మతమార్పిడులపై పోపుగారు ఈసారి మాట మార్చారు.
13 వ శతాబ్దంలో మహమ్మదు ప్రవక్తపై బైజాంటైన్ రాజు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుని, బయటికి తీసి, ఓ వివాదాన్ని సృష్టించారు.
మధ్యయుగాల్లో ముస్లిములు జరిపిన బలవంతపు మత మార్పిళ్ళపైనే పోపుగారి ప్రస్తుత విమర్శల జోరు.
కొన్ని నెల్ల కిందట ఇదే బలవంతపు మతమార్పిళ్ళపైనే పోపుగారు మనపైనా కొన్ని విసుర్లు విసిరారు .
అయితే ఆనాటి వారి వాదన వేరు.
మూకుమ్మడి మతమార్పిడులకు వ్యతిరేకంగా భారత్‌లో చట్టాలు చేయరాదని అప్పుడు వారు మనకు చెప్పారు.
(అప్పటి వారి విమర్శలపై ఈ పేజీల్లోనే వచ్చిన నా పాత జాబు ఇది.)
మరి ఇప్పుడేమో ఇలా చెబుతున్నారు.
మధ్యయుగాల్లో కత్తి చూపి మతమార్పిడి చేయించారు,
అది ఆ కాలం తీరు.
ఇప్పుడేమో ప్రచారం తెగ చేసి, ఎరవేసి, ఆశలు చూపి, మొహమాటపెట్టి మూకుమ్మడిగా చేస్తున్నారు,
ఇది ఇప్పటి తీరు.
చేసే పని మాత్రం అదే.., బలవంతపు మతమార్పిడే! తీరే వేరు.
అయితే పోపుగారు మాత్రం..
"ఇప్పుడు మేం చేసేది ఒప్పు, దాన్ని అడ్డుకోరాదు, అప్పుడు ముస్లిములు చేసింది తప్పు, దాన్ని మర్చిపోరాదు" .. అని అంటున్నారు.
ముస్లిములపై మాట మీరారు, చివరికి క్షమించ గోరారు!
హిందు మతానికి తప్ప అన్ని మతాలకు మూలం 'ప్రవక్తలు' (ప్రాఫెట్లు). హిందూ మతానికి 'ధర్మాలు' మూలం. అదే హిందూ మతముయొక్క గొప్పదనము. ఈ మార్పిడులను ఆపాలంటే ఒకే ఒక్క పని మనమంతా చేయాలి - మన కులాల వ్యవస్తను అంతమొందించాలి. ఈ రెజెర్వేషన్లను పీకి పడేయాలి. ఈవి తెల్లవారి ముసుగులో మనపై వదిలిన విష వాయువులు.
రిప్లయితొలగించండి