29, మే 2007, మంగళవారం

ఓ మంత్రిగారి జాబు

6 కామెంట్‌లు
"స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల్లో రామారావుపై ఉన్న అభిమానాన్ని, మూర్తిమత్వాన్ని దుర్వినియోగం చేయవద్ద"ని కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి చంద్రబాబు నాయుడును కోరింది.

నవ్వొస్తది వీళ్ళ పద్ధతి చూస్తుంటే. ఈమె కాంగ్రెసు నేత. తెదేపా వాళ్ళు తమ తమాషాను జరుపుకుంటున్నారు. తమ నాయకుణ్ణి తలచుకుంటున్నారు. మరో కాంగ్రెసు నాయకుడెవరైనా అంటే పర్లేదు, కానీ అలా రాసే నైతికత ఈమెకుందా? ఆమెనే అడుగుదాం.

అమ్మా మంత్రిగారూ..
 1. రామారావు పార్టీ పెట్టిందే కాంగ్రెసుకు వ్యతిరేకతతో. కాంగ్రెసు వ్యతిరేకతే తెదేపాకు అస్తిత్వం. మరి మీరు ఆ పార్టీలో ఎలా చేరారు? మీ నాన్నపై అంత గౌరవం, ప్రేమ ఉంటే తెదేపాలోనే ఎందుకుండలేదు? సరే బాబు ఉండనివ్వలేదు.. అందుకని కాంగ్రెసులో ఎలా చేరతారు, మీ నాన్న ఆశయాలకు వ్యతిరేకంగా?
 2. మీ నాన్నను పడదోసి బాబు గద్దెనెక్కినపుడు, మీభర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముందు మీ నాన్నతోటే ఉన్నాడు. తరువాత బాబు పంచన చేరాడు. మరి అప్పుడు కనిపించలేదా బాబు మీనాన్నకు చేసిన ద్రోహం? కొన్నాళ్ళకు మళ్ళీ వెనక్కి పోయాడు. తన వర్గంలోని వారికి మంత్రివర్గంలో చాలినన్ని సీట్లివ్వలేదనే కదా బయటికి పోయింది?
 3. ఇప్పుడు మీరీ బహిరంగ లేఖ ఎందుకు రాసారు? ఏ నిచ్చెన ఎక్కేందుకు మీ తాపత్రయం?
 4. రాజకీయ నాయకుడిగా రామారావుకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని సొమ్ము చేసుకుందామని అందరూ చూస్తున్నారు. తెదేపా, ఆయన కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు.. ఇలా అందరూ. సొమ్ము చేసుకునే హక్కు ఎవరికైనా ఉందీ అంటే అది తెలుగుదేశం పార్టికే ఉంది. ఆయన రాజకీయ వారసత్వం తెలుగుదేశం పార్టీదే. పార్టీకి మూలవిరాట్టుగా రామారావుకు ఆ గౌరవమివ్వాల్సిన బాధ్యతా పార్టీకుంది. మీరు ఆయన బిడ్డలైతే ఆయన కుటుంబ వారసత్వం కోసం పోట్లాడుకోండి. ఆయన ఆస్తి కోసం కొట్టుకోండి. ప్రజల ముందు నాటకాలొద్దు.
లేదూ ఎన్టీయార్ రాజకీయ వారసుడు బాబు కాదు మేమేనంటారా.. వెళ్ళి తెలుగుదేశం పార్టిలో చేరి ప్రజాభిమానం పొందండి. లేదూ పోటీ తెలుగు దేశం పెట్టండి. ఆయన రాజకీయ వారసత్వం కోసం పోటీ పడండి. అంతేగానీ ఎక్కడ ఆత్మగౌరవం తాకట్టడిపోయిందని ఎన్టీయార్ తెలుగుదేశం ఏర్పాటు చేసాడో.. ఆ కాంగ్రెసులో ఉండి ఇలాంటి శ్రీరంగ నీతులు చెప్పొద్దు.

25, మే 2007, శుక్రవారం

అంటువ్యాధి

2 కామెంట్‌లు
మొత్తానికి సత్యసాయి గారు మొదలెట్టారు, త్రివిక్రమ్ గారు నాకంటించారు. ఇక ఆగలేక పోయాను. పొద్దున్నే పరీక్ష రాసాను. తెరచాప కూడా కనపడింది. ఇక నేనూ నా తెరమెరుపును పెడుతున్నా.

24, మే 2007, గురువారం

పాతవన్నీ ఒకచోట!

1 కామెంట్‌లు
నా పాత జాబులన్నిటినీ గుది గుచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఓసారి చూడండి, కొన్ని బాగుండొచ్చు! :)
 1. ఆహా! సమస్యలు!!
 2. బ్లాగరులో హిందీ!
 3. మసీదులో బాంబు
 4. అప్పన్న, అప్పన్న, అప్పన్న
 5. అడ్డుగోడలు, అడ్డగోలు మాటలు
 6. జీమెయిలు ఉత్తరాలు ఇక ప్రింటు తీసి మన ముంగిట్లో
 7. చాప కింద నీరు
 8. మండలి, దాని ఎన్నికలు
 9. టైగరు, పేపరు టైగరూ
 10. బుద్ధుడి పాలనలో
 11. పునరంకితం -మళ్ళీ మళ్ళీ
 12. దొంగ సాధ్వులు,
 13. మండలి ఎన్నికల కథా కమామీషు
 14. తప్పటడుగులు
 15. సైంధవులు, శిశుపాలురు, మన పాలిట గుదిబండలు -
 16. మానవత!
 17. ఊరు బడి చెబుతుంది ఏలుబడి తీరు!
 18. తెలుగు సినిమా - 7 ఏళ్ళ పండుగ
 19. కార్పొరేటు చిల్లర కొట్లు
 20. బ్రౌను ఫోటో
 21. సాయిబాబా - తెలంగాణా
 22. ఆర్టీసీకి కొత్త రంగులు
 23. సీతాకోక చిలుక ప్యూపా దశకు పోతూంది
 24. తెలంగాణా సెంటిమెంటు + యాంటీ కాంగ్రెసు సెంటిమెంటు
 25. మార్గదర్శి
 26. సడిసేయకో గాలి సడిసేయబోకే.. పాటలు,
 27. వినుడు వినుడు వీనుల విందుగా..
 28. కొన్ని హాస్య వార్తలు
 29. ప్చ్..
 30. బీడీ, భాషా, యాసా కాదేదీ ఎన్నికల ప్రచారాని కనర్హం
 31. వోక్సూ పోనాదండి
 32. గొంతు విప్పిన బాలసుబ్రహ్మణ్యం
 33. అనుకోకుండా, యాదృచ్ఛికంగా, కాకతాళీయంగా...
 34. తెలుగు, ఆంధ్రం - కనకదుర్గ గారి అబద్ధాలు, దూషణలు
 35. తెలుగు సినిమాలను ఆడించేందుకు కొన్ని చిట్కాలు
 36. రామోజీరావు x రాజశేఖరరెడ్డి
 37. నీటి బొట్టు పెరిగిపోతె సంద్రమే! సమాజం
 38. కొత్త వెస్టిండియనులు, అదే పాత ఇండియనులు క్రికెట్టు
 39. సోయం బాపూరావు అనగా రాజా జయచంద్ర
 40. తెలుగుతల్లి
 41. ఈనాడు x ముఖ్యమంత్రి అవినీతి, మాధ్యమాలు,
 42. గురజాడపై విమర్శ భాష,
 43. కేసీయార్ రాజీనామా తార్కికమైనదేనా!
 44. స్వపరిపాలన కోసం తెలంగాణ
 45. ఉరుకుల పరుగుల వికీపీడియా
 46. రాష్ట్ర విభజనతో నీళ్ళూ, నియామకాలు వస్తాయా?
 47. రాష్ట్ర విభజనతో ఏం జరుగుతుంది?
 48. ఆదివారం టీవీ కార్యక్రమాలు
 49. వేడెక్కుతోన్న వాతావరణం
 50. పోపు గారు.. క్షమించ గోరారు
 51. నక్సలైట్లు, రాకెట్లు, పౌరహక్కుల సంఘాలు రాజకీయాలు,
 52. నిరుత్తర కుమారులు
 53. అరాచకీయుడిని ఎదిరిద్దాం! రాజకీయాలు,
 54. ఆత్మ లేని బతుకులు రాజకీయాలు,
 55. శంఖారావం - తెలంగాణ కాంగ్రెసు నాయకులెక్కడ? ఎక్కడ??
 56. భావ దారిద్ర్యం, భావ దాస్యం - మలి పర్వం
 57. వందేమాతరం!
 58. లోక్‌సత్తా పార్టీ అవసరమా?
 59. సినిమా పాటలూ మన పాట్లూ పాటలు,
 60. భేష్, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు
 61. రాంగురోడ్డు బాధితులు
 62. వీరేశలింగం పంతులుగారి వారసత్వం
 63. ప్లూటో హోదా ఏమిటి?
 64. తెలంగాణ ధ్వనులు
 65. వాయిదా వెయ్యడమెందుకు?
 66. రావోయీ అనుకోని అతిథీ!
 67. రాజీనామా ఎందుకు చేసారబ్బా!?
 68. వికీపీడియా ఎందుకు చూడాలి?
 69. పదాలు, దపాలు
 70. వెంటాడే జ్ఞాపకాలు
 71. నేడే స్వాతంత్ర్య దినం.. వీరుల త్యాగఫలం
 72. పొంతన లేని ఆంగిక వాచికాలు
 73. ఎన్నోవాడు?
 74. శబ్ద కాలుష్యం
 75. ఈయన అన్‌ఫిట్!
 76. భావ దారిద్ర్యం, భావ దాస్యం
 77. ప్రజలతో జయప్రకాష్ నారాయణ ఫోనాఫోని
 78. ఏమిటీ ధోరణి!
 79. నెట్లో తెలుగు వ్యాప్తి
 80. ఏమిటీ తెలివితక్కువతనం! బ్లాగు, రాజకీయాలు,
 81. దుర్వార్తలు, దుష్టులు, దుష్కీర్తి, ఆశావహ ధోరణి
 82. విజేతలూ, విజితా!
 83. లోక్‌సత్తా రాజకీయ ప్రణాళికలు
 84. పీబీశ్రీనివాస్ ఇంటర్వ్యూ
 85. జాబుల జాబితా
 86. ప్రజా ప్రతినిధులపై ప్రజాసమీక్ష
 87. అవకాశవాదం - తిట్లకు మహదవకాశం
 88. తెలుగు సినిమా హీరోలు, అభిమానులు, ఇతర పాత్రలూ
 89. గూగుల్ ఎనలిటిక్స్
 90. వర్డ్‌ప్రెస్సుకీ బ్లాగ్‌స్పాటుకీ పడదని తెలిసింది
 91. వామపక్ష నాటకాలు
 92. బూదరాజు రాధాకృష్ణ అస్తమయం
 93. వినవచ్చిన వార్తలు, విన.. నొచ్చిన వార్తలు
 94. తెలంగాణ గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు..
 95. టీవీ వాళ్ళకు, సినిమా వాళ్ళకు తగువైతే..
 96. వేగుచుక్క
 97. బ్లాగు గణాంకాలు -
 98. మత మార్పిడి ఊపు మీద పోపు గారు
 99. రిజర్వేషాలు
 100. ఒంటరిగా మనలేని మాటలు
 101. చతుర భక్తి, నిష్ఠుర భక్తి, ఎత్తిపొడుపు భక్తి..
 102. బ్లాగు గణాంకాలు
 103. పునరంకితం.. పునః పునరంకితం
 104. (పుస్తకాల) పురుగులొస్తున్నాయి జాగ్రత్త!
 105. జయహో ఇస్రో!
 106. మీరేం చేస్తుంటారు?
 107. తెలుగు అమలు - ఇంటా బయటా
 108. చందమామ గురించి
 109. వీళ్ళు పోలీసులా ?!?
 110. గాయకుడు కారుణ్య
 111. తెలుగురాష్ట్ర రాజధానిలో తెలుగు
 112. సొంతడబ్బా
 113. తనికెళ్ళ భరణి ఇంటర్వ్యూ
 114. హైకోర్టు ఆదేశాలు
 115. మమ్మేలిన మా శాసనసభ్యులకు..
 116. మీరిది చూసారా..?
 117. మనమూ మన భాషా..
 118. భారతదేశం - SWOT విశ్లేషణ
 119. ఎవరికోసమీ శాసనమండలి?
 120. కెరటాల కరణాలు
 121. వార్తల్లో విప్లవం - ఇందిరమ్మ టీవీ
 122. నా గోడు

22, మే 2007, మంగళవారం

ఆహా! సమస్యలు!!

3 కామెంట్‌లు
మనకు సమస్యలకేం తక్కువ లేవు. ఒకదాని మీదొకటి పుట్టుకొస్తున్నాయి. ఎంతలా అంటే.. ప్రభుత్వం ఆనందించేంతగా! ఆనందం ఎందుకంటే.. ఒకదాని మీదొకటి ఇలా సమస్యలు పడిపోతూ ఉంటే, పాత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం లేదు కదా! గతంలో ఇందిరా గాంధీ, ప్రయత్నించి మరీ కొత్త సమస్యలు తెచ్చేది. అలా పుట్టుకొచ్చిన వాడేనట జర్నెయిల్ సింగ్ భిందరన్ వాలే! ఇప్పటి మన రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం అయాచితంగా వచ్చి పడిపోతున్నాయ్, సమస్యలు. సమస్యలు ప్రభుత్వానికి కాదు, ప్రజలకని మనవి.

 1. సరే తెలంగాణ సమస్య ఎలాగు ఉండనే ఉందనుకోండి. 2009 ఎన్నికల్లో దానితో బోలెడు పనుంది కాబట్టి అది అలా ఉంటూనే ఉంటుంది.
 2. ఇహ ప్రాజెక్టుల్లో అవినీతి..డబ్బులున్న చోట అవినీతి ఉండడం సహజమే కదా. అవినీతి సర్వవ్యాప్తం అని ఇప్పటి నాయకులందరి అమ్మగారు (మదర్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ లీడర్స్) ఎప్పుడో తేల్చి చెప్పారాయె.
 3. పోతిరెడ్డిపాడు సమస్య మాత్రం ముఖ్యమంత్రి ఒంటి చేత్తో సృష్టించిన సమస్య! బ్రదర్సుకు మాత్రం మందుగుండు సరఫరా చేస్తోందీ సమస్య
 4. 11 కోట్ల సొమ్ములు పోనాయన్న సంగతి మీరు మర్చిపోనారు, నాకు తెల్దనుకోకండి మరి.
 5. మరి మన ఎంపీలు ప్రశ్నలడిగేందుకు డబ్బులు నొక్కేసిన సంగతి తెలిసి ప్రజలు నోళ్ళు తెరిచారు. అన్ని యుద్ధాలకు మాతృక లాగా అన్ని కుంభకోణాలకు మాతృక ఇది అని చెప్పుకున్నారు. దీని బాబు లాంటిది మరోటి రాబోతోందని తెలీదు పాపం అమాయకులకు.
 6. ఆ మధ్య డిపెప్పో మరోటో.. కార్యక్రమం కోసం (ఇక్కడ కార్యక్రమం ఏమిటనేది ముఖ్యం కాదు, డబ్బులేమాత్రం ఉన్నాయనేది ముఖ్యం. ఇప్పుడు చూడండి, నిధుల్లేవని చెప్పి, ఆ మధ్య ఉప్పునూతల వారు ప్రాంతీయ అభివృద్ధి మండలి పదవి తీసుకోనన్నారు. నిధుల్లేని పదవి నాకెందుకన్నారు. "..ఈ ఏకాకి కంచి గరుడ సేవ నాకెందుక"న్న దుర్యోధనుడిలా) కేంద్రం డబ్బులు పంపిస్తే సూర్యుడి వేడికి ఆవిరైపోయిన నీరు లాగా ఆ డబ్బులు సుబ్బరంగా అయి పోయాయి.
 7. ఇదిలా జరుగుతూ ఉండగా బాబ్లీ ప్రాజెక్టుతో తెదేపా మంచి సందడి చేసి, పండగ చేసుకుంది. పాపం తెరాస వెనకబడి పోయింది. పోలవరం కంటే పెద్ద సమస్యనా ఇది అంటూ తేల్చేయబోయారు గానీ, వాళ్ళ వాదనే తేలిపోయింది.
 8. ప్రశ్నల కోసం డబ్బులు తీసుకున్న ఎంపీలు తెలివి తక్కువగా దొరికిపోయాక, మిగిలిన వాళ్ళలో కొందరికి ఆ ఆదాయ మార్గం మూసుకుపోయింది. (అంత తెలివి తక్కువగా ఎందుకు దొరికి సచ్చారో అని తిట్టుకున్నారట కూడా!) ఒక విప్లవాత్మక, వినూత్న పద్ధతి కనిపెట్టారు. గిట్టనివాళ్ళు "అది కొత్తదేమీ కాదు, చిర పురాతనమైనది, అతి ప్రాచీనమైన వృత్తే" నని పెదవి విరిచారు. కట్టుకున్న భార్య ఉండగా మరో స్త్రీని భార్యగా చూపించి, డబ్బులు చేసుకున్నారు. మహామహా చార్లెస్ శోభరాజ్ లాంటి వాళ్ళే డంగైపోయేంతటి తెలివితేటలవి, మనబోటి మామూలు పౌరుల సంగతి చెప్పేదేముంది?
 9. కొత్త సమస్యేమీ లేనట్లు పాత దాన్ని తిరగదోడారీసారి. అదే - పుర్రె గుర్తు! బాబ్లీని తెదేపా ఎత్తుకుపోయే సరికి తెరాస వాళ్ళు మళ్ళీ కంకాళ నృత్యం చేయ సంకల్పించారు. అయితే పుర్రె కూడా మాదే నంటూ తెదేపా వాళ్ళూ గొడవ చేసారు. మొత్తం సమస్యలన్నీ వొళ్ళో పోసేసుకుని తెరాసకు సమస్యలనేవే లేకుండా చేద్దామని తెదేపా పన్నాగంలా ఉంది.
 10. ఈలోగా సీపీయం వాళ్ళు భూ ఆక్రమణలకు దిగారు. అధికార పార్టీ నాయకులకు అర్థం కానిదొకటుందిందులో.. "భూమి ఆక్రమించుకోడం వరకూ బానే ఉంది, కానీ ఇలా అంత మందిని తీసుకొచ్చి బహిరంగంగా ఆక్రమించుకుంటే ఉపయోగమేముంది? ఈ తెలివి తక్కువ కమ్యూనిస్టులు మనలను చూసన్నా నేర్చుకోకపోతే ఎలా" అని వాపోయారు. శ్రమ వృధా అయిపోతోందే అని వారి వేదన!
 11. ఈలోగా వర్గీకరణ అంటూ రావణ కాష్ఠంలా రగులుతున్న సమస్యొకటి మనకుండనే ఉంది. వర్గీకరణ కావాలని మంద కృష్ణ మాదిగ పాపం చంద్రబాబుకు ముందు కాలం నుండీ మొత్తుకుంటున్నాడు. ఒద్దొద్దని మాలలు! ఈలోగా కృష్ణ మాదిగ నిరశన దీక్ష, ఆయన అనుచరుల దహన కాండ, దోపిడీ కాండ మొదలైంది (బస్సు తగలబెట్టబోయే ముందు, ప్రయాణీకుల డబ్బూ దస్కం దోచుకున్నారట! కొన్ని చోట్ల ప్రయాణీకులు దిగక ముందే తగలబెట్టారట!!) . ప్రభుత్వానికి బోల్డంత పని.
 12. ఇవన్నీ ఇలా ఉండగా మక్కా మసీదులో బాంబు పేలింది. కొన్నాళ్ళ పాటు సందడి! 24 గంటల్లో కూపీ లాగుతామని ముఖ్యమంత్రే చెప్పేటప్పటికి, ఓహో కుట్ర సంగతి దాదాపు తెలిసిపోయిందనుకున్నా. దీన్నిగానీ పరిష్కరించేస్తారా ఏమిటి అని ఆశ్చర్యపోయాను కూడా! ఇవ్వాళ పేపర్లో చూస్తే తెలిసింది అలాంటి ప్రమాదమేమీ లేదని.. 24 గంటల్లో కూపీ లాగిందేంటయ్యా అంటే "సెల్ ఫోనుతో పేల్చారా, మరోటేదన్నా వాడారా" అనే సంగతి!
బాంబు పేల్పేసి నాల్రోలై పోయింది గదా, మరోటేదన్నా సమస్యొచ్చాక రాద్దాం లెమ్మనుకున్నా. కానీ ఏమీ రాకపోయేతలికి, ఇహనాగలేక ఈ జాబు రాసేస్తున్నా! సమస్యలకేం కొదవలేదు. కొత్తవి రాకపోతే పాతవెలాగూ ఉన్నాయి, ఎందుకంటే సమస్యను పరిష్కరించడం మన ప్రభుత్వాలకెలాగూ అలవాటు లేదుగా! పై సమస్యల్లో దేన్నీ పరిష్కరించకుండా జాగ్రత్త పడ్డాయి, చూసారుగా. కొత్తవి దొరకని రోజున పాతవి పనికొస్తాయి కదా, మరి! చీమ మనస్తత్వమన్నమాట!

బ్లాగరులో హిందీ!

1 కామెంట్‌లు
अब हिंदी मे भी लिख सकते है। लेकिन ए सुविधा तेलुगु भाषा केलिये कब आयेगी?
ఇది నేరుగా బ్లాగరు ఎడిటరులోనే నేను రాసిన హిందీ; నేను RTS లో రాస్తూ ఉంటే ఆటోమాటిగ్గా అదే హిందీలోకి మారిపోయింది. బ్లాగరూ, మరి తెలుగులో ఎప్పుడు!?

19, మే 2007, శనివారం

మసీదులో బాంబు

4 కామెంట్‌లు
మసీదులో బాంబు! గతంలో పోలీసు కమిషనరేటు మీద మానవ బాంబు దాడి జరిగిన తరువాత కొన్నాళ్ళకనుకుంటా.. పోలీసులు ఇద్దరు ముస్లిము కుర్రాళ్ళని అరెస్టు చేసారు. అందుకు నిరసనగా ముస్లిము ఆడవాళ్ళు గుంపులు గుంపులుగా కమిషనరేటు మీదకి దండెత్తి వచ్చి, నానా యాగీ చేసి పోయారు. వాళ్ళకి వాళ్ళ నాయకుల మద్దతు కూడా. అనుమానమ్మీద ముస్లిములను అరెస్టు చేస్తేనే అలా అల్లరి చేస్తే, మరి ఇళ్ళల్లో దాక్కున్న నేరస్తులను పట్టుకునేదెట్లా? ఇలాంటి ఘటనలను నివారించేదెట్లా? అంతెందుకు, మే 18 నాటి బాంబు దాడి తరువాత కూడా, మసీదు లోపలికి పోలీసులను రానివ్వలేదట అక్కడి జనం! ఎలాగో తోసుకుని లోపలికి వెళ్ళి చూస్తే మరో రెండు బాంబులు కనబడ్డాయి. వాటిని నిర్వీర్యం చేసారట పోలీసులు. రానివ్వలేదని వాళ్ళు వెళ్ళకపోయి ఉంటే అవీ పేలేయేమో! ఈ సంఘటనలో అనుమానితుడు షాహెద్‌ బిలాల్ అని పత్రికలు రాస్తున్నాయి.

సంబంధిత టపాలు