తెలుగులో మనక్కొన్ని పదాలున్నాయి.. ఒంటరిగా పెద్ద గుర్తింపు లేనివి.. మళ్ళీ అదే పదంతో జతయితే అర్థవంతమౌతాయి. అలాంటివి కొన్ని ఇక్కడ, సరదాగా.. (ఇది కవిత కాదు!)
కాగే నీరు - సలసల
పారే నీరు - సళసళ
ఉడికే అన్నం - కుతకుత
పొంగే పాలు - బుసబుస
ఒక నవ్వు - పకపక
మరో నవ్వు - కిలకిల
ఇంకో నవ్వు - గలగల
పెళ్ళిచూపుల్లో పిల్ల నవ్వు - ముసిముసి
కచ్చికతో తోమిన ఇత్తడి పాత్ర - తళతళ
రిన్‌తో ఉతికిన బట్టలు - థళత్తళ
పక్షిజంట సయ్యాటలు - కువకువ
భారీకాయపు నడక - గునగున
రహస్యంగా మాట్లాడితే - గుసగుస
అడ్డూ ఆపూ లేకుండా మాట్లాడితే - గలగల
వాగుడు కాయ వాగే విధానం - లొడలొడ
అప్పుడే నిద్రలేచిన కుంభకర్ణుడి గొంతు - గరగర
అప్పుడే పొలం నుండి ఇంటికొచ్చిన నాన్న ఆకలి - నకనక
రాజకీయుడి అనర్గళ ఊకదంపుడు - గడగడ
వాళ్ళు వెధవలైనా వోట్లేస్తాం - తెలిసితెలిసి
సొమ్ములు పోనాయని ఓ మంత్రి - భోరుభోరు
పొలంలో కూరగాయలు - లేతలేత
లేలేత కూరగాయలు - నవనవ
కొత్త వందనోటు - పెళపెళ
తాతయ్యల నవ్వు - పెళ్ళుపెళ్ళు
వాళ్ళ దగ్గు - ఖళ్ళుఖళ్ళు
కృష్ణమ్మ పరుగులు - బిరబిర
చిన్నారులు అల్లాబిల్లి తిరుగుతారు - గిరగిర
రైలుకోసం నడక - గబగబ
దప్పిక అయినప్పుడు నీళ్ళు తాగుతాం - గటగట
పాలకోసం పసిపాపడి - తహతహ
బుడుక్కి ఇలా పెద్దవ్వాలని.. - చకచక
సెలవుల్లో పల్లెల్లో ఇళ్ళన్నీ పిల్లల్తో - కళకళ
బళ్ళు తీసాక, వాళ్ళు వెళ్ళాక అవే ఇళ్ళు - వెలవెల
ఇవ్వాళ్టి నుండి బడికి వెళ్ళాలని గుర్తొచ్చిన బుల్లిబాబు కళ్ళ నీళ్ళు - జలజల
ఇప్పటికిప్పుడు పూలజడ కావాలని చిట్టి తల్లి కంట నీరు - బొటబొట
పంతులు గారు లేని తరగతి గది - గోలగోల
ఇంటి గంట కొట్టగానే బళ్ళో నుండి పిల్లలు బయటపడతారు - బిలబిల
ఆలస్యంగా ఇంటికొచ్చిన బుడతడు నాన్నొచ్చాడేమోనని చాటు నుండి చూస్తాడు - నిక్కినిక్కి
తనపై చాడీలుచెప్పే చెల్లెలి వైపు చూస్తాడు - మిర్రిమిర్రి
మండే సూర్యుడు - భగభగ
పొయ్యిలో కట్టెలు - గనగన
తెలుగు సినిమా హీరో గుండె ఎల్లప్పుడూ పగతో - భుగభుగ
ఆమె సౌందర్యం - మిసమిస
అలంకరణతో, దీపకాంతులతో పెళ్ళి మంటపం - ధగధగ
మంచి కుటుంబం, మంచి కుర్రవాడని కూతుర్నిచ్చి పెళ్ళి చేసాడు - కోరికోరి
అత్తింట మర్యాదగ మెలగమని చెప్పాడు - మరీమరీ
కోరిన నగ తెస్తే ఆమె కళ్ళు - మిలమిల
లేదంటే కోపగృహ పయనం - విసవిస
సినిమాకెళ్దామని చెప్పి, ఆనక ఆలస్యంగా వచ్చిన అభాగ్యుడిపై సతీమణి - రుసరుస
బతిమాలుకోబోయిన భర్తను ఆమె చూసే చూపు - చురచుర
ఒక్క నంబరులో లాటరీ తప్పిపోయినపుడు బాధతో - విలవిల
బహుమతి వచ్చిన టిక్కట్టు కొన్నది పక్కింటివాడేనని తెలిసినపుడు ఏడుపుతో - వలవల
ఈ సంగతి తన గయ్యాళి భార్యకు తెలుస్తుందేమోనని భర్త - దడదడ
సంగతి తెలిసిన భార్య, 'లాటరీ టిక్కెట్టు కొంటం కూడా రాదీ మనిషికి' అంటూ - లబలబ
మరికొన్ని.. తరువాత్తరువాత చేర్చినవి
నముల్తారు - కరకర (భలే బుడుగు రాసారు.)
చించేస్తారు - పరపర
పాము పాకుతుంది - జరజర
ఢమరుకం మ్రోగే - ఢమఢమ (వీవెన్)
కొంటె కోణంగి చూపు - కొరకొర (వీవెన్)
విలన్ హీరోయిన్ని లాక్కెళ్ళాడు - బరబర (అజ్ఞాత వ్యక్తి)
మోగే గంటలు - గణగణ (అజ్ఞాత వ్యక్తి)
నీళ్ళ కోసం జనాల - కటకట (అజ్ఞాత వ్యక్తి)
ఇంజను స్టార్ట్ అవుతుంది - దగడగ (అజ్ఞాత వ్యక్తి)
ఆకలితో - మలమల (అజ్ఞాత వ్యక్తి)
గోంగూర పచ్చట్లోకి ఈ నెయ్యి ఉంటే నాసామిరంగా - వేడివేడి (అజ్ఞాత వ్యక్తి)
అమ్మాయి కురులు - నిగనిగ (అజ్ఞాత వ్యక్తి)
మండే నిప్పులు - కణకణ (అజ్ఞాత వ్యక్తి)
అరిచే కప్పలు - బెకబెక (అజ్ఞాత వ్యక్తి)
కొత్త గడియారం కొనమంటూ బుల్లిబాబు - నసనస (స్పందన)
ఎత్తు మడమల చెప్పుల్లో భామ నడక - టకటక (స్పందన)
సొరకాయ నడుం మీద చాకు నడక - కసకస (స్పందన)
ఓ భామకు బుగ్గమీద, ఓ కాంతకు కాలిమీద, వయ్యారికి వెన్నుమీద, నెరజాణకు నిలువెల్లా - కితకిత (స్పందన)
గ్రాంధికంలో అభినందిస్తామిలా - భళిభళి(స్పందన)

అయ్య బాబోయ్!
రిప్లయితొలగించండిఎన్ని పదాలు క్రోడీకరించారండీ!!
" 'లాటరీ టిక్కెట్టు కొంటం కూడా రాదీ మనిషికి' అంటూ - లబలబ"
లాంటి మాటలు తెగ నవ్వించాయి.
గురుగారు బాగుంది ఈ భావ వ్యక్తీకరణ. సరే ఇక అందుకోండి నా అభినందన..
రిప్లయితొలగించండి"మాటలని మరమరలాల లాగా నమిలేసారు కదా - కర కరా"
అద్భుతమైన సంకలనం!
రిప్లయితొలగించండిమ్రో రెండు:
"ఢమరుకం మ్రోగే - ఢమఢమ"
"కొంటె కోణంగి చూపు - కొరకొర"
గురు గారు - నేను "నమిలేశారు మాటల్ని - కర కర " అన్నది మిమ్మల్ని...మీ సంభాషణా చాతుర్యాన్ని ... మంచి భాష , భావ వ్యక్తీకరణ చాలా తక్కువ మందికి ఉంటాయి..
రిప్లయితొలగించండిఐ భలెభలె! చాలా బాగుంది. ఇప్పుడే చూశా మీ బ్లాగు.
రిప్లయితొలగించండిపారే సెలయేరు - గలగల
విలన్ హీరోయిన్ని లాక్కెళ్ళాడు - బరబర
కూడబెడతారు - రూపాయిరూపాయి
గంటలు మోగుతాయి - గణగణ
జనాలు నీళ్ళ కోసం - కటకట
ఇంజను స్తార్ట్ అవుతుంది - దగడగ
ఆకలితో - మలమల, నకనక
కళ్ళుపోతాయి - రామరామ
గోంగూర పచ్చట్లోకి ఈ నెయ్యి ఉంటే నాసామిరంగా - వేడివేడి
అమ్మాయి కురులు - నిగనిగ
నిప్పులు వెలుగుతున్నాయి - కణకణ
కప్పలు అరుస్తున్నాయి - బెకబెక
గుంపులో గోవిందయ్య
మంచి సేకరణ.
రిప్లయితొలగించండివీటిని తెలుగు వికీలో ప్రచురిస్తే బాగుంటుంది.
నీళ్ళు త్రాగుతారు - గుట గుట (గట గట కాదు)
రిప్లయితొలగించండిమనకు తెలీకుండానె ఇన్ని జంట పదాలు వాదుతున్నామా అని ఒకింత ఆశ్చర్యంగా చదువుతున్నంత సేపు సరదాగ, ఇన్ని సేకరించిన వారిని అభినందించేలా ఉన్నాయి
రిప్లయితొలగించండిఓ, ఎన్ని పదాలు! అభినందనలు.
రిప్లయితొలగించండిఈ కింది పదాలు మీ సంకలనములో చూసినట్టులేదు.
నసనస
టకటక
కసకస
కితకిత
భళభళ
ఈ కింది పదాలు జంటపదాలు అవునో కాదో తెలియదు కాని ఇవి కూడ అలాంటి విలక్షణమైనవే.
చిటపట
గడబిడ
లబోదిబో
చెడామడా
నదురుబెదురు
ఇంపుసొంపు
రుచీపచీ
ఉప్పూపప్పూ
మీరూ వీటికి మరిన్ని చేర్చండి.
(Ikkada vyakteekarinche abhiptayalni Telugu Font lo ela vrayali?)
రిప్లయితొలగించండిEe sankalananiki krindavi kooda cherchandi mari...
1.Talupu teeyagane pillalantha "bila bila" mani loniki vachesaru
2. "Chaka Chaka" mani nadusthunnaru
3.Deepavali naadu matabulu "Dham Dham " ani peluthunnayi.
4. "Chaduvu Sandhya" lekunda tiruguthunna kodukuni mandalinchaddu.
5.Aakashaniketheyyadam lo "Vaariki Vaare" Saati.
ప్రవీణ్ గారూ
రిప్లయితొలగించండిమీరు లేఖిని చూడండి. నేనిది దాంతోటే రాసాను.