మన భావ దాస్యానికి మరో గుర్తు మన ప్రజా సదుపాయాలకు మనం పెట్టుకున్న పేర్లు. చాలావాటికి జాతీయ నాయకుల పేర్లే. అక్కడక్కడా, పెద్దగా ప్రాముఖ్యం లేని వాటికి మాత్రమే తెలుగువారి పేర్లు పెట్టుకుంటాం. జాతీయ నాయకులపై నాకేమీ చిన్న చూపు కాదు. 'ఏఁ, మనకాపాటి నాయకులు లేరా' అని బాధ అంతే! జాతీయ స్థాయి కెదిగిన మన వారన్నా మనకు అలక్ష్యమే! ప్రతీ దానికీ గాంధీలు, నెహ్రూల పేర్లేనా? పీవీలు, ప్రకాశాలు, సంజీవ రెడ్డిలు, బూర్గుల, సురవరం, పట్టాభిలు కనపడరే?
ఇందిరా సాగరు, రాజీవ్ గాంధీ విమానాశ్రయం, జవహర్లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ, రాజీవ్ రహదారి, లాల్ బహదూర్ స్టేడియం, నెహ్రూ జూలాజికల్ పార్కు, ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు, రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం, రాజీవ్ పల్లెబాట, మహాత్మా గాంధీ బస్సు స్టేషను, పండిట్ నెహ్రూ బస్సు స్టేషను అని పేర్లు పెట్టుకున్నాం.
నెల్లూరు జిల్లాకు అమరజీవి పేరు పెట్టే విషయమై కొట్టుకు చచ్చారు మనవాళ్ళు. చివరికి అరవ్వాళ్ళు పెట్టుకున్నట్లు వింతగా పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టాలని తీర్మానించినట్లున్నారు. అదే ఏ ఎల్లయ్యగాంధీ అనో పుల్లయ్యనెహ్రూ అనో ఫలానాపటేల్ అనో పెడదామంటే చంకలెగరేసుకుంటూ సరే సరే అనేవాళ్ళే!
అల్లూరి సీతారామరాజు పేరిట ఏమన్నా ఉన్నాయేమో గమనించారా ? కన్నెగంటి హనుమంతు, కొమరం భీము, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, కొండా వెంకటప్పయ్య.. అందరూ విస్మృత వీరులే! కందుకూరి, చిలకమర్తి, గురజాడ, గిడుగు, సురవరం వంటివారు మనకు ఆనరు. రవీంద్ర భారతి పెట్టిన మనవారికి వేమన, కవిత్రయం, పోతన, శ్రీనాథుడు గుర్తు రాలేదు. (నన్నయ విశ్వవిద్యాలయం పెట్టడం సంతోషించదగ్గ విషయం). తమిళులు సుబ్రహ్మణ్య భారతి పేరిట విశ్వవిద్యాలయం పెట్టుకున్నారు. వాళ్ళ శిలప్పాదికారం గురించి, తిరుక్కురళ్ గురించి మామూలు తెలుగువాణ్ణైన నాకూ తెలిసింది. మరి మన కళాపూర్ణోదయం గురించి, వేదసమానమైన వేమన పద్యాల గురించి వాళ్ళకు తెలుసా? (మనకే సరిగ్గా తెలీదు!) తలగుడ్డతో, మెలిదిరిగిన మీసాలతో ఉండే సుబ్రహ్మణ్య భారతి బొమ్మ మనకు సుపరిచితమే. తెలుగు గురించి ఆయన చెప్పిన తమిళ మాటలు మనకు వచ్చు కూడాను. మరి మన శ్రీశ్రీ , గురజాడల బొమ్మలు వాళ్ళకు తెలుసా? వాళ్ళకు తమవాడి గురించి చెప్పుకోడం తెలుసు, మనకు తెలవదు. మనవాళ్ళంటే మరీ చులకన, పైవాడంటే పరమ గౌరవం. అంతే!
ఇక్కడో విషయం.. ఆకలిరాజ్యం సినిమా తీసేటపుడు బాలచందర్‌కు వాడీ వేడీ కలిగిన కవితలు అవసరమయ్యాయి, హీరో నోట పలికించేందుకు. అదేదో తమిళ సినిమాలో (తమిళ ఆకలిరాజ్యమేమో మరి) భారతి పాటలు పెట్టుకున్నాడట, ఆ స్థాయిలో ఉండే పాటలు కావాలి అని ఆయన వెతుకులాట! శ్రీశ్రీ కవితలు విన్నాక పరవశించి పోయాడట. (ఏమాటకామాటే.. ఆ కవితలకు కమలాసనుడు న్యాయం చెయ్యలేకపోయాడు, గొంతు కుదరలేదు!)
మనవాళ్ళంటే మనకెంత నిర్లక్ష్యమంటే - "మాకొద్దీ తెల్లదొరతనము" అని పాడిన గరిమెళ్ళ అవసానదశలో దుర్భరమైన జీవితం గడిపాడట. ప్రభుత్వం ఆయనకు సాయం చెయ్యలేదు. పూట గడవని దయనీయమైన స్థితిలో అడుక్కున్నాడట.
మన పరాధీన మనస్తత్వానికి, చిన్నదే, మరో నిదర్శనం..
ఓం ఎలా రాస్తాం? సంస్కృతంలో రాస్తాము తప్ప అచ్చ తెలుగున ఓం అని రాయడం బహు అరుదు! అయ్యప్ప భక్తి మన రాష్ట్రాన ప్రబలినాక, సంస్కృత ఓం తో పాటు మలయాళ ఓం కూడా చూస్తున్నాం.
బాగా చెప్పారు. ప్రజా సదుపాయాలకే కాదు, మన పేర్లు కూడా ఎంత తెలుగు పేర్లలా అనిపించకపోతే అంత మంచిది. కుషాల్ కునాల్ అవీ ఇవీ అంటూ హిందీ పేర్లే కావాలి (ముద్దు పేర్లు ఇంగ్లీషు పేర్లే కావాలి) నోరు తిరగని సంస్కృతం పేర్లు (సంస్కృతం పేర్లకి వ్యతిరేకం కాదు, నోరు తిరగని పేర్లకి) పెట్టుకుని దాని అర్థం ఇదీ అంటారు, మరి ఈ కుషాల్ కునాల్ పేర్లకి యే భాష లో అర్థం చెప్తారో. అసలు యే భాషో, ఏంటో కూడా తెలుసో లేదో పెట్టినవాళ్ళకి. ఇంటి పేరుని వెనుక వ్రాయటం దగ్గెర నుంచి (U.S. లో అలా వ్రాస్తుండవచ్చు గాక, ఆంధ్రా లో ఎందుకు), తండ్రి/భర్త పేరు వెనుక వ్రాయటం (తమిళవారికి (మలయాళీలు కూడా?) మనలాగ ఇంటి పేరు అని ఉండదు, తండ్రి/భర్త పేరే వెనుక తగిలించుకుంటారు, నాకు తెలిసి) వరకు, ఎంత పక్కవాడి అలవాట్లు, పద్ధతులు, ఎందుకు ఏంటి అని తెలియకుండా, మనం పాటిస్తుంటే అంత POSH, మనవాటిని ఎంత తక్కువ ఉపయోగిస్తే అంత మంచిది, అంత గౌరవం.
రిప్లయితొలగించండిGreat words
రిప్లయితొలగించండిఓహో దీన్ని మీరు భావ దాస్యం, భావదారిద్ర్యం అన్నారా!
రిప్లయితొలగించండిఉదాహరణలు వేరైనా నేను చెప్పేది ఇదేనండీ! ఒకటేనని చెప్పడానికి ఒక ఉదరహరణ, దీని గత జాబులోని మీ వాక్యం:
" >>అనుకరణపై ఎందుకింత యావ?"
దీనికి విరుగుడుగానే నేను చెప్పేది: "తెలుగులో ఆలోచించడం"
కాపీ కొట్టడం మానేయండో అని గొంతు చించుకొని అరుస్తున్నాను. అది నాకు మాత్రమే వినిపిస్తోంది :))
ఆ గత జాబులోని మొదటి పేరాలోనే అసలు విషయం ఉంది :
">> మరీ ముఖ్యంగా కొత్త పుంతలు తొక్కుతున్నామనుకుంటూ పెడదోవలు తొక్కే టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికిల్, టీవీ9 లాంటి ప్రసార సాధనాలే!"
ఈ ప్రసార సాధనల విపరీత ధోరణులకు వ్యతిరేకంగా పనిచేసేదే, ఈ సోషల్ బ్లాగింగ్.
ప్రతిమార్పునీ కొందరైనా వ్యతిరేకిస్తారు. మార్పులు ఐతే ఆగవు కదా! కానీ, కావల్సిన మార్పుని, స్వయంగా మనమే ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవచ్చు. ప్రసార సాధనాల వల్లే జ్ఞానాసమూపార్జన జరుగుతున్నంత కాలం, ఈ ఒరవడి ఇలాగే కొనసాగుతుంది. దీన్ని మార్చాలి. మార్చటం అంటే అర్ధం "రివర్టింగ్ బ్యాక్ లేదా రోలింగ్ బాక్" కాదు. ముందుకి ముందుగా అడుగేయటం. భాష ప్యూరిటీకంటే, భాషలో "పుడుతున్న" విషయానికి ప్రాధాన్యమిస్తే, అది "జీవ భాష"గా ఉంటుంది అని చెబుతూ ఉంటాను. మిగిలిన భాషాభిమానులతో నాకున్నటువంటి ప్రధానమైన తేడా ఇదే.
మంచి పోస్టు....అదే అదే ..సరే! :) మంచి టపా! ధన్యవాదాలు.
ఏం చెబుతాం? అంతా నిజమే.
రిప్లయితొలగించండిఈ పేరు మార్పిడి యవ్వారాల గురించి బ్లాగర్లంతా ఓ టపోద్యమం లేవదీస్తే? ఓ వారం పాటు అందరూ ఈ విషయం గురించే టపాలు రాస్తే? (ఇంతకు ముందు ఇలాంటివి జరిగేవి - వారమో పక్షమో ఒకే విషయమ్మీద అందరూ రాయటం. ఆ రోజులిప్పుడు లేవనుకోండి) ఈ టపాలు చదివే రెండు మూడు వేలమందికి, వాళ్ల ద్వారా మరో పది వేల మందికీ అంతో ఇంతో అవగాహన రావచ్చు కదా.
లుగు ప్రముఖులను మనమే చిన్నచూపు చూస్తున్నామన్నది బాగా ఎత్తి చూపారు. అయినా ప్రాంతాలకి ఎంత గొప్ప వాళ్ళైనా వారి పేరు పెట్టటం సమంజసం కాదు. ఎలాగూ ప్రతి పట్టణంలో కొన్ని వీధులైనా వారి పేర్లతో ఉన్నాయి కదా! ఇక జిల్లాలు కూడానా!
రిప్లయితొలగించండిఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు
రిప్లయితొలగించండిఏర్పడిన సంవత్సరం ↓ జిల్లా ↓ జిల్లాకేంద్రం ↓ జనాభా (2001) ↓ వైశాల్యం (km²) ↓ జనసాంధ్రత (/km²) ↓ జిల్లావెబ్ సైట్ ↓
1905 అదిలాబాద్ జిల్లా అదిలాబాద్ 2,479,347 16,105 154 http://adilabad. nic.in/
1881 అనంతపూర్ జిల్లా అనంతపూర్ 3,639,304 19,130 190 http://anantapur. nic.in/
1911 చిత్తూరు జిల్లా చిత్తూరు 3,735,202 15,152 247 http://chittoor. nic.in/
1802 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 4,872,622 10,807 451 http://eastgodavari .nic.in/
1794 గుంటూరు జిల్లా గుంటూరు 4,405,521 11,391 387 http://guntur. nic.in/
1978 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 3,686,460 217 16,988 http://hyderabad. nic.in/
1910 కడప జిల్లా కడప 2,573,481 15,359 168 http://kadapa. nic.in/
1905 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 3,477,079 11,823 294 http://karimnagar. nic.in/
1953 ఖమ్మం జిల్లా ఖమ్మం 2,565,412 16,029 160 http://khammam. nic.in/
1925 కృష్ణా జిల్లా మచిలీపట్నం 4,218,416 8,727 483 http://krishna. nic.in/
1949 కర్నూలు జిల్లా కర్నూలు 3,512,266 17,658 199 http://kurnool. nic.in/
1870 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 3,506,876 18,432 190 http://mahabubnagar .nic.in/
1956 మెదక్ జిల్లా సంగారెడ్డి 2,662,296 9,699 274 http://medak. nic.in/
1953 నల్గొండ జిల్లా నల్గొండ 3,238,449 14,240 227 http://nalgonda. nic.in/
1906 నెల్లూరు జిల్లా నెల్లూరు 2,659,661 13,076 203 http://nellore. nic.in/
1876 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 2,342,803 7,956 294 http://nizamabad. nic.in/
1970 ప్రకాశం జిల్లా ఒంగోలు 3,054,941 17,626 173 http://prakasam. nic.in/
1978 రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ 3,506,670 7,493 468 http://rangareddy. nic.in/
1950 శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 2,528,491 5,837 433 http://srikakulam. nic.in/
1950 విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 3,789,823 11,161 340 http://visakhapatna m.nic.in/
1979 విజయనగరం జిల్లా విజయనగరం 2,245,103 6,539 343 http://vizianagaram .nic.in/
1905 వరంగల్ జిల్లా వరంగల్ 3,231,174 12,846 252 http://warangal. nic.in/
1926 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 3,796,144 7,742 490 http://wgodavari. nic.in/
విశేషాలు
* అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు : మాల్టా,గ్రెనెడా,ఆండొర్రా,బహ్రైన్,బ్రూనే,కేప్వర్ద్,సైప్రస్,డొమినికా,ఫిజీ,గాంబియా,జమైకా,కువైట్,లెబనాన్,లక్సెంబర్గ్,మారిషస్,పోర్టోరికో,కతార్,సీషెల్స్,సింగపూర్,స్వాజీలాండ్,టాంగో.ట్రినిడాడ్,టుబాగో,వనౌటూ.