16, డిసెంబర్ 2005, శుక్రవారం

ఎవరికోసమీ శాసనమండలి?

"శాసనసభలో విద్యావంతులు లేరు, కాబట్టి విద్యావంతులకోసం మండలి కావాలి" అనే వాదనపై రెండు విషయాలు..

1. "శాసనసభలో విద్యావంతులు లేరు, కాబట్టి విద్యావంతులకోసం మండలి కావాలి" అనేది పసలేని వాదన. ప్రస్తుత శాసనసభలో చూడండి..దేశ అక్షరాస్యతా శాతం కంటే చాలా ఎక్కువగానే విద్యావంతులున్నారు. (అయినా నోళ్ళిప్పాలంటే డబ్బు కావాలంట.. ఒళ్ళమ్ముకునేవాళ్ళే నయం.) కాబట్టి విద్యావంతుల కోసం ప్రత్యేకించి మరో సభ అవసరం లేదు. మరో సంగతి.. ఈ చదువుకున్న వాళ్ళ కంటే, పెద్దగా చదువుకోని పల్లె ప్రాంతాల్లోనే ఎన్నికల్లో ఓట్లేసే వారి శాతం ఎక్కువ. అసలుదానికే ఓట్లెయ్యని వాళ్ళకోసం ఈ కొసరు అవసరమా?

2. పైచదువులు చదివినవారు - మంచివారు, తెలివిగలవారు, నీతిపరులని అనుకోవడం సరికాదని మనందరికీ తెలుసు. ఏమీ చదువుకోని టంగుటూరి అంజయ్యా ఆయన ప్రభుత్వం ఇటీవలి ప్రభుత్వాల్లో అత్యంత నీతివంతమైనవి (సాపేక్షికంగా) కాగా ఎం...థో చదివిన బాబు గారి నిర్వాకం మనకు తెలియంది కాదు. పై చదువులు..పై పై చదువులేనండీ!

కాబట్టి మండలి వస్తే లాభపడేది వాళ్ళే.. మనకేం ఒరిగేదిలేదు.
-------------

P.S: మనకు ఒరిగే విషయాలున్నాయి కొన్ని, వాటిని వీళ్ళసలు పట్టించుకోరు... ఉదాహరణకు రాజకీయాల్లో నేరస్తుల విషయమే చూడండి.. దేశం మొత్తం మీద ఒక్కడన్నా మాకు నేరస్తుడే నాయకుడు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటాడా..!?, కోడు. మరి వాళ్ళేంచేసారు..? నేరమయ రాజకీయాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు మార్గదర్శకాలిస్తే.. మొత్తం అన్..హి పార్టీలూ కలిసిపోయి మరీ.. ఎదురు తిరిగాయి. ఏమయింది..? రాజకీయాలూ అలాగే ఉన్నాయి, నేరస్తులూ అలాగే ఉన్నారు. మనమూ అలాగే ఉన్నాం, పిచ్చోళ్ళలాగా.

ఇప్పుడు చెప్పండి.. వీళ్ళేం కోరుకుంటున్నారు? మనకుపయోగప్డేదా.. లేక.. వాళ్ళకు పనికొచ్చేదా?

2 కామెంట్‌లు:

  1. అధ్యక్షా! మనమొక్కసారి ఆలోచించాలధ్యక్షా, చావా కిరణ్ దగ్గర చాల సమాచారం ఉందధ్యక్షా! తెలుగు బ్లాగులకు సంబంధించి, ఆయన మంచి వనరు అని తెలియజేసుకుంటున్నానధ్యక్షా!! మనమింగా ఆలోచిస్తే అధ్యక్షా, ఆయన బ్లాగుకు ఎన్‌సైక్లోపీడియా అనే అర్థంలో బ్లాగోపీడీయా అని పెడితే టోటల్ గా బాగుంటుందని భావించామధ్యక్షా!!!

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు