హైదరాబాదు జంటపేలుళ్ళపై నా గతజాబు, దానిపై వచ్చిన వ్యాఖ్యలు దీనికి నేపథ్యం. ఆ వ్యాఖ్యలకు సమాధానమే ఈ జాబు.
ఉగ్రవాదులు మతం పేరు చెప్పుకునే ఈ పనులు చేస్తున్నారు. మతం పేరిటే స్లీపర్లను, తదితరులను ఏర్పాటు చేసుకుంటున్నారు. మామూలు యువకులు స్లీపర్లు గాను, మానవ బాంబులు గాను మారటానికి ప్రేరణ మతమే అని నేనంటున్నాను. వీరలా మారడానికి ఉగ్రవాదులతో చేతులు కలపడానికి మరో కారణం ఏంటో చెప్పండి. బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ కూడా ఉగ్రవాదులతో చేతులు కలపడాన్ని మనమేమనుకోవాలో చెప్పండి. -క్లుప్తంగా ఇదీ నా గత జాబు! దీనిపైన వచ్చిన విమర్శలోని ముఖ్యాంశాలు, నా జవాబులు:
తీవ్రవాదానికి మతం వగైరాలు లేవు: ఉగ్రవాదమంటే ఉగ్రవాదమే, దానికి మతం లేదు. ఒక మతంతో దాన్ని ముడిపెట్టరాదు. ఏ రూపంలో ఉన్నా దాన్ని అణచివెయ్యాలి. అని అన్నారు. సదాశయమే! కానీ సమస్యకు మూలమేంటో తెలీకుండా ఎలా అణచగలం? అంచేత మూలం కోసం వెతకాలి. మూలం వెతకబోతే అదేమో మతం వైపుకు పోతోంది. పాకిస్తానో, బాంగ్లాదేశో పోతోంది కదా అని అనొచ్చు.. అక్కడికి మాత్రం ఎందుకెళ్తోంది? "మన అభివృద్ధిని చూసి ఓర్వలేక". మరి, వాళ్ళకి మనమీదే ఎందుకా ఏడుపు? చైనా మీద లేదేఁ? అది కూడా పక్కనే ఉంది, మన లాగానే వృద్ధిలో ఉంది. మిత్రదేశమనే మాటను పక్కనుంచండి.. ఓర్వలేక ఏడ్చేవాడికి తనామనా ఉండవు మరి. పోనీ, అసలు మూలాల జోలికే పోవద్దంటారా? సరే, మానేద్దాం. మన పోలీసుల చేత చేయిస్తున్నదదేగా! మనం పోకపోయినా మునిగిపోయేదేమీ లేదు.
పాతబస్తీ అభివృద్ధి: పాతబస్తీ వెనకబడడానికి ప్రధాన కారణం, ఎమ్మయ్యెమ్, దాని మతవాద భావజాలం. ఈరోజుల్లో రాజకీయుడికి కావాల్సింది ఓట్లు. మతం గురించి మాట్టాడితేనో, షరియత్ గురించి మాట్టాడితేనో, మనకు ఓట్లు వస్తాయనుకోండి.. వాళ్ళు వాటి గురించే మాట్టాడతారు. ఆ పాయింట్లకే సానపడుతూ ఉంటారు. పాతబస్తీ వెళ్ళినపుడు రూమీ టోపీ, షేర్వాణీలు పెట్టుకోని సలాములు కొడుతూ తిరిగే రాజకీయ నటులను చూళ్ళేదా మనం! 'మతం మీద జరుగుతున్న దాడి'ని చూపించి అభద్రతా భావాన్ని ప్రజల్లో రేకెత్తించో, ముస్లిములంతా సంఘటితంగా లేకుంటే భద్రత ఉండదనో, మరోటో చెప్పి వాళ్ళని ఆత్మరక్షణ లోకి నెడతారు. ముస్లిములను ఆకట్టుకోవాలంటే వాళ్ళ మతం గురించి గొప్పగా మాట్టాడితే చాలు అనే భావన అందరిలో ఉంది.
ఓహో, మన మతం ప్రమాదంలో ఉంది, మనం మన మతాన్ని రక్షించుకుంటేనే మనకు ఉనికి అని ప్రజలు అనుకునేలా చేసారు. ప్రజల్లో ఇలాంటి ధోరణిని జాగ్రత్తగా పెంచి పోషిస్తూ వస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఉన్నత చదువులు లేవు. కొత్త ఉద్యోగావకాశాలు లేవు. మతం గురించి మాట్టాడితే ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయా? ఒక్కరు కాదు, దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలూ అంతే! అందరూ మతం గురించి మత సంబంధమైన కబుర్లు చెప్పి ముస్లిములను లాలించేవారే, జోకొట్టేవారే. ఈమధ్య సీపీఎమ్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్తూందని గమనించి గంగవెర్రులెత్తి పోతోంది ఎమ్మయ్యెమ్ము! దానికి విరుగుడుగా ఏం చేసారు వాళ్ళు? మత భావనలను రెచ్చగొట్టేందుకు తస్లీమా మీద దాడి చేసారు. ముస్లిములను అకట్టుకోవాలంటే మతమే సమ్మోహనాస్త్రం మరి! (కనీసం రాజకీయు లనుకుంటున్నారలా! అలా అనుకుంటూ బాగానే నెట్టుకొస్తున్నారు)
పరాయీకరణ: తమ మతభావాలను బట్టి ముస్లిములు మానసికంగా దూరం అవుతున్నారేమో గానీ ఇతర మతస్తులు వారిని దూరం చేసినందువలన మాత్రం కాదు. మతానికి వారి జీవితంలో ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. షరియత్ తరవాతే రాజ్యాంగం అని చెప్పగా వినలేదా మనం. రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమే అయితే ఈ మాటలెలా వస్తాయి? నాకు రాజ్యాంగమే సర్వోన్నతమైనది. కానీ దానికంటే షరియత్తే గొప్పదనే వ్యక్తికి నేను దగ్గర కాగలనా? స్వాతంత్ర్యోద్యమ రణన్నినాదం.. వందేమాతరం. నేనది పాడను అని ఎవరైనా అంటే నాకది కష్టం కలిగించదా? నేను ఐదో తరగతిలో ఉండగా మాకు ఒక సాయిబు ("సాయిబు" మావైపు గౌరవవాచకమే. "ముస్లిము" కంటే నాకామాట ప్రియంగా తోస్తుంది. మరో విధంగా భావించరాదని మనవి) పంతులుగారు హెడ్‌మాస్టరుగా ఉండేవారు. "వందేమాతరం"తోటే బడి మొదలయ్యేది, "జనగణమన", ఆ తరవాత "బోలో స్వతంత్ర భారత్ కీ.. జై" అనే నినాదంతోటే బడి ముగిసేది.
ఒక్కటి గమనించండి.. ముస్లిము సోదరులు అని అంటారు. హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు, సిక్కు సోదరులు అని అనడం వింటామా? ఎందుకలా? దువ్వడం! అక్కడి నుండే మొదలవుతుంది వారిని దువ్వడం. అదొక నిరంతర ప్రక్రియ. (ఇంత సీరియస్ విషయంలో ఈ పోలిక కుదురుతుందో లేదో గానీ నాకు ఇది పదే పదే గుర్తొస్తూ ఉంటుంది.. మనవాళ్ళు సినిమాల విడుదలకు ముందూ, అయ్యాక కొద్ది రోజులూ.. ఓ తెగ వాయించేస్తూ ఉంటారు ప్రాపగాండాతో. నిర్మాతా దర్శకుల దగ్గరి నుండి చిన్నాచితకా నటుల దాకా అందరూ ఇలా అంటూ ఉంటారు.. సెట్లో చిరూ సార్ ఎంతో కో ఆపరేటు చేసారు, బాలయ్య బాబు దగ్గరి నుండి నేనెంతో నేర్చుకున్నాను, నాగార్జున గారు సెట్లో ఉంటే అసలు పని చేస్తున్నట్టే ఉండదు.. ఇలా సొల్లుతూ ఉంటారు. వాళ్ళను దువ్వుతూ ఉండడం అన్నమాట. అలాంటిదే ఇది.) ముస్లిములకు ఓ ప్రత్యేకత ఉందని తెలియజెప్పడం సోదరులు అనడంతో మొదలవుతుంది. మాధ్యమాలు, రాజకీయులూ ఎక్కువగా వాడుతూ ఉంటారు దీన్ని.
"ఇరువర్గాల ఘర్షణల" గురించి చదివి ఆ వర్గాలెవరో తెలీదన్నట్టు మనం నటిస్తూంటాం.. అలాగే మన మధ్య ఈ తీవ్రవాదం బలిసిపోవడానికి మతతత్వం ముఖ్య కారణమని తెలిసీ, తెలీనట్టు నటిద్దామా? తీవ్రవాదం గురించి తెలిసీ.., ఇస్లామిస్టు తీవ్రవాదం గురించి చదవని / తెలియని / తలచని వారున్నారా? అందరికీ తెలిసిన ఈ విషయాన్ని రాస్తే నేనా జాబు రాయడమే తప్పన్నట్టు వ్యాఖ్యానించారు. నేను కూడా 'పెద్దమనిషి' (స్టేట్స్‌మన్ కు ఇంతకు మించిన తెలుగు పదం తట్టలేదు.) లాగా "ఒక వర్గానికి చెందిన తీవ్రవాదులు" అని రాస్తే పోయేది, నన్నేమీ అనగలిగేవారు కాదు. ఇదంతా చదివి నాకు పరమత సహనం లేదని నిందించకండి. అపరిమిత సహనం లేకపోవడం నిందార్హమంటారా.. నిందించండి!
ఇరువర్గాల మధ్య ఘర్షణకు ఒక ఉదాహరణ ఇది.. (మూణ్ణెల్లలోపే ఈ ఈనాడు లింకు చస్తుంది). ఇరవై ఇరవైలో భారత్, పాకిస్తాను మీద నెగ్గిన సందర్భంలో కర్నూల్లో జరిగింది. దీనికి కారణం ఫలానా వర్గమేనని నేననడం లేదు, రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు మోగేది. కానీ చప్పట్లకు మూలం చూసారా?

చదువరి గారూ, మీ టపా చూసాకా నాకేమనాలో తెలియటంలేదు. స్వచ్ఛమైన మనసులోని భావాలని నిష్కళ్మషంగా ఇలా ఏ వార్తాపత్రిక సంపాదకీయంలోనూ రాయరు(మనదేశంలో ఉన్న ఒక పెద్ద సమస్య ఈ మీడియా కూడా). మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవల్సింది చాలా ఉంది. మీరొక వార్తాపత్రిక పెడితే పనిచెయ్యడానికి నేను సిద్ధం!
రిప్లయితొలగించండిచదువరి గారూ...వ్యాసం బాగుంది.
రిప్లయితొలగించండి' ఇస్లాం ఒక మతం ' అనుకోవడంతోనే మొదలవుతుంది సమస్య.
మతం ముసుగులో వున్న ఓ భయంకరమైన ' కల్ట్ ' అనే నిజం ప్రజలందరకూ తెలియనంతవరకూ...
అసలు మహమ్మద్ ఎవరు?...ఎన్ని దోపిడీలు చేసాడు? ఎందరిని స్వయంగా చంపాడు? ఎందరు స్త్రీలను బానిసలుగా చేసుకొన్నాడు? లాంటివి తెలియనంతవరకూ.... ప్రపంచమంతా ముస్లిములు చేసే మారణ కాండ సాగుతూనే వుంటుంది.
ఇస్మాయిల్ గారూ,
మీరు చేస్తోన్న సర్వ మత ప్రార్ధనలు అనే భావన ఉన్నతమే కానీ, ఇస్లాం మాత్రం దాన్ని అస్సలు సహించదు... - సల్మాన్ ఖాన్ ఫత్వా విషయం తెలుసుగా?
ఇస్లాం అసలు రంగు బయటపడడానికి ...గూగుల్ లో ఇలా చిన్నగా వెదికినా చాలు...' islam religion or cult? ' లేదా ' islamic terrorism '...
-శేఖర్
Sriiraam gaaruu,
రిప్లయితొలగించండిmiiDiyaa samasya manadESamlOnEkaadu, prapanchamantaa vundi. '# politically correctness #' valla gaanii, ' mata tatva ' anE mudra vEstaarEmOnanE bhayam valla gaanii, lEdaa '# Jyllands-Posten #' laa # TARGET # avutaamEmO anE bhayam valla gaanii...miiDiyaa swE chchagaa raayalEka pOtOndi.
-SEkhar
శ్రీరాం గారూ,
రిప్లయితొలగించండిమీడియా సమస్య మనదేశంలోనేకాదు, ప్రపంచమంతా వుంది. ' politically correctness ' వల్ల గానీ, ' మత తత్వ ' అనే ముద్ర వేస్తారేమోననే భయం వల్ల గానీ, లేదా ' Jyllands-Posten ' లా TARGET అవుతామేమో అనే భయం వల్ల గానీ...మీడియా స్వే చ్చగా రాయలేక పోతోంది.
-శేఖర్
చదువరి గారూ !
రిప్లయితొలగించండిమతం, మతం అంటూ అన్ని మతాల్నీ ఒకే గాటన కట్టి నిందించకండి. ఇస్లాం లాగా అంత భయంకరంగా మనుషుల్ని మృగాలుగా మార్చి తోలే మతం ఇంకేదీ లేదు. మీరొక సంగతి చెబితే ఆశ్చర్యపోతారు. బహుశా నమ్మరు కూడా. గత 1200 వందల ఏళ్ళలో ఇండియాలో ఇస్లామిక్ ముష్కరుల దుండగాలకు బలైపోయిన హిందువుల సంఖ్య 8 కోట్లుంటుందని ఒక ఫ్రెంచి చరిత్రకారుడు అంచనా వేశాడు. క్రీ.శ.13 వ శతాబ్దం దాకా హిందూ రాష్ట్రంగా ఉన్న కాశ్మీర్ హఠాత్తుగా ముస్లిం రాష్ట్రంగా ఎందుకు మారిందంటారు ? అల్లా వచ్చి స్వయంగా దర్శనమిచ్చి మార్చాడా ? లేక కత్తులూ కటార్లూ హిందువుల మీద వీరవిహారం చేశాయా ? ఆలోచించండి. ఒక ఆఫ్ఘనిస్తాన్ అయినా మరో పాకిస్తాన్ అయినా ఇంకో బాంగ్లాదేశ్ అయినా అన్నిటిదీ ఒకటే కథ....కత్తి మతం...కటార్ల మతం...రక్త మతం...రాక్షస మతం. వాళ్ళు ఇంకా అల్లా గురించి మాట్లాడుతూండడం చాలా ఆశ్చర్యకరం.
ఆ దేశాలే కాదు, మన (తెలుగు) ముస్లిములు కూడా అందరూ ఒకప్పుడు హిందువులే. అందరూ బలవంతంగా మతం మార్చబడ్డవాళ్ళే.
మీరు చెప్పిన విశేషాలు బానే ఉన్నాయి.
రిప్లయితొలగించండికాకపోతే ఇక్కడ ఆక్సెప్టెన్స్ కి కానీ అది లేకపోవడానికి కానీ ముఖ్య కారణం ఒక మతం కానీ ఒక వర్గాన్ని కానీ వేలెత్తి చూపితే తమనే ఎత్తి చూపినట్టు జనాలు భావిస్తారు. అది అనివార్యం కూడా.
అది ఎవరయినా సరే. ఇస్లాం వాదులు బీజేపీ ని, ఆరెసెస్ నీ హిందూ తీవ్రవాదం గా పరిగణించడం నేను విన్నాను. అది తప్పా, సరా అనేది ఇక్కడ విషయం కాదు. కానీ అలా అనగానే హిందువులు అఫెండ్ అవుతారు. హిందూత్వాన్నీ తీవ్రవాదాన్ని ఒక గాటిన కట్టేస్తారా అని.
ఇలా ఎవరిని వేలెత్తి చూపినా ఆ వర్గం అఫెండ్ అవుతుంది.
జనాలు దాంట్లోంచి బయటకొచ్చి అతీతంగా ఆలోచించగలిగితే అప్పుడు మూలాలు ఆలోచించగలరు. ఇది ఏదో ఐడియలిస్టిక్ టాక్ గా అనిపించినా నిజమని నా అభిప్రాయం.
ఒక సమస్య పరిష్కరించాలంటే దాని మూలాలలోకి వెళ్ళడం తప్పనిసరి. ఆ మూలం వెతకడం అనే ప్రక్రియ మన రాజకీయనాయకుల దువ్వడం వల్ల నెరవేరకుండా పోతుంది. ఎక్కడ ఎత్తి చూపితే తమ వోటు బాంకులు గల్లంతవుతాయో అని వారిని వెనకేసుకొస్తారు. దర్యాప్తులు నడవకుండా ఆపుతారు.
అలాగే ఇది కేవలం ఇస్లామో ఇంకేదానికో ప్రత్యేకం కాదు. "కింది వర్గాలు" అని స్టాంపేసిన ప్రజలను దువ్వడానికి రిజర్వేషన్లను పెంచుకుంటూ పోవడం లంటివి కూడా ఈ కోవలోకే చెందుతాయి. జనాలు ఎడ్యుకేట్ అవాలి. అవేర్నెస్ రావాలి.
శ్రీరాం గారూ, పత్రిక పెడితే నే కొంటా :)
రాయటానికి ఏమీ లేదు. మీ అందరికీ సంఘీభావం తెలపటం తప్ప
రిప్లయితొలగించండిఅఫెండ్ అవుతారని గాంధీ గారి కోతుల్లా నిజాన్ని చూడకుండా, కళ్ళు; నిజాన్ని వినకుండా, చెవులు; నిజాన్ని మాట్లాడకుండా; నోరు ఎన్నాళ్ళు మూసుకోవటం??
రిప్లయితొలగించండిపోలీసులకు ఒక మనిషిని చూసి అతన్ని తాకకుండా, ప్రశ్నించకుండా, లక్షల మందిలో తీవ్రవాదులను పసిగట్టే అతీంద్రియ శక్తులు, సిక్స్త్ సెన్సులు, రయ్యన సూపర్ మాన్లాల ఎక్కిడికైనా ఎగరగలిగే అష్టసిద్ధులు ఉంటేతప్ప తీవ్రవాదం అంతం కాదేమో (పట్టకుంటే తప్పు, ప్రశ్నిస్తే తప్పు, సోదా చేస్తే తప్పు..మానవ హక్కులు..గొర్రె పెండ)
"మర్మమెఱుగ లేక మతములు కల్పించి
రిప్లయితొలగించండియుర్విజనులు దు:ఖ మొందుచుండ్రు
గాజుటింటి కుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ! వినురవేమ!"
శేఖర్ గారు,
For the record నేనే మతావలంబీకున్నీ కాను. నేను పెరిగిన సంస్కృతీ, సంప్రదాయాలను గౌరవిస్తానంతే! ఇంకా చెప్పాలంటే నేను ఓ Agnostic.
తాడేపల్లి గారూ,
కత్తి మతం ఏంటండీ? అలాగైతే క్రైస్తవం-క్రూసేడులు, శైవ-వైష్ణవ ఊచకోతలు,భారతంలో జైన-బౌద్ధ మతాల నిర్మూలన జరిగే క్రమంలో జరిగిన దారుణాలు...ఇలా చెప్పుకొంటూ పోతే అన్నీ కత్తి మతాలే. ప్రాథమికంగా ఆనాటి సంఘటనలకు నేటి సమాజవిలువలు అంటగట్టి న్యాయం అడిగితే ఇలానే ఉంటుంది. ఏదేమైనా అన్నిటికీ మూలకారణం-అధికారం, అందుకోసం పోరాటంలో బలవంతుడిదే రాజ్యం కావడం.
తెలుగువీర,
మీరు చెప్పింది అక్షరాల నిజం.కానీ ఆ "మానవ హక్కులు-గొర్రె పెండ" అన్నారే అదే ఆక్షేపణీయం.చూస్తూనే ఉన్నారుగా ఇరాక్ యుద్ధం తీవ్రవాదాన్ని పెంచిందో? తుంచిందో?
ఉగ్రవాదులందరూ కూడా, ప్రజల బలహీనతలని సొమ్ము చేసుకుంటూ, వాళ్ళ కార్యకలాపాలు సాగిస్తున్నారు.. అయితే అలాగని అందరినీ ఒకే గాటన కట్టేయలేము కదా..
రిప్లయితొలగించండిఉదాహరణకు, అసలు మన రాష్టంలో త్యాగరాజ ఉత్సవాలని మొట్టమొదటిగా ప్రారంభించిన వ్యక్తి ఒక ముస్లిమ్, తెనాలిలో, గత ఇరవయ్యేళ్ళుగా, గణపతి నవరాత్రులు జరిపించేది ఒక ముస్లిమ్.. అంతెందుకు మనం ఎంతగానో పూజించే రాముడు కూడా మొదట తానీషా ప్రభువుకే దర్శనమిచ్చాడు(రామదాసు కంటే ముందే)..!
అయితే, ఈ రాజకీయనాయకులు తమ ఓట్ల కోసం వాళ్ళలో వ్యతిరేక భావనలని పెంచి పోషిస్తున్నాయి లేకపొతే ఒక రచయిత్రిని అందరి ముందు కొట్టి, నిన్ను చంపేస్తాం అన్నా కూడ కేసు నమోదు కాదు.. మొన్న కరుణానిది గారిని వేదాంతి అనే హిందూ వాది, ఆయన తలకి వెలగట్టారని, మీడియా మొత్తం గగ్గోలు పెట్టింది, పోలీసులు కేసు నమోదు చేశారు.. ఇది కరెక్టే, కానీ ఇదే పని ముస్లిమ్ లు చేసినప్పుడు, వాళ్ళని ఎవరూ ఏమీ అనరు..
మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, UNPA తరపున పోటీ చేసిన అభ్యర్ధ్ధి ముస్లిమ్.. మన చంద్రబాబు గారు ఆయనంత గొప్పవాడు లేడని మోసేశారు.. కానీ ఆ మహనీయుడు, వందేమాతరం అంటేనే తనకు ఇష్టం లేదు.. నేను భరతమాతని గౌరవించను, అల్లా తప్ప వేరే దెవుడిని నమ్మను, గౌరవించను అని అన్నారు.. మరి ఈ లౌకిక వాదులంతా అప్పుడు ఏమయ్యారు..? ప్రతి చిన్న విషయాన్ని సుమోటో కేసు క్రింద స్వీకరించే కోర్టులు ఆ విషయన్ని ఎందుకు పట్టించుకోలేదు.. ఏ ఒక్క పత్రిక కూడా దీన్ని తప్పు పడుతూ, సంపాదకీయాలు ఎందుకు వ్రాయలేదు?
సి.పి.యమ్ వాళ్ళు పాతబస్తీలో భూపోరాటం చేయడానికి అడుగుపెట్టినప్పుడు ఎమ్.అయి.ఎమ్ వాళ్ళు తెగ భయపడిపోయారు, ఎక్కడ తమ పునాదులు కదులుతాయో అని.. అంతే కదా మరి, ఇప్పటివరకు వాళ్ళని బలహీనులుగా, చుట్టూ ఉన్నవాళ్ళందరినీ బలవంతులుగా చూపి వీళ్ళందరినీ గుప్పెట్లో పెట్టుకున్నారు.. ఇప్పుడు వాళ్ళకి తమకి కనీస అవసరాలు కూడ తీరనప్పుడు ఈ మతం ఎందుకు అని ఎక్కడ ఆలోచన వస్తుందో, వస్తే అది వారి అంతానికి ఆరంభం.. అందుకే అలాంటివాటిని మొగ్గలోనే త్రుంచేయడానికి ఈ కుహనా లౌకికవాదులందరూ తమ వంతు ప్రయత్నం తాము చేస్తుంటారు…
ఈ పరిస్థితులు మారనంత కాలం మతం ముసుగులో జరిగే మారణహోమాలు ఆగవు..
విశ్లేషణ బానే ఉంది - కానీ పరిష్కారం మాత్రం లేదు, ఎందుకంటే - అధికారం అలాంటిది. power corrupts, absolute power corrupts absolutely!"
రిప్లయితొలగించండిచదువరీ, మానవహక్కుల ముసుగును బాగా ఉపయోగించుకుంటున్నారన్న అక్రోషంలో నేను రాసిన దాన్ని క్షమించగలరు.
రిప్లయితొలగించండిసోలార్ ఫ్లేర్ గారూ, power corrupts అనేది తప్పు..లక్షలమందిని నడిపించిన గాంధీ, క్రీస్తు, బుద్ధుడు , వివేకానందుడు వంటి మహామహుల వద్ద ఉన్నది శక్తి కాదంటారా? it's humans that are corrupt..please don't blame power. we all need power. Power to rise, stand up and excel.
వ్యాఖ్యాతలందరికీ నెనర్లు.
రిప్లయితొలగించండి".. బానే ఉంది - కానీ పరిష్కారం మాత్రం లేదు,.." పరిష్కారం లేనిది దేనికి? వివరించగలరు!
@TeluguVeera gaaru,
రిప్లయితొలగించండిI think you are confusing yourself between strength and power.
now..i am really confused :-( Gandhi was a powerful man..was he a strong man?
రిప్లయితొలగించండిచదువరి గారూ
రిప్లయితొలగించండిభావాల్ని చాలా స్పష్టంగా వెల్లడించినందుకు నెనర్లు...
పరిష్కారం లేకపోవడమనేది లేనే లేదు.. కావల్సిందీ కరువైనదీ చిత్తశుద్ధి మాత్రమే..