ఇప్పుడు గ్రహపు నిర్వచనాన్ని మార్చారు. కొత్త నిర్వచనం ప్రకారం ప్లూటో గ్రహం కాకుండా పోయింది. ప్లూటో గ్రహం కాకపోతే మరేంటి? మరుగుజ్జు గ్రహమట!
ఖగోళ సంఘం వాళ్ళు కొత్త నిర్వచనాలను ఇలా ఇచ్చారు.. ఈ నిర్వచనాల తయారీకి వాదనలూ, తర్జన భర్జనలూ జరిగాయట! (వారి డెఫినిషన్లకు ఇవి నిర్వచనాలు, అంతే!)
1. గ్రహం
- సూర్యుడి చుట్టూ తిరిగేది
- గోళాకారాన్ని నిలబెట్టుకునేందుకు కావలసినంత గురుత్వ శక్తి కలిగిఉండడం కోసం అవసరమైన ద్రవ్యరాశిని కలిగి ఉండేది.
- దాని కక్ష్య యొక్క ఇరుగు పొరుగులను ఖండించకుండా ఉండేది.
2. మరుగుజ్జు గ్రహం/బుల్లి గ్రహం
- సూర్యుడి చుట్టూ తిరిగేది
- గోళాకారాన్ని నిలబెట్టుకునేందుకు కావలసినంత గురుత్వ శక్తి కలిగిఉండడం కోసం అవసరమైన ద్రవ్యరాశిని కలిగి ఉండేది.
- దాని కక్ష్య తన ఇరుగు పొరుగు కక్ష్యలను ఖండిస్తూ ఉండేది.
- ఉపగ్రహం కానిది
3. ఇతర సౌర వ్యవస్థా వస్తువులు
- సూర్యుని చుట్టూ తిరిగే ఉపగ్రహాలు కాని మిగతా వస్తువులన్నిటినీ కలిపి ఇతర సౌర వ్యవస్థా వస్తువులు అంటారు. ఏస్టెరాయిడ్లూ, తోకచుక్కలు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి.
వికీపీడియాలోని హిందూ నవగ్రహాల వ్యాసానికి మీరు వేసిన లంకె సరిగా అతుక్కోలేదండీ. ఎక్కడికో... వెళ్ళిపోతోంది.
రిప్లయితొలగించండిథాంక్స్, మార్చాను.
రిప్లయితొలగించండి