సిద్దిపేటలో ఉద్యోగుల గర్జన పేరుతో అక్టోబరు 21న తెరాస నిర్వహించిన సభను టీవీలో చూసాను. హైదరాబాదును ఫ్రీజోనుగా ప్రకటిస్తూ (పోలీసు నియామకాలకు సంబంధించి) సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణా ఉద్యోగ సంఘాలతో కలిసి పెట్టిన సభ ఇది.
వ్యక్తులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, అక్టోబర్ 2009, బుధవారం
5, ఏప్రిల్ 2008, శనివారం
మన ప్రాధాన్యతలెక్కడున్నాయి
లక్కు అనితారెడ్డి ఎవరో మీకీ పాటికి తెలిసే ఉంటుంది. బీచి వాలీబాలు ఆటలో బరి నుండి బంతి బయటికి పోయినపుడు దాన్ని తిరిగి ఆటకత్తెలకు అందించటానికి ప్రత్యేకించి కొందరిని నియమించారు - బాల్‌గర్ల్స్, బాల్ బాయ్స్. అక్కడ బంతి అందించే వ్యక్తిగా అనిత పనిచేస్తోంది. ఏప్రిల్ 5 నాటి ఈనాడు ఆమె గురించి రాసింది. ఈనాడు ఇలా అంటోంది..
"...నిజానికి ఆ అమ్మాయి సాధించిన విజయాలతో పోల్చితే ఆ బీచి వాలీబాలు క్రీడాకారిణులు లెక్కలోకి రారు. అక్కడున్నవాళ్లలో ఎవరికీ తెలియదు ఆమె జిమ్నాస్టిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిందని..."
జిమ్నాస్టిక్స్‌లో అంతర్జాతీయపోటీలు ఆడి కూడా, సరైన ప్రోత్సాహం లేదని గ్రహించి ఆ తరువాత వాలీబాలు ఆడటం మొదలుపెట్టి, జాతీయ స్థాయికి ఎదిగింది. అలాంటి అనితారెడ్డి ఇక్కడ, ఈ ఆటలో.. బంతులందిస్తోంది. జాతీయ స్థాయికి చెందిన ఒక క్రీడాకారిణికి మంచి గుర్తింపే!!! వాలీబాలు, బీచి వాలీబాలుల పట్ల మన ప్రాధాన్యతలవి.
అయినా అనితారెడ్డి దాన్ని చిన్నతనంగా భావించటం లేదు.. అది ఆమె హుందాతనం.
శభాష్ అనితా!

9, డిసెంబర్ 2007, ఆదివారం
"మహాకవి శ్రీశ్రీ" జీవిత చరిత్ర
"1983లో అతడు భౌతికంగా మరణించినా మరికొన్ని సహస్రాబ్దాల పాటు అతడి కవిత్వం బతికే ఉంటుంది. తన జీవిత కాలంలోనే చరిత్ర ప్రసిద్ధుడైన శ్రీశ్రీ అనంతర కాలంలోనూ అలాగే జీవిస్తాడు. కవిత్వమున్నంత కాలం, కవిత్వ రసాస్వాదన ఉన్నంత కాలం కవితానుభూతి ఉన్నంత కాలం అతడు ఉంటాడు. " శ్రీశ్రీ జీవిత చరిత్ర పుస్తకాన్ని ముగిస్తూ రచయిత రాసిన వాక్యాలివి.
"కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది". శ్రీశ్రీ కవిత, "కవితా ఓ కవితా" గురించి రాస్తూ ఆ పుస్తకంలోనే రచయిత అన్న మాటలివి.

25, అక్టోబర్ 2007, గురువారం
శభాష్, శ్రీరమణా!
అక్టోబరు 25 న ఈనాడు పేపర్లో హైదరాబాదు విభాగంలో వచ్చిందీ వార్త! కూకట్పల్లి హౌసింగు బోర్డులో పద్దెనిమిదేళ్ళుగా ప్రజల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకుతున్న ఒక పిచ్చివాడు, ప్రజలందరికీ కృతజ్ఞతలు చెబుతూ, పనిలో పనిగా దసరా, దీపావళి పండగల శుభాకాంక్షలు కూడా చెబుతూ కాలనీ అంతటా బ్యానర్లు పెట్టాడంట.
నిజానికి ఈ బ్యానర్లు పెట్టింది పి.వి.శ్రీరమణ అనే వ్యక్తి.
రోడ్లమీదా, కాలనీల్లోనూ అలా శుభాకాంక్షలు చెప్పే బ్యానర్లు కొల్లలుగా చూస్తూంటాం. పెద్దకారు రాజకీయులకు చిన్నకారు వాళ్ళూ, చిన్నకారు సన్నకారు వాళ్ళకు వాళ్ళ చెంచాగాళ్ళూ పెడుతూ ఉంటారు ఇలాంటి బ్యానర్లు. ఫలానావాడి పుట్టినరోజు వచ్చిందనుకోండి.. "వారికి శుభాకాంక్షలు" చెబుతూ పెడతారు. ఆ ఫలానావాడు బ్యానరులో ఒక పక్కన నుంచోనుంటాడు. రెండో పక్కన బ్యానరు కోసం అందరికంటే ఎక్కువ డబ్బులు పెట్టినవాడు నుంచోనుంటాడు. ఇహ కింద, వాళ్ళ కాళ్ళదగ్గర, ఓ ఏడెనిమిది మంది సత్రకాయల ఫొటోలుంటాయి. ఏ బ్యానరైనా కొద్దిగా అటూ ఇటూగా ఇదే మూస! సందర్భాలు మాత్రం మారుతూ ఉంటాయి. ఫలానావాడు అయ్యప్ప దీక్ష తీసుకున్నాడనో, ఫలానా "అన్న" ముష్టి పార్టీ గల్లీ కమిటీ మెంబరైన సందర్భంగానో, మరోటో మరోటో! ఇహ పండగలప్పుడూ ఈ బాపతు జనాల హడావుడి గురించి ఎంతైనా చెప్పొచ్చు.
పాపం శ్రీరమణ చిర్రెత్తిపోయినట్టున్నాడు ఈ బ్యానరాసురుల గోలతో; ఆ పిచ్చివాడి పేరు మీద బ్యానర్లు తయారు చేసి కాలనీలో అంటించాడు. ఈ బ్యానరాసురుల్ని వెక్కిరించడానికే పెట్టినట్టు వాళ్ళకు వెంటనే అర్థం కాదేమోననే సంకోచంతో ఈ మాట కూడా చెప్పాడట.. "నేను ఎవర్నీ నొప్పించే ఉద్దేశ్యంతో పెట్టలేదు. నాయకులు ప్రజలకి ఇబ్బందులు కలిగించకూడదనే సందేశమిస్తూ ఇలా పెట్టాను".
ఈ రాజకీయ సత్రకాయలకు సంగతి అర్థమవుద్దంటారా అని!!
మీ నిరసనను తెలియజేసినందుకు శభాష్ శ్రీరమణా!

***

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
సంబంధిత టపాలు
loading..