దేశంలోని వనరులపై మొదటి హక్కు ముస్లిములకే ఉందట. హఠాత్తుగా దీన్ని ఎలా కనుకున్నాడో తెలియదు గానీ, చాలా గొప్ప సూత్రాన్ని ప్రజల్లోకి వదిలాడు, మన ప్రధానమంత్రి. రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసారో ఏంటో తెలీదు గానీ, ఇంతకు ముందెవరూ చెప్పని కొత్త విషయమిది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు త్వరలో రానుండడం, అక్కడ ముస్లిము వోట్లు ఎక్కువగా ఉండడం ఈ ప్రకటనకు ముఖ్య కారణమని ప్రతిపక్షాల గోల. రాజకీయుడి గుట్టుమట్లు రాజకీయుడికి ఎరుకే గదా!
పిల్లగా ఉన్నపుడు గాడిద అందంగానే ఉంటుందట. పెద్దయ్యాకే.. వంకరకాళ్ళు, బానపొట్ట, ఇంతబారు చెవులు, చెవులదిరే స్వరమూ వస్తాయట. వంకర మాటలు, వోటుబ్యాంకు రాజకీయాల లాంటివాటిని వంటబట్టించుకుని మన ప్రధాని ఆర్థికవేత్త నుండి పూర్తిస్థాయి రాజకీయుడిగా మారినట్లే కనిపిస్తోంది.
రాజ్యాంగం ప్రకారం ఇలా మాట్లాడటం ఒక నేరం.
రిప్లయితొలగించండిచప్పట్లో చప్పట్లు. వందటపాల చదువరికి....కాదు కాదు వందటపాల రచయితకు, అలాగే ఇప్పటికే వంద టపాలు దాటేసి ముందుకు సాగిపోతున్న బ్లా"గురు"లకు అభినందనలు.
రిప్లయితొలగించండిఇంకోవైపు మన ప్రధాని దిగజారుడు మాటలు విని మతిపోయింది. విద్యాధికులు రాజకీయాల్లోకి వచ్చినా జరిగేది ఇదేనా?
చాలా థాంక్సండి, త్రివిక్రమ్!
రిప్లయితొలగించండిenta chaduvukunna vaallayinaa inkokalli ceatulloa kiilu bommalayinappudu manam koarea abhivruddi ekkadinumdi vastundandi? vaallaki puurti sweacha,adikaram vundaaligaa emi ceayaalanaa.edeamayinaa oka atyunnata padavi lo vundi ilaa matladakuudadu.
రిప్లయితొలగించండిఓట్లకోసం పాట్లు ఎంతటివాడినైనా మట్టి తినిపించక మానవు.
రిప్లయితొలగించండి--ప్రసాద్
http://blog.charasala.com
ఇంకా బుర్ర తలలోనే ఉన్న మన్మోహనుడి నుండి ఈ మాట ఊహించలేదు. ఎందుకిలా అన్నారబ్బా? చదువరి గారూ శతటపోత్సవము జరుపుకుంటున్న సందర్భములో శుభాకాంక్షలు
రిప్లయితొలగించండివంద టపాల సందర్భంగా హార్దిక శుభాభినందనలు. ఈ సారి బ్లాగర్ల సమావేశంలో మిమ్మల్ని మిస్ అయ్యాం. ఈ కొత్త మూస బాగుంది, అన్ని కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
రిప్లయితొలగించండిరాధిక, స్పందన, రవి, శోధన గార్లకు,
రిప్లయితొలగించండి-కృతజ్ఞతలు!