భాష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భాష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, నవంబర్ 2011, శుక్రవారం

గూగులుకు తెలుగు నేర్పాలి మనం!

13 కామెంట్‌లు
తెలుగులో పదాలను వాక్యంలో ఇమిడ్చేటపుడు అవి రూపం కోల్పోతూ ఉంటాయి. సంధి జరిగి, సమాసం ఏర్పడినపుడు, బహువచనాలైనపుడు, విభక్తులు చేరినపుడు, .. ఇలా అనేక రకాలుగా పదాల రూపు మారుతూంటుంది. క్రియా రూపాలను బట్టి మారడం సరేసరి! ఇంగ్లీషులోనూ మారతాయిగానీ, తెలుగులో మారినంత ఎక్కువగా ఆ భాషలో జరగదు. పైగా ఇంగ్లీషులో జరిగే మార్పులు కొన్ని ఖచ్చితమైన నియమాలకు లోబడి జరుగుతాయి. ఆ నియమాలు కూడా తక్కువే. తెలుగులోనూ నియమాలున్నాయి గానీ, అవి చాలా ఎక్కువ.

31, ఆగస్టు 2011, బుధవారం

తెలుగులో తేదీని ఎలా రాయాలి? (Date format in Telugu)

2 కామెంట్‌లు
తెలుగులో తేదీ ఆకృతి - తేదీ ఫార్మాట్ (Date format) - ఎలా ఉండాలి?

’ఎలా ఏముంది.. 08/31/11 అని ,అంతేగా’ అంటారు నేటి ఐటీ ఘనపాఠీలు. నాకు తెలిసిన ఐటీ కుర్రాడొకడు కిస్మీసు సెలవలకి అమెరికా నుంచి వాళ్ళూరు వచ్చాడు. వాళ్ళ తాతకు ఏదో కాగితం రాసిపెడుతూ తేదీని 12/13/06 అని రాసాడంట. అదిచూసి, ఆ పెద్దాయన, ’సదవేత్తే ఉండమతి పోయిందిరా నీకు’ అని అన్నాడంట. తేదీని తిరగరాసి, ’ఎమెరికన్స్ డేట్ ని అట్లాగే రాస్తారు తాతా’, అని అసలు సంగతి చెప్పాడంట, మనవడు. అమెరికా వోళ్ళకు తిక్కగానీ ఉందేంట్రా.. రోడ్డుకు కుడేపున పోతారంటగా? అని అడిగాడంట ఆయన.  ఔను తాతా. అంతేకాదు, లోకమంతా లీటర్లు, కిలోమీటర్లూ అంటూ ఉంటే వాళ్ళు ఔన్సులు, అడుగులూ, మైళ్ళూ అంటారు. వాళ్ళక్కొంచెం తిక్కలే! అని చెప్పాడంట.

3, ఆగస్టు 2010, మంగళవారం

తెలుగులో వెతకటం అంత వీజీ కాదు గురూ!

20 కామెంట్‌లు
(ఈ వ్యాసంలో కొన్ని పదాల పక్కన బ్రాకెట్లలో అంకెలు చూపించాను. అవి - ఆగస్టు 2 రాత్రి ఆయాపదాల కోసం గూగిలించినపుడు వచ్చిన ఫలితాల సంఖ్య. మళ్ళీ వెతికితే ఈ ఫలితాలు కొద్దిగా అటూఇటూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రాసినదంతా గూగుల్లో వెతకడాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినదే. గూగిలించడం అంటే google.com లో వెతకడం.) 

1, మార్చి 2009, ఆదివారం

పేర్ల పురాణం

23 కామెంట్‌లు
"విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, డాక్టర్, పద్మశ్రీ  నందమూరి తారక రామారావు నటించిన.. " అని మన రాష్ట్ర విఖ్యాత సినిమారిక్షా వాడు చెప్పుకుంటూ పోతూంటే, అది వింటూ, వాడు పంచే కరపత్రాల కోసం ఆ బండెనకాలే పరిగెడుతూ -ఆహా, తలుచుకుంటూంటేనే మైకం కమ్ముతోంది. ఆ మైకువాడు ప్రతీసారీ ఆ ముందరి బిరుదులన్నీ వరసాగ్గా చదివేవాడు, అదంతా రామారావు ఇంటిపేరైనట్టు! రామారావు భక్తులైన కొందరు నాబోటిగాళ్ళు కూడా ఉత్త రా. మా. రా. వు. అని అంటే పాపం తగులుద్దేమో అన్నట్టు మొత్తం బిరుదులన్నీ చదివి మరీ పేరు చెప్పేవాళ్ళు.

13, జూన్ 2008, శుక్రవారం

దశావతారం

11 కామెంట్‌లు
ఆ పేరేంటి? దశమావతారమన్నా అనాలి లేదా దశావతారాలు అనన్నా అనాలి. దశావతారం అనొచ్చా? "పది అవతారం" !!!

29, నవంబర్ 2007, గురువారం

మర్యాదకరమైన మాటలు

14 కామెంట్‌లు
ఈ జాబు ఎవరిని ఉద్దేశించీ రాసింది కాదు. ఇది ఏ కొందరికో మాత్రమే పరిమితమైన విషయమూ కాదు. నాకూ అటువంటి భావనే ఉంది, దాదాపుగా అందరూ అలానే భావిస్తారనుకుంటా.
........

కొన్ని మాటల విషయంలో తక్కువతనాన్ని (నిమ్నత్వాన్ని), అమర్యాదను తెలియజేయడానికి తెలుగు పదాలను వాడుతూ, గొప్పతనాన్ని, ఉచ్ఛతను, మర్యాదను తెలియజేసేందుకు సంస్కృతాన్ని వాడతాం. దాని గురించే ఈ జాబు.

11, అక్టోబర్ 2007, గురువారం

వ్యాఖ్యోపాఖ్యానం

23 కామెంట్‌లు
తెలుగు బ్లాగుల రాసి బాగా పెరుగుతోంది, ఇక బ్లాగరులు 'వాసి'పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ వింజమూరి విజయకుమార్ గారు మధ్యంతర మార్గ నిర్దేశనం లాంటిది చేసారు. బ్లాగు నాణ్యతకై బ్లాగరులంతా పునరంకితం (అమంగళం ప్రతిహతమగుగాక :) ) కావాలని వారి ఉద్దేశ్యం కాబోలు.

20, సెప్టెంబర్ 2007, గురువారం

గురు లఘువులు

42 కామెంట్‌లు
తెలుగు బ్లాగరుల్లో పద్యాలు రాసేవారు కొందరున్నారు. వారివలన పద్య చాపల్యం అంటుకున్న వారిలో నేనూ ఒకణ్ణి. అదే చెబుతున్నానిక్కడ.

20, ఫిబ్రవరి 2007, మంగళవారం

తప్పటడుగులు

17 కామెంట్‌లు
చిన్నప్పుడు మనం నేర్చుకున్న తప్పులను తరువాత్తరువాత సరిదిద్దుకుంటాం. కానీ ఆ తప్పులు మన మనసులనలాగే అంటి పెట్టుకుని ఉంటాయి, పుట్టుమచ్చల్లాగా. నేను నేర్చుకున్న అలాంటి కొన్ని తప్పులు ఇక్కడ వివరిస్తాను. ఫెయిల్యూరు కథల్లాగా ఇది నా తప్పుల చిట్టా!

14, నవంబర్ 2006, మంగళవారం

తెలుగు, ఆంధ్రం - కనకదుర్గ గారి అబద్ధాలు, దూషణలు

16 కామెంట్‌లు
ఆంధ్రజ్యోతిలో కనకదుర్గ దంటు గారు రాసిన వ్యాసం చదివి నేనీ స్పందనను రాస్తున్నాను. ఆ వ్యాసంలో ఆమె చాలా అవాస్తవాలను రాసుకు పోయారు. తెలుగు అనే మాట తెలంగాణ వాళ్ళదనీ, ఆంధ్ర ప్రాంతం వారికి దానితో అసలు సంబంధమే లేదనీ ఆవిడ వాదించారు. ఇంత పరమ మూర్ఖపు వాదనను చదివాక నా స్పందనను రాయకుండా ఉండ లేకపోతున్నాను. ఇక ఆంధ్ర అనేమాటను ఆమె కోస్తా, రాయలసీమ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని వాడారు. నా దృష్టిలో అది తప్పైనా, వాదన కోసం నేనూ అదే వాడాను.

4, అక్టోబర్ 2006, బుధవారం

గురజాడపై విమర్శ

0 కామెంట్‌లు
గురజాడ గురించి గొప్పగా వింటూ వచ్చాం! విమర్శ చాలా అరుదు. కానీ ఈ లింకు చూడండి, ఎంత తీవ్ర విమర్శ ఉందో! కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ రాయనే లేదనే సుప్రసిద్ధ విమర్శలో కూడా దాన్ని ఆయన రాయలేదని అన్న్నారే గానీ, (దాన్ని ఆయన ఇంగ్లీషులో రాస్తే ఆయన స్నేహితుడు తెనిగించారనే వాదన ఉంది. పెద్ద చర్చే జరిగింది. ఇదంతా గురజాడ చనిపోయాకే!) ఇంత ఘోరంగా విమర్శించలేదు. నిజానిజాలు దేవునికెరుక! రచయిత నవరసాల అట.

అదే పేజీలో ఒక "సవర" కవి తెలుగులో రాసిన కవిత చూడండి, బాగుంది. 'వెన్నెముక లేని జంతువుల'ను తరిమేసి 'అకశేరుకాల'ను తెచ్చుకున్నారు అంటూ, సంస్కృత భాషపై మన మోజును కలమెత్తి చూపిస్తున్నాడు.

19, సెప్టెంబర్ 2006, మంగళవారం

ఆదివారం టీవీ కార్యక్రమాలు

2 కామెంట్‌లు
మామూలు రోజుల్లో లాగానే ఆదివారం నాడు కూడా టీవీల్లో సినిమాల గురించిన కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త సినిమాల నటులు, దర్శకులు, నిర్మాతలతో ఇంటర్వ్యూలు పెట్టి వాటికి ప్రచారాలు కలిగించే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. జెమినీలో జోకర్ల లాంటి ఇద్దరు లంగర్లు (మనుషులు బాగానే ఉంటారు, వాళ్ళ ప్రవర్తనే.. జోకర్లలాగా ఉంటుంది. ఒకరి పేరు సత్తెన్న.. ఇంకోళ్ళెవరో గుర్తు లేదు) కొత్త సినిమా జనుల ఇళ్ళలో లంగరు దించి, ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు. ఈ మధ్య వస్తున్నట్లు లేదు (మరో పిచ్చి కార్యక్రమమేదో పెట్టి ఉంటారు!).

20, ఆగస్టు 2006, ఆదివారం

పదాలు, దపాలు

5 కామెంట్‌లు
ఓ పదం.. ఆ పదంలోని హల్లులను అటూఇటూ మారిస్తే మరో అర్థవంతమైన పదం. హల్లులు స్థానాలు మారతాయి గానీ, గుణింతం మాత్రం యథాస్థానంలోనే ఉంటుంది. దాంతో ఆ రెండు పదాలను పలికే తీరు (శబ్దం) ఒకే రకంగా ఉంటుంది. ఉదాహరణకు మోహము, హోమము. రెండింటిలోని హల్లులు - మ, హ, మ - అటూ ఇటూ అయ్యాయి. గుణింతం మాత్రం స్థానం మారలేదు. (ఇంగ్లీషులో అనాగ్రం అనే పదముంది. ఒక పదంలోని అక్షరాలన్నిటితో కూర్చిన మరో పదం లేదా పదబంధాన్ని అనాగ్రం అంటారు.) కానీ ఈ పదాల్లో హల్లుకు ఉండే గుణింతం మారిపోతుంది. అంచేత ఇవి అనాగ్రం లు కావు. వీటినేమనాలో!!? (అనాగ్రంలు కానివి - అగ్రంలు :-) ) అయితే ఈ పదాల RTS స్పెల్లింగు (hOmamu - mOhamu) మాత్రం అనాగ్రమే!

12, ఆగస్టు 2006, శనివారం

ఎన్నోవాడు?

5 కామెంట్‌లు
ఆ ఫోటోలో మీవాడు ఆ చివరి నుండి ఎన్నోవాడు?
ఈ వాక్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించండి. "ఎన్నోవాడు" ను ఎలా అనువదిస్తారో చూడాలనుంది, అంతే!
ఎన్నోవాడు, ఎన్నోరోజు ఇలాంటివి ఇంగ్లీషులోకి అనువదించలేమట.
ఇలాంటివి ఇంకా ఉన్నాయా?

8, ఆగస్టు 2006, మంగళవారం

భావ దారిద్ర్యం, భావ దాస్యం

4 కామెంట్‌లు
చిన్న విషయంగా అనిపించవచ్చు. కాస్త ఆలోచిస్తే ఏమిటి మనకింత అవివేకం అనిపిస్తుంది. బొంబాయిలో జూలై 11 న పేలుళ్ళు జరిగితే.. దాన్ని 7/11 అన్నారు. నిజానికి మన పద్ధతి ప్రకారం అది 11/7. మరి అలా ఎందుకన్నారు? అమెరికా వాళ్ళు ముందు నెల పెట్టి ఆపై తేదీ పెడతారు కాబట్టిన్నీ, 9/11 అనేది, వాళ్ళ దేశంలో ఇలాంటిదే ప్రముఖ దాడి జరిగిన తేదీ కాబట్టిన్నీ, దానికి ప్రాస కుదురుతున్నది కాబట్టీ దాన్ని మనం 7/11 అన్నాం! దీనికి ప్రధాన కారకులు కొందరు మాధ్యమాల వాళ్ళు, మరీ ముఖ్యంగా కొత్త పుంతలు తొక్కుతున్నామనుకుంటూ పెడదోవలు తొక్కే టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికిల్, టీవీ9 లాంటి ప్రసార సాధనాలే!

21, జులై 2006, శుక్రవారం

నెట్లో తెలుగు వ్యాప్తి

3 కామెంట్‌లు
నెట్లో తెలుగు వ్యాప్తికై మనమేం చెయ్యాలి.

ఈ విషయం పాతదే! నెట్లోనూ, నోట్లోను కూడా బాగా నానింది. బ్లాగరుల సమావేశాల్లో ఈ విషయం అనేక సార్లు చర్చకు వచ్చింది. అనేక సూచనలొచ్చాయి. ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు గాను కింద నే రాసిన ఆరు మార్గాలు కొత్తవేం కాదు. గతంలో ఎందరో చెప్పినవే! మరోసారి బ్లాగరులు జూలై 23న హై.లో కలుస్తున్న వేళ.. చర్విత చర్వణమిది.

4, జూన్ 2006, ఆదివారం

బూదరాజు రాధాకృష్ణ అస్తమయం

3 కామెంట్‌లు
ప్రసిద్ధ భాషావేత్త, తెలుగు భాషా శాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ జూన్ 4 న మరణించారు. ఈనాడు పత్రిక ద్వారా బూదరాజు రచనలు నాకు పరిచయం అయ్యాయి. వారం వారం తెలుగు మాటల గురించి పాఠం చెప్పేవారు. ఏది సరైన పదం, ఏది కాదు అనేది చక్కగా విడమర్చి చెప్పేవారాయన. తరువాత్తరువాత అవే పుస్తకాలుగా వచ్చాయి.

రాధాకృష్ణ గారి పుస్తకం మాటలూ-మార్పులూ పుస్తకంలోంచి కొన్ని మచ్చుతునకలు..
  1. స్మశానం తప్పు శ్మశానం సరైనది.
  2. రాబందు అనే మాట రామ బంధువు నుండి వచ్చింది. సీతాపహరణ వేళ రాముడికి సాయం చేసి, జటాయువు రామ బంధువై, రాంబంధువైంది. అదే రాబందు అయింది.
  3. ఋజువు తప్పు, రుజువు సరైనది
ఇలా మనం మామూలుగా చేసే ఎన్నో తప్పులను ఎత్తి చూపిన మాస్టారు ఆయన. వ్యవహార పదకోశాలు రాసారు. ఆయన మరణంతో తెలుగు భాష చిన్నబోయింది. వికీపీడియాలో బూదరాజు రాధాకృష్ణపై వ్యాసం చూడండి

17, మే 2006, బుధవారం

ఒంటరిగా మనలేని మాటలు

11 కామెంట్‌లు
తెలుగులో మనక్కొన్ని పదాలున్నాయి.. ఒంటరిగా పెద్ద గుర్తింపు లేనివి.. మళ్ళీ అదే పదంతో జతయితే అర్థవంతమౌతాయి. అలాంటివి కొన్ని ఇక్కడ, సరదాగా.. (ఇది కవిత కాదు!)

చతుర భక్తి, నిష్ఠుర భక్తి, ఎత్తిపొడుపు భక్తి..

1 కామెంట్‌లు
ఆధ్యాత్మిక రచనలతో తెలుగు సాహిత్యం పరిపుష్టమయింది. దేవుణ్ణి కీర్తిస్తూ చేసిన రచనలు ఎన్నో కాగా, కొన్ని మాత్రం భిన్నమైనవి. భగవంతుణ్ణి మాయజేసో, బుట్టలోవేసో, ఎత్తిపొడిచో, నిష్ఠురాలాడో తమ పనులు నెరవేర్చుకున్న కార్యసాథకులైన భక్తుల గురించిన రచనలు ఇవి.

2, మే 2006, మంగళవారం

తెలుగు అమలు - ఇంటా బయటా

4 కామెంట్‌లు
(నేను దీన్ని నా తెలుగు రాతలు బ్లాగు నుండి సేకరించాను. నేనేమాత్రం ఆచరిస్తున్నానో, నేనసలేమనుకుంటున్నానో బ్రాకెట్లలో రాసాను. త్యాగ గారూ, మంచి లింకిది, థాంక్స్)
ఇంటింటా తెలుగు దివ్వె
డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ Courtesy: ఈనాడు

సంబంధిత టపాలు