దాదాపు నూట యాభై ఏళ్ళ వియోగం తరవాత 1956 నవంబరు 1 న తెలుగుజాతి తిరిగి
ఏకమైంది. అభివృద్ధి పట్ల, జీవన పరిస్థితుల మెరుగుదల పట్లా ప్రజల్లో ఉన్న ఆకాంక్షలను తీర్చడానికై సమైక్య రాష్ట్రం ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. మామూలుగా ప్రభుత్వాల్లో ఉండే అలసత్వం, నాయకులు, పాలకుల్లో ఉండే అవినీతి, అక్రమాల వంటి అవలక్షణాలు ఈ ప్రభుత్వాల్లోనూ ఉన్నాయి. ఈ అవకరాల గురించి చేసే విమర్శలు రోజూ మనం చదువుతూనే ఉన్నాం. వింటున్నాం. మనమూ రాస్తున్నాం. బ్లాగుల్లోను, ఇతర మీడియాలోను, ప్రజల్లోను, వివిధ వేదికల మీదా అనేక విమర్శలు వస్తున్నాయి.
సమాజం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సమాజం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
1, నవంబర్ 2011, మంగళవారం
26, ఆగస్టు 2011, శుక్రవారం
లే థింకర్లు, లే.థింకర్లు, భలే థింకర్లు, రిలే థింకర్లు
ముందుగా లే. థింకర్ల గురించి. లే. థింకర్స్ అంటే లే థింకర్స్ (lay thinkers)
అని కాదు, ’లే’ పక్కన చుక్క ఉంది చూడండి. లే. థింకర్స్ అంటే లేటరల్ థింకర్స్ అని అండి. మామూలుగా సూటిగా, నిటారుగా ఆలోచించకుండా కొంత అడ్డంగా, కుసింత ఐమూలగా ఆలోచించేవాళ్ళను లేటరల్ థింకర్స్ అని అంటారు. కాబట్టి వీళ్ళను తేలిగ్గా తీసుకోవద్దని మనవి. కొన్ని సమాజాల్లో వీళ్ళని కూడా మేధావులు అనే అంటూంటారు. వీళ్ళ ఆలోచనలు సమాజం ఆలోచించే పద్ధతికి కొంత ’తేడా’గా ఉంటది. ఉదాహరణకు -
10, జూన్ 2010, గురువారం
మందు x మందులు
రాష్ట్రంలో మందు దుకాణాల పాటలు కోట్లలో పాడారు. ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు పోగేసుకుంది. పాటలు పాడినవాళ్ళలో ఎక్కువమంది రాజకీయులే. ఏదో ఒక కొట్టులో వాటాలేని ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే అతగాడు పాపం మరీ అమాయకుడైనా అయ్యుండాలి, లేదా మరింకేదైనా డబ్బులొచ్చే యవ్వారంలో తలమునకలుగా ఉండి ఉండాలి, లేదా జయప్రకాశ్ నారాయణైనా అయ్యుండాలి!
4, మే 2010, మంగళవారం
ఐఐఐయో.. ఐఐఐటీ!
రాష్ట్ర ఐఐఐటీల్లో ప్రభుత్వం సీట్లను తగ్గించేసింది. రెండేళ్ళ కిందట మొదలుపెట్టిన ఈ ఐఐఐటి వ్యవస్థను మొక్కగా ఉండగానే కత్తిరించడం మొదలుపెట్టింది. ఈ కత్తిరింపు, మొక్క ఏపుగా ఎదగడానికని ప్రభుత్వం చెబుతోంది.
23, జనవరి 2010, శనివారం
శాస్త్రీయ పుకారు
నేను మొదటి ఉద్యోగంలో చేరినపుడు ఇండక్షన్ కార్యక్రమం ఒకటి వారంపాటు జరిగింది. మొత్తం ఒక యాభై మందిమి. ఓరోజున ఓ గదిలో కూలేసి కమ్యూనికేషన్స్ నిపుణుడొకాయన క్లాసు పీకుతున్నాడు. కాసేపయ్యాక, ఒక సరదా ఆట ఆడదామని చెప్పాడు. మొదటి వరసలో కూచ్చున్న మొదటి వాడి దగ్గరికెళ్ళి, 'ఇదుగో ఇతని చెవిలో రహస్యంగా ఒక కబురు చెబుతాను. అతడు తన పక్కవాడి చెవిలో ఆ సంగతిని ఊదుతాడు. ఆతడు తన పక్కవాడి చెవిలో చెబుతాడు. అలా చెప్పుకుంటూ వెళ్ళగా, చిట్టచివరి వాడు తనకు చేరిన సమాచారమేంటో బోర్డు మిద రాస్తాడు.' అని చెప్పి, మొదటివాడి చెవిలో ఏదో కబురు చెప్పాడు. దాన్నీ, చిట్టచివరివాడు బోర్డు మీద రాసేదాన్నీ పోల్చి చూస్తాడన్నమాట, ఇదీ ఆట!
7, డిసెంబర్ 2009, సోమవారం
బాబ్రీకట్టడపు కూల్చివేత వార్షికోత్సవం
పురుషోత్తముడి గుడిని కూల్చేసి మసీదునొకదాన్ని కట్టాడో దురాక్రమణదారు. తన జాతి వారసత్వంపై మక్కువ, గర్వమూ ఉన్న ఏ స్వతంత్ర ప్రభుత్వమైనా ఆ కట్టడాన్ని పడేసి మళ్ళీ గుడి కట్టుకుంటుంది. ఎందుకంటే అది జాతి గౌరవంతో ముడిపడి ఉన్నది కాబట్టి. ఎంచేతో మన ప్రభుత్వాలు ఆ పని చెయ్యట్లేదు. మరి ఇవి ప్రభుత్వాలు కావో, లేక వాటికి ఈ జాతి వారసత్వం పట్ల గౌరవం లేదో!! ప్రభుత్వాలు ఎలాగన్నా పోనీండి.., ఆ పనేదో తామే చేసుకోవాలనుకున్నారు, హిందువులు. ఆ పనిలో సగభాగం పూర్తై మరో ఏడాది గడిచిపోయింది. గుడి కట్టే కార్యక్రమం మాత్రం ఇంకా మొదలు కాలేదు.
5, నవంబర్ 2009, గురువారం
మన హితము గోరి పెద్దలిందరు పలుకుచుండగా..
అసలూ.. తెలుగులో మాట్లాడొద్దని చెప్పినా ఆ పిల్లలు తెలుగులోనే మాట్లాడి పలకలు తగిలించుకునేదాకా ఎందుకు తెచ్చుకున్నారంటారూ?
మనమంటే పెద్దాళ్ళం, బోలెడు భేషజాలుంటై, బడాయిలుంటై, తెలుగులో మాట్టాడాలంటే నామోషీలుంటై.. అంచేత ఎన్ని తిప్పలు పడైనా,.. ఇంగ్లీషులోనే మాట్టాడతాం. కానీ ఇంగ్లీషొచ్చినట్టు నటించాల్సిన ఖర్మ పిల్లలకేంటి? హాయిగా తెలుగులో మాట్టాడుకుంటారు. తెలీని భాషలో మాట్టాడగలిగే తెలివితేటలు కూడా వాళ్ళకు లేవు! పైగా, తమదిగాని భాషలో మాట్టాడాలంటే పడే తిప్పలు మామూలువి కావు మరి. అంచేత పాపం తెలుగులో మాట్టాడి పలక మెడలో వేయించుకున్నారు.

2, అక్టోబర్ 2009, శుక్రవారం
పోటెత్తిన కృష్ణ -ప్రమాదంలో రాష్ట్రం
కృష్ణానది ఉప్పొంగుతోంది. ఊళ్ళను, నగరాలను, మండలాలను కూడా ముంచెత్తుతూ ఉరకలెత్తుతోంది. గత వంద సంవత్సరాల్లో ఎప్పుడూ రానంత వరద వచ్చిందట. కర్నూలు నగరం నడుంలోతు నీళ్ళలో మునిగిపోయింది. మంత్రాలయం మునిగిపోయింది. రాఘవేంద్రస్వామి మఠం మునిగిపోయింది. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అనేక ఊళ్ళు నీళ్ళలో చిక్కుకుపోయాయి. విజయవాడ ప్రమాదపు అంచున ఉంది. పులిచింతల కాఫరు డ్యాము కొట్టుకుపోయింది. శ్రీశైలం డ్యాము, నాగార్జున సాగరు డ్యాము పాటవ పరీక్షను, పటుత్వ పరీక్షను ఎదుర్కొంటున్నాయి.
30, ఆగస్టు 2009, ఆదివారం
హిందూ వ్యతిరేక దళితిస్టువాదం
దేశంలో కొంతమందికి హిందూమతాన్ని విమర్శించడం ఫ్యాషనైపోయింది. హిందూమతాన్ని తిడుతూ, ఇతర మతాలను వెనకేసుకొస్తూంటారు. వీళ్ళు కాలం చెల్లిన, బూజు పట్టిన పాత కబుర్లు చెబుతూ, "మనుస్మృతిలో అలా చెప్పారు, రామాయణంలో ఇలా చెప్పారు, కొన్ని కులాల వాళ్ళను వేదం చదవనీయలేదు, కృష్ణుడు ఇలా చేసాడు, దేవుళ్ళంతా కొన్ని కులాలకే చెందినవాళ్ళు, ఇతర కులాలకు దేవుళ్ళు లేరు.." - ఇలాంటి అరిగిపోయిన వాదనలు చేస్తూంటారు. ఇలాంటి వాదనలు చేసేవాళ్ళను దళితిస్టువాదులు అనీ, వీళ్ళ వాదాన్ని దళితిస్టువాదం అని అంటారు.
26, ఆగస్టు 2009, బుధవారం
కులమార్పిడి బిల్లు తెండి
హిందూమతం నుండి ఇతర మతాల్లోకి వెళ్ళినవాళ్ళకు కూడా కులప్రాతిపదికన రిజర్వేషనులిస్తారట. హిందూమతం కాదనుకుని పోయినవాడికి హిందూమత సౌకర్యాలు ఎలా ఇస్తారు? తక్కువ కులమనే పేరుతో గతంలో వివక్ష చూపించారు, అణచివేసారు.. అంచేతే కులప్రాతిపదికన రిజర్వేషనులిస్తున్నారు. బానే ఉంది. ఇతర మతాల్లో వివక్ష ఉండదు, అందరూ సమానమే. అసలు కులమనే ప్రసక్తే లేని మతాలు అవి. ఇక్కడ వివక్ష ఉందిగదాని మతం మార్చుకుని, అద్భుతమైన సర్వసమానత కలిగిన ఆ మతాల్లోకి పోతున్నపుడు.. -మరి వీళ్ళకి కులరిజర్వేషను ఎందుకు? అసలు కులమనేదే లేని చోట కుల రిజర్వేషన్లా?
16, ఆగస్టు 2009, ఆదివారం
ఎంత ఘోరం! ఎంత అవమానం!!
జాతి సిగ్గుతో తలదించేసుకోవాల్సిన సంగతి మరొకటి దొరికేసింది మనకు. అద్భుతమైన సినిమాలెన్నింటిలోనో నటించి, అమెరికాతో సహా అనేక దేశాల ప్రజలను ఆనంద డోలికల్లో ఓలలాడించిన షారుఖ్ ఖాన్‌ను పేరొందిన నటుడని కూడా చూడక అమెరికా ఇమ్మిగ్రేషనువాళ్ళు రెండు గంటల సేపు ప్రశ్నించారంట. తన పేరును బట్టే తనకీ అవమానం జర్గిందని చెబుతున్నాడతడు. [మై నేమ్ ఈస్ ఖాన్ అనేది ఖాన్ కొత్త సినిమా పేరంట :) ] ఎంత అవమానం! రండి, సిగ్గుతో తలొంచేసుకుందాం.
25, ఫిబ్రవరి 2009, బుధవారం
ప్రమదావనం.. భేష్!
సామాజికంగా సేవ చెయ్యాలనే ఆసక్తి ఎంతో మందికి ఉంటుంది. ఉత్సాహమూ ఉంటుంది. వీటికి మించి సాటివారి కష్టం, బాధ, వేదనల పట్ల సహానుభూతి ఉంటుంది. కానీ అందుకు అవసరమైన ఆర్థిక, ఆర్థికేతర వనరులు లేకపోవడం వలనగానీ, మరో కారణం వలన గానీ ఆయా పనులు చెయ్యలేరు. ఎక్కడో అరుదుగా, యామినీ ఫౌండేషను పెట్టిన శ్రీనివాసు గారి లాంటివారు ఉంటారు.అలాంటి అరుదైన సేవకులను అభినందిద్దాం.
29, జనవరి 2009, గురువారం
అది "శ్రీరామ సేన" కాకుండా మరోటేదైనా అయ్యుంటే..
మంగళూరు పబ్బు దాడి చేసినది "శ్రీరామ సేన" కాకుండా మరోటేదైనా అయ్యుంటే.. ఏ పీపుల్ ఫర్ రేషనల్, ఎథికల్, మెథొడికల్ లివింగో, డెమోక్రటిక్ సెక్యులర్ లిబర్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియానో, జెనెక్స్ ఇండియానో, ఇలాంటి ఇంగ్లీషు పేర్లు - హిందూ వాసన లేని పేర్లు - పెట్టుకున్న మరో సంస్థ ఏదైనానో చేసుంటే మన మహిళల పబ్బు హక్కుల కార్యకర్తలు ఒక్ఖరైనా నోరు మెదిపేవారా? పేపర్లలో అసలు వార్తలొచ్చేవా? దాడిని ఖండిస్తూ ప్రకటనలుండేవా? బ్లాగుల్లో వ్యాఖ్యలుండేవా? అసలు టపాలుండేవా? -ఇవేవీ ఉండేవి కావు.
7, జనవరి 2009, బుధవారం
అసత్యం
లాభాలు అబద్ధం.
చూపెట్టిన అప్పులు అబద్ధం.
రావాల్సి ఉందని చెప్పిన ఆదాయం అబద్ధం.
ఆయన కుటుంబానికే చెందినవి మేటాస్ ఇన్ఫ్రా, మేటాస్ ప్రాపర్టీస్ కంపెనీలు. (వీటినే సత్యంలోకలిపెయ్యబోతే షేరుహోల్డర్లు ఎదురుతిరిగారు.) మేటాస్ ఇన్ఫ్రాయే హై.లో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఆ ప్రాజెక్టును వాళ్ళకు ఇచ్చినందుకుగాను, ఆశ్చర్యకరమైన రీతిలో 35 ఏళ్ళలో ప్రభుత్వానికే 30 వేల కోట్లు ఎదురు చెల్లిస్తామని ఒప్పుకుంది -ప్రభుత్వం ఇస్తానన్న రెండున్నర వేల కోట్ల రూపాయల డబ్బులు వద్దని మరీ! ఎలా చేస్తారో మరి!!

14, డిసెంబర్ 2008, ఆదివారం
అసలు నేరస్తులు
వరంగల్లు విషాదంలో రెండు సంఘటనలున్నాయి: ఒకటి యాసిడు పోసిన ఘటన, అందుకు దారితీసిన పరిస్థితులు, రెండోది పోలీసులు చేసిన ఎన్‌కౌంటరు.
6, డిసెంబర్ 2008, శనివారం
మన భద్రతే మనకు ముఖ్యం
దేశానికి నాయకుల ప్రాణాలు ఎంత ముఖ్యమో, సామాన్యుడి ప్రాణాలు కూడా అంతే ముఖ్యం -తేడాయే లేదు. ఆఫ్టరాల్ నాయకుడికే జెడ్లూ, జెడ్‌ప్లస్సులూ ఉంటే అతణ్ణి తయారుచేసిన సామాన్యుడికెన్ని ఉండాలి? ముందు మనమీ సంగతిని ఒప్పుకుంటే ఇక ముందుకు పోవచ్చు.
11, అక్టోబర్ 2008, శనివారం
కంధమాల్ కథేమిటి?
ఒరిస్సాలోని కంధమాల్ జిల్లాలో జరుగుతున్న కుల/మత ఘర్షణలు ఈమధ్య కాలంలో దేశవ్యాప్తంగా కలకలం కలిగించాయి. ఆ కలహాలకు మూల కారణమైన క్రైస్తవం బయటి దేశాలతో మతపరమైన సంబంధాలు కలిగి ఉండటాన, ఆ మతం, ఆ దేశాలు అంతర్జాతీయ రాజకీయాల్లో పలుకుబడి కలిగినవి కావటాన, ఈ ఘర్షణలు అంతర్జాతీయ దృష్టికి చేరాయి. ప్రధానమంత్రిని ఫ్రాన్సులో నిలదీసిన సంఘటన కూడా జరిగింది. "రెండేళ్ళ కిందట మీ పారిస్‌లో ముస్లిములపై అలా దౌర్జన్యాలు చేసారేంటని నేను అడిగానా? మీకెందుకు మా సంగతి?" అని ఆయన అడగాల్సింది. లేదూ.. క్రైస్తవ మిషనరీలు భారత్‌లో లేపుతున్న కల్లోలాల గురించి చెప్పి, "ముందు మీవాళ్ళని అదుపులో పెట్టండి. ఆ తరవాత గొడవల గురించి మాట్టాడండి" అని చెప్పుండాల్సింది. కనీసం "అది మా ఇంటిసంగతిలే, మేం చూసుకోగల్దుంలే" అనైనా అనుండాల్సింది. (పాపం ఒకచేతిలో యురేనియమ్ జోలె ఉండటాన ఆ మాట అడగలేకపోయి ఉండొచ్చు.) ఏదో తప్పు చేసినవాడిలాగా అక్కడేం మాట్టాడకుండా, ఇంటికొచ్చి దిండులో తలదూర్చి ఎక్కెక్కి ఏడిస్తే ఏం లాభం!?
అసలు కంధమాల్‌లో జరిగిన గాథ క్లుప్తంగా ఇక్కడ...
14, సెప్టెంబర్ 2008, ఆదివారం
మరో 'పిరికి' చర్య
ఇంకోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ సారి ఢిల్లీ. ఊరు మారింది, స్థలాలు మారాయి. బాంబులేసినవాళ్ళు వాళ్ళేనట -మేమేనని బోర విరుచుకుని మరీ చెబుతున్నారు.
5, సెప్టెంబర్ 2008, శుక్రవారం
ప్రభుత్వ భూ కబ్జాను ఎదుర్కోవడం ఎలా?
ప్రత్యేక ఆర్ధిక మండలాలు, కోస్టల్ కారిడార్, ఇంకా ఇతర ప్రాజెక్టుల కొరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా రైతుల భూములు సేకరిస్తోంది. ఒక పద్ధతీ పాడూ లేకుండా జరుగుతున్న ఈ భూసేకరణ వల్ల రైతులు దారుణంగా మోసపోయి రోడ్డున పడుతున్నారు.
ఇక ముందైనా అలా జరగకూడదనే సదుద్దేశ్యంతో మానవ హక్కుల వేదిక (HRF) వారు ఇటీవల "ప్రభుత్వం మీ భూమి కోసం వస్తే..." అనే ఒక చక్కని పుస్తకాన్ని ప్రచురించారు. పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య సంఘటన వారు తమ బ్లాగులో కూడా దీన్ని ప్రచురించారు.
5, జులై 2008, శనివారం
వీళ్ళు మనకోసమే పోరాడుతున్నారా?
అంతమంది పోలీసులు హతులైతే హక్కుల నేతలెవరూ మాట్టాడరే, అని నేను రాసాను. దానికి స్పందనగా దిలీప్ గారు తన బ్లాగులో రాస్తూ నక్సల్ ఉద్యమ ప్రస్థానంలో జరిగిన చాలా విషయాల గురించి చెప్పారు. ఆయన రచనాశైలికి తగినట్టుగానే వ్యాసం ఎంతో విజ్ఞానదాయకంగా ఉంది.
ఆ జాబులో ఆయన లేవనెత్తిన అంశాలపై నా ఆలోచనలను కూడా రాద్దామని అనిపించింది. అయితే ఒక సామాజిక, సైద్ధాంతిక మరియూ రాజకీయ అవగాహన ఎర్పరచుకున్న తరువాతే అభిప్రాయాలు తెలిపితే పద్ధతిగా ఉంటుందని నాక్కూడా అనిపించి అక్కడ రాయలేదు.
ముందుగా ఒక్క విషయం.. పోలీసులు చేసిన తప్పుడు ఎన్‌కౌంటర్లను నేను సమర్ధించడం లేదు. నేనన్నదల్లా - రెండువైపులా తప్పులు జరిగినపుడు ఒక్కరినే ప్రశ్నిస్తారేమిటని! అటువైపు తప్పులు కనబడవేమిటని!!
నక్సలైట్లపై జరిగిన అమానుష హింస గురించి మనం తెలుసుకోవాలి, నిజమే! అలాగే నక్సలైట్ల ఇన్నాళ్ళుగా చేస్తున్నదేమిటో, ఇప్పటివరకూ వాళ్ళు సాధించిందేమిటో కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి.
ముందుగా.. నక్సలైట్లపై చట్టబద్ధంగా చర్యలెలా తీసుకోవాలి -
ఏకే47లూ, రాకెట్లతో యుద్ధం చేసేవారిని చట్టబద్ధంగా శిక్షించడమెలాగ? (ఆ ఆయుధాలను పట్టుకుని మనపై తెగబడినవారినే అనేకానేక సంఘటనల్లో కాల్చిచంపేసింది - వాటిలో పార్లమెంటుపై దాడి ఒకటి) వాళ్ళని పట్టుకుని, సంకెళ్ళు వేసి తెచ్చేందుకు పోలీసులు ఏ ఆయుధాలు తీసుకెళ్ళాలి? ఏ విధంగా పట్టుకోవాలి? మందుపాతరలు పెట్టి అటుగా వచ్చే పోలీసులను (మనుషులను) పేల్చేసిన వారిని పట్టుకునేదెలా, శిక్షించేదెలా?
అలాగే నక్సలైట్లు ఇన్నాళ్ళుగా చేస్తున్నదేమిటో, ఇప్పటివరకూ వాళ్ళు సాధించిందేమిటో కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి.
రైల్వే స్టేషన్లు, పోలీసు స్టేషన్లు, టెలిఫోను ఎక్స్ఛేంజీలు, ఆర్టీసీ బస్సులు, సెల్ టవర్లు మొదలైన అనేక ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిందెందుకో కూడా మనం తెలుసుకోవాలి.
ఇన్నేళ్ళుగా వాళ్ళు వాడిన ఆయుధాలు, మందుపాతరలు, మందుగుండు సామాగ్రి ఎక్కడినుండి వచ్చాయో తెలుసుకోవాలి. తమ సాయుధ పోరాటాన్ని నడపడానికి అవసరమైన డబ్బును వాళ్ళు ఎక్కడినుండి ఎలా సమకూర్చుకున్నారో కూడా తెలుసుకోవాలి. ప్రజాప్రతినిధుల లాగానే వీళ్ళు కూడా కాంట్రాక్టర్ల దగ్గరి నుండి రౌడీమామూళ్ళు తీసుకుంటారన్న సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నక్సలైట్ల పేరు చెప్పుకుని ప్రజల దగ్గరినుండి డబ్బులు గుంజిన (ఎక్స్‌టార్షన్) నకిలీ నక్సలైట్లకు ఆ ఆలోచనలు ఎలా వచ్చాయో, చాలా సందర్భాల్లో ఆ మోసాలు ఎందుకు సఫలమయ్యాయో కూడా తెలుసుకోవాలి. నక్సలైట్లు ఆయుధాల డంపులతో పాటు డబ్బు డంపులు కూడా ఎలా సమకూర్చుకున్నారో తెలుసుకోవాలి. డబ్బులు పట్టుకుని దళాన్నొదిలి పారిపోయినవారి గురించి, డబ్బుల కోసం అయిన గొడవల గురించి కూడా తెలుసుకోవాలి. దళంలోని ఆడవారిపై దాడులు చేసిన సంగతులు కూడా మనం మననం చేసుకోవాలి.
పోలీసులు జీపుల్లో వెళ్ళటానికి భయపడి ఆర్టీసీ బస్సులో వెళ్ళబోతే ప్రజలు అడ్డుచెప్పిన సంఘటనలెందుకు ఎదురయ్యాయో, పోలీసులు అంటరానివారు ఎందుకయ్యారో కూడా తెలుసుకోవాలి. ఎన్నికల విధులను నిర్వర్తించేందుకు అటవీ ప్రాంతాలకు వెళ్ళే ఉద్యోగులు 'పోలీసులు మావెంట రక్షణగా వస్తే మేం వెళ్ళం' అనే పరిస్థితి ఎందుకొచ్చిందో, పోలీసులు వెంటరాకూడనివారు ఎందుకయ్యారో కూడా తెలుసుకోవాలి. 'ఎన్‌కౌంటరు జరిగిన ప్రదేశానికి వెళ్ళినపుడు అక్కడ మృత్యువాసన గుప్పున కొట్టింద'ని అంటూ ఉంటారు విప్లవ కవులు కొందరు, శ్రేష్టులలోకెల్లా శ్రేష్టులు కొందరు - మరి అంటరాని, వెంటరాకూడని ఆ పోలీసుల కళ్ళలో మృత్యువు నీడలు కనబడలేదో ! మందుపాతరల్లో మారుమోగిన మృత్యుఘోష వినబడలేదో!!
దిలీప్ గారన్నారు.. ఆ డబ్బులు ఆ ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేసి ఉంటే నక్సలైట్ల అవసరం ఉండేదే కాదు అని. ఈ నక్సలైట్లు ఉండీ ఉపయోగమేం జరిగిందో నాకు అర్థం కాదు.. ఇవ్వాళ్టికి కూడా చింతపండు అమ్ముకునే దగ్గర గిరిజనులు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న కూడా - గిరిజనులను దోచుకుంటే ఊరుకునేది లేదని వ్యాపారులను బెదిరించి పోయారట! ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసినా ఎంతో కొంత సాధించి ఉండేవారేమో!
ఇన్నేళ్ళ సాయుధ పోరాటం తరవాత, వాళ్ళు సాధించిన కొన్ని కీర్తి కిరీటాలు: టి.హయగ్రీవాచారి, దుద్దిళ్ళ శ్రీపాదరావు, మాగుంట సుబ్బరామిరెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి, పాల్వాయి పురుషోత్తమరావు, ప్యానెల్ స్పీకరు సి.నర్సిరెడ్డి - ఆయనతోపాటు మరో పది పన్నెండు మంది. (ఇవి నాకు తెలిసినవి, తెలియనివెన్నో!) వీళ్ళెవరూ పోలీసులు కారు.
ఇన్నేళ్ళ వర్గపోరాటం ద్వారా ఏం సాధించారో, ప్రజలకు వీళ్ళెంత ఉపయోగపడ్డారో కూడా తెలుసుకోవాలి. నేపాలు నుండి దండకారణ్యం దాకా (లేక, నల్లమల దాకానో మరి.) ఎర్ర బాట (రివల్యూషనరీ కారిడార్ - RC) పరిచారు కదా! నేపాల్లో చెయ్యాల్సిన హింస అంతా చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొని పాలనలో కొచ్చారు. అక్కడంటే ఇన్నాళ్ళూ ప్రజాస్వామ్యం లేదు సరే, కానీ మనకుందే! మరి ఈ హింసా, విధ్వంసం అన్నీ మానేసి, ఎన్నికల్లో పాల్గొనవచ్చుగదా!ఆ బాటలో నడచే కామ్రేడ్లే గదా, వీళ్ళూను!! పోటీ చేసి, అధికారంలోకి వచ్చి, వర్గ నిర్మూలన చెయ్యొచ్చు కదా! వర్గ నిర్మూలన తుపాకీతో సాధ్యపడేదైతే ఈ 40 ఏళ్ళలోనూ జరగలేదే!!
వర్గనిర్మూలన, సమసమాజ స్థాపన అనేది ఉదాత్తమైన ఆశయమే కానీ నలభై ఏళ్ళ తరవాత అది ఉత్త ఆశయం ఐపోయినట్టు కనబడుతోంది.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్‌లు (Atom)
సంబంధిత టపాలు
loading..