31, ఆగస్టు 2007, శుక్రవారం

కంప్యూటర్ ఎరా చూసారా?

..చూడకపోతే చూడండి. మీరు గీకువీరులైనా చూడండి. మీకు తెలీని విశేషాలు కూడా అక్కడ దొరకొచ్చు.

పత్రికంటే ఓ యాభై కాగితాలు కాదు, యాభై పేజీల విశేషాలు. రాసే వ్యక్తికి తెలిసిన విషయాలు రాస్తే కాదు.., చదువరికి తెలియని కబుర్లు రాయాలి. అప్పుడే పత్రికను కొనుక్కున్న పాఠకుడికి తృప్తి కలుగుతుంది. ఈ పత్రిక ఖచ్చితంగా డబ్బుకు తగ్గ విలువ ఇస్తుంది. ఒకే ఒక్క వ్యక్తి, నెలనెలా, అంతంత సమాచారాన్ని, అన్నన్ని విశేషాల్ని, ఒంటిచేత్తో ఇస్తూ వస్తున్నారంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సంపాదకుడు నల్లమోతు శ్రీధర్ గారికి అభినందనలు.

పత్రికను మీరూ చదవండి.. మీ సూచనలు, సలహాలను శ్రీధర్ గారికి పంపండి.

సెప్టెంబరు సంచికలో 'జాలంలో తెలుగు వెలుగుల' కబుర్లు కూడా వచ్చాయి. వలబోజు జ్యోతి గారి చలవ అది. మంచి వ్యాసం రాసారు.
----

ఓ పాఠకుడిగా తప్ప, నాకు కంప్యూటర్ ఎరాతో వేరే ఏ అనుబంధమూ లేదు. :)

1 కామెంట్‌:

  1. అవునండి. ఇది నిజం. ఈ పత్రిక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సంవత్సర చందా కట్టి తీసుకుంటే మేలు. ఇంటికే వస్తాయి. పాతవి కూడా కావాలంటే దొరుకుతాయి. పత్రికాఫీసులో...

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు