఆడా అని ఆలోచించలే! తెలుగులో nueter gender లేదు. కాని సంస్కృతంలో ఉంది - అందుకనే - "అనామకుడా" అనలేదు - "అనామకా" అన్నాను. =))
రిప్లయితొలగించండిఈ లింగ బేధాల గొడవలో, నాకొక చిన్నప్పుడు చదువుకున్న కధ (కాదు, శీర్షిక) గుర్తుకొస్తోంది. ఆందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, వక పేరులేని పాత్ర, దాని గొప్పతనము. ఆ పాత్రే "నిగమ శర్మ అక్క". ఇది తెలాలి రామక్రిష్ణ కవి వ్రాసిన "పాండురంగ మహాత్మ్యము" అనే కావ్యం నుంచి సంగ్రహించబడిన భాగం పై ఏవరొ ఇంకొక మహానుభావుడు చేసిన "విమర్శ" (అంటె, లిటరరి క్రిటిసిజం అన్న మాట).
రిప్లయితొలగించండిఇంతకీ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మంచి విశ్లేషణ చెయ్యటానికి పేరులేకపోయినా పరవాలేదు. విశ్లేషణ లేక విమర్శ సహేతుకమైనదా కాదా అనే మనం గమనిచాలి కాని అది చేస్తున్నది ఎవరు అనేది అప్రస్తుతం అని నా ఉద్దేశ్యం.
పాపం, సుధాకర్ గారు కంగారు పడినట్లు కనిపిస్తోంది, ఆయనే ముసుగులో రాసేస్తున్నారని ఎవరైనా అనుకుంటారేమోనని. నన్ను క్షమించాలి, నా ఉద్దెశ్యం అది కాదు. మీ శైలిని అనుకరించి వ్రాసేసానని అన్నారు, ప్రస్తుతానికి అది నిజమైనా, పూర్తిగా నిజం కాదు. రా.వి. శాస్త్రి గారు, బీ.నా. దేవి గారు, కా.రా గారు, ఇలా చాలా మంది మీకన్నా ముందు ఇదే శైలిలో (కాదు, మనం అదే శైలిలో ;), ఇంకా సరిగ్గా చెప్పాలంటె, మనం అందరం, గ్రామ్య బాస లో, ఏటంతారు) చాలా వ్రాశారు.
మల్లీ నా బాసలో వొకటేసుకోవాల :)
నన్ను పిసాచం, దొఁగ అని తెగతిట్టేత్తన్నారేటి బాబు, అసల నానేటన్నానని?
ఇలా పేరులేకపోవడం వల్ల వచ్చిన కష్టాలు చూసేక, నాక్కూడ వక పేరు పెట్టూకోవాలినిపించింది. ఆందుకే, "సూర్యుడు" (బ్లాగాగ్ని గారికి నాకు ఎటువంటి సంబంధము లేదని ఇందుమూలంగా విన్నవించుకుంటున్నాను) అని నాకు నేనే పేరెట్టేసుకున్నాను :-). ప్రస్తుతానికి ఏదో తలా తోకా లేని విషయం ఏదో వ్రాశాను. ఇకనుంచి మిమ్మల్నెవరినీ ముసుగులో ఇబ్బంది/సిరాకు పెట్టనని తెలియపరచుకుంటున్నాను.
on OP:
This incident is a blatant attack on our democracy and the dignity of the house.
I seriously think all these guys are the same and even may have an internal understanding as well and put up a good show in front of the people. May be, they have taken a cue from our cricket brothers and customized it to politics. If it is the case, we are in a trap :(
As usual, media is sensationalizing this issue, with the help of mobile service providers (they are making money at the cost of our democratic fabric). Everyone has their own best interests in their minds than anything else. Just disgusting.
ఇదో అబ్బాయ్యో - "సూర్యుడు" ఏందిట, సక్కగ సూరీడు అని ఎట్టుకో. కేకైనీకి బాంటది.
రిప్లయితొలగించండిసూర్యుడు (సూరీడు అంటే ఒక అవినీతి మనిషి గుర్తొస్తాడు నాకు :-)) గారు,
రిప్లయితొలగించండినా శైలి అంటే నా సొంత అని కాదండి. ఇదే విషయంపై నేను రాసిన శైలి అని నా మీనింగ్ :-)
అపార్ధం చేసుకోకండి.
సూర్యుడు గారూ, సోలార్ఫ్లేరన్నట్టు ఈ పేరుతో గారూ జోడించాలంటే అంత బాలేదేమో గానీ సూర్యుడూ అని ఏకవచనంలో పిలిస్తే బానే ఉంది. కానీ మీరేమనుకుంటారో..! (సోలార్ఫ్లేర్ కూడా పిలిచేందుకు సౌకర్యంగా లేదు మరి! బ్లాగాగ్ని బానే ఉంది:))
రిప్లయితొలగించండిపిశాచమనే పేరు మీకు చెందదు లెండి.. అది అనామకుడికి పెట్టిన పేరు. సూర్యుడిని అలా ఎందుకంటాం!!? :)
నిన్నటిదాక పిశాచమైనా, మీ టపా తాకిడితో సూర్యుడినైనా!!
రిప్లయితొలగించండిఎలా అంటే, ఇలా : http://lekhkalu.blogspot.com/
నమస్కారలతో,
సూర్యుడు :-)