బ్లాగు మూతల కార్యక్రమంలో తెలుగు బ్లాగరులు తలమునకలుగా ఉండగా.. ప్రసిద్ధులైనవాళ్ళు తమ తెలుగు బ్లాగులను మొదలుపెట్టారు. బ్లాగరి పేరు, బ్లాగు పేరు (బొద్దు అక్షరాల్లో), వాళ్ళ బ్లాగులలోని ప్రధాన విశేషాలు మొదలైనవాటితో కూర్చిన టపా ఇది. అవధరించండి.
మన్మోహన్‌సింగ్: "గడ్డాల్లో బిడ్డ": భలే చక్కగా, విషయపుష్టితో, చిక్కటి తెలుగులో రాసేస్తూంటాడీయన. కాకపోతే ఈయన లాగిను, సంకేతపదమూ సోనియాగాంధీ దగ్గర కూడా ఉన్నాయి. ఈయన రాసిన టపా కూడలిలో రాగానే, వెంటనే ఆవిడ లాగినైపోయి, తనకు తోచిన మార్పులు చేసేసి, టపాను తిరగరాసేస్తూ ఉంటుంది. మొదట్లో "ఇదేటిది? నేనిలా చెత్తగా రాయలేదే! ఎలా మారిపోయిందబ్బా", "ఈ భాషేంటి ఇలా ఉంది!!" అని ఆశ్చర్యపోయేవాడుగానీ, ఇప్పుడలవాటైపోయింది. ఈ బ్లాగులోని వ్యాఖ్యలు దాదాపుగా అన్నీ కూడా జాలి చూపిస్తూ ఉంటూంటాయి. "అయ్యో పాపం", "ఐ పిటీ యూ", "ప్చ్", "పోన్లెండి, మీరు మాత్రం ఏంచేస్తారు పాపం" లాంటివే అన్నీ!
సోనియాగాంధీ: "చిన్ని నా కన్నకూ.. ప్రాధాని పదవీ..ఇఇఇ, ఇఇఇ, ఇఇఇఈ..."
ఇదో పాడుకాస్టు -పాటల బ్లాగన్నమాట. బ్లాగు శీర్షికనే పాటగా వివిధ రాగాల్లో వినిపిస్తూ ఉంటారీ బ్లాగులో. అయితే పాట పాడేది బ్లాగరి కాదు. ఈమెకు కొందరు నిలయ విద్వాంసులున్నారు, వాళ్ళు పాడుతూ ఉంటారు. ఒకడు పాడుతూ ఉంటే, కొందరు తాళాలేస్తూ, కొందరు కోరస్ పాడుతూ, ఇంకొందరు డప్పులు మోగిస్తూ.. భలే సందడిగా ఉంటదిలెండి బ్లాగు. రాగాలు వేరైనా పాట ఒకటే కావడంతో, రోజూ అదే పాట వినాల్సి రావడంతో మరీ వీరాభిమానులకు తప్ప మామూలు మానవులకు నచ్చదు.
అద్వానీ: "నా పార్టీ, నా పదవీ" కొత్త కొత్త పదాలు, నినాదాలు కాయిస్తూ ఉంటాడీ బ్లాగరి. "అన్నా జిన్నా!" లాంటి పాతవాటిని మళ్ళీ పెడుతున్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త కొత్త నినాదాల కోసం చూస్తూనే ఉండండి..
రాజశేఖరరెడ్డి: "సీతయ్య" ట్యాగులైను అక్కరలేని బ్లాగిది. ఈ బ్లాగులో ఉండే ప్రధానమైన అంశాల్లో ఒకటి - "మా సర్వే ఫలితాలు" ఈ క్షణంలో ఈ శీర్షిక కింద ఉన్న స్కోరు - 258/294" జీమెయిల్లో నిల్వ సామర్థ్యం క్షణక్షణానికీ పెరిగిపోతున్నట్టు ఈ స్కోరు కూడా పెరుగుతూ ఉంటది. అయితే 294 దాటే వీలు లేదే అని బ్లాగరి హృదయం క్షోభిస్తూ ఉంటుంది.
ఇంతకీ, ఈ సర్వేలో మనం పాల్గొనేందుకు లింకుండదు, ఉత్త ఫలితాలు చూట్టం వరకే!
"షార్ట్ సర్కిట్": బ్లాగు సందర్శకులకు, వచ్చిన ప్రతీసారీ రెండ్రూపాయలు ఇస్తూంటాడీ బ్లాగరి. పైగా ఇలా మిగతా బ్లాగరులు చెయ్యడం లేదని రోజూ వాళ్ళను తిట్టిపోస్తూంటాడు. బ్లాగరి ఎవరో తెలీడం లేదు. మనమే కనుక్కోవాలి.
చంద్రబాబు నాయుడు: "ఒక బావ వంద బావమరుదులు"
మీకోసం వాగ్దానం అనేది ఈయన బ్లాగులోని ప్రధాన వర్గం. రోజుకో కొత్త వాగ్దానం దానంతట అదే వచ్చే ఏర్పాటుందీబ్లాగులో.
అలాగే, మీకోసం నటవంశం అనే వర్గంలో రోజుకో కొత్త సినిమా నటుడి పరిచయం జరుగుతూ ఉంటది.
కేసీయార్: " అదిగో అల్లదిగో!" ఒక్కో టపాలో ఒక్కో విధానాన్ని చూపించే ఈ బ్లాగరి చాతుర్యం చూసి, మహా మహా బ్లాగరులకే మతి పోతూంటుంది. నిన్నటి టపాలో అతడు దొంగ అని తిట్టాడొకర్ని. వ్యాఖ్యాత ఒకాయన, అదేంటి కిందటి బ్లాగులో అతడు దేవుడని రాసారు గదా అని అడిగాడు పాపం. వెంటనే ఇవ్వాళ మరో టపా రాసి అందులో ఈ వ్యాఖ్యాతను "నా బ్లాగు చాయలకొచ్చావో, ఓ వెయ్యి ఐపీ అడ్రసుల కింద పూడ్చి పెడతా, ఖబడ్దార్" అని రాసాడు.
చిరంజీవి: "మెగారాజ్యం - మాకేభోజ్యం"
ఈ బ్లాగులో మామూలు బ్లాగుల్లో లాగా మొదటి పేజీగా ఇట్టీవలి టపా ఉండదు. ఒక టపా రాసి పెట్టుకున్నాడు, మొదటి పేజీగా ఏప్..పుడూ అదే వస్తుంది (స్టికీ పోస్టనమాట). ఆ టపాలో "నేను మీవాణ్ణి, మంచివాణ్ణి, అందరూ నావాళ్ళే, అందరూ మంచివాళ్ళే. రాజశేఖరరెడ్డి, చంద్రబాబు కూడా మంచివాళ్ళే. మీరు మాత్రం నాకే ఓటెయ్యండి." అని ఉంటుంది.
జయప్రకాశ్ నారాయణ: "తామరాకు" తామరాకు నీళ్ళలో ఉంటుంది, కానీ తడి అంటదు. ఈ బ్లాగుకు వేలాదిగా హిట్లుంటాయి, కానీ వ్యాఖ్యలుండవు. (రాజకీయపు బురదలో ఉంటుంది, కానీ లోక్‌సత్తా పార్టీకి బురదంటదు. వోటర్ల మధ్యనే ఉంటుంది, కానీ వోట్లూ అంటవు, ప్చ్)
హరికృష్ణ: "నేనూ, మా నాన్న, నా తమ్ముళ్ళు, నా పెదబిడ్డ, నా చినబిడ్డ ఇంకా.. నేను!"
మొదటి పేజీలో తన నిలువెత్తు కటౌటుంటది, గజమాలతో -అంతే!
బాలకృష్ణ: "ఎంత తొడకు అంత మోత" ఇది వీడియో బ్లాగు. మొత్తమన్నీ మోత మోగి పోయే వీడియోలే!
పవన్‌కల్యాణ్: "రారా తేల్చుకుందాం @$!%&*#" ఈ బ్లాగులోకి వెళ్ళబోయే ముందు పెద్దలకు మాత్రమే అనే హెచ్చరికను దాటుకుని పోవాలి
దేవేందర్ గౌడ్: "బ్రో..చే వా.........." ఎక్కువగా విషాద గీతాలు, విరహ గీతాలు సేకరించి పెడుతూంటాడీ బ్లాగులో. కేసీయారును తిట్టిపోసి, వెలుగులోకి వద్దామనుకుని ఈ బ్లాగు పెట్టాడు. పాపం, ప్రొఫెసరొకరు అడ్డం పడ్డం కారణంగా, ఇదిగో ఇలా అయిపోయింది.
నారాయణ: ఎప్పుడెవరితో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుందో, ఎప్పుడెలా మాట్లాడాల్సుంటుందో తెలవదు కాబట్టి, ఒకటికి రెండుంటే మంచిదనే ఉద్దేశంతో రెండు బ్లాగులు పెట్టాడు. అవి చాలడం లేదు, మరో రెండుండాల్సిందేనని ఈ మధ్యే అనుకున్నాడు. అవి కూడా త్వరలో రావచ్చు
పై పెద్దాయన లాగా రెండేసి, మూడేసి బ్లాగులక్కరలేదీయనకు. ఒక్కటి చాలు. టపాకో విధానం చూపించడంలో లాఘవం కలిగినవాడు. ప్రతి టపా గత టపాలో చెప్పినదాన్ని తప్పంటుంది. అయినా వ్యాఖ్యల్లో అదేంటని అడిగిన పాపాన పోరెవరూ !
సురేష్ రెడ్డి: ఈయనకు రెండు బ్లాగులుంటాయి. ఎడం పక్కవాళ్ళకొకటి, కుడివైపువాళ్ళకొకటి. ఎంతైనా నిష్పక్షపాతులు గదా.. అంచేతన్నమాట!
కాంగ్రెసు పార్టీలోని ఓ యాభై అరవై మంది కలిసి నిర్వహించే గుంపు బ్లాగు, "నువ్వేమన్నా తక్కువ తిన్నావా?" ఇది చరిత్రను చెప్పే బ్లాగు. ఎక్కువగా 1995-2004 మధ్య ఆంధ్ర ప్రదేశ్ చరిత్రపై పరిశోధన చేస్తూంటుంది. "వెన్నుపోటు", "నీ చరిత్ర నాకు తెలుసులే" లాంటి మాటల కోసం గూగిల్లితే వచ్చే ఫలితాల్లో ఈ బ్లాగు మొదట కనబడుతుంది - తెలుగే కాదు, ఈ మాటలను ఇంగ్లీషులో, ఫ్రెంచిలో, అరవంలో, చైనీసులో రాసి వెతికినా సరే, వచ్చే ఫలితాల్లో ఈ బ్లాగుదే మొదటి స్థానం.
రోశయ్య: ఈయనకు కూడా రెండు బ్లాగులున్నాయి.
రామలింగరాజు: నాకు రెండు బ్లాగులున్నాయని ఈయన చెబుతూంటాడు. రేపు, అబ్బే ఉత్తదే,లేవని అంటాడేమో తెలీదు. అంచేత అదేంటి నువ్వు చెప్పిన బ్లాగులు లేవు కదా, మాకిలా అబద్ధాలు చెప్పావేంటని భవిష్యత్తులో మీరు నన్నడగరాదు.
వేషమే నాకున్నదీ వేషమే నా పెన్నిధీ! అనేది ఈ బ్లాగు ట్యాగులైను. దాదాపుగా ప్రతీ రోజూ మూసను మారుస్తూ ఉంటాడు. టపాలేమీ ఉండవు. ఉత్త మూస మార్పిళ్ళే!
సుబ్బరామిరెడ్డి: "విశాఖదత్తుడు"
ఇది ఫోటో బ్లాగు. ప్రసిద్ధ వ్యక్తులతో తాను దిగిన ఫోటోలు, బాబాలతో తాను దిగిన ఫోటోలు, సినిమా తారలతో తాను దిగిన ఫోటోలు, తనకు జరిగిన సన్మానాలు, తాను చేసిన సన్మానాలు, తాను చేసిన వివిధ యాగాలూ యజ్ఞాల దృశ్యాలు, వివిధ ఆల్బములుగా కొలువుదీరి ఉంటాయి. చక్కటి అతిథి పుస్తకం కూడా ఉంటది. ఒక్కసారి ఈ బ్లాగుకు వెళ్ళారంటే ఈ పుస్తకం చూడకుండా, అక్కడ సంతకం చెయ్యకుండా, బ్లాగరి గురించి నాలుగు మంచిముక్కలు చెప్పకుండా బయటికి రాలేరు -రానీయదీ బ్లాగు.
"శిఖండి"
బ్లాగరి పేరు కూడా అదే. ఇదో తిట్టు బ్లాగు. ఈ బ్లాగు ఉండవల్లిదని కొందరు, కాదని కొందరూ వాదించుకుంటూంటారు. ఆయనెప్పుడూ ఖండించలేదు. తనది కాకపోతే ఖండించేవాడేగా అని మొదటి వర్గం వారు అంటారు. తనదే అయితే మరీ ఆ పేరు పెట్టుకుంటాడా బ్లాగుకు అని రెండో వర్గం వారు అంటూంటారు. ఇదమిత్థంగా ఫలానావారిదని తెలీదు మనకు.
దివాకరరెడ్డి, గొల్లపల్లి సూర్యారావులు బ్లాగులు తెరిచారు. చెరో టపా రాసారుగానీ, ఎంచేతో, వెంటనే బ్లాగులు మూసేసారు. ఎక్కడా వ్యాఖ్యలు కూడా రాయడం లేదు పాపం.
నందమూరి తారకరామారావు (అసలు సిసలు ఎన్టీయార్): "మ్హేమూ మా బ్లాగూ!" ఇందులో ఒకే ఒక టపా ఉంది.
బ్రదర్స్, మన తెలుగు బిడ్డలంతా చక్కగా తెలుగులో బ్లాగుతుండడం చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది. తెలుగింటి ఆడపడుచులు కూడా బహుచక్కగా బ్లాగుతున్నారు.
బ్రదర్స్, మన ఆడపడుచులను మనం గౌరవించుకోవాలి, సాదరంగా, సౌమనస్యంతో మెలగాలి.!
మనలో మనకు గొడవలొద్దు. తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది.

- "నేనొకటి తలచిన బర్దనొకటి తలచును": ఒక టపా రాయడం, దాన్ని సమూలంగా మార్చడం, తరవాత మళ్ళీ మార్చడం.. ఇలా జరుగుతూ ఉంటుంది. చిట్టచివరికి ఒక రూపానికి వచ్చిందనుకున్న తరవాత, దానికి పీడీయెప్ఫు కట్టేసి పక్కన పడేస్తాడు. తరవాత కొత్త టపాయణం మొదలౌతుంది.
- "ఏవిఁ లాఘవం!" యుద్ధ సమయాల్లో బీవీ రాఘవులును నేరుగా తిట్టడానికి, శాంతి సమయాల్లో లోపాయికారీగా ఎత్తిపొడవడానికీ పనికొస్తుందని దీన్ని పెట్టాడు. ఖమ్మంలో స్నేహపూర్వక పోటీ జరిగినప్పుడు కూడా పనికొస్తదీ బ్లాగు.
పై పెద్దాయన లాగా రెండేసి, మూడేసి బ్లాగులక్కరలేదీయనకు. ఒక్కటి చాలు. టపాకో విధానం చూపించడంలో లాఘవం కలిగినవాడు. ప్రతి టపా గత టపాలో చెప్పినదాన్ని తప్పంటుంది. అయినా వ్యాఖ్యల్లో అదేంటని అడిగిన పాపాన పోరెవరూ !
సురేష్ రెడ్డి: ఈయనకు రెండు బ్లాగులుంటాయి. ఎడం పక్కవాళ్ళకొకటి, కుడివైపువాళ్ళకొకటి. ఎంతైనా నిష్పక్షపాతులు గదా.. అంచేతన్నమాట!
- "లేదండి, విననండి, నో అండి, సారీ అండి, కూర్చోండి!" : ఇక్కడ వారానికొకటి చొప్పున శాసనసభా నియమాలను , శాసనసభ జరిగే రోజుల్లో, రాస్తూంటాడు. వ్యాఖ్యలు రాసే సౌకర్యం తీసివేయబడింది.
- "మీరజాలగలనా మీయానతి..." : సరిగ్గా ఆ రోజుల్లోనే ఇక్కడ కూడా వ్యాసాలొస్తూంటాయి, కానీ అవి రాసేది ఈ బ్లాగరి కాదని ప్రతీతి! ఇక్కడ కూడా వ్యాఖ్యలు రాసే సౌకర్యం తీసివేయబడింది.
కాంగ్రెసు పార్టీలోని ఓ యాభై అరవై మంది కలిసి నిర్వహించే గుంపు బ్లాగు, "నువ్వేమన్నా తక్కువ తిన్నావా?" ఇది చరిత్రను చెప్పే బ్లాగు. ఎక్కువగా 1995-2004 మధ్య ఆంధ్ర ప్రదేశ్ చరిత్రపై పరిశోధన చేస్తూంటుంది. "వెన్నుపోటు", "నీ చరిత్ర నాకు తెలుసులే" లాంటి మాటల కోసం గూగిల్లితే వచ్చే ఫలితాల్లో ఈ బ్లాగు మొదట కనబడుతుంది - తెలుగే కాదు, ఈ మాటలను ఇంగ్లీషులో, ఫ్రెంచిలో, అరవంలో, చైనీసులో రాసి వెతికినా సరే, వచ్చే ఫలితాల్లో ఈ బ్లాగుదే మొదటి స్థానం.
రోశయ్య: ఈయనకు కూడా రెండు బ్లాగులున్నాయి.
- "యతో గొడవస్తతో రోశయః" ఇందులో మాటలేమీ ఉండవు -అనగా రాతలేమీ ఉండవు . అన్నీ ఇమోటికాన్లే! నాలుక బయటపెట్టి ఎక్కిరించేవి, కన్నుకొట్టేవి, ఎగతాళి చేసేవి,లేవుడి గొట్టేవి, రెండు బొటనవేళ్ళు కణతలకు ఆనించి మిగతా వేళ్ళు ఆడించేవి, ఎకిలిగా నవ్వేవి, తర్జని చూపెట్టేవి -ఇలాంటి వనేకానేకం ఉంటాయిక్కడ. జాగ్రత్త సుమా.. వాటిని వాడేసుకునేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి మనం -కొన్నిటిమీద బ్లాగరికి పేటెంట్లున్నాయి.
- "తమలపాకుతో నువ్వొకటంటే.." : ఇందులో ఉంటాయి, రాతలు. మామూలుగా పై బ్లాగు చూసాక కూడా బ్లాగరి హృదయం అర్థం చేసుకోలేని, నాబోటి మందమతుల కోసం ఈ బ్లాగు.
రామలింగరాజు: నాకు రెండు బ్లాగులున్నాయని ఈయన చెబుతూంటాడు. రేపు, అబ్బే ఉత్తదే,లేవని అంటాడేమో తెలీదు. అంచేత అదేంటి నువ్వు చెప్పిన బ్లాగులు లేవు కదా, మాకిలా అబద్ధాలు చెప్పావేంటని భవిష్యత్తులో మీరు నన్నడగరాదు.
- "జురాగలింమరా" ఈ బ్లాగు ప్రాశస్త్యాన్ని వివరించనక్కర్లేదు గదా! బ్లాగు పేరే చెబుతోంది.
- "రామ _ _ రాజు" దీని సంగతి కూడా వివరించనక్కర్లేదు! బ్లాగు పేరు చెబుతూనే ఉంది.
వేషమే నాకున్నదీ వేషమే నా పెన్నిధీ! అనేది ఈ బ్లాగు ట్యాగులైను. దాదాపుగా ప్రతీ రోజూ మూసను మారుస్తూ ఉంటాడు. టపాలేమీ ఉండవు. ఉత్త మూస మార్పిళ్ళే!
సుబ్బరామిరెడ్డి: "విశాఖదత్తుడు"
ఇది ఫోటో బ్లాగు. ప్రసిద్ధ వ్యక్తులతో తాను దిగిన ఫోటోలు, బాబాలతో తాను దిగిన ఫోటోలు, సినిమా తారలతో తాను దిగిన ఫోటోలు, తనకు జరిగిన సన్మానాలు, తాను చేసిన సన్మానాలు, తాను చేసిన వివిధ యాగాలూ యజ్ఞాల దృశ్యాలు, వివిధ ఆల్బములుగా కొలువుదీరి ఉంటాయి. చక్కటి అతిథి పుస్తకం కూడా ఉంటది. ఒక్కసారి ఈ బ్లాగుకు వెళ్ళారంటే ఈ పుస్తకం చూడకుండా, అక్కడ సంతకం చెయ్యకుండా, బ్లాగరి గురించి నాలుగు మంచిముక్కలు చెప్పకుండా బయటికి రాలేరు -రానీయదీ బ్లాగు.
"శిఖండి"
బ్లాగరి పేరు కూడా అదే. ఇదో తిట్టు బ్లాగు. ఈ బ్లాగు ఉండవల్లిదని కొందరు, కాదని కొందరూ వాదించుకుంటూంటారు. ఆయనెప్పుడూ ఖండించలేదు. తనది కాకపోతే ఖండించేవాడేగా అని మొదటి వర్గం వారు అంటారు. తనదే అయితే మరీ ఆ పేరు పెట్టుకుంటాడా బ్లాగుకు అని రెండో వర్గం వారు అంటూంటారు. ఇదమిత్థంగా ఫలానావారిదని తెలీదు మనకు.
దివాకరరెడ్డి, గొల్లపల్లి సూర్యారావులు బ్లాగులు తెరిచారు. చెరో టపా రాసారుగానీ, ఎంచేతో, వెంటనే బ్లాగులు మూసేసారు. ఎక్కడా వ్యాఖ్యలు కూడా రాయడం లేదు పాపం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
బ్రదర్స్, మన తెలుగు బిడ్డలంతా చక్కగా తెలుగులో బ్లాగుతుండడం చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది. తెలుగింటి ఆడపడుచులు కూడా బహుచక్కగా బ్లాగుతున్నారు.
బ్రదర్స్, మన ఆడపడుచులను మనం గౌరవించుకోవాలి, సాదరంగా, సౌమనస్యంతో మెలగాలి.!
మనలో మనకు గొడవలొద్దు. తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది.
---------------------------------------------------------
ఇవే కాక "సగటు వోటరు" అనే వ్యక్తి మొదలెట్టబోయే బ్లాగుకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. దాని పేరు "కనకపు సింహాసనం పై.." వుంటుందా లేక "తాంబూలాలిచ్చేశాను.." వుంటుందా అని వేడిగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం "అంతుబట్టని నాడి" అనే పేరుతో పై బ్లాగులన్నింటిలో వ్యాఖ్యలు వ్రాస్తున్నట్టు తెలుస్తోంది.
రిప్లయితొలగించండిచదువరిగారు, చాలా బాగుందండీ టపా..!!
chalaa baagaa raasaaru
రిప్లయితొలగించండిఅన్నిటికన్నా బాలకృష్ణ ది అదుర్స్ అండి.
రిప్లయితొలగించండిబాగా నవ్వించారు.
రిప్లయితొలగించండిబాగుంది.
రిప్లయితొలగించండిgood post
రిప్లయితొలగించండి"పాలాభిషేకం" తర్వాత అంత కత్తి లాంటి పోస్టు!
రిప్లయితొలగించండిరాఘవులు బ్లాగేది ఏది అని అడ్గుగుదామనుకుంటూ ఉండగనే చివర్న కనిపించింది.
తామరాకు బ్లాగు ఎంచక్కా ఉంది. హిట్లుంటాయి కానీ వోట్లుండవు!
అన్నిటికంటే "నువ్వేమన్నా తక్కువ తిన్నావా" బ్లాగు సూపరు.
అసలు 150 వ్యాఖ్యలు రాదగ్గ టపా ఇది. ఇంతకంటే ఏం చెప్పలేనండి!
చాలా బాగుంది టపా. అందరి బ్లాగుల కంటే సుబ్బిరామి రెడ్డి గారి బ్లాగు బాగుంది. ఆయన బ్లాగులో ఆయన బాంబే తారల మద్య తానూ చేసుకొన్న పుట్టిన రోజుల ఫోటోలు కూడా ఉండాలే?? అప్పట్లో ఆయనకీ తెలుగు తారలు కనబడే వారు కారు. అయినదానికి, కానిదానికి బాంబే తారల్ని పిలిచి మరీ పార్టీలు ఇచ్చేవారట. (అదీ ఈయన బొంబాయి వెళ్లి మరీ)
రిప్లయితొలగించండిwah! a wonderful introduction, you see!
రిప్లయితొలగించండిఅన్నట్టు, విశాఖ దత్తుడు "పులి చర్మం" మీద కుచుని జపమో, తపమో, లేక యాగమో చేస్తున్న ఫొటో ఉంటే పెట్టండి!
రిప్లయితొలగించండిబాగుంది మీ సరికొత్త బ్లాగుల పరిచయం :)
రిప్లయితొలగించండినేను గవర్నర్ బ్లాగు, ఇంకా నేను రాష్ట్రపతి.. కాకా మొదలైన బ్లాగులను కూడా దయచేసి పరిచయం చేయ్యండి. ఇంకా "మనోభావాలు" అనే బ్లాగును మరచినట్టున్నారు, పరిచయం చేయ్యండి. లేదంటే మనోభావాలు దెబ్బతీసారు అని ... జరగబోయే పరిణామాలకు మీరు బాద్యత వహించవలసి ఉంటుంది.
టోపీ తీసేశాం!
రిప్లయితొలగించండిఓలక్ష ఐపీ అడ్రసుల పైన ఎగరేయాల్సినంత క్రియేటివిటీ చూపించారు. పాగా తీసాం.
రిప్లయితొలగించండిఅదరగొట్టేర్సార్.
రిప్లయితొలగించండిGood Post
రిప్లయితొలగించండి"మ్హేమూ మా బ్లాగూ!" :) (తెలిసిందిలే...తెలిసిందిలే)
హహహ! కేక టపా. మీకే సాధ్యం.
రిప్లయితొలగించండిఇంకా రోజా గారి బ్లాగు, రాజశెఖర్ బ్లాగు, సచిన్ బ్లాగు...చాలా ఉన్నాయ్ మీరు లుక్కేసి, మాకు పరిచయం చేయటానికి.
రిప్లయితొలగించండిటపా కేక.
మీరు ఉటంకించిన బ్లాగులగురించి దేనికదే విలక్షణంగా భలే చెప్పారు.
రిప్లయితొలగించండినాకు పాగా (పెట్టుకునే అలవాటు) లేదు... కాబట్టి తెనాలి రామకృష్ణ సినిమాలో కృష్ణదేవరాయల సభ సీను కళ్ల ముందు ఊహించుకోండి :)
LOL
రిప్లయితొలగించండిThe Best!!!
రిప్లయితొలగించండిరోశయ్యబ్లాగు గురించి మీర్రాసింది చదువుతూ కళ్లలో నీళ్లొచ్చేదాకా నవ్వాను. విశాఖదత్తుడు, ఉత్తరాళ్లు, శిఖండి, ... ఇలా అన్నీ హై(బీమ్)లైట్లే. శంకరనారాయణ మాటల్లోని శ్లేష, ఈనాడు శ్రీధర్ కార్టూన్లలోని వ్యంగ్యం కలబోసినట్టుగావుందీటపా. ప్రవీణ్ అన్నట్టుగా మీకే సాధ్యం.
లోక్ సత్తా బాగుంది
రిప్లయితొలగించండిపైనున్న అన్ని కామెంట్లు కలిపి నా కామెంటు.. :-)
రిప్లయితొలగించండిచదువరి గారు,
రిప్లయితొలగించండిఇతను (మార్తాండ) "గాంధీ మహాత్ముని కులగజ్జి " ఇలా రాయడం సమంజసమేనా లేక అతను జాతి పిత గాంధి గురించి అతని బ్లొగ్ లో రాసు కున్నాడు కనుక అది అతని ఇష్టం అంటె. ఇటువంటి వారి వ్యాఖ్యలు రెగులర్ గా రాసెవారి బ్లొగ్ లో అనుమతించవచ్చా? మీరూ దీనిమీద చ్చర్చించాలి మీకు తెలిసిన సీనియర్ మరియు సిన్సియెర్ బ్లొగర్ల తో
http://telugu.stalin-mao.net/?p=151
వ్యాఖ్యాతలందరికీ నెనరులు. నాకు బాగా నచ్చినవి, రామలింగరాజు బ్లాగులు.
రిప్లయితొలగించండిAwesome post sir
రిప్లయితొలగించండిwe made a small ppt/video on why u should vote for Loksatta using a fictional character, u can check it from the below links
http://www.youtube.com/watch?v=NC7mHsPTtO8
http://www.slideshare.net/indizen
Can you please help in spreading the word
అదరగొట్టారు. :D :D
రిప్లయితొలగించండి