రాజశేఖరరెడ్డి గెలిచాడు.
రాజశేఖరరెడ్డి ఐదేళ్ళ అద్భుతమైన పాలనకు మురిసి ప్రజలు వోట్లేసారని కాదు, ప్రతిపక్షాలు ఈ ఐదేళ్ళలో అద్భుతమైన పనితీరేమీ కనబరచలేదు కాబట్టి. 'ఇదిగో వీళ్ళకు వోటేస్తే మంచి, సమర్ధవంతమైన పాలనను అందిస్తారు' అనే నమ్మకాన్ని ప్రజలకు కలిపించలేకపోయారు కాబట్టి కాంగ్రెసు గెలిచింది. ప్రభుత్వ వ్యతిరేక వోట్లను ప్రతిపక్షాలు చీల్చుకోడంతో కాంగ్రెసు గట్టెక్కింది. గతంలో కంటే సీట్లు తగ్గడాన్ని బట్టి తెలుస్తోంది, ప్రజలు కాంగ్రెసు పట్ల వ్యతిరేకతతో ఉన్నారని. వోట్ల శాతాలు వెల్లడైతే అప్పుడు పూర్తి సంగతులు తెలుస్తాయి.
ఎన్నికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఎన్నికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
18, మే 2009, సోమవారం
14, ఏప్రిల్ 2009, మంగళవారం
చారిత్రిక అవసరం
అధికారమనేది లక్ష్యం కాకూడదు, అదొక మార్గం అంతే! అంటున్నాడు లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ. జాతినిర్మాణం, బిడ్డల భవిష్యత్తూ లక్ష్యాలు కావాలి. అధికారం -దాన్ని సాధించే మార్గం కావాలి. కానీ సాంప్రదాయిక రాజకీయ పార్టీలు అధికారాన్ని లక్ష్యంగా చూస్తున్నాయి అని అంటున్నాడు.
2, ఏప్రిల్ 2009, గురువారం
రెండు చర్చలు
ఇవ్వాళ టీవీ ఛానళ్ళలో రెండు చర్చలు చూసాను. రోజూ చూస్తాననుకోండి, ఎందుకో ఈ రెంటి గురించీ రాయాలనిపించింది. కాస్త సమయమూ చిక్కింది. ముందుగా..
2, మార్చి 2009, సోమవారం
ఎన్నిక లెన్నిక లెన్నిక లెండిక!
ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. పార్టీలు, నాయకులు మన ముందు చేతులు కట్టుకు నిలబడే రోజు వస్తోంది. 2009 సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది.
25, అక్టోబర్ 2008, శనివారం
ఇక వోటరు నమోదు కొన్ని నొక్కుల్లో
ఇక మనం ఇంట్లోంచే వోటరుగా నమోదు చేసుకోవచ్చు. మీ క్రెడిటుకార్డు వాడి జాలంలో పుస్తకం కొనుక్కున్నట్టుగా, డ్రాప్‌బాక్సు ద్వారా ఫోను బిల్లు కటినట్టుగా, కార్డు బిల్లును చెల్లించి పారేసినట్టుగా, పోస్టాఫీసులో ఉత్తరాన్ని రిజిస్టరు చేసినట్టుగా ఇక వోటరుగా నమోదు చేసుకోవచ్చు.
27, సెప్టెంబర్ 2008, శనివారం
పోస్టాఫీసుల్లో వోటరు నమోదు కేంద్రాల ప్రయోగాత్మక ఏర్పాటు
పోస్టాఫీసుల్లో వోటరు నమోదు కేంద్రాలనేర్పాటు చెయ్యాలనే విషయమై లోక్‌సత్తా ఎప్పటినుండో అడుగుతోంది కదా... దీనిమీద ఈమెయిలు గోల కూడా చేసాం. ఈమధ్య జయప్రకాష్ నారాయణ ఎన్నికల ప్రధాన కమిషనరుతో జరిపిన చర్చల తరవాత దీన్ని ప్రయోగాత్మకంగా హై. లో అమలు చెయ్యాలని నిర్ణయించారని తెలిసింది.
22, సెప్టెంబర్ 2008, సోమవారం
వోటరు నమోదు కేంద్రాలను పోస్టాఫీసుల్లో ఏర్పాటు చెయ్యండి!
మీకు వోటు హక్కుందా? ఉండే ఉంటుంది. మరి, వోటరుగా నమోదయ్యారా? అయ్యుండకపోతే, నమోదు చేయించుకోండి. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మన భవితను నిర్ణయించుకునే అవకాశమది -ఎలాగోలా నమోదు చేయించుకోవాలి మరి. అయితే, ఈ నమోదు వ్యవహారం పెద్ద తతంగంగా కనిపిస్తోంది. కుప్పుసామయ్యర్ మేడ్డిఫికల్టు లాగా వీలైనంత కష్టతరంగా చేసిపెట్టారు ఈ కార్యక్రమాన్ని. నమోదు చేయించుకోడానికి ఎక్కడికెళ్ళాలో తెలీదు, ఎప్పుడు చేయించుకోవాలో తెలీదు, ఏవేం కాగితాలు తీసుకెళ్ళాలో తెలీదు. దీన్ని సులభం చేస్తూ.. 'పోస్టాఫీసుల్లో నమోదు కేంద్రాల నేర్పాటు చెయ్యండి మహప్రభో' అంటూ లోక్‌సత్తా ఎన్నేళ్ళుగానో గోల పెడుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
సంబంధిత టపాలు
loading..