దేశంలో కొంతమందికి హిందూమతాన్ని విమర్శించడం ఫ్యాషనైపోయింది. హిందూమతాన్ని తిడుతూ, ఇతర మతాలను వెనకేసుకొస్తూంటారు. వీళ్ళు కాలం చెల్లిన, బూజు పట్టిన పాత కబుర్లు చెబుతూ, "మనుస్మృతిలో అలా చెప్పారు, రామాయణంలో ఇలా చెప్పారు, కొన్ని కులాల వాళ్ళను వేదం చదవనీయలేదు, కృష్ణుడు ఇలా చేసాడు, దేవుళ్ళంతా కొన్ని కులాలకే చెందినవాళ్ళు, ఇతర కులాలకు దేవుళ్ళు లేరు.." - ఇలాంటి అరిగిపోయిన వాదనలు చేస్తూంటారు. ఇలాంటి వాదనలు చేసేవాళ్ళను దళితిస్టువాదులు అనీ, వీళ్ళ వాదాన్ని దళితిస్టువాదం అని అంటారు.
30, ఆగస్టు 2009, ఆదివారం
28, ఆగస్టు 2009, శుక్రవారం
కాటమరాజు కథ - ఆరుద్ర నాటకం
కాటమరాజు కథ
-స్టేజీ నాటకం
- రచన: ఆరుద్ర
- వస్తువు: ఆంధ్ర చారిత్రిక గాథ
- రాసిన సంవత్సరం: 1961
- ముద్రణ: 1999
- ప్రచురణకర్త: స్త్రీశక్తి ప్రచురణలు, చెన్నై
- ఆసక్తులు: చరిత్ర, ఛందోబద్ధ పద్యాలు
- 130 పేజీలు, 55 రూపాయలు.
- దొరుకుచోటు: విశాలాంధ్ర, కె.రామలక్ష్మి
కాటమరాజు గొల్లప్రభువు. వేలాది పశువులు అతడి ఆస్తి. శ్రీశైలం ప్రాంతంలో తమ ఆవులను మేపుతూంటారు. ఓ సంవత్సరం ఆ ప్రాంతంలో కరవు కారణంగా గ్రాసం లేక వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దక్షిణంగా ప్రయాణించి పాకనాడుకు చేరి అక్కడి పాలకుడు నల్లసిద్ధిరాజుతో ఒక ఒడంబడికకు వచ్చి ఆ రాజ్యంలో పశువులను మేపుకుంటూంటారు.
26, ఆగస్టు 2009, బుధవారం
కులమార్పిడి బిల్లు తెండి
హిందూమతం నుండి ఇతర మతాల్లోకి వెళ్ళినవాళ్ళకు కూడా కులప్రాతిపదికన రిజర్వేషనులిస్తారట. హిందూమతం కాదనుకుని పోయినవాడికి హిందూమత సౌకర్యాలు ఎలా ఇస్తారు? తక్కువ కులమనే పేరుతో గతంలో వివక్ష చూపించారు, అణచివేసారు.. అంచేతే కులప్రాతిపదికన రిజర్వేషనులిస్తున్నారు. బానే ఉంది. ఇతర మతాల్లో వివక్ష ఉండదు, అందరూ సమానమే. అసలు కులమనే ప్రసక్తే లేని మతాలు అవి. ఇక్కడ వివక్ష ఉందిగదాని మతం మార్చుకుని, అద్భుతమైన సర్వసమానత కలిగిన ఆ మతాల్లోకి పోతున్నపుడు.. -మరి వీళ్ళకి కులరిజర్వేషను ఎందుకు? అసలు కులమనేదే లేని చోట కుల రిజర్వేషన్లా?
24, ఆగస్టు 2009, సోమవారం
హిందూమతంపై దాడి
* ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, ' హిందూ దేవాలయాల్లో పనిచేసేవారు హిందువులే అయ్యుండాల్సిన అవసరం లేదు. ఏ మతస్తులైనా పనిచెయ్యవచ్చు ' అని చెప్పాడు.
22, ఆగస్టు 2009, శనివారం
బీయెస్సెన్నెల్ బ్రాడ్ బ్యాండు వాడుకరులారా..
ఈ మధ్య నా పాత జాల కనెక్షను తీసవతల పారేసి, బీయెస్సెన్నెల్ కనెక్షను తెచ్చి నెత్తిన పెట్టుకున్నాను. కొన్నాళ్ళు బానే పని చేసిందిగానీ, ఆ తరవాత ఏడిపించడం మొదలెట్టింది. హఠాత్తుగా DNS లోపం దొర్లిందని చెప్పేది. ఓ పక్క కొన్ని సైట్లు బానే వస్తూండేవి. కొన్ని సైట్లు వచ్చేవి కావు. ఇదిగో ఈ బొమ్మ చూడండి:
16, ఆగస్టు 2009, ఆదివారం
ఎంత ఘోరం! ఎంత అవమానం!!
జాతి సిగ్గుతో తలదించేసుకోవాల్సిన సంగతి మరొకటి దొరికేసింది మనకు. అద్భుతమైన సినిమాలెన్నింటిలోనో నటించి, అమెరికాతో సహా అనేక దేశాల ప్రజలను ఆనంద డోలికల్లో ఓలలాడించిన షారుఖ్ ఖాన్ను పేరొందిన నటుడని కూడా చూడక అమెరికా ఇమ్మిగ్రేషనువాళ్ళు రెండు గంటల సేపు ప్రశ్నించారంట. తన పేరును బట్టే తనకీ అవమానం జర్గిందని చెబుతున్నాడతడు. [మై నేమ్ ఈస్ ఖాన్ అనేది ఖాన్ కొత్త సినిమా పేరంట :) ] ఎంత అవమానం! రండి, సిగ్గుతో తలొంచేసుకుందాం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
సంబంధిత టపాలు
loading..