29, డిసెంబర్ 2009, మంగళవారం

పుస్తక ప్రదర్శనలో e-తెలుగు వెలుగు!

9 కామెంట్‌లు
పదునైన ఆలోచనాశక్తి, ఆలోచనలను ఆచరణలో పెట్టే నేర్పూ కలిగిన నాయకత్వం ఏ సంస్థనైనా విజయవంతంగా నడిపిస్తుంది. స్వచ్ఛంద సంస్థల నాయకత్వాలకు ఈ లక్షణాలు మరింత ముఖ్యం. పని మీదే శ్రద్ధ పెట్టి, కార్యకర్తలను ఏకోన్ముఖంగా నడిపించగలగడం స్వచ్ఛంద సంస్థల నాయకత్వానికి ఒక సవాలు. e-తెలుగు అలాంటి స్వచ్ఛంద సంస్థే! e-తెలుగు కార్యవర్గం అటువంటి సవాలును స్వీకరించిన నాయకత్వమే!

27, డిసెంబర్ 2009, ఆదివారం

తెలంగాణవాదుల దొంగ లెక్కలు

42 కామెంట్‌లు
ఎప్పుడో ఐదారు దశాబ్దాల కిందట.. పోలీసు చర్య తరవాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది. ఆ తరవాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. రెండు రాష్ట్రాలూ కలిసి ఒకే రాష్త్రంగా ఏర్పడాలని పెద్దలు కోరుకున్నారు. హైదరాబాదు రాష్ట్ర శాసనసభ మెజారిటీతో ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఆ విధంగా ఏకమయ్యాక, తెలంగాణకు అనేక అన్యాయాలు జరిగాయనే ఉద్దేశంతో, విడిపోవాలనే ఉద్యమం మొదలెట్టారు, తెలంగాణవాదులు. 1969లో పెద్ద ఉద్యమమే చేసారు. అప్పటికి ఆ ఉద్యమం చల్లారిపోయింది. ఆ తరవాత, ఈ నలభై యేళ్ళలోనూ అనేక మార్పులొచ్చాయి, అభివృద్ధి జరిగింది. అయితే విడిపోవాలనే తెలంగాణవాది కోరిక అలాగే ఉండిపోయింది. తెలంగాణవాదుల కసి ('ఆంద్రోళ్ళు' అభివృద్ధి చెందారు, మేం చెందలేదు అనే కసి), కాంక్ష (పదవీ కాంక్ష) అలాగే ఉండిపోయాయి. కానీ ఈ కారణాలను బైటకు చెప్పుకోలేరు. అంచేత అభివృద్ధి జరగలేదని చెబుతూ రకరకాలుగా అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు. చేస్తూ, ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం చేస్తున్నారు.

24, డిసెంబర్ 2009, గురువారం

చవకబారున్నర విశ్లేషకుడు

11 కామెంట్‌లు
ఆ మధ్య హై.లో సినిమా షూటింగుల మీదబడి ధ్వంసం చేసారు ముష్కరులు. మనోజ్ సినిమా షూటింగు సంఘటన పట్ల స్పందనగా మోహన్‌బాబు ఘాటుగానే మాట్టాడాడు. ఆ తరవాత అల్లు అర్జున్ సినిమా షూటింగు మీద కూడా దాడి జరిగింది.

మన టీవీలవాళ్ళకు ఘంటా చక్రపాణి అనే నిలయ విద్వాంసుడి లాంటి విశ్లేషకు డొకాయనున్నాడు. దాడి విషయమ్మీద ఓ టీవీలో మాట్టాడుతూ -

ఇక సంప్రదింపులట!

10 కామెంట్‌లు
2012 సినిమాలో కాబోలు.. భూమి ధ్రువాలు మారిపోతాయంట. ఉత్తర దక్షిణ ధ్రువాలు అటుదిటూ ఇటుదటూ కావడంతో ప్రళయం జరుగుతుందట. అలా ఎందుకు జరిగిందో కారణం నాకు తెలవదు.

2009 డిసెంబరు 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ధ్రువమార్పిడే జరిగింది. కోస్తా, సీమల్లో ఉద్యమాగ్ని చప్పున చల్లారిపోయి, తెలంగాణలో గుప్పున మంటలెగసాయి. కారణం మనందరికీ తెలుసు. కేంద్రం చేసిన మరో ప్రకటనతోఈ ధ్రువమార్పిడి జరిగింది. ఆంధ్రప్రదేశాన ఇలా జరగడం ఇది రెండో సారి. మొదటిసారి డిసెంబరు 9 న - తెల్లారితే పదో తేదీ అనగా - జరిగింది.

19, డిసెంబర్ 2009, శనివారం

రాయలవారికి బహిరంగలేఖ!

23 కామెంట్‌లు
మొత్తమ్మీద డాక్టరు గారు మళ్ళీ మనలోకంలో పడ్డారు. ఎటొచ్చీ.. 'నేజెప్పేది వినండి, మీరేదైనా చెప్పాలనుకుంటే పోయి మీమీ బ్లాగుల్లో ఏడవండి, ఇక్కడ మీ రాతలకు స్థానం లేదు అని అంటున్నారు.' సరే అలాక్కానివ్వండి సార్!  కానీ, డాక్టరు గారూ, ఓటి గమనించారా..? మీకు రాయలంటే అభిమానం.  మీ బ్లాగుకు ఆయన పేరే పెట్టుకున్నారు. ఆయనో సమైక్యవాది. -పోనీ విస్తరణవాది అనుకుందాం. మీరు మాత్రం విభజనవాది! రాయలు ధర్మం తెలిసినవాడు, గుర్రాలమ్ముకుందామని వచ్చి గొడవలు పెట్టుకున్నవాళ్లను  కూడా సభకు రానిచ్చి, వాళ్ళు చెప్పింది విన్నాడంట. మీరేంటి సార్,

16, డిసెంబర్ 2009, బుధవారం

'ఆంద్రోళ్ళు' దురాక్రమణవాదులా?

30 కామెంట్‌లు
తెలంగాణ ఎందుకు అని అడిగితే నీళ్ళు, నిధులు, నియామకాల కోసం అని సమాధానం వస్తుంది. ఇంకోటి కూడా వినవస్తుంది.. దాడి, దోపిడీ, దురాక్రమణలను ఎదుర్కొనేందుకు అని. సంస్కృతి మీద దాడి, నిధుల దోపిడీ, ఆస్తుల దురాక్రమణలను ను ఎదుర్కొనేందుకు అని వీటికర్థం. ఈ రెండో సెట్టు సరిగ్గా ఇదే కాకపోవచ్చు, నేను పొరపాటు పడి ఉండవచ్చు. కాస్త అటూ ఇటూగా ఇలాగే ఉంటది.

14, డిసెంబర్ 2009, సోమవారం

కొందరు తెలంగాణ వాదుల అబద్ధాలు

59 కామెంట్‌లు
తెలంగాణ ఎందుకు వేరు పడాలి అని ఎవరైనా తెలంగాణ వాదిని అడిగి చూడండి.. ఓ అరడజను లింకులు మన మొహాన పడేసి పోతారు. తెలంగాణ గ్రామాల్లో ఛిద్రమౌతున్న జీవితాలను చూడండి అంటూ భావోద్వేగాన్ని ఒలకబోస్తారు. మా ప్రాంతాన్ని దుర్మార్గంగా ఆక్రమించారు ఆంద్రోళ్ళు అని అంటారు, అక్కడికేదో కోస్తా సీమల వాళ్ళు వీళ్ళ పొలాలను కొనుక్కోకుండా కబ్జా చేసేసుకున్నట్టు! ఇంకా ఇలాంటివే బోలెడు కన్నీటి గాథలు చెప్పుకుంటూ పోతారు. ఎంతలా చెబుతారంటే.., అది నిజమే కాబోలునని జనం అనుకుంటారు. పైగా.., అన్నదమ్ముల్లా విడిపోవాలంట!

9, డిసెంబర్ 2009, బుధవారం

తెలంగాణపై కాంగ్రెసు సందిగ్ధ ప్రకటన

13 కామెంట్‌లు
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడతాం. శాసనసభలో సముచితమైన తీర్మానాన్ని ప్రవేశపెడతాం. అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సాయంత్రం నుంచీ జరిగిన కోర్ కమిటీ, ఇంకా ఇతర సమావేశాల తరవాత చిదంబరం ఈ సంగతి ప్రకటించాడు. ఉద్యమకారుల మీద పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేస్తామనీ ప్రకటించాడు.

7, డిసెంబర్ 2009, సోమవారం

బాబ్రీకట్టడపు కూల్చివేత వార్షికోత్సవం

35 కామెంట్‌లు
పురుషోత్తముడి గుడిని కూల్చేసి మసీదునొకదాన్ని కట్టాడో దురాక్రమణదారు. తన జాతి వారసత్వంపై మక్కువ, గర్వమూ ఉన్న ఏ స్వతంత్ర ప్రభుత్వమైనా ఆ కట్టడాన్ని పడేసి మళ్ళీ గుడి కట్టుకుంటుంది. ఎందుకంటే అది జాతి గౌరవంతో ముడిపడి ఉన్నది కాబట్టి. ఎంచేతో మన ప్రభుత్వాలు ఆ పని చెయ్యట్లేదు. మరి ఇవి ప్రభుత్వాలు కావో, లేక వాటికి ఈ జాతి వారసత్వం పట్ల గౌరవం లేదో!! ప్రభుత్వాలు ఎలాగన్నా పోనీండి.., ఆ పనేదో తామే చేసుకోవాలనుకున్నారు, హిందువులు. ఆ పనిలో సగభాగం పూర్తై మరో ఏడాది గడిచిపోయింది. గుడి కట్టే కార్యక్రమం మాత్రం ఇంకా మొదలు కాలేదు.

2, డిసెంబర్ 2009, బుధవారం

బలవన్మరణ దీక్ష

22 కామెంట్‌లు
పులి మీద స్వారీ చెయ్యడానికి పూనుకుంటే మళ్ళీ దిగే వీలుంటుందో ఉండదోనని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలంట. లంచావతారం సినిమాలో కాబోలు.. దాసరి చెబుతాడు, లంచం తీసుకోవడం పులిమీద స్వారీ లాంటిదని. స్వారీ మొదలెట్టడమే మన చేతిలో ఉంటుంది, దిగడం మనవల్ల కాదు. ఆమరణ నిరశనదీక్షలు కూడా అలాంటివేనని ఇప్పుడు తోస్తోంది.

5, నవంబర్ 2009, గురువారం

మన హితము గోరి పెద్దలిందరు పలుకుచుండగా..

30 కామెంట్‌లు
అసలూ.. తెలుగులో మాట్లాడొద్దని చెప్పినా ఆ పిల్లలు తెలుగులోనే మాట్లాడి పలకలు తగిలించుకునేదాకా ఎందుకు తెచ్చుకున్నారంటారూ?

మనమంటే పెద్దాళ్ళం, బోలెడు భేషజాలుంటై, బడాయిలుంటై, తెలుగులో మాట్టాడాలంటే నామోషీలుంటై.. అంచేత ఎన్ని తిప్పలు పడైనా,.. ఇంగ్లీషులోనే మాట్టాడతాం. కానీ ఇంగ్లీషొచ్చినట్టు నటించాల్సిన ఖర్మ పిల్లలకేంటి? హాయిగా తెలుగులో మాట్టాడుకుంటారు. తెలీని భాషలో మాట్టాడగలిగే తెలివితేటలు కూడా వాళ్ళకు లేవు! పైగా, తమదిగాని భాషలో మాట్టాడాలంటే పడే తిప్పలు మామూలువి కావు మరి. అంచేత పాపం తెలుగులో మాట్టాడి పలక మెడలో వేయించుకున్నారు.

2, నవంబర్ 2009, సోమవారం

సాయంకాలమైంది!

7 కామెంట్‌లు
అప్పుడే సాయంకాలమైంది. సూర్యాస్తమయం చేరువైంది.  సంవత్సరం కిందట ఉజ్వలంగా ఉదయించిన ప్రజారాజ్యం సూర్యుడు, కాంగ్రెసు తుప్పల్లో కుంకబోతున్నాడు.

పాపం చిరంజీవి! హీరో కావాలనుకున్నవాడు మొన్నటి ఎన్నికల్లో జీరో అయ్యాడు. ఇప్పుడు కాంగ్రెసు పంచన చేరి, నిదానంగా వంత పాత్రలు వేసి, ఎప్పుడోకప్పుడు హీరో కాకపోతానా అని చూస్తున్నట్టున్నాడు. కాంగ్రెసుతో పెట్టుకుంటున్న ఈ పొత్తు కారణంగా ఒక్కటి మాత్రం స్పష్టం.. ఒకవేళ ఈ పొత్తే గనక 2014 ఎన్నికలలోనూ కొనసాగినా, లేక ఈలోగా ప్రజారాజ్యం కాంగ్రెసులో మునిగిపోయినా.. కాంగ్రెసు చేస్తే తప్ప ఇక అతడు హీరో కాలేడు. పాపం చిరంజీవి!

24, అక్టోబర్ 2009, శనివారం

ఆ.. ట ఆగిందా!

8 కామెంట్‌లు
ఒకరి సీ...టు గోవిందా! ఓ పక్క శవాన్ని పెట్టుకోని, అంత బాధనూ దిగమింగుతూ కూడా జగను బ్యాచ్చీ అంత రాజకీయం చేసారే! అంతటి కష్టంలోనూ రాజకీయం చెయ్యక తప్పని వాళ్ళ పరిస్థితిని అధిష్ఠానదేవత  ఇసుమంతైనా పట్టించుకుందా? మరీ సెంటిమెంట్లు లేనట్టుగా వ్యవహరించింది.

21, అక్టోబర్ 2009, బుధవారం

తెలంగాణ ఉద్యమాన్ని లేవదీసే ప్రయత్నం

8 కామెంట్‌లు
సిద్దిపేటలో ఉద్యోగుల గర్జన పేరుతో అక్టోబరు 21న తెరాస నిర్వహించిన సభను టీవీలో చూసాను. హైదరాబాదును ఫ్రీజోనుగా ప్రకటిస్తూ (పోలీసు నియామకాలకు సంబంధించి) సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణా ఉద్యోగ సంఘాలతో కలిసి పెట్టిన సభ ఇది.

14, అక్టోబర్ 2009, బుధవారం

హైకమాండు, హై.కమాండు

11 కామెంట్‌లు
జగను హై. చేరాడు. ఇక ఢిల్లీలో  హైకమాండు - హైదరాబాదులో  హై.కమాండు. మంత్రులు, ఎమ్మెల్యేల  తీర్థయాత్రాస్థలం ఇక కళకళలాడబోతోంది.  ముఖ్యమంత్రి జగనుకు చేసే ఫోన్లు ఇలా ఉండొచ్చు - 'జగనూ, ఆ రఘువీరారెడ్డి ఉంటే రేపో ఎల్లుండో ఓసారి సచివాలయానికి పంపించవా, కాస్త పనుంది.'

పాకిస్తానువాడిక్కూడా వద్దురా నాయనా ఇలాంటి మంత్రులు !

10, అక్టోబర్ 2009, శనివారం

ఒబామాకు నోబెలిస్తే మనకెందుకాశ్చర్యం?

30 కామెంట్‌లు
ఒబామాకు నోబెలిస్తున్నట్టు ప్రకటించినప్పుడు అక్కడున్న విలేకరులు ఆశ్చర్యంతో ఆవులించారు. ప్రపంచమంతా విస్తుపోయింది. అధ్యక్షపదవిలోకి వచ్చిన 12 రోజుల్లోనే అతడు అంత శాంతిదూత ఎలా అయ్యాడో పాపం ఒబామాకు కూడా అర్థమయ్యుండదు. ఒక రకంగా ఇది ఒబామాను చిన్నబుచ్చడమే. ఒబామాను విమర్శించేందుకు, అతడి మీద కార్టూన్లు జోకులూ వేసుకునేందుకు ప్రజలకిచ్చిన అవకాశమే ఇది. ఇప్పుడు నేనేం చేసానని నాకీ పురస్కారం అని అతడు తలపట్టుకునే పరిస్థితి. దానికితోడు,

2, అక్టోబర్ 2009, శుక్రవారం

పోటెత్తిన కృష్ణ -ప్రమాదంలో రాష్ట్రం

44 కామెంట్‌లు
కృష్ణానది ఉప్పొంగుతోంది. ఊళ్ళను, నగరాలను, మండలాలను కూడా ముంచెత్తుతూ ఉరకలెత్తుతోంది. గత వంద సంవత్సరాల్లో ఎప్పుడూ రానంత వరద వచ్చిందట.  కర్నూలు నగరం నడుంలోతు నీళ్ళలో మునిగిపోయింది.  మంత్రాలయం మునిగిపోయింది. రాఘవేంద్రస్వామి మఠం మునిగిపోయింది. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అనేక ఊళ్ళు నీళ్ళలో చిక్కుకుపోయాయి. విజయవాడ ప్రమాదపు అంచున ఉంది. పులిచింతల కాఫరు డ్యాము కొట్టుకుపోయింది.  శ్రీశైలం డ్యాము, నాగార్జున సాగరు డ్యాము పాటవ పరీక్షను, పటుత్వ పరీక్షను ఎదుర్కొంటున్నాయి.

28, సెప్టెంబర్ 2009, సోమవారం

జగనే మాయ! పదవే మాయ!!

39 కామెంట్‌లు
రాష్ట్రంలో కాంగ్రెసు నాయకులు ఎప్పుడూ కూడా అధికార కుటుంబానికి పాలేళ్ళే. ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్.. ఇలా ఎప్పుడూ ఎవరో ఒక వ్యక్తికి ఊడిగం చేస్తూ ఉంటారు. కొందరు పెద్ద పాలేళ్ళు, కొందరు ఇంట్లో పనులుచేసే చిన్న పాలేళ్ళు, కొందరు రోజుకూలీలు. ఎన్ని రకాలున్నప్పటికీ అందరూ పాలేళ్ళే. దొర కనుసన్నలలో ఉండటం కోసం నానాతంటాలు పడతారు.

12, సెప్టెంబర్ 2009, శనివారం

కంప్యూటరు ఈ యుగపు ఋక్కు

11 కామెంట్‌లు
సమకాలీన తెలుగు కవుల్లో గరికపాటి నరసింహారావు ప్రసిద్ధులు. దేశవిదేశాల్లో దాదాపు 250 అవధానాలు చేసిన పండితుడాయన. టీవీల్లో కావ్యపఠనం చేస్తూ పండిత పామరులను అలరిస్తూ ఉంటారు. ఛందోబద్ధ పద్యాలను వినసొంపుగా పాడి పండిత పామరులను అలరిస్తూ ఉంటారు.

3, సెప్టెంబర్ 2009, గురువారం

రాజశేఖరరెడ్డి మరణం, ఆ తరవాత

33 కామెంట్‌లు
సంచలనాల జీవితం సంచలనంగానే ముగిసింది. అరవయ్యో యేట రాజకీయాలనుండి విశ్రాంతి తీసుకుందామనుకున్నా, అలా జరగలేదు. ప్రతి మనిషికీ తన జీవితంలో చేసిన పనులను, తను సాధించినవిజయాలను నెమరు వేసుకుని, తన తప్పొప్పులను సమీక్షించుకునే అవకాశం బహుశా వానప్రస్థంలో కలుగుతుంది. కానీ వై.ఎస్‌కు ఆ అవకాశం లేకపోయింది. ముఖ్యమంత్రిగా తీరుబడిలేని జీవితం గడుపుతూండగానే అర్థంతరంగా  జీవిత ప్రయాణం ముగిసింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఐదుగురి కుటుంబసభ్యులకూ నా సానుభూతి.

30, ఆగస్టు 2009, ఆదివారం

హిందూ వ్యతిరేక దళితిస్టువాదం

49 కామెంట్‌లు
దేశంలో కొంతమందికి హిందూమతాన్ని విమర్శించడం ఫ్యాషనైపోయింది. హిందూమతాన్ని తిడుతూ, ఇతర మతాలను వెనకేసుకొస్తూంటారు. వీళ్ళు కాలం చెల్లిన, బూజు పట్టిన పాత కబుర్లు చెబుతూ, "మనుస్మృతిలో అలా చెప్పారు, రామాయణంలో ఇలా చెప్పారు, కొన్ని కులాల వాళ్ళను వేదం చదవనీయలేదు, కృష్ణుడు ఇలా చేసాడు, దేవుళ్ళంతా కొన్ని కులాలకే చెందినవాళ్ళు, ఇతర కులాలకు దేవుళ్ళు లేరు.." - ఇలాంటి అరిగిపోయిన వాదనలు చేస్తూంటారు. ఇలాంటి వాదనలు చేసేవాళ్ళను దళితిస్టువాదులు అనీ, వీళ్ళ వాదాన్ని దళితిస్టువాదం అని అంటారు.

28, ఆగస్టు 2009, శుక్రవారం

కాటమరాజు కథ - ఆరుద్ర నాటకం

7 కామెంట్‌లు
కాటమరాజు కథ
-స్టేజీ నాటకం
  • రచన: ఆరుద్ర
  • వస్తువు: ఆంధ్ర చారిత్రిక గాథ
  • రాసిన సంవత్సరం: 1961
  • ముద్రణ: 1999
  • ప్రచురణకర్త: స్త్రీశక్తి ప్రచురణలు, చెన్నై
  • ఆసక్తులు: చరిత్ర, ఛందోబద్ధ పద్యాలు
  • 130 పేజీలు, 55 రూపాయలు.
  • దొరుకుచోటు: విశాలాంధ్ర, కె.రామలక్ష్మి
కాటమరాజు కథ - 13 వ శతాబ్దం చివరిలో నెల్లూరుసీమలో జరిగిన ఒక వాస్తవ వీరగాథ. పలనాటి వీరచరిత్ర లాగా కాటమరాజు కథ కూడా మన రాష్ట్రంలో సుప్రసిద్ధం.

కాటమరాజు గొల్లప్రభువు. వేలాది పశువులు అతడి ఆస్తి. శ్రీశైలం ప్రాంతంలో తమ ఆవులను మేపుతూంటారు. ఓ సంవత్సరం ఆ ప్రాంతంలో కరవు కారణంగా గ్రాసం లేక వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దక్షిణంగా ప్రయాణించి పాకనాడుకు చేరి అక్కడి పాలకుడు నల్లసిద్ధిరాజుతో ఒక ఒడంబడికకు వచ్చి ఆ రాజ్యంలో పశువులను మేపుకుంటూంటారు.

26, ఆగస్టు 2009, బుధవారం

కులమార్పిడి బిల్లు తెండి

42 కామెంట్‌లు
హిందూమతం నుండి ఇతర మతాల్లోకి వెళ్ళినవాళ్ళకు కూడా కులప్రాతిపదికన రిజర్వేషనులిస్తారట. హిందూమతం కాదనుకుని పోయినవాడికి హిందూమత సౌకర్యాలు ఎలా ఇస్తారు? తక్కువ కులమనే పేరుతో గతంలో వివక్ష చూపించారు, అణచివేసారు.. అంచేతే కులప్రాతిపదికన రిజర్వేషనులిస్తున్నారు. బానే ఉంది. ఇతర మతాల్లో వివక్ష ఉండదు, అందరూ సమానమే. అసలు కులమనే ప్రసక్తే లేని మతాలు అవి. ఇక్కడ వివక్ష ఉందిగదాని మతం మార్చుకుని, అద్భుతమైన సర్వసమానత కలిగిన ఆ మతాల్లోకి పోతున్నపుడు.. -మరి వీళ్ళకి కులరిజర్వేషను ఎందుకు? అసలు కులమనేదే లేని చోట కుల రిజర్వేషన్లా?

24, ఆగస్టు 2009, సోమవారం

హిందూమతంపై దాడి

8 కామెంట్‌లు

* ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, ' హిందూ దేవాలయాల్లో పనిచేసేవారు హిందువులే అయ్యుండాల్సిన అవసరం లేదు. ఏ మతస్తులైనా పనిచెయ్యవచ్చు ' అని చెప్పాడు.

22, ఆగస్టు 2009, శనివారం

బీయెస్సెన్నెల్ బ్రాడ్ బ్యాండు వాడుకరులారా..

16 కామెంట్‌లు
ఈ మధ్య నా పాత జాల కనెక్షను తీసవతల పారేసి, బీయెస్సెన్నెల్ కనెక్షను తెచ్చి నెత్తిన పెట్టుకున్నాను. కొన్నాళ్ళు బానే పని చేసిందిగానీ, ఆ తరవాత ఏడిపించడం మొదలెట్టింది. హఠాత్తుగా DNS లోపం దొర్లిందని చెప్పేది. ఓ పక్క కొన్ని సైట్లు బానే వస్తూండేవి. కొన్ని సైట్లు వచ్చేవి కావు.  ఇదిగో ఈ బొమ్మ చూడండి:

16, ఆగస్టు 2009, ఆదివారం

ఎంత ఘోరం! ఎంత అవమానం!!

38 కామెంట్‌లు
జాతి సిగ్గుతో తలదించేసుకోవాల్సిన సంగతి మరొకటి దొరికేసింది మనకు. అద్భుతమైన సినిమాలెన్నింటిలోనో నటించి, అమెరికాతో సహా అనేక దేశాల ప్రజలను ఆనంద డోలికల్లో ఓలలాడించిన షారుఖ్ ఖాన్‌ను పేరొందిన నటుడని కూడా చూడక అమెరికా ఇమ్మిగ్రేషనువాళ్ళు రెండు గంటల సేపు ప్రశ్నించారంట. తన పేరును బట్టే తనకీ అవమానం జర్గిందని చెబుతున్నాడతడు. [మై నేమ్ ఈస్ ఖాన్ అనేది ఖాన్ కొత్త సినిమా పేరంట :) ] ఎంత అవమానం! రండి, సిగ్గుతో తలొంచేసుకుందాం.

21, మే 2009, గురువారం

తెలంగాణపై రహస్య సమావేశం

28 కామెంట్‌లు
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కల సాకారమయ్యేందుకు అవసరమైన అనుకూల వాతావరణం ఏర్పడింది.  ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏర్పడిన తెలంగాణ-అనుకూల పరిస్థితులు ఇంతకు ముందెన్నడూ లేవు. త్వరలో రాష్ట్ర విభజన మొదలయ్యేందుకు రాజకీయ సమీకరణాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి.

18, మే 2009, సోమవారం

కాంగ్రెసు గెలిచింది

25 కామెంట్‌లు
రాజశేఖరరెడ్డి గెలిచాడు.

రాజశేఖరరెడ్డి ఐదేళ్ళ అద్భుతమైన పాలనకు మురిసి ప్రజలు వోట్లేసారని కాదు, ప్రతిపక్షాలు ఈ ఐదేళ్ళలో అద్భుతమైన పనితీరేమీ కనబరచలేదు కాబట్టి. 'ఇదిగో వీళ్ళకు వోటేస్తే మంచి, సమర్ధవంతమైన పాలనను అందిస్తారు' అనే నమ్మకాన్ని ప్రజలకు కలిపించలేకపోయారు కాబట్టి కాంగ్రెసు గెలిచింది. ప్రభుత్వ వ్యతిరేక వోట్లను ప్రతిపక్షాలు చీల్చుకోడంతో కాంగ్రెసు గట్టెక్కింది. గతంలో కంటే సీట్లు తగ్గడాన్ని బట్టి తెలుస్తోంది, ప్రజలు కాంగ్రెసు పట్ల వ్యతిరేకతతో ఉన్నారని. వోట్ల శాతాలు వెల్లడైతే అప్పుడు పూర్తి సంగతులు తెలుస్తాయి.

18, ఏప్రిల్ 2009, శనివారం

కుఁయ్..కుయ్...కుయ్య్

19 కామెంట్‌లు
ఎన్నికల ప్రచారంలో తన ఆరోగ్యశ్రీ  పథకం గురించి చెప్పుకునే క్రమమంలో అంబులెన్సు మోతను అనుకరించడానికి గాను రాజశేఖరరెడ్డి కుఁయ్.. కుఁయ్.. కూఁయ్.. అంటూ గుక్కపట్టి అరిచేవాడు. యాడుల్లో తమ ఉత్పత్తులను తేలిగ్గా గుర్తుకు తెచ్చేలా ఉండటం కోసం, తమ ఉత్పత్తికో బ్రాండు గుర్తింపును, బ్రాండు విలువనూ తేవడం కోసం జింగిల్స్ వాడుతూంటారు. అలాగ,  వయ్యెస్ కూడా ఈ కూతతో తనకూ, ఆరోగ్యశ్రీకీ ప్రజల్లో ఒక బ్రాండుస్పృహ కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. అంబులెన్సు కూత వింటే, ఏదో అనర్ధాన్ని సూచిస్తూ, ఆందోళన కలిగిస్తుంది. వయ్యెస్ వేసే ఈ కూత అంతకంటే ఎక్కువ చిరాకు కలిగించేది. అన్ని యేళ్ళొచ్చినవాడు వేదికనెక్కి ఇలా కారాట, బస్సాట ఆడుకున్నట్టు అంబులెన్సాట ఆడుకుంటూ ఉంటే, ఎబ్బెట్టుగా ఉండదా మరి.

14, ఏప్రిల్ 2009, మంగళవారం

చారిత్రిక అవసరం

22 కామెంట్‌లు
అధికారమనేది లక్ష్యం కాకూడదు, అదొక మార్గం అంతే! అంటున్నాడు లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ. జాతినిర్మాణం, బిడ్డల భవిష్యత్తూ లక్ష్యాలు కావాలి. అధికారం -దాన్ని సాధించే మార్గం కావాలి. కానీ సాంప్రదాయిక రాజకీయ పార్టీలు అధికారాన్ని లక్ష్యంగా చూస్తున్నాయి అని అంటున్నాడు.

10, ఏప్రిల్ 2009, శుక్రవారం

ఏం తేడా లేదు!

65 కామెంట్‌లు
ఇన్నాళ్ళూ ప్రజారాజ్యాన్ని రాజ్యేతరులే విమర్శించారు. ఆ పార్టీలో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. మిగతా పార్టీల కంటే కొత్తదనం, వైవిధ్యత ఏదీ లేదన్నారు. డబ్బులు తీసుకుని టిక్కెట్లిస్తున్నారనీ అన్నారు. చిరంజీవి పైకి కనబడేంత సౌమ్యుడు, అమాయకుడూ కాదన్నారు. అతడిది నటన అని అన్నారు. అది అతివినయం అనీ అన్నారు.

2, ఏప్రిల్ 2009, గురువారం

రెండు చర్చలు

9 కామెంట్‌లు
ఇవ్వాళ టీవీ ఛానళ్ళలో రెండు చర్చలు చూసాను.  రోజూ చూస్తాననుకోండి, ఎందుకో ఈ రెంటి గురించీ రాయాలనిపించింది. కాస్త సమయమూ చిక్కింది. ముందుగా..

20, మార్చి 2009, శుక్రవారం

పత్రికలూ నేనూ

9 కామెంట్‌లు
(గత టపా తరువాయి)

వీటన్నిటికంటే ముందు యువ వచ్చేది. వడ్డాది పాపయ్య బొమ్మలు తప్ప మరింకేవీ గుర్తు లేవు నాకు.  వపా బొమ్మల వేళ్ళు ఎలా ఉండేవి.. సన్నగా, కోసుగా, చివర్లు నైసుగా వంపు దిరిగి ఉండేవి.  ఎంత హొయలు బోయేవి ఆ బొమ్మలు!! యువలో నాకు అవే నచ్చేవి.  అలాగే చందమామ బాలమిత్ర కూడా వచ్చేవి. కొన్నాళ్ళు బొమ్మరిల్లూ చదివాను. వాటికి నేను ఏకైక పాఠకుణ్ణి అవడం చేత, మాయింట్లో అంత ఆదరణ ఉండేది గాదు. తరవాత్తరవాత కొన్నాళ్ళకి వాటిని మానిపించారు.

19, మార్చి 2009, గురువారం

నేను చదివిన పత్రికలు

20 కామెంట్‌లు
చిన్నప్పుడు మాయింటికి ఈనాడు, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పేపర్లతో పాటు, వారపత్రికలు కూడా వచ్చేవి. ఈనాడు విజయవాడలో ముద్రణ పెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా మాయింటికి ఈనాడు వస్తూనే ఉంది. జ్యోతి మధ్యలో కొన్నాళ్ళు ఆపారుగానీ, ఈనాడు మాత్రం ఎప్పుడూ మానలేదు.  అప్పటినుండి ఇప్పటిదాకా మా కుటుంబమంతా కాంగ్రెసు పార్టీవారైనా , నేను మాత్రం ఈనాడు పార్టీనే.  :)  (అనగా కాంగ్రెసు వ్యతిరేకిని). ఇప్పుడు మావాళ్ళు తమ అభిమాన, ముష్టిపార్టీ పత్రికను కూడా వేయించుకుంటున్నారు (పార్టీ ముష్టిది, పత్రిక వీరముష్టిది). ఏం చేస్తాను, ఆళ్ళ రాజకీయాలు ఆళ్ళవి.
ఆగండాగండి.. ఇకముందు రాజకీయాల్లేవీ టపాలో, ఒట్టు!

2, మార్చి 2009, సోమవారం

ఎన్నిక లెన్నిక లెన్నిక లెండిక!

16 కామెంట్‌లు
ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. పార్టీలు, నాయకులు మన ముందు చేతులు కట్టుకు నిలబడే రోజు వస్తోంది. 2009 సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది.

1, మార్చి 2009, ఆదివారం

పేర్ల పురాణం

23 కామెంట్‌లు
"విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, డాక్టర్, పద్మశ్రీ  నందమూరి తారక రామారావు నటించిన.. " అని మన రాష్ట్ర విఖ్యాత సినిమారిక్షా వాడు చెప్పుకుంటూ పోతూంటే, అది వింటూ, వాడు పంచే కరపత్రాల కోసం ఆ బండెనకాలే పరిగెడుతూ -ఆహా, తలుచుకుంటూంటేనే మైకం కమ్ముతోంది. ఆ మైకువాడు ప్రతీసారీ ఆ ముందరి బిరుదులన్నీ వరసాగ్గా చదివేవాడు, అదంతా రామారావు ఇంటిపేరైనట్టు! రామారావు భక్తులైన కొందరు నాబోటిగాళ్ళు కూడా ఉత్త రా. మా. రా. వు. అని అంటే పాపం తగులుద్దేమో అన్నట్టు మొత్తం బిరుదులన్నీ చదివి మరీ పేరు చెప్పేవాళ్ళు.

25, ఫిబ్రవరి 2009, బుధవారం

ప్రమదావనం.. భేష్!

3 కామెంట్‌లు
సామాజికంగా సేవ చెయ్యాలనే ఆసక్తి ఎంతో మందికి ఉంటుంది. ఉత్సాహమూ ఉంటుంది. వీటికి మించి సాటివారి కష్టం, బాధ, వేదనల పట్ల సహానుభూతి ఉంటుంది. కానీ అందుకు అవసరమైన ఆర్థిక, ఆర్థికేతర వనరులు లేకపోవడం వలనగానీ, మరో కారణం వలన గానీ ఆయా పనులు చెయ్యలేరు. ఎక్కడో అరుదుగా, యామినీ ఫౌండేషను పెట్టిన శ్రీనివాసు గారి లాంటివారు ఉంటారు.అలాంటి అరుదైన సేవకులను అభినందిద్దాం.

14, ఫిబ్రవరి 2009, శనివారం

బ్లాగుల్లో దొంగలు పడ్డారు

17 కామెంట్‌లు
..పడి, మన ఐడీలను కొట్టేస్తున్నారు. మన వేషాలేసుకుని, మన పేర్లతో దొంగ వ్యాఖ్యలు రాసేస్తున్నారు. ఇది ఎవరి పనో చెప్పనక్కర్లేదు, ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలను పరిశీలించినవారికెవరికైనా, ఈ పనులు చేస్తున్నది ఎవరో తెలిసిపోయి ఉంటుంది.

1, ఫిబ్రవరి 2009, ఆదివారం

సరికొత్త బ్లాగుల పరిచయం

26 కామెంట్‌లు
బ్లాగు మూతల కార్యక్రమంలో తెలుగు బ్లాగరులు తలమునకలుగా ఉండగా.. ప్రసిద్ధులైనవాళ్ళు తమ తెలుగు బ్లాగులను మొదలుపెట్టారు. బ్లాగరి పేరు, బ్లాగు పేరు (బొద్దు అక్షరాల్లో), వాళ్ళ బ్లాగులలోని ప్రధాన విశేషాలు మొదలైనవాటితో కూర్చిన టపా ఇది. అవధరించండి.

29, జనవరి 2009, గురువారం

అది "శ్రీరామ సేన" కాకుండా మరోటేదైనా అయ్యుంటే..

44 కామెంట్‌లు
మంగళూరు పబ్బు దాడి చేసినది "శ్రీరామ సేన" కాకుండా మరోటేదైనా అయ్యుంటే.. ఏ పీపుల్ ఫర్ రేషనల్, ఎథికల్, మెథొడికల్ లివింగో, డెమోక్రటిక్ సెక్యులర్ లిబర్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియానో, జెనెక్స్ ఇండియానో, ఇలాంటి ఇంగ్లీషు పేర్లు - హిందూ వాసన లేని పేర్లు - పెట్టుకున్న మరో సంస్థ ఏదైనానో చేసుంటే మన మహిళల పబ్బు హక్కుల కార్యకర్తలు ఒక్ఖరైనా నోరు మెదిపేవారా? పేపర్లలో అసలు వార్తలొచ్చేవా? దాడిని ఖండిస్తూ ప్రకటనలుండేవా? బ్లాగుల్లో వ్యాఖ్యలుండేవా? అసలు టపాలుండేవా? -ఇవేవీ ఉండేవి కావు. 

19, జనవరి 2009, సోమవారం

హద్దులేని అధికార పక్షం - అడ్డలేని ప్రతిపక్షం

14 కామెంట్‌లు
ఐదేళ్ళుగా ఈ అధికారపక్షం ఆంధ్రప్రదేశ్‌ను ఎన్ని రకాలుగా దోచుకోవచ్చో అన్ని రకాలుగానూ దోచుకుంటోంది. కుంభకోణాల యజ్ఞాలు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం వారిని అడ్డుకోలేకపోతోంది. ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తే ప్రభుత్వం తప్పులను బయటపెట్టవచ్చో, ఒకప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షానికి తెలిసే ఉండాలి. కానీ ఈ ప్రతిపక్షం అలా తెలిసినట్టుగా వ్యవహరించడంలేదు.

7, జనవరి 2009, బుధవారం

అసత్యం

20 కామెంట్‌లు
లాభాలు అబద్ధం.
చూపెట్టిన అప్పులు అబద్ధం.
రావాల్సి ఉందని చెప్పిన ఆదాయం అబద్ధం.

ఆయన కుటుంబానికే చెందినవి మేటాస్ ఇన్ఫ్రా, మేటాస్ ప్రాపర్టీస్ కంపెనీలు. (వీటినే సత్యంలోకలిపెయ్యబోతే షేరుహోల్డర్లు ఎదురుతిరిగారు.) మేటాస్ ఇన్ఫ్రాయే హై.లో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఆ ప్రాజెక్టును వాళ్ళకు ఇచ్చినందుకుగాను, ఆశ్చర్యకరమైన రీతిలో 35 ఏళ్ళలో ప్రభుత్వానికే 30 వేల కోట్లు ఎదురు చెల్లిస్తామని ఒప్పుకుంది -ప్రభుత్వం ఇస్తానన్న రెండున్నర వేల కోట్ల రూపాయల డబ్బులు వద్దని మరీ! ఎలా చేస్తారో మరి!!

సంబంధిత టపాలు