ప్రసిద్ధ భాషావేత్త, తెలుగు భాషా శాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ జూన్ 4 న మరణించారు. ఈనాడు పత్రిక ద్వారా బూదరాజు రచనలు నాకు పరిచయం అయ్యాయి. వారం వారం తెలుగు మాటల గురించి పాఠం చెప్పేవారు. ఏది సరైన పదం, ఏది కాదు అనేది చక్కగా విడమర్చి చెప్పేవారాయన. తరువాత్తరువాత అవే పుస్తకాలుగా వచ్చాయి.
రాధాకృష్ణ గారి పుస్తకం
మాటలూ-మార్పులూ పుస్తకంలోంచి కొన్ని మచ్చుతునకలు..
- స్మశానం తప్పు శ్మశానం సరైనది.
- రాబందు అనే మాట రామ బంధువు నుండి వచ్చింది. సీతాపహరణ వేళ రాముడికి సాయం చేసి, జటాయువు రామ బంధువై, రాంబంధువైంది. అదే రాబందు అయింది.
- ఋజువు తప్పు, రుజువు సరైనది
ఇలా మనం మామూలుగా చేసే ఎన్నో తప్పులను ఎత్తి చూపిన మాస్టారు ఆయన. వ్యవహార పదకోశాలు రాసారు. ఆయన మరణంతో తెలుగు భాష చిన్నబోయింది. వికీపీడియాలో
బూదరాజు రాధాకృష్ణపై వ్యాసం చూడండి
బూదరాజు రాధాకృష్ణ గారి కి నా శ్రధ్ధాంజలి.తెలుగు భాష మీద సాధికారత కలిగిన అతి కొద్ది మంది లో శ్రీ రాధాకృష్ణ గారు ఒకరు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిWhat a great site, how do you build such a cool site, its excellent.
రిప్లయితొలగించండి»