రాజకీయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రాజకీయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, సెప్టెంబర్ 2013, బుధవారం

సీమాంధ్ర ఉద్యమం, తెవాద ఉన్మాదం

63 కామెంట్‌లు
’పోండి, మీ రాష్ట్రాన్ని, మీ రాజధానినీ ఏర్పాటు చేసుకోండి, పోండవతలికి’ అని చివరికి అధికార పక్షం కూడా ప్రజలకు చెబితే, ఆ ప్రజలు ఏం చేస్తారు? ఏం చెయ్యాలి?

4, నవంబర్ 2011, శుక్రవారం

సీబీఐ ని విచారించిన జగన్ !

3 కామెంట్‌లు
ఇవ్వాళ సీబీఐ జగన్ను పిలిచి విచారించింది. గాలి కేసులో జరిగిందీ విచారణ.  ఓ రెండు గంటల విచారణ తరవాత బైటికొచ్చిన జగన్ విలేఖరులతో మాట్టాడాడు.

’నన్ను కేవలంగా సాక్షిగా మాత్రమే విచారించారు. సబితమ్మ గారిని ఏవిధంగానైతే సాక్షిగా విచారించారో అలాగే నన్నూ విచారించారు. అసలు 2002 లో ఈ భూములను (ఏ భూములో చెప్పలేదుగానీ.. టీ హీరెహాళ్ మండలంలోని భూములు అనుకుంటాను) ఓబుళాపురం మైనింగు కంపెనీకి ఇచ్చినది చంద్రబాబేననీ, ఫలానా జీవో ప్రకారం ఆ భూములను ధారాదత్తం చేసారనీ అంచేత చంద్రబాబును కూడా విచారించాలనీ సీబీఐకి చెప్పాను’, అని పత్రికల వాళ్ళకు చెప్పాడు. ఆ జీవో కాపీలను కూడా పత్రికల వాళ్లకు ప్రదర్శించాడు.  ఇకనైనా చంద్రబాబును గుడ్డిగా సమర్ధించే ఎల్లో పత్రికలు బుద్ధి తెచ్చుకుని నిజాలు రాస్తారని ఆశిస్తున్నాను. అని కూడా అన్నాడు.

21, అక్టోబర్ 2011, శుక్రవారం

గెలిచినవాడు నీచ మానవుడు

7 కామెంట్‌లు
బాన్సువాడ ఉప ఎన్నిక ముగిసింది. తెరాస అభ్యర్థి గెలిచాడు. కానీ అనుకున్నంత మెజారిటీ రాలేదు. కాంగ్రెసుకు చాలానే వోట్లొచ్చాయి, స్వయంగా వాళ్ళు కూడా ఊహించనన్ని వోట్లొచ్చాయి. అందుకు గాను తెరాస తరపున గెలిచిన అభ్యర్థి ఏమన్నాడో చూసారా..? తమకు వోటెయ్యని వాళ్ళు ద్రోహులంట. ఏగడ్డ మీద బతుకుతున్నారో ఆ గడ్డకు ద్రోహం చేసేవాళ్ళంట. ఇతడి ధోరణి వాళ్ళను భయపెట్టేవిధంగా కూడా ఉంది.

18, ఆగస్టు 2011, గురువారం

మన్మోహన్ అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే..

4 కామెంట్‌లు
అడ్డెడ్డె...

అన్నా హజారే విషయంలో మన అప్రధానమంత్రి చేసిన పనులు చూస్తూంటే రాజకీయ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం లాగా కనిపిస్తోంది. ’ఇహ నీతో పని అయిపోయింది, రాహుల్ గాంధీ కోసం సీటు ఖాళీ చెయ్యి’, అని నేరుగా చెప్పకుండా, ఇలా ఆత్మహత్య చేయిస్తున్నట్టున్నారు. లేకపోతే, ఇంత తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటారా?

5, ఆగస్టు 2011, శుక్రవారం

సమస్యలు బాబోయ్ సమస్యలు

4 కామెంట్‌లు
ముసురుకున్న సమస్యల నుండి బైట పడటానికి నాయకులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్య నుండి కాపాడమంటూ వేడుకుంటున్నారు. ఇలా సాగాయవి:

మేడమ్మ: ఎట్టాగోట్టా మబ్బాయిని ప్రధానమంత్రిని చెయ్యి ప్రభూ! నాకున్న సమస్యల్లా ఇదొక్కటే. ఈ దేశానికున్న ఏకైక సమస్య కూడా ఇదే! దీన్ని తీర్చావంటే నేను, ఈ దేశ ప్రజలూ కూడా శేష జీవితాన్ని హాయిగా గడిపెయ్యొచ్చు.

14, జూన్ 2011, మంగళవారం

మరింత దిగజారిన లౌకికవాదం

32 కామెంట్‌లు
హిందూ వ్యతిరేక భావాలను పదేపదే నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది లౌకికవాదం. 

బాబా రామ్ దేవ్ ఆరెస్సెస్ ఏజంటు
అన్నా హజారే ఆరెస్సెస్ ఏజంటు

29, మే 2011, ఆదివారం

మహానాడులో చంద్రబాబు ముగింపు ప్రసంగం

14 కామెంట్‌లు
మహానాడులో చంద్రబాబు ముగింపు ప్రసంగం చూసాను. మనిషిలో, మాటలో చాలా తేడా కనిపించింది. ప్రసంగంలో నేను గమనించిన కొన్ని విశేషాలు.

మఖ్యమైన విశేషమేంటంటే -

22, మే 2011, ఆదివారం

"అయితే హైకమాండు పిరికి సన్నాసేనన్నమాట!"

3 కామెంట్‌లు
బ్రేకు తరవాత.. (బ్రేకు ముందర జరిగిన చర్చను చదవండి.)

"చెప్పండి ఘొల్లు రవిగారూ, మీ హైకమాండుకు వెన్నెముక లేదట, పిరికిదట, సన్నాసట - నిజమేనా?" అని రంజనీకాంతు అడిగాడు.

21, మే 2011, శనివారం

హైకమాండుకు కమానుకట్టలు విరిగినై

4 కామెంట్‌లు
మొన్నామధ్య నూరేళ్ళ పార్టీ హైకమాండు కడప మీంచి బిళ్ళబీటుగా కింద పడింది. అంతెత్తునుంచి కింద పడటంతో  వెన్నెముక విరిగింది, కాళ్ళు రెండూ కూడా విరిగిపోయాయి. నడవలేని స్థితిలో మంచాన బడింది. ముందే హైకమాండంటే ఎటకారమై పోయిన ఆ పార్టీ నాయకులు కొందరికి మరీ అడ్డూ ఆపూ లేకుండా పోయింది. వంకరమ్మ అనే ఒక పార్టీ నాయకురాలు ’అసలు హైకమాండు ఉత్త పిరికిది. పేరుకే అది హైకమాండు, దానికి హై లేదు, కమాండూ లేదు. ఇప్పుడు వెన్నెముక కూడా విరిగింది కాబట్టి, ఇక అది ఉన్నా లేనట్టే" అని అనేసింది. దానిమీద రంజనీకాంతు తొమ్మిదో టీవీలో చర్చ పెట్టాడు. ఆ చర్చ ఇలా జరిగింది..

19, మే 2011, గురువారం

సానుభూతి గెలిచింది

16 కామెంట్‌లు
జగను గెలిచాడు. సానుభూతి గెలిపించింది. తండ్రి చనిపోయాడన్న సానుభూతిని ఆధారం చేసుకుని జగను గెలిచాడు. సానుభూతితో పాటు ఈ గెలుపుకు తోడ్పడిన కారణాలు ఇంకా కొన్నున్నాయి. అవి:

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఉండవల్లి అస్త్రం

13 కామెంట్‌లు
ఉండవల్లి అరుణ్ కుమార్ జగనుపైకి ఒక పదునైన ఎన్నికల అస్త్రాన్ని విసిరాడు. పేరుబెట్టి పిలిచి, నిలదీసి ఉండవల్లికి అవకాశమిచ్చాడు జగను. అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉండవల్లి బాగా వాడుకున్నాడు.

28, మార్చి 2011, సోమవారం

వయ్యెస్సార్ రౌడీ మూక

95 కామెంట్‌లు
శాసనసభలో తెలుగుదేశం పార్టీవాళ్ళు "వయ్యెస్సార్ దొంగలముఠా" అంటూ ప్లకార్డులు చూపించారంట.  అందుకు కోపించిన వయ్యెస్సార్ అనుయాయులు (వారిలో మంత్రులు కూడా ఉన్నారంట)  తెదేపా సభ్యులను పట్టుకుని కొట్టేసారంట.

కొట్టేటప్పుడు ఏమని అన్నారో తెలీటంలేదుగానీ, ఇలా అని ఉండొచ్చని నా ఫ్రెండొకడు అన్నాడు -"ఏరా ఉత్త దొంగల ముఠాయేననుకుంటన్నావా.., మేం రౌడీ ముఠా కూడారోయ్. ఒళ్ళు దగ్గర పెట్టుకోని ప్రవర్తించు"
...............
జాగర్త శాసనసభ్యులారా పోయినోడు హిరణ్యాక్షుడైతే, ఉన్నోళ్ళు హిరణ్యకశిపులు, జరాసంధులు, బకాసురులు!

17, ఫిబ్రవరి 2011, గురువారం

గవర్నరు గారూ, వాళ్ళ దౌర్జన్యాలు చూసారు కదా..!

74 కామెంట్‌లు
గవర్నరు గారూ,
ఏనాడూ జరగని సంఘటనలు సభలోనూ బయటా జరిగాయి. ఒక శాసనసభ్యుడికే రక్షణ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యమంటే నచ్చని కొందరి కారణంగా ఇవ్వాళ స్వేచ్ఛకు విఘాతం ఏర్పడింది. స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించే ఒక గౌరవనీయ సభ్యునికి, తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవమానం జరిగింది. ’మేము చెప్పినదే నిజం, మేము చెప్పేదే అందరూ వినాలి, అవతలి పక్షం మాటలను వినం, విననివ్వం, అసలు అవతలి వారిని మాట్టాడనివ్వం’ అనే ధోరణి గల నియంతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.

శాసనసభ వద్ద రౌడీలు

74 కామెంట్‌లు
శాసనసభలో తెలంగాణ ఎమ్మెల్యేలు గొడవచేసి సభ వాయిదా పడేలా చేసారు. తరవాత సభనుంచి బయటికి వచ్చిన జయప్రకాశ్ నారాయణ  మీడియాతో మాట్టాడాక వెళ్తూండగా తెరాస ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎవరో ఆయన మీద దాడి చేసి తలపై కొట్టారు. టీవీ9 లో ఇది స్పష్టంగా కనబడింది. అయితే చెయ్యి కనబడింది గానీ, అది ఎవరిదో కనబడలేదు. చెయ్యి మాత్రం అక్కడ కెమెరాలు పట్టుకున్న జనాల గుంపులోనుండి వచ్చింది.

20, జనవరి 2011, గురువారం

అధిష్ఠానం కేళి - కాంగీయుల కథాకళి

9 కామెంట్‌లు
అసలు సంగతి కెళ్ళేముందు..

మన ప్రధానమంత్రి గారు ఇవ్వాళ కొన్ని రత్నాల్లాంటి మాటలు చెప్పాడు. వాటి సంగతి చూద్దాం.
1. తెలంగాణ సంగతి ఎప్పుడు తేలుస్తారు అని అడిగితే "సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం" అని చెప్పాడు. సరైన సమయమంటే మళ్ళీ మేడమ్మ పుట్టినరోజు రావాలి కాబోలు. ("సరైన సమయంలో సరైన నిర్ణయం" కోసం గూగిలించి చూస్తే..  2490 ఫలితాలొచ్చాయి.)

26, నవంబర్ 2010, శుక్రవారం

ఉత్సవ విగ్రహాలు, లార్జర్ దాన్ లైఫ్ సైజు కటౌట్లూ!

10 కామెంట్‌లు
ఆంధ్రప్రదేశుకు ముఖ్యమంత్రిని  మార్చారు.  తమలోంచి ఒకణ్ణి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన జనానికి ప్రణబ్బు ముఖర్జీ చెప్పేదాకా తెలీదు, కుర్చీ ఎక్కబోయేది ఎవరో!  ఛానెళ్ళ పుణ్యమా అని, వాళ్లకంటే మనకే కొంత ముందు తెలిసింది.  ’ఏంటి ఎవరు  ముఖ్యమంత్రి కాబోతున్నారు ’అని అడిగితే కాంగీయుడు ప్రతీవాడూ చెప్పిన సమాధానం ఒకటే - అధిష్ఠానం మాటే మామాట ! అమ్మ మాట  బంగారు మూట అనమాట! ఇక్కడి నాయకుణ్ణి విమర్శించమంటే అడ్దమైన బూతులు తిడుతూ ఒంటికాలిమీద లేచేవాళ్ళే వీళ్ళంతా..  కాని మేడమ్మ దగ్గరికి వచ్చేసరికి తోకలు ముడుస్తారు. పిల్లికూనలైపోతారు. ఏంటో ఆ అమ్మ గొప్పదనం!  ఏమిటి ఆమెలో ఉన్న మహత్తు? ఎన్నికల్లో వీళ్ళందరినీ ఒంటిచేత్తో గెలిపించుకు పోగల సమర్ధత, మహిమా ఉన్నాయా? రాష్ట్ర సమస్యలను ఢిల్లీలో కూచ్చుని అవలీలగా తేల్చిపారేస్తదా?

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

పోయినోళ్ళందరూ మంచోళ్ళే..

28 కామెంట్‌లు
పోయినోళ్ళందరూ... మంచోళ్ళు! ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు!!  -ఆత్రేయ చెప్పాడంట.

రాశేరె కూడా పోయాడు. కాబట్టి చాల మంచోడు! 

21, జులై 2010, బుధవారం

నిష్పాక్షికతను కోరే పక్షపాతులు!

29 కామెంట్‌లు
చంద్రబాబు బాబ్లి యాత్ర నేపథ్యంలో, కొందరు మీడియా మీద పడ్డారు.  మీడియా అనవసరంగా చంద్రబాబుకు ప్రాధాన్యతనిచ్చి, ఉపఎన్నికల్లో  తెరాస ఓడేందుకు పని చేస్తోంది - ఇదీ వారి ఆరోపణ. చాలా అసంబద్ధమైన ఆరోపణ అది. అసలీ నాలుగైదు రోజుల్లో బాబ్లి యాత్రకు మించిన ప్రాధాన్యత కలిగిన మరో సంఘటన లేదు, అంతకంటే పెద్ద వార్తా లేదు. అంచేత, సహజంగానే బాబ్లి యాత్ర  మీడియాలో బాగా ఫోకసైంది.  

18, జులై 2010, ఆదివారం

బాబ్లి సమస్య - చంద్రబాబుది ఉత్తమ స్వార్థం, మిగతావాళ్లది నీచ స్వార్థం!

20 కామెంట్‌లు
గోదావరి మీద మహారాష్ట్ర కడుతున్న బాబ్లి ప్రాజెక్టు గురించి తెదేపా గొడవ చేస్తూ సమస్యను రాష్ట్రాన్ని దాటించి మహారాష్ట్రకు, అక్కడినుంచి ఢిల్లీకీ చేర్చింది. ప్రాజెక్టు చూస్తామంటూ బస్సు యాత్ర చేపట్టి అక్కడి ప్రభుత్వం చెరలో పడ్డారు. ప్రాజెక్టు చూడకుండా తిరిగి పొయ్యేది లేదని చెప్పి, చంద్రబాబు సమస్యను చాలా చక్కగా వెలుగులోకి తెచ్చాడు.

సంబంధిత టపాలు