ఇతడి వార్త వచ్చిన ఆగస్టు 25నే మరో వార్త కూడా వచ్చింది. అంతరించి పోతున్న కృష్ణజింక జాతిని (అతడు చంపేసిన జింక జాతి) కాపాడేందుకు హైదరాబాదులోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ - మక్కికి మక్కి అనువాదం చేస్తే.. కణ, కణజాల జీవశాస్త్ర కేంద్రం) నడుం బిగించింది. కృత్రిమ గర్భధారణ ద్వారా ఒక జింక పిల్లను భూమి మీదకు తెచ్చారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు మనోజ్‌పాటిల్, సదానంద్, ఉమాపతి దీనిపై కృషిచేసారు. వీరు అయిదు మగ కృష్ణజింకల నుంచి 85 వీర్యనమూనాలను సేకరించారు. వీటిని మూడు జింకల్లో కృత్రిమ విధానంలో గర్భధారణ చేయించగా ఒకటి విజయవంతం అయిందని సీసీఎంబీ సంచాలకులు లాల్జీసింగ్ చెప్పారు. [2007 ఆగస్టు 25 నాటి ఈనాడు వార్త -ఈ లింకు ఎన్నాళ్ళో పనిచెయ్యదు]
శభాష్, శాస్త్రవేత్తలూ!
సీసీఎమ్‌బీ, మూలకణాలపై (స్టెమ్‌సెల్స్) పరిశోధనలు చేస్తున్న ఏకైక భారతీయ సంస్థే కాకుండా, ప్రపంచంలోని అతి కొద్ది సంస్థల్లో ఇది ఒకటని కూడా చదివిన గుర్తు. మొదలుపెట్టినకొత్తలో దాని గురించి ప్రముఖంగా వార్త వచ్చింది, అది ఎంత బాగుందో, దాని పరిసరాలెంత బాగున్నాయో అంటూ! అప్పటి సంచాలకుడు (భార్గవ అనుకుంటా) మారి, లాల్జీసింగు వచ్చాక ఆయన జీవిత విశేషాలను గురించిన వార్త వచ్చింది.
----- -x- -----
కొసమెరుపు: ఆ సినిమా హీరో ప్రాణాలు తీస్తే, శాస్త్రవేత్తలు ప్రాణాలు పోసారు. ఈనాడులో అతడి వార్త మొదటి పేజీలో ఫోటోతో సహా ప్రముఖంగా వచ్చింది, వీరి వార్త ఐదో పేజీలో వేసారు; ఫోటోలా!? భలేవారే!!
మీరు మళ్ళీ చురుగ్గా బ్లాగులు వ్రాయడం ఆనందంగా ఉంది.
రిప్లయితొలగించండిఅసలు, సల్మాన్ ఖాన్ కి జైలు శిక్షతో పాటు CCMB రిసెర్చికయిన ఖర్చు భరించమని తీర్పిస్తే బాగుంటుంది. ఈవెధవలకి జైలు శిక్ష పడినా సిగ్గు లేకుండా గొప్ప పని చేసినట్లు స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలుకెళ్ళినట్లు ఫీలయిపోయి తిరుగుతున్నారు. అభిమానులు సల్మాన్ ఖాన్ దర్శనంకోసం పడిగాపులు కాసారట. ఆయన బాల్కనీలోకొచ్చి చేయి ఊపి వాళ్ళని ఉద్ధరించాడట. ఆఅభిమానులకి నేరం చేసినవాళ్ళే హీరోలా?
పొద్దున్న ఈనాడు చదవగానే నాకు కూడా ఇలాగే అనిపించింది.
రిప్లయితొలగించండిమొత్తానికి వీరికి శిక్షంటూ పడిందిగా ఎప్పటికో అప్పటికి అనే సంతోషం కూడా ఏ మూలనో ఉంది నాకయితే
ఈ కాలం లో భరత ఖండం లో తప్పుచేసిన వాడే హీరో.అది కూడా తెలియదా... భలేవారే.
రిప్లయితొలగించండిఆచార్యుల వారు చాలా బాగా సెలవిచ్చారు..ఈ పరిశోధనకి చాలా ఖర్చవుతుంది. (ఇలాంటి పదిమందికి మేలు జరిగే తీర్పులు ఎప్పుడొస్తాయో). ఈ సదరు హీరో జైలుకెలితే మనకు ఒరిగేదేమీ లేదు. శిక్ష పడినా జైళ్ళో సకలసౌకర్యాలు సమకూర్చుకుని బాగా రెస్టుతీసుకొని రాళ్ళకొట్టినట్టు బిల్డప్పిచ్చి ఒక పుస్తకం రాస్తాడు. అది విడుదలైనప్పుడు..అహా అపర గాంధీ అన్నట్టు ఆయన అభిమానులు కొని, చదివి, జపించి తరిస్తారు..
రిప్లయితొలగించండిచదువరీ, కణజాలమంటే టిష్యూ. సిసిఎంబి -> కణ మరియు పరమాణుజీవ శాస్త్ర కేంద్రము
సత్యసాయి గారూ, మీరన్నది నిజం. జైలుకెళ్ళిన వాడూ హీరోనే మనకు!
రిప్లయితొలగించండిప్రవీణ్ గారూ, అవును.
రాధిక గారూ, :)
రవీ, తప్పు సరిద్దినందుకు థాంక్స్.