20, నవంబర్ 2007, మంగళవారం

ఏరు దాటిన వెనుక..

కం. ఏరును దాటిన దళపతి
పేరుకె మద్దతు తెలిపెను! పేరోలగమున్
చేరగ తొలగెను ముసుగులు
తేరుకు జూచిన ప్రభుతకు తెరపడి పోయెన్!


ఊరు హర్దనహళ్ళి
ఊతపదమట 'హళ్ళి'
'అప్ప'జెప్పిరి మళ్ళి
-కర్నాటకదల్లి

సూత్రధారుడు నాన్న
పాత్రధారుడు కన్న
భాజపాకిక సున్న
-కర్నాటకాన

రాజకీయమ్మంత
రోత వెదకిననెంత
కానరాదే సుంత
-దేశమందంత!

4 కామెంట్‌లు:

  1. బాగా చెప్పారు, రోత పుట్టించే రాజకీయం అంటే ఇదే..ఇదంతా దేవగౌడ తన మూడవ పుత్రరత్నాన్ని ముఖ్యమంత్రిని చేయడానికి నడిపిన బూతు రాజకీయం

    రిప్లయితొలగించండి
  2. చదువరి గారు రెండు కవిత్వాలు కలిపి కొడుతున్నారు కదా, కందం బాగుంది, దానితో ఉన్న భావ కవిత్వం కూడా సూపర్.

    పేరోలగమున్ అంటే అర్థం కాలేదు.

    నేను వార్తలు పెద్దగా చదవను వీవెనుడీ పుణ్యామా అని కొత్త కూడలిలొ తెలుగు జర్నల్ వార్తల మీద కన్ను వేయగలిగే ఏర్పాటు లభించింది, దానితో తెలిసింది ఆ వార్త గద్దె ఎక్కడం దిగడం కూడా అయిపోయిందని.

    http://blogeswaradu.blogspot.com/2007/11/blog-post.html

    ఊకదంపుడు గారు మీరు వెలుబుచ్చిన, నా మనసులో ఉన్న సందేహాం నివృత్తి చేయప్రయత్నించారు. కానీ నాకు ఇంకా సందేహం ఉన్నది. బహుశ ఊకదంపుడు గారు జాతుల పద్యాల ప్రాస నియమం గురించి మాట్లాడారేమో??

    కొన్ని వృత్తా పద్యాలలొ ప్రాసకి వాడబడిన అక్షరము అనుస్వరం తో కూడినది కూడా చూశాను. కాని కందం లొ మాత్రము ప్రాస అనుస్వరం తో ఉంటే మిగతా అన్ని పాదాలతో అనుస్వరం ఉండాలి అలాగే కాబోలు మొదటి అక్షరం నియమం కూడా

    రిప్లయితొలగించండి
  3. ఇప్పుడు మళ్ళీ క్రొత్త నాటకం మొదలు పెట్టాడు కదా కుమారస్వామి, తండ్రి నుండి విడిపోయి వేరే పార్టీ పెడతాను అంటున్నాడు.. చూద్ద్డాం, ఇది ఎన్ని రోజులు సాగిస్తాడో..!

    రిప్లయితొలగించండి
  4. @giri - నెనరులు
    బ్లాగేశ్వరా - పేరోలగము అంటే సభ!
    మేథ - అవును, నాటకాల రాయుళ్ళే!

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు