1, నవంబర్ 2006, బుధవారం

తెలుగుతల్లి

పేరు కోసం, పదవి కోసం
అడ్డదారిన వచ్చిపడే
కలిమి కోసం బలిమి కోసం
తమ స్వార్థ యజ్ఞపు హోమగుండంలో
తల్లినైనా సమిధ లాగా వ్రేల్చగలిగిన
కుటిల జీవుల, రాజకీయుల గెలుపు కోసం
జరుగుతున్న ఈ బందును నిరసిస్తున్నా

జనం కోసం, బతుకు కోసం
నిజాయితీగా ఉద్యమించే వారి కోసం నిరీక్షిస్తున్నా

ఈ మదోన్మాదుల, పదవోన్మత్తుల
కొంగ జపాలు, నక్కజిత్తులు
తేటతెల్లమయ్యే రోజు కోసం,
వీళ్ళ బతుకులు నడిబజార్లో బట్టబయలయ్యే రోజుకోసం,
నడమంత్రపు సిరి కోసం అమ్మనైనా తిట్టగలిగిన
వీళ్ళ నోళ్ళు పడిపొయ్యే రోజు కోసం
నిరీక్షిస్తున్నా

మెరుపును చూపించి దీపంగా నమ్మించి,
ఎండమావుల వెంట పరిగెత్తించే నికృష్ట రాజకీయులారా

వేరు కుంపటి ఉపయోగపడేది కాకున్నా,
అడిగే హక్కు మీకుంది. కానీ..
అందుకోసం అమ్మను తిట్టడం ఘోరపాపం

తల్లిని నిందించిన మీ పాపం ఊరక పోదు
అది మిమ్మల్ని కట్టి కుడిపే రోజు రాకపోదు

------

తెలుగు తల్లికి వందనం
తెలుగు జాతికి జయం
తెలుగు నేలకు శుభం

6 కామెంట్‌లు:

  1. రాజకీయులు స్వార్థ కుటిల రాజకీయాలకై తల్లిని రోడ్డుకీడుస్తున్నారు. మీ ఆవేదన సహేతుకం.

    రిప్లయితొలగించండి
  2. ముగ్గురమ్మల మాయమ్మ అని ఇప్పుడు తెలంగాణ తల్లి, సీమ తల్లి, కోస్తా తల్లి వచ్చాయన్న మాట. ఆ తరువాత తరంలో నెల్లూరు తల్లి, కరీం తల్లి, నిజాం తల్లి, నల్గొండ తల్లి, గోదావరి తల్లి. తల్లుల సంతతి వృద్ధి. అప్పుడు తెలుగు తల్లి పోయి తెలుగు ముసలవ్వ అవుతుంది :-)

    రిప్లయితొలగించండి
  3. గుండెల్ని పిండే టట్టు తెలుగు తల్లి గురించి మాట్లాడేవాళ్ళకు తెలుగు తల్లి దీవెనలిస్తుందే కానీ వాళ్ళను చూసి ఆగ్రహించు కోదు అనే సత్యాన్ని ఈ కుటిల రాబందులు ఎప్పుడు గ్రహిస్తారో

    విహారి

    రిప్లయితొలగించండి
  4. సాయంత్రం అయ్యేటప్పటికి బుడ్డి ముందేసుకుని కూర్చొనే తాగుబోతు నోటి వెంట సంస్కారమైన భాష ఎలావస్తుందిలెండి? హతవిధీ... ఈ రాజకీయాల పేరుతో ఇంకెంత దిగజారుడు వ్యవహారాల్ని చూడాల్సివస్తుందో...!!

    రిప్లయితొలగించండి
  5. చెప్పటం మరిచా... మీ కవిత చాల బాగుందండీ...!
    శ్రీశ్రీ మహాప్రస్తానం గుర్తుకు తెచ్చింది :-)

    రిప్లయితొలగించండి
  6. "మెరుపును చూపించి దీపంగా నమ్మించి,
    ఎండమావుల వెంట పరిగెత్తించే నికృష్ట రాజకీయులారా"

    నాకు తెలిసి ఎ౦తో ఉద్వేగ౦లో కానీ ఇలా౦టి మెరుపు రాదు. బాగా రాసారు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు