24, మే 2006, బుధవారం

మత మార్పిడి ఊపు మీద పోపు గారు

భారత్‌లో మత మార్పిడులు కూడదంటూ చట్టాలు చెయ్యడం ఒప్పనంటున్నారు పోపు గారు. మత స్వేచ్ఛకు అది భంగమట! వంద కోట్ల జనాభా (95 శాతం మంది క్రైస్తవేతరులు), పేదరికం (దుప్పట్లిచ్చి మతం మార్చెయ్యొచ్చు), పరమత సహనంతో ఉండే ప్రజలు (వాళ్ళ పడగ్గదిలోకి వెళ్ళి ప్రచారం చేసినా ఏమీ అనుకోరు), లౌకిక తత్వం (అనగా పెద్ద మతానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లుతుంది), అనుకూలమైన చట్టాలు (లేకపోయినా మార్చుకోవచ్చు).. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే గాల్లో తేలివచ్చే విత్తనాల్లాగా వచ్చి, ఇక్కడ చేరి మొలకలెత్తాలని ప్రయత్నాలు చేసారు, చేస్తున్నారు. పళ్ళ చెట్టుకే గదా రాళ్ళదెబ్బలు!

ఈ దేశం వాళ్ళకి ప్రచారం చేసుకోండి పోండని చెప్పింది. ఇంటి పెరట్లో ఆడుకోండని పక్క వీధి పిల్లలకు చనువిస్తే పెరడంతా పీకి పందిరి వేయబూనినట్లుగా అయింది మన పరిస్థితి. ఎవరో ఒక్కరిద్దరు మతం మారితే అది మారే వాళ్ళిష్టం. మందలుగా, మూకుమ్మడిగా మారితే అది మార్చే వాళ్ళిష్ట ప్రకారం జరుగుతున్నదని అర్థం. ముస్లిము పాలకుల కాలంలో మత మార్పిడులు తెగ జరిగాయి, ఎందుకు? ఇస్లాంపై ప్రేమతోనా? లేక హైందవంపై మొహం మొత్తా? బలవంత మత మార్పిడి మధ్య యుగ సంస్కృతి. ప్రస్తుత సంస్కృతి ఏమిటంటే.. దుప్పట్లిద్దాం, మందులిద్దాం, ఆపై మతం మారుద్దాం. అడ్డుకుంటే, పరమత సహనం లేదంటూ నిందిద్దాం, మతస్వేచ్ఛ గురించి బోధిద్దాం.

మత సంస్కారం, పరమత సహనం అంటే ఏంటో ప్రపంచానికి నేర్పిన ఆధ్యాత్మిక శిఖరానికి పోపు గారు నీతులు చెబుతున్నారు.., ఎంత తెంపరితనం!!

4 కామెంట్‌లు:

  1. నిజమేనండి. పోప్ గారే (ఇష్టం లేకపోయినా గౌరవించడం మన సంస్కారం) పనిగట్టుకుని తిరుపతికి వచ్చి మతమార్పిడులకు పూనుకునేంత మతసహనం మన నుండి ఆయన కోరుకుంటున్నారేమో!

    రిప్లయితొలగించండి
  2. భళా మిత్రమా భళా. చక్కని ఆలోచన రేకెత్తించే జాబు. ఈ మతం మార్పిడి చట్టం గురించి వార్త మిస్సయినట్టునాను. మూకుమ్మడి మతమార్పిడే నిషిద్ధమా? లేక వ్యక్తిగత మార్పిడి కూడానా? మరి ఇస్కాన్ భక్తుల సంగతేమవును? వాళ్ళు వేరే దేశాల్లో హిందూ ప్రచారం చేయవచ్చునా? -బు

    రిప్లయితొలగించండి
  3. yes yes బాగా చెప్పారండి ....! నిజానికి హిందువులకి ఉన్నంత పరమత సహనం ... మిగతా మతాలకు ఎక్కడ ఉన్నదండి ? ఈ మతం మార్చుకున్న జనాలు మన ప్రసాదాలు తినరు , ఆ మత ప్రభోధకులు మన దేవుళ్ళని సాతానులనోచ్చు . .. మన హిందువులు మిగతా మతాలను అనుసరించాలి ఎవరు అడ్డు చెప్పకూడదు (మన మతం లో వున్నా స్వేచ్చే అదీ ... ఇదెక్కడి న్యాయమా అండి?

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు