వ్యంగ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్యంగ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, సెప్టెంబర్ 2013, శనివారం

ఐవీయార్ లో రాష్ట్ర విభజన

14 కామెంట్‌లు
ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్సులు (ఐవీయార్) ఎక్కడబడితే అక్కడ వినిపిస్తున్నాయి యిప్పుడు. అవును మరి.. ఈ ఐవీయార్లతో ఆయా సంస్థలకు గొప్ప ప్రయోజనా లున్నాయి మరి! ఫోను చేసేవాళ్ళకు మాత్రం ఐవీయార్లు నరకం చూపిస్తాయి. ఉదాహరణ కావాలంటే ఐసీఐసీఐ బ్యాంకుకు ఫోను చేసి చూడండి..తిక్క పుట్టకపోతే నన్నడగండి.  ఒకసారి ఫోను చేసిన వాడు మళ్ళీ ఫోను చెయ్యడానికి ధైర్యం చెయ్యడు -ఎక్కడో నాలాంటి మందులు, తోలుమందులూ తప్పించి.

26, ఆగస్టు 2011, శుక్రవారం

లే థింకర్లు, లే.థింకర్లు, భలే థింకర్లు, రిలే థింకర్లు

70 కామెంట్‌లు
ముందుగా లే. థింకర్ల గురించి. లే. థింకర్స్ అంటే లే థింకర్స్ (lay thinkers) అని కాదు, ’లే’ పక్కన చుక్క ఉంది చూడండి. లే. థింకర్స్ అంటే లేటరల్ థింకర్స్ అని అండి.  మామూలుగా సూటిగా, నిటారుగా ఆలోచించకుండా కొంత అడ్డంగా, కుసింత ఐమూలగా ఆలోచించేవాళ్ళను లేటరల్ థింకర్స్ అని అంటారు. కాబట్టి వీళ్ళను తేలిగ్గా తీసుకోవద్దని మనవి. కొన్ని సమాజాల్లో వీళ్ళని కూడా మేధావులు అనే అంటూంటారు. వీళ్ళ ఆలోచనలు సమాజం ఆలోచించే పద్ధతికి కొంత ’తేడా’గా ఉంటది. ఉదాహరణకు -

5, ఆగస్టు 2011, శుక్రవారం

సమస్యలు బాబోయ్ సమస్యలు

4 కామెంట్‌లు
ముసురుకున్న సమస్యల నుండి బైట పడటానికి నాయకులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్య నుండి కాపాడమంటూ వేడుకుంటున్నారు. ఇలా సాగాయవి:

మేడమ్మ: ఎట్టాగోట్టా మబ్బాయిని ప్రధానమంత్రిని చెయ్యి ప్రభూ! నాకున్న సమస్యల్లా ఇదొక్కటే. ఈ దేశానికున్న ఏకైక సమస్య కూడా ఇదే! దీన్ని తీర్చావంటే నేను, ఈ దేశ ప్రజలూ కూడా శేష జీవితాన్ని హాయిగా గడిపెయ్యొచ్చు.

4, ఆగస్టు 2011, గురువారం

ఈ రోజుల్లో ఢిల్లీలో ఒకరోజు

10 కామెంట్‌లు
ఢిల్లీ నుంచి అందిన రెండు వార్తల గురించిన వివరాలివి, చదవండి.
.................................................................................

కాంగీసాఫీసులో విలేఖరుల సమావేశం జరుగుతోంది. అధికార ప్రతినిధి మాట్టాడుతున్నాడు..

మా మేడమ్మకు ఒంట్లో బాగోకపోడం మూలాన అమెరికా వెళ్ళారు. రెండు మూడు వారాల దాకా తిరిగి రారు. ఈ లోగా తాననుభవిస్తున్న అధికారాలను ఇలా సర్దారు..

22, మే 2011, ఆదివారం

"అయితే హైకమాండు పిరికి సన్నాసేనన్నమాట!"

3 కామెంట్‌లు
బ్రేకు తరవాత.. (బ్రేకు ముందర జరిగిన చర్చను చదవండి.)

"చెప్పండి ఘొల్లు రవిగారూ, మీ హైకమాండుకు వెన్నెముక లేదట, పిరికిదట, సన్నాసట - నిజమేనా?" అని రంజనీకాంతు అడిగాడు.

21, మే 2011, శనివారం

హైకమాండుకు కమానుకట్టలు విరిగినై

4 కామెంట్‌లు
మొన్నామధ్య నూరేళ్ళ పార్టీ హైకమాండు కడప మీంచి బిళ్ళబీటుగా కింద పడింది. అంతెత్తునుంచి కింద పడటంతో  వెన్నెముక విరిగింది, కాళ్ళు రెండూ కూడా విరిగిపోయాయి. నడవలేని స్థితిలో మంచాన బడింది. ముందే హైకమాండంటే ఎటకారమై పోయిన ఆ పార్టీ నాయకులు కొందరికి మరీ అడ్డూ ఆపూ లేకుండా పోయింది. వంకరమ్మ అనే ఒక పార్టీ నాయకురాలు ’అసలు హైకమాండు ఉత్త పిరికిది. పేరుకే అది హైకమాండు, దానికి హై లేదు, కమాండూ లేదు. ఇప్పుడు వెన్నెముక కూడా విరిగింది కాబట్టి, ఇక అది ఉన్నా లేనట్టే" అని అనేసింది. దానిమీద రంజనీకాంతు తొమ్మిదో టీవీలో చర్చ పెట్టాడు. ఆ చర్చ ఇలా జరిగింది..

20, మార్చి 2011, ఆదివారం

ఇదిగో.. ఆ చిరంజీవిని ఢిల్లీకి రమ్మనమని కబురెట్టమని కబురెట్టవోయ్

9 కామెంట్‌లు
రాబోయే రోజుల్లో  మనం చూడబోయే వార్తల్లో ఈ కిందిదో దీని లాంటిదో ఉండొచ్చని నా ఊహ.
------------------------------------
"చిరంజీవి గారూ ఒక్ఖసారి ఢిల్లీకి వచ్చిపోరూ.. ప్లీజ్!" - అధిష్ఠానం

హైదరాబాదు, రేపటి వార్త 

ప్రముఖ కాంగ్రెసు నాయకుడు చిరంజీవిని వెంటనే ఢిల్లీకి రమ్మని అధిష్ఠానుడు కబురు పెట్టించారు. ఆయన హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. అదృష్టం కలిసొస్తే, ఆయన మేడమ్మను కూడా కలవొచ్చని తెలుస్తోంది.

20, జనవరి 2011, గురువారం

అధిష్ఠానం కేళి - కాంగీయుల కథాకళి

9 కామెంట్‌లు
అసలు సంగతి కెళ్ళేముందు..

మన ప్రధానమంత్రి గారు ఇవ్వాళ కొన్ని రత్నాల్లాంటి మాటలు చెప్పాడు. వాటి సంగతి చూద్దాం.
1. తెలంగాణ సంగతి ఎప్పుడు తేలుస్తారు అని అడిగితే "సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం" అని చెప్పాడు. సరైన సమయమంటే మళ్ళీ మేడమ్మ పుట్టినరోజు రావాలి కాబోలు. ("సరైన సమయంలో సరైన నిర్ణయం" కోసం గూగిలించి చూస్తే..  2490 ఫలితాలొచ్చాయి.)

8, జనవరి 2011, శనివారం

’చదువరి’ పత్రికలో వచ్చిన కొన్ని వార్తాశీర్షికలు

24 కామెంట్‌లు
’చదువరి’ పత్రికలో ఇప్పుడు/రాబోయే పదేళ్ళలో వచ్చే వార్తల శీర్షికలివి. అవధరించండి.

"మరో నెల రోజుల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నుండి హైదరాబాదు రాక"

"ఉద్యమం కోసం ఇంకా ఎవరూ ప్రాణత్యాగం చేసుకోలేదు. కాబట్టి ఎవరూ చేసుకోకండి - జాక్ ది రిప్పర్"

"మీ ప్రాణాలు పణంగా పెట్టైనా సరే తెలంగాణ సాధిస్తాం -ఉస్మానియాలో ఇంకో జాక్"

16, ఆగస్టు 2009, ఆదివారం

ఎంత ఘోరం! ఎంత అవమానం!!

38 కామెంట్‌లు
జాతి సిగ్గుతో తలదించేసుకోవాల్సిన సంగతి మరొకటి దొరికేసింది మనకు. అద్భుతమైన సినిమాలెన్నింటిలోనో నటించి, అమెరికాతో సహా అనేక దేశాల ప్రజలను ఆనంద డోలికల్లో ఓలలాడించిన షారుఖ్ ఖాన్‌ను పేరొందిన నటుడని కూడా చూడక అమెరికా ఇమ్మిగ్రేషనువాళ్ళు రెండు గంటల సేపు ప్రశ్నించారంట. తన పేరును బట్టే తనకీ అవమానం జర్గిందని చెబుతున్నాడతడు. [మై నేమ్ ఈస్ ఖాన్ అనేది ఖాన్ కొత్త సినిమా పేరంట :) ] ఎంత అవమానం! రండి, సిగ్గుతో తలొంచేసుకుందాం.

21, మే 2009, గురువారం

తెలంగాణపై రహస్య సమావేశం

28 కామెంట్‌లు
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కల సాకారమయ్యేందుకు అవసరమైన అనుకూల వాతావరణం ఏర్పడింది.  ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏర్పడిన తెలంగాణ-అనుకూల పరిస్థితులు ఇంతకు ముందెన్నడూ లేవు. త్వరలో రాష్ట్ర విభజన మొదలయ్యేందుకు రాజకీయ సమీకరణాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి.

1, ఫిబ్రవరి 2009, ఆదివారం

సరికొత్త బ్లాగుల పరిచయం

26 కామెంట్‌లు
బ్లాగు మూతల కార్యక్రమంలో తెలుగు బ్లాగరులు తలమునకలుగా ఉండగా.. ప్రసిద్ధులైనవాళ్ళు తమ తెలుగు బ్లాగులను మొదలుపెట్టారు. బ్లాగరి పేరు, బ్లాగు పేరు (బొద్దు అక్షరాల్లో), వాళ్ళ బ్లాగులలోని ప్రధాన విశేషాలు మొదలైనవాటితో కూర్చిన టపా ఇది. అవధరించండి.

18, ఆగస్టు 2008, సోమవారం

అన్నయ్యల పోటీ

8 కామెంట్‌లు
రాజకీయాలంటే అనేకానేక నిర్వచనాలతో పాటు భావోద్వేగాల ఆట అనే ఒక వ్యుత్పత్తి కూడా ఉండుంటుంది. ఏదో రకంగా ప్రజల సెంటిమెంటు మీద ఆటాడాలి, వోట్లను వేటాడాలి. (ఆ పైన ప్రజలను చెండాడాలి). అందుకోసం అనేకానేక పద్ధతులను మనవాళ్ళు కనిపెట్టారు. అన్నయ్యను మించిన సెంటిమెంటలు వస్తువు మరోటి లేదని మన రాజకీయులు నమ్మడమే కాదు నిరూపించారు కూడాను. అఖిలాంధ్ర ఆడపడుచులకు అన్నను అంటూ ఎన్టీవోడు వచ్చినపుడు కాంగ్రెసోళ్ళు 'ఏడిసాడు, ఈ నాటకాలు మన ముందా' అనుకున్నారు. 'ఈడు రామారావు కాదు, డ్రామారావు' అన్నారు. ఆనక జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందో తెలిసి, కాంగ్రెసు తేరుకునేలోపు రామారావు ముఖ్యమంత్రి అయిపోయాడు.

28, జూన్ 2008, శనివారం

దేశం తలపట్టుకుంది

13 కామెంట్‌లు
నారదుడు లోకసంచారం చేస్తూ, భారతం మీదుగా పోతుంటే ఢిల్లీ కనిపించింది. 'చాన్నాళ్ళైంది ఢిల్లీ చూసి, ఓసారెళ్ళొద్దాం' అనుకుని కిందికి దిగి జనపథాల వెంటా, రాజపథాల వెంటా నడుస్తూ పోతూంటే అనేక మంది నాయకులు కనిపించారు. అందరూ కూడా తలపట్టుకుని కూచ్చుని ఉన్నారు. ఏదో దిగులుగా ఉన్నట్టున్నారు. ఏం జరిగిందో తెలుసుకుందామని ఆగాడు.

9, డిసెంబర్ 2005, శుక్రవారం

వార్తల్లో విప్లవం - ఇందిరమ్మ టీవీ

6 కామెంట్‌లు
"పత్రికలు రంధ్రాన్వేషణే పనిగా పెట్టుకున్నాయి"
"విశాఖలో పత్రికలపై ఆంక్షలు"
"ఆదిలాబాదులో హెచ్చరికలు, నోటీసులు"

ఇవన్నీ ఇప్పటి వార్తలు కావు, విప్లవానికి ముందువి. విప్లవం తరువాత రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయింది. ఇది 2006 డిసెంబరు.., ఇప్పుడిలాంటి వార్తలస్సలుండవు.

అసలేం జరిగింది..

19, నవంబర్ 2005, శనివారం

నా గోడు

13 కామెంట్‌లు
తెలుగునాట టీ.వీ.ఛానెళ్ళు స్థూలంగా రెండు రకాలు - టీవీ9, ఈటీవీ2, తేజ న్యూస్ వంటి వార్తా ఛానెళ్ళు, ఈటీవీ, జెమిని, తేజ, మా, జీ వంటి సినిమా ఛానెళ్ళు. మర్చిపోయా, డీడీ8 ఉంది కదా, ఇది ''అదో'' టైపు. ప్రస్తుతానికి దాన్నో పక్కన పెడదాం. ఈ ఛానెళ్ళ తీరుతెన్నులపై ఒక సామాన్యుడి వేదన ఇది.., నా గోడు. (Telugu Blog)

సంబంధిత టపాలు