23, ఆగస్టు 2006, బుధవారం

రావోయీ అనుకోని అతిథీ!

ఒక విషయం గమనించారా? బ్లాగుస్పాటులో పైన లింకుల పట్టీలో చివరన ఉన్న NEXT BLOG అనే లింకును చూసారా? అది నొక్కితే అప్పుడే తాజాకరించిన బ్లాగు మనకు కనిపిస్తుంది. నేను స్టాటుకౌంటరు గణాంకాల్లో చూస్తూ ఉంటాను, ఏ సంబంధమూ లేని బ్లాగుల నుండి నా బ్లాగుకు లింకులు వస్తూ ఉంటాయి. గమనించగా తేలిందిది.. నా బ్లాగులో నేను కొత్త జాబు పెట్టీ పెట్టగానే వచ్చిన ఈ అనుకోని అతిథులు (తిథి లేకుండా వచ్చేవారే కదా అతిథులు) ఆ లింకు ద్వారానే వచ్చారని! వాళ్ళు తమ బ్లాగుల్లో NEXT BLOG నొక్కిన సమయానికి నేను నా బ్లాగును తాజాకరించి ఉంటాను. ఏదేమైనా మన బ్లాగుకు ట్రాఫిక్కు పెరుగుతోంది, సంతోషమే కదా!

అనుకోని అతిథీ! స్వాగతం!!

ఏంటి, మీకీ సంగతి తెలుసా!? అయినా పర్లేదు, నే రాస్తాను. నేను వికీపీడియా వాడిని.. ఏదీ చిన్న విషయం కాదు, తెలుసు కాబట్టి మనకది చిన్నది, తెలియని వారికి.. అది పెద్దదే, తెలుసుకోవలసిన విషయమే.

1 కామెంట్‌:

  1. స్టాట్‌కౌంటరు వాడడం మొదలుపెట్టినప్పుడు నేను చాలా తికమకపడ్డాను...ఈ అనుకోని అతిథులెవరా అని. తర్వాత ఆ విషయం పూర్తిగా మరిచిపోయాను. ఇప్పుడు తెలిసింది అసలు రహస్యం. :)

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు