17, అక్టోబర్ 2007, బుధవారం

ఏంటో..

  • నాయకులకు పెద్దపెద్ద విగ్రహాలు పెడతారు - అంత కంటే పెద్ద నిచ్చెనలు వాళ్ళ భుజాల మీదుగా కడతారు
  • ఉచిత విద్యుత్తు.. మోటారు కోసం ఉండదు - షాకిచ్చి చంపేందుకు మాత్రం వెనకాడదు.
  • పదుగురాడు మాట పాడియై ధరజెల్లు - పదకొండు మంది ఆడవారి గోడు మాత్రం అడవి పాలు
  • దోపిడీ మీటర్ల నరికట్టలేరంట - ఆటోలు తీసేసి కార్లు పెడతారంట.
  • గోధుమపై నెనరు - వరినసలే కనరు
  • బయటి రింగు రోడ్లకు.. రెండువేల కోట్లంట - ఊళ్ళో రోడ్లకు.. రెండు కోట్లు లేవంట
  • ఒకరు గజదొంగ ఇంకోరు జగదొంగ (ఒకడు చిక్కడు ఇంకోడు దొరకడు) - ఒక్క జడ్జేం చాలుతాడు వీళ్ళను పట్టంగ! (అసలు, జడ్జీలతో కాకుండా జే.ఎం. లింగ్డో, రామచంద్ర సమాల్ లతో ఓ కమిషను వేసి వీళ్ళ సంగతి చూడమనాలి.)
  • వాళ్ళు రొప్పుతూ రోజుతూ రోడ్డేస్తారు - జలమండలి వాళ్ళు నవ్వుకుంటూ తవ్వేస్తారు (తారు కాసే మంట మీద నీళ్ళు జల్లినట్టు)
  • నిజాం పాలన తెస్తడంట - పాలిస్తడా లేక పీడిస్తడా?
  • సారీ బుష్, ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యలేను - సరే బాస్, న్హా..కా సంగతి తెలుసులే!
  • సెన్సెక్సు పెరిగితే నల్లేరుపై నడక - పడితే..., పల్లేరుపై పడక

4 కామెంట్‌లు:

  1. చదువరి గారు,
    నిజం చెప్పినారు, సూక్ష్మముగా, రాజకీయాన్ని కాసి వడపోసినట్లు ఉంది మీ టపా.
    -మరమరాలు

    రిప్లయితొలగించండి
  2. ఆయనెవరో ఆ కాలంలో సాహిత్య మరమరాలు వడ్డించారు. ఈనాటి మీ ఈ రాజకీయ మరమరాలు మాంఛి ఘాటుగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  3. యేళ్ళ నుంచి రాజకీయ రాబంధుల కబోధి పాలనలో విలవిల లాడుతున్న సమాజాన్ని చూసి చూసి, అసహ్యం పొంది..కెరటాల్లా ఎగసి పడుతున్న బాధను వరుసపెట్టి టపాలల్లో వ్రాస్తున్నారు.."చాలా సంతోషం" అని వ్రాయలేను.
    సమస్యను వివరించడం సగం పని మాత్రమే. దానికి మనం ఏమి చేయగలమో ఆలోచించగలిగితే??
    నాకైతే ఏ ఉద్యోగం మానేసి..కౌన్సిలరుగానో చైర్మెనుగానో పోటీ చేసి..రాజకీయాలు ఊరులో లేకుండా చేసి ఆదర్శ పట్టణంగా మారుస్తాం అన్న ఆవేశం వస్తుంది. కానీ ఏమి లాభం. నేను సమరసింహా రెడ్డిని కాదు, స్టాలిన్ను కాదు...వట్టి నవీన్ను మాత్రమే. కానీ నాలాంటోళ్ళ ఆవేశం ఈ దేశానికి ఏవిధంగానూ ఉపయోగపడకపోతూందే అన్నదే నా బాధ.
    కిం కర్తవ్యం?

    రిప్లయితొలగించండి
  4. మంచి పాయింటు లేవదీశారు నవీన్. మీ తోటి వారిని కూడగట్టుకుని ఒక voters' club ఎందుకు మొదలు పెట్టకూడదు?

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు