రాష్ట్ర విభజనపై హెచ్చెమ్ టీవీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాల్లో తరువాతిది వరంగల్లులో జనవరి 24, ఆదివారంనాడు జరిగింది. సమావేశం బాగా జరిగింది. కొందరు మాట్టాడుతున్నపుడు గోల జరిగిందిగానీ, పెద్దలు శాంతపరచడంతో వెంటనే సద్దుమణిగింది. మిగతా సమావేశాల్లో లాగానే, ఇక్కడ కూడా సరుకున్న ప్రసంగాలు కొన్నే! ఎక్కువ ప్రసంగాలు బాగా నలిగిన పాత సంగతులే చెప్పగా, కొద్ది మంది చేసిన ప్రసంగాలు ఉత్త ఊకదంపుడే!
25, జనవరి 2010, సోమవారం
23, జనవరి 2010, శనివారం
శాస్త్రీయ పుకారు
నేను మొదటి ఉద్యోగంలో చేరినపుడు ఇండక్షన్ కార్యక్రమం ఒకటి వారంపాటు జరిగింది. మొత్తం ఒక యాభై మందిమి. ఓరోజున ఓ గదిలో కూలేసి కమ్యూనికేషన్స్ నిపుణుడొకాయన క్లాసు పీకుతున్నాడు. కాసేపయ్యాక, ఒక సరదా ఆట ఆడదామని చెప్పాడు. మొదటి వరసలో కూచ్చున్న మొదటి వాడి దగ్గరికెళ్ళి, 'ఇదుగో ఇతని చెవిలో రహస్యంగా ఒక కబురు చెబుతాను. అతడు తన పక్కవాడి చెవిలో ఆ సంగతిని ఊదుతాడు. ఆతడు తన పక్కవాడి చెవిలో చెబుతాడు. అలా చెప్పుకుంటూ వెళ్ళగా, చిట్టచివరి వాడు తనకు చేరిన సమాచారమేంటో బోర్డు మిద రాస్తాడు.' అని చెప్పి, మొదటివాడి చెవిలో ఏదో కబురు చెప్పాడు. దాన్నీ, చిట్టచివరివాడు బోర్డు మీద రాసేదాన్నీ పోల్చి చూస్తాడన్నమాట, ఇదీ ఆట!
21, జనవరి 2010, గురువారం
2010 జనవరి 18 - తెలంగాణ ఉద్యమంలో కంచె అయిలయ్య రోజు!
తెలంగాణ ఉద్యమంలో 2010 జనవరి 18 న హఠాత్తుగా కులం ప్రసక్తి తలెత్తింది. ఉద్యమ నేతల కులాలను ఎత్తిచూపి, ఎందుకు వాళ్లకింత ప్రాముఖ్యత, దళిత బహుజనులకు ప్రాముఖ్యత ఎందుకు లేదు అంటూ కంచె అయిలయ్య ప్రశ్నిస్తూంటే చర్చలో పాల్గొన్న ఇతర నాయకులు, విశ్లేషక శేఖరులూ కొండొకచో మాటల కోసం తడుముకోవాల్సి వచ్చింది.
19, జనవరి 2010, మంగళవారం
తెలంగాణపై విజయవాడ చర్చ
రాష్ట్ర విభజనపై హెచ్చెమ్ టీవీ వాళ్ళు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ జరుపుతున్న సమావేశాల వరసలోని మరో సమావేశం విజయవాడలో జరిగింది. జనవరి 17 ఆదివారం సాయంత్రం నుండి అర్థరాత్రి దాకా జరిగిన ఈ సమావేశంలో మొత్తమ్మీద ఎక్కువమంది సమైక్యాంధ్రనే బలపరచారు. ఇద్దరు ముగ్గురు మాత్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలన్నారు.
13, జనవరి 2010, బుధవారం
ది ఫౌంటెన్ హెడ్ - ఎ కొయ్యగుర్రం రైడ్!
ఆమధ్య, అదేదో ఇంగ్లీషు పుస్తకాలమ్మే కొట్టుకెళ్ళాం. అక్కడ తెలుగు పుస్తకాలు పెద్దగా దొరకవ్. దాని పేరు క్రాస్వర్డు అనుకుంటా. పిల్లలు వెళ్దామన్నారు గదాని వెళ్ళాం. అక్కడ అయన్ ర్యాండ్ (ఐన్ ర్యాండ్?) రాసిన పుస్తకాలు చూస్తున్నా. అయన్ ర్యాండ్ అని చనువుగా పేరు రాసాను గదా అని నేను ఆవిడ రాసిన పుస్తకాలన్నీ చదివేసి ఉంటానని అనుకునేరు. ఒక్కటి కూడా చదవలేదు. కానీ నాకావిడ పేరు బాగా తెలుసు -యండమూరి మనందరికీ ఆవిణ్ణి బాగా పరిచయం చేసాడు గదా! ఆయన రాసిన కథ ఒకదానిలో ఒక పాత్ర మరో పాత్రతో అంటుంది.. 'అయాన్ రాండా.. ఆడి కథలు నేను చాలానే చదివాను, నాకు భలే నచ్చుతాయవి' అని అంటాడు. అవతలోడు పెదాలు కాదుగదా, కనీసం ఒంట్లోని ఒక్క అణువు కూడా కదిలించకుండా 'అయన్ రాండంటే ఆడు కాదు, ఆవిడ ' అని అంటాడు. అలా నాకు అయన్ ర్యాండు పరిచయం!
11, జనవరి 2010, సోమవారం
తెలంగాణ వాదుల మరో పచ్చి అబద్ధం
అభివృద్ధిలో వెనకబడి పోయామని, మాకు అన్యాయం జరిగిందనీ, జరుగుతోందనీ చెబుతూ ప్రత్యేక రాష్ట్రం ఉంటే తప్ప లాభంలేదని తె.వాదులు డిమాండు చేస్తూ వచ్చారు. తరవాత్తరవాత వీళ్ళ గొంతు కాస్త మారి, 'ఆంద్రోళ్ళు' మమ్మల్ని అణగదొక్కారంటూ రాష్ట్ర విభజన భజన చేసేవారు. ఇప్పుడవన్నీ పక్కకు నెట్టి ఆత్మగౌరవం కోసం తెలంగాణ, స్వపరిపాలన కోసం తెలంగాణ అంటూ కొత్త కారణాలు చెబుతున్నారు. ఈ కారణాల్లో న్యాయం ఉందా లేదా చెప్పండి అంటూ తెలివితక్కువ వాదనలు చేస్తున్నారు. అభివృద్ధి లేదన్న మాట మాత్రం ఇప్పుడు వీళ్ళ నాలుకల మీద కనబడదు.
7, జనవరి 2010, గురువారం
ఢిల్లీ చర్చలు
జనవరి 5 న జరిగిన చర్చల ద్వారా రెండు వైపుల ఉన్న ఉద్యమకారులూ వేసిన ముందడుగేమీ లేకపోవచ్చు. కేంద్రం మాత్రం విభజనవాదులను, సమైక్యవాదులనూ ఒకచోటికి చేర్చి మాట్టాడగలిగింది. మా అభిప్రాయాలనూ విన్నారు అనే భావనను వాళ్ళలో కలిగించ గలిగింది. ఉద్యమాలను ఆపాలని వాళ్లకు చెప్పి ఆపించగలిగింది. ఏదేమైనా, తెలంగాణ విషయంలో కేంద్రం వెనకడుగేసినట్టేమీ అనిపించలేదు.
2, జనవరి 2010, శనివారం
రాష్ట్ర విభజనపై తిరుపతిలో రౌండ్‌టేబుల్ సమావేశం
రాష్ట్ర చీలిక ఉద్యమం నేపథ్యంలో హెచ్చెమ్టీవీవాళ్ళు వివిధప్రాంతాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతపు సమావేశం ఆమధ్య హై.లో జరిగింది. తరువాత డిసెంబరు 27న రాయలసీమ సమావేశం తిరుపతిలో జరిగింది. సాయంత్రం దాదాపు ఐదున్నర నుండి రాత్రి 11 గంటల దాకా జరిగిన ఈ సమావేశంలో సీమ నాయకులు, మేధావులు తమ ఆలోచనలను, అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
1, జనవరి 2010, శుక్రవారం
కొత్త సంవత్సరానికి పాత టపాలు!
నచ్చిన బ్లాగుల గురించి, టపాల గురించీ ఈ మధ్య టపాలొస్తున్నాయి. ఆ స్ఫూర్తితోనే ఈ టపా!
సాధారణంగా నాకు హాస్యం చిప్పిల్లే టపాలు నచ్చుతాయి. అసలు హాస్యం నచ్చందెవరికిలెండి!! హాస్యం తరవాత, జ్ఞాపకాల టపాలు కూడా నాకెంతో నచ్చుతాయి. ఎవరి జ్ఞాపకాలు వాళ్ళకు ముద్దేననుకోండి. నాకు మాత్రం ఎవరి జ్ఞాపకాలైనా ముద్దే! చదవడానికి ఆహ్లాదకరంగా, చదివాక హాయిగా ఉండే ఏ టపాలైనా బావుంటాయి. ఎప్పటికప్పుడు గుర్తుకొస్తూ ఉండే టపాలు కొన్నిటి గురించి ఇక్కడ కొంత...
సాధారణంగా నాకు హాస్యం చిప్పిల్లే టపాలు నచ్చుతాయి. అసలు హాస్యం నచ్చందెవరికిలెండి!! హాస్యం తరవాత, జ్ఞాపకాల టపాలు కూడా నాకెంతో నచ్చుతాయి. ఎవరి జ్ఞాపకాలు వాళ్ళకు ముద్దేననుకోండి. నాకు మాత్రం ఎవరి జ్ఞాపకాలైనా ముద్దే! చదవడానికి ఆహ్లాదకరంగా, చదివాక హాయిగా ఉండే ఏ టపాలైనా బావుంటాయి. ఎప్పటికప్పుడు గుర్తుకొస్తూ ఉండే టపాలు కొన్నిటి గురించి ఇక్కడ కొంత...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
సంబంధిత టపాలు
loading..