28, నవంబర్ 2013, గురువారం

మంత్రుల గుంపుకు నా ఉత్తరం

4 కామెంట్‌లు

శతకోటి ఉపాయాలకు అనంతకోటి దరిద్రాలు అన్నట్టుగా తయారైంది రాష్ట్ర విభజన. వాటిలో ఓ ఉపాయం మంత్రుల గుంపు. (మంత్రుల ’గుంపు’ అంటూంటే నవ్వొస్తోంది -నాన్నా.. మంత్రులే గుంపులు గుంపులుగా ఉంటారు. సోనియా మాత్రం ఒంటరిగానే ఉంటది).  ఈ గుంపు ఎన్ని దరిద్రాలను సృష్టించనుందో చూడాలి.

నా బుర్రకు తోచిన సూచనలను మెయిల్లో పెట్టి, గుంపుకు పంపేసాను. గడువు ఆఖరి రోజున కుసింత హడావుడిగా రాసి, సరిగ్గా ఐదింటికి రెణ్ణిమిషాల ముందు తోసేసాను మెయిల్ని. మన ఈమెయిళ్ళను చూసేంత తీరిక ఓపికా ఢిల్లీలో ఎవరికీ లేదని తెలిసినా ఏదో నా తుత్తి కోసం...

సంబంధిత టపాలు