27, మార్చి 2006, సోమవారం

తెలుగురాష్ట్ర రాజధానిలో తెలుగు

1 కామెంట్‌లు
తెలుగు భాషకు ప్రాచీనత కావాలని కేంద్రాన్ని కోరతాం, కేంద్రంపై వత్తిడి తెస్తాం అంటోంది, ప్రభుత్వం. అయితే భాష పరంగా తాను స్వయంగా చెయ్యగలిగిన పనులను పక్కనబెట్టింది. హైదరాబాదులో తెలుగు వాడుక ఉండేకొద్దీ తగ్గిపోతోంది. దీనిపై బ్లాగుల్లో రాస్తున్నారు. వాటిని ఇక్కడ చూడొచ్చు.

6, మార్చి 2006, సోమవారం

సొంతడబ్బా

2 కామెంట్‌లు
విలేకరులతో మాట్లాడేటపుడు కొందరు మరీ శాస్త్రోక్తంగా మాట్లాడాలని ప్రయత్నిస్తూ కొన్ని తప్పులు చేస్తారు. ఇక్కడొకటి..

తాము ఒక పని చేసామని చెప్పే సందర్భంలో కింది పదబంధాలను వాడుతూ ఉంటారు.
1. చెప్పడం జరిగింది. (నేను విలేకరులకు కూడా చెప్పడం జరిగింది)
2. వివరించడం జరిగింది (మేము మా సమస్యలను ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది)
3. మాట్లాడడం జరిగింది (ఈ సమస్యపై నేను అధికారులతో మాట్లాడడం జరిగింది)

టీవీలో మనం దీన్ని గమనించవచ్చు. పత్రికల్లో యథాతథంగా ప్రచురించరు కాబట్టి అక్కడ ఇవి కనబడవు. ఈ మాటలు కృతకంగా ఉంటాయి. తన ప్రమేయం లేకుండా వాటంతట అవే జరిగిన సంఘటనలను వివరిస్తున్నట్లుంటాయి. ఈ పదాల స్థానంలో వాడాల్సిన 'చెప్పాము ', 'చెప్పాను ', 'వివరించాను ', 'మాట్లాడాను ' మొదలైన మాటలు వాడితే సొంతడబ్బాలా ధ్వనిస్తుందనే బెరుకు దీనికి కారణం కావచ్చు.

కానీ..వాడాల్సినవివే!

తాజాకలం: కానీ మన రాజకీయ నాయకుల్లో చాలామంది ఇలాంటి మాటలు వాడరు; చేసాను, చెప్పాను అనే వాడతారు. వాళ్ళనందుకు మెచ్చుకోవాలి. వీళ్ళీ తప్పులు చెయ్యకపోవడంలో ఉన్న కిటుకేంటబ్బా!?

సంబంధిత టపాలు