25, ఫిబ్రవరి 2009, బుధవారం

ప్రమదావనం.. భేష్!

సామాజికంగా సేవ చెయ్యాలనే ఆసక్తి ఎంతో మందికి ఉంటుంది. ఉత్సాహమూ ఉంటుంది. వీటికి మించి సాటివారి కష్టం, బాధ, వేదనల పట్ల సహానుభూతి ఉంటుంది. కానీ అందుకు అవసరమైన ఆర్థిక, ఆర్థికేతర వనరులు లేకపోవడం వలనగానీ, మరో కారణం వలన గానీ ఆయా పనులు చెయ్యలేరు. ఎక్కడో అరుదుగా, యామినీ ఫౌండేషను పెట్టిన శ్రీనివాసు గారి లాంటివారు ఉంటారు.అలాంటి అరుదైన సేవకులను అభినందిద్దాం.


యామినివంటి సంస్థలను, శ్రీనివాసుగారివంటి వ్యక్తులను చూసినపుడు మనం కూడా ఏమైనా చేస్తే బాగుంటుందని అనిపించడం సహజం. తెలుగుబ్లాగరులే ఎక్కువగా సభ్యులుగా ఉన్న ప్రమదావనం గూగుల్ గుంపుకు కూడా అలాగే అనిపించింది. అనిపించిన వెంటనే వాళ్ళు రంగంలో దిగారు. తలా కాసిని డబ్బులు వేసుకుని యామినికి వస్తు రూపేణా సాయం అందించారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

ప్రమదావనం గతంలో కూడా ఇలాంటి సాయం చేసింది. స్త్రీలే సభ్యులుగా ఉన్న ఈ గూగుల్ గుంపు అభినందనీయమైన పని చేస్తోంది. కొందరు మగవారు కూడా వీళ్ళ పనుల్లో ఆర్థిక సాయం అందిస్తున్నారు.

ప్రమదావనం సభ్యులను, ఈ పనిలో పాలుపంచుకుంటున్న వారందరినీ మనసారా అభినందిస్తున్నాను.

3 కామెంట్‌లు:

  1. యామిని ఫౌండేషన్ .. శ్రీనివాస్ గారు తన బిడ్డ యామిని పడుతున్న బాధ చూసి అలంటి బాద మరే బిడ్డ పడకూడదని యామిని ఫౌండేషన్ స్థాపించారు ... సహాయ ఫౌండేషన్ నుండి వారికీ సహాయ సహకారాలు అందించాము ప్రమదావనం సభ్యులు కూడా ఇటువంటు కార్యక్రమాలు చేస్తున్నదుకు అభినందనలు

    రిప్లయితొలగించండి
  2. ప్రమదావనం ఇటువంటి మరిన్ని కార్యక్రమాలను చేపట్టి ఆదర్శవంతంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  3. నాకు కూడా చాలా సంతోషంగా వుంది ప్రమదావనం, యామిని ఫౌండేషన్ చేస్తున్న సేవలు. వట్టిమాటలకంటే చిన్న పని అయినా చెయ్యడం చాలా అవసరం. అభినందనలు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు